న్యూఢిల్లీ: కరోనా వచ్చిందో లేదో ఇంట్లోనే ఉండి నిర్ధారించుకునే సరికొత్త టెస్టింగ్ కిట్ ను ఐఐటీ ఢిల్లీ, జాతీయ రసాయన లాబొరేటరీ (ఎన్సీఎల్)లు కలసి తయారు చేస్తున్నాయి. తక్కువ సమయంలోనే ఈ కిట్ ఫలితాలను వెల్లడిస్తుందని తయారీదారులు చెబుతున్నారు. దీనికి మైక్రోసాఫ్ట్ ఇండియా వంటి దిగ్గజ సంస్థ ఆర్థిక చేయూతను అందిస్తోంది. వీరు ఎలీసా (ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసాయ్) ఆధారంగా కోవిడ్ ను నిర్ధారించే ప్రక్రియతో తయారుకానుంది. ప్రస్తుతం నిర్ధారణకు అయ్యే ఖర్చులకంటే తక్కువ ఖర్చులోనే ఇది పూర్తవుతుందని చెప్పారు. ప్రస్తుతం ఈ కిట్లను ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ఉన్న మెడ్ టెక్ జోన్ లో తయారు చేస్తున్నామని, ఓ నెలరోజుల్లో మార్కెట్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment