కోల్‌కతా: ఆర్కిటెక్చర్ సిలబస్‌లో వాస్తు శాస్త్రాన్ని త్వరలో ప్రారంభించాలని ఐఐటీ ఖరగ్‌పూర్ యోచిస్తోంది. ప్రపంచమంతా వాస్తును బలంగా విశ్వసిస్తున్న సమయంలో తమ విద్యార్థులకు ఇందులోని మెలకువలు తెలవాలనుకుంటున్నట్లు ఐఐటీ ఖరగ్‌పూర్ ఆర్కిటెక్చర్ విభాగం హెడ్.. ప్రొఫెసర్ జాయ్ సేన్ తెలిపారు.
‘ప్రకృతి, నాగరికతల మధ్య అనుసంధానాన్ని వాస్తు శాస్త్రం చెబుతుంది. ప్రపంచమంతా భారతీయ వాస్తు శాస్త్రాన్ని ఆసక్తిగా గమనిస్తోంది. మన యువతరానికి దీని గురించి తెలవాలనేదే మా ప్రయత్నం. అందుకే వీలైనంత త్వరలోనే సిలబస్‌లో దీన్ని చేర్చనున్నాం’ అని సేన్ వెల్లడించారు.