సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతూ సంచరిస్తున్న ఎలుగుబంటి ఎట్టకేలకు అధికారులు పట్టుకున్నారు. దాన్ని పట్టుకునేందుకు అధికారులు వలలు ఏర్పాటు చేశారు. రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా ఎయిర్ గన్తో అటవీశాఖ అధికారులు మత్తు ఇంజక్షన్ ఇవ్వగా.. అనంతరం రేకుర్తి సమ్మక్క గద్దెల్లోకి భల్లూకం పారిపోయింది. దీంతో అటవీశాఖ అధికారుల గాలింపు ప్రక్రియ ముమ్మరం చేసి చివరికి పట్టుకున్నారు. కాసేపట్లో అటవీ శాఖ అధికారులు ఎలుగుబంటిని అడవిలో విడిచిపెట్టనున్నారు.
నడిరోడ్డు పై హల్‌చల్
కాగా నడిరోడ్డుపై సంచరిస్తూ నగర వాసులను పరుగులు పెట్టిస్తోంది. శుక్రవారం రాత్రి బొమ్మకల్ పంచాయతీ పరిధిలోని రజ్వీ చమాన్ ప్రాంతంలో ఓ కాలనీలోకి ప్రత్యక్షమైన ఎలుగుబంటి.. శనివారం ఉదయం రేకుర్తిలో నడిరోడ్డుపై సంచరిస్తూ ప్రజలకు కనిపించింది. దీంతో ఎలుగు బంటిని చూసిన గ్రామస్థులు భయంతో పరుగులు పెట్టారు.
ఎలుగుబంటి సంచరిస్తుండగా దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ కాగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. మరో వైపు ఎలుగుబంటి కోసం అటవీశాఖ అధికారులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఎలుగుబంటి కోసం హన్మకొండ నుంచి ప్రత్యేకంగా వలలు, ఎయిర్ గన్స్, ఇతర ఎక్విప్ మెంట్ తో వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment