Ranbir Kapoor's Animal Teaser Accused Of Copying South Korean Film Oldboy - Sakshi
Sakshi News home page

Ranbir Kapoor Animal: యానిమల్ ‍‍ప్రీ టీజర్.. ఆ సీన్ మొత్తం కాపీ పేస్ట్!

Published Tue, Jun 13 2023 3:25 PM | Last Updated on Tue, Jun 13 2023 5:00 PM

Ranbir Kapoor Animal Teaser Of Copying South Korean Film Old boy - Sakshi

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'యానిమల్‌'. 'అర్జున్‌ రెడ్డి' ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ నుంచి చిన్న సీన్‌ను ప్రీ టీజర్‌గా ఆదివారం విడుదల చేసింది సంగతి తెలిసిందే. ‘వైల్డ్‌ యానిమల్‌’, ‘వైలెంట్‌ యానిమల్‌’ అంటూ ‘యానిమల్‌’ ప్రీ టీజర్‌ గురించి పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు నెటిజన్స్. అయితే ఈ చిత్రం ఫుల్‌ టీజర్‌ ఈ నెల 16న విడుదల కానుందని సమాచారం.

(ఇది చదవండి: నాడు అర్జున్ రెడ్డి, నేడు యానిమల్‌.. ఇదీ మామూలు అరాచకం కాదు )

తాజాగా ఈ చిత్రంలోని ప్రీ టీజర్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ టీజర్‌లోని ఫైట్‌ సీన్‌ వైరల్ కావడంతో కొందరు నెటిజన్స్ కాపీ కొట్టారంటూ ఆరోపిస్తున్నారు. దక్షిణ కొరియా  చిత్రం ఓల్డ్ ‌బాయ్‌తో చిత్రంలోని ఫైట్‌ సీన్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేస్తున్నారు. ఓల్డ్‌బాయ్‌లోని హాల్‌వే సీక్వెన్స్ మాదిరిగానే ఈ ఫైట్ సీన్‌లా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.    

 సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి దిమ్రీ, ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఐదు భాషలలో ఆగస్ట్ 11 న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని టి-సిరీస్,  సినీవన్ స్టూడియోస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి.

(ఇది చదవండి: కమెడియన్ మృతి.. అతనికి గుండెపోటు కాదు! )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement