బ్లాక్లిస్టులో మరో ఎనిమిది స్టార్టప్లు! | IIT Kharagpur blacklists 8 start-ups for campus placements | Sakshi
Sakshi News home page

బ్లాక్లిస్టులో మరో ఎనిమిది స్టార్టప్లు!

Published Sat, Nov 5 2016 6:17 PM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM

బ్లాక్లిస్టులో మరో ఎనిమిది స్టార్టప్లు!

బ్లాక్లిస్టులో మరో ఎనిమిది స్టార్టప్లు!

కోల్కత్తా : అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలలో కంపెనీల బ్లాక్లిస్టుల జాబితా పెరుగుతోంది. తాజాగా ఐఐటీ ఖరగ్పూర్, తమ క్యాంపస్లో రిక్రూట్మెంట్ జరుపకుండా ఎనిమిది స్టార్టప్లపై నిషేధం విధించింది. ఉద్యోగ ఆఫర్లు ఇచ్చి అనంతరం వెనక్కి తగ్గేసిన నేపథ్యంలో ఈ స్టార్టప్లను ఖరగ్పూర్ బ్లాక్ లిస్టులో పెడుతున్నట్టు ప్రకటించింది. గతేడాది తమ విద్యార్థులకు ఈ స్టార్టప్లు ఆఫర్ లెటర్లు ఇచ్చారని, అనంతరం ఆ లెటర్లను ఉపసంహరించుకున్నారని ఇన్స్టిట్యూట్ ప్లేస్మెంట్ చైర్మన్ దేవాసిస్ దేవ్ తెలిపారు.
 
దీంతో ఆ స్టార్టప్లను క్యాంపస్లోకి ఈ ఏడాది అడుగుపెట్టే వీలులేకుండా నిషేధం విధించినట్టు పేర్కొన్నారు.  ఈ ఏడాది 10 నుంచి 12 స్టార్టప్లకు క్యాంపస్లో ప్లేస్మెంట్లకు అనుమతిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు మొత్తం 31 స్టార్టప్లపై నిషేధం విధించాయి.   ఆఫర్ లెటర్లు ఇచ్చి, అనంతరం ఉద్యోగంలో జాయిన్ చేసుకోకుండా జాప్యం చేయడం, లేదా ఆ ఆఫర్లను వెనక్కి తీసుకోవడం వంటి కారణాలతో ఆ కంపెనీలపై ఐఐటీలు వేటు వేస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement