షాకింగ్‌ విషయాలు: ఆవు సాధు జంతువు... అదేగానీ దాడికి దిగితే.. | Every Year so Many Humans Die Due to Cow Attack | Sakshi
Sakshi News home page

షాకింగ్‌ విషయాలు: ఆవు సాధు జంతువు... అదేగానీ దాడికి దిగితే..

Published Mon, Jun 19 2023 12:39 PM | Last Updated on Mon, Jun 19 2023 9:39 PM

Every Year so Many Humans Die Due to Cow Attack - Sakshi

వరల్డ్‌ యానిమల్‌ ఫౌండేషన్‌ వెబ్‌సైట్‌ పలు ఆసక్తిక వివరాలు వెల్లడించింది. ప్రతీయేటా ఆవుల కారణంగా అమెరికాలో అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొంది. వీరంతా ఆవుల దాడికి బలవుతున్నారని తెలియజేసింది.

భారతీయులు ఆవును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. పూజలు కూడా చేస్తుంటారు. ఆవును గోమాత అని కూడా అభివర్ణిస్తుంటారు. ఆయుర్వేద పరిభాషలో ఆవు పాలు అమృతంతో సమానం. అయితే అప్పుడప్పుడు మనుషులపై జంతువుల దాడులు జరుగుతుంటాయి. 

ఇటువంటి సందర్భాల్లో మనుషుల మరణాలు కూడా సంభవిస్తుంటాయి. ప్రతీయేటా ఆవుల దాడుల కారణంగా వందల మంది మృత్యువు బారిన పడుతున్నారు. ఆవుల దాడుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది మరణిస్తున్నారనే వివరాలకు సంబంధించిన గణాంకాలను వరల్డ్‌ యానిమల్‌ ఫౌండేషన్‌ వెబ్‌సైట్‌ తెలియజేసింది. ఆ వివరాలు ఎంతో ఆశ్యర్యాన్ని కలిగిస్తున్నాయి.

గణాంకాలు ఏమి చెబుతున్నాయి?
వరల్డ్‌ యానిమల్‌ ఫౌండేషన్‌ వెబ్‌సైట్‌లో ప్రచురితమైన డేటా ప్రకారం ప్రతీయేటా ఆవుల దాడుల కారణంగా అమెరికాలో 20 నుంచి 22 మంది మరణిస్తున్నారు. ఆవుల గుంపు తొక్కివేయడం కారణంగా మరణించారంటూ ‍ప్రతీయేటా సుమారు 5 కేసులు వెలుగు చూస్తున్నాయి. లండన్‌లో ప్రతీయేటా ఆవుల దాడులలో కనీసం నలుగురు కన్నుమూస్తున్నారు. దీనిని షార్క్‌ దాడులతో పోల్చి చూస్తే.. షార్క్‌ దాడుల కారణంగా ‍ప్రతీయేటా కనీసం ఐదుగురు మరణిస్తున్నారు. ప్రతీయేటా ఆవుల దాడులకు కనీసం 22 మంది బలవుతున్నారు.

భారత్‌లో ఆవుల దాడుల సంగతేమిటి?
సోషల్‌ మీడియాలో జంతువుల దాడులకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారుతుంటాయి. వీటిలో ఆవుల దాడులకు సంబంధించిన వీడియోలు కూడా కనిపిస్తాయి. ఇటీవల ఒక ఎద్దు ఒక వృద్ధుడిపై దాడి చేసి చంపేసిన ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీనికిముందు కూడా ఉత్తరప్రదేశ్‌లో ఒక మహిళపై ఆవు దాడి చేసినట్లు ఒక వీడియో ద్వారా తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎద్దుల దాడులతో పోల్చి చూస్తే, ఆవుల దాడులు స్వల్పమేనని చెప్పవచ్చు.

ఇది కూడా చదవండి: రైలు రిజర్వేషన్‌లో సరిదిద్దలేని పొరపాట్లివే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement