న్యూఢిల్లీ: కోవిడ్ చికిత్సలో టీకోప్లానిన్ అనే డ్రగ్‌తో మెరుగైన ఫలితాలు వస్తున్నట్లు ఐఐటీ ఢిల్లీకి చెందిన కుసుమ స్కూల్ ఆఫ్ బయోలాజికల్ సైన్స్ పరిశోధనలో స్పష్టమైంది. ఈ డ్రగ్ ఇప్పటికే క్లినికల్‌గా ఆమోదం పొందింది. కరోనా వైద్యంలో భాగంగా ఉపయోగిస్తున్న ఇతర ఔషధాల కంటే టీకోప్లానిన్ దాదాపు 20 రెట్లు ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు గుర్తించామని ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్ అశోక్ పటేల్ చెప్పారు. 23 ఆమోదిత ఔషధాల మిశ్రమంతో టీకోప్లానిన్ డ్రగ్‌ను తయారుచేశారు. తాజా పరిశోధన వివరాలను అంతర్జాతీయ పత్రిక బయోలాజికల్ మాక్రోమాలిక్యూల్స్‌లో ప్రచురించారు. టీకోప్లానిన్‌పై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని ప్రొఫెసర్ అశోక్ పటేల్ చెప్పారు.
కాగా, జలుబు నుంచి ఉపశమనం కోసం వాడే నాసల్ స్ర్పేతో కరోనాను తగ్గించవచ్చని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఆస్ట్రేలియా బయోటెక్ కంపెనీ ఎనా రెస్పిరేటరీ జంతువుల మీద చేసిన ప్రయోగాల ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించారు. నాసల్ స్ప్రే వాడకంతో కరోనా వైరస్ పెరుగుదలని గణనీయంగా తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. (చదవండి: గాల్లో కరోనా వ్యాప్తిపై సీసీఎంబీ శోధన)
Comments
Please login to add a commentAdd a comment