Blacklist
-
స్పామ్ కాల్స్ టెలీమార్కెటర్లను బ్లాక్‌లిస్ట్ చేయండి
న్యూఢిల్లీ: స్పామ్ కాల్స్ చేసే టెలీమార్కెటర్లపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కఠిన చర్యలు ప్రకటించింది. అన్‌రిజిస్టర్డ్ టెలీ మార్కెటింగ్ సంస్థలు వ్యాపారపరమైన స్పామ్ కాల్స్ చేస్తున్నట్లుగా తేలినట్లయితే వాటి టెలికం వనరులన్నింటినీ డిస్కనెక్ట్ చేయాలని, రెండేళ్ల పాటు వాటిని బ్లాక్‌లిస్ట్‌లో ఉంచాలని టెల్కోలను ఆదేశించింది. బ్లాక్‌లిస్ట్‌లో ఉంచినప్పుడు ఆయా సంస్థలకు కొత్తగా టెలికం వనరులను కేటాయించరాదని పేర్కొంది.ఎస్ఐపీ, పీఆర్ఐ వంటి టెలికం వనరులను ఉపయోగిస్తున్న అన్‌రిజిస్టర్డ్ టెలీమార్కెటర్లు ఈ ఆదేశాలు వచ్చిన నెల రోజుల్లోగా డీఎల్టీ ప్లాట్‌ఫాంనకు మారాలని తెలిపింది. ఈ ఆదేశాలను తక్షణం పాటించాలని, ఈ విషయంలో తీసుకున్న చర్యలపై ప్రతి పదిహేను రోజులకు ఓసారి (ప్రతి నెలా ఒకటి, పదహారో తారీఖుల్లో) అప్డేట్ ఇవ్వాలని టెల్కోలకు ట్రాయ్ సూచించింది. ఈ ‘నిర్ణయాత్మక చర్య‘తో స్పామ్ కాల్స్ బెడద గణనీయంగా తగ్గగలదని, వినియోగదారులకు ఉపశమనం కలగగలదని అభిప్రాయపడింది. -
బ్లాక్‌లిస్టులో ఈవీ కంపెనీలు!
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉన్న హీరో ఎలక్ట్రిక్, ఒకినావా ఆటోటెక్, బెన్లింగ్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాల నుండి బ్లాక్‌లిస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫేమ్–2 పథకం కింద తప్పుగా అందుకున్న సబ్సిడీ ప్రయోజనాలను తిరిగి ఇవ్వడంలో ఈ సంస్థలు విఫలం కావడమే ఇందుకు కారణం. ఈ పథకం కింద నమోదైన వివిధ తయారీ సంస్థలు ఫేమ్–2 మార్గదర్శకాలను ఉల్లంఘించడంపై భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు 2022లో ఫిర్యాదులు అందాయి. ఫేమ్–2 నిబంధన ప్రకారం దేశీయంగా విడిభాగాలను కొనుగోలు చేయకుండా విదేశాల నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకున్నాయన్నది ఈ ఫిర్యాదుల సారాంశం. -
ఉగ్రవాది సాజిద్ మీర్ బ్లాక్‌లిస్టుపై... మోకాలడ్డిన చైనా
ఐక్యరాజ్యసమితి: చైనా మరోసారి తన దుష్టబుద్ధిని బయటపెట్టుకుంది. పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మీర్‌ను బ్లాక్‌లిస్టులో చేర్చాలంటూ ఐరాసలో భారత్, అమెరికా చేసిన ప్రతిపాదనను అడ్డుకుంది. 2008 ముంబై దాడుల కేసులో నిందితుడైన మీర్‌ను భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో చేర్చింది. ఐరాస భద్రతా మండలికి చెందిన 1267 అల్–ఖైదా శాంక్షన్స్ కమిటీ కింద మీర్‌ను బ్లాక్‌లిస్టులో చేర్చాలని భారత్, అమెరికా గురువారం ప్రతిపాదించాయి. దీన్ని చైనా అడ్డుకుంది. 26/11 ముంబై దాడుల ఉదంతంలో పాత్రధారి అయిన మీర్ తలపై అమెరికా 5 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. ఉగ్రవాద కార్యకాలాపాలకు నిధులు సమకూరుస్తున్నట్లు రుజువు కావడంతో పాకిస్తాన్‌లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఈ ఏడాది జూన్‌లో మీర్‌కు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
ఫేస్బుక్ ‘టెర్రర్’ వార్నింగ్..! పలు డాక్యుమెంట్లు లీక్..!
Facebook Secret List Leaked By Intercept: ఫేస్బుక్ పాలసీలకు వ్యతిరేకంగా ఉన్న గ్రూప్స్, వ్యక్తులపై ఫేస్బుక్ కఠినమైన ఆంక్షలను విధిస్తోంది. ప్రమాదకరమైన వ్యక్తులు, సంస్థలను గుర్తించడానకి ఫేస్బుక్ మూడంచెల వ్యవస్థను కల్గి ఉంది. టెర్రరిస్ట్ , ద్వేషపూరిత గ్రూప్స్, క్రిమినల్ ఆర్గనైజేషన్ గ్రూప్‌లను ఫేస్బుక్ బ్లాక్ లిస్ట్‌లో పెట్టినట్లు ఇంటర్సెప్ట్ పేర్కొంది. చదవండి: 4 నెలల పాటు ఉచిత ఇంటర్నెట్ సేవలు...! ఎలాగంటే... ఇండియాలో నాలుగువేలకు పైగా... ప్రజాస్వామ్య పద్దతులకు వ్యతిరేకంగా ఉండే గ్రూప్స్, వ్యక్తులపై, తీవ్రవాద సంస్థలపై ఫేస్బుక్ కఠిన చర్యలను తీసుకుంటుంది. సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్బుక్ సుమారు 4 వేలకు పైగా గ్రూప్స్‌ను, వ్యక్తుల ఖాతాలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ఫేస్బుక్ తన ప్లాట్‌ఫారమ్‌లో అనుమతించని 'ప్రమాదకరమైన వ్యక్తులు, సంస్థల(‘Dangerous Individuals and Organizations’)' జాబితా డాక్యుమెంట్లను ఇంటర్సెప్ట్ మంగళవారం రోజున లీక్ చేసింది. వీటిలో ఇండియన్ ముజాహిదీన్, జైషే-ఇ-మహమ్మద్, తాలిబన్లకు, సంబంధించిన గ్రూప్స్ ఇందులో ఉన్నాయి. ఇంటర్సెప్ట్ ద్వారా విడుదల చేయబడిన బ్లాక్లిస్ట్పై ఫేస్బుక్ స్పందించలేదు. సోషల్ మీడియానే ఆయుధంగా...! నేటి టెక్నాలజీ యుగంలో సోషల్‌మీడియా ఒక పదునైన ఆయుధం. సోషల్ మీడియాను సరైన దారిలో వాడుకుంటే ఎన్నో ఉపయోగాలు..అదే చెడు దారిలో వాడితే ఊహించలేని పర్యావసనాలు ఎదురవుతయ్యాయి. పలు ఉగ్రవాద సంస్థలు సోషల్‌మీడియాను ఒక ఆయుధంగా మార్చుకుంటూ తమ భావజాలాన్ని ముందుకు తీసుకేళ్తున్నారు. పలు సోషల్‌మీడియా సంస్థలు ప్రజాస్వామ్య పద్దతులకు వ్యతిరేకంగా ఉన్న గ్రూప్‌లను, పేజీలను గుర్తించి వాటిని బ్లాక్‌లిస్ట్‌లో పెడుతుంటాయి. చదవండి: చైనాకు భారీ షాకిచ్చిన మైక్రోసాఫ్ట్..! -
ఉగ్రవాదులే పాలకులు..!
కాబూల్/పెషావర్/ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వంలో ఏకంగా 14 మంది ఉగ్రవాదులు ఉన్నారు. ఐక్యరాజ్యసవిుతికి చెందిన భద్రతా మండలి వారిని గతంలోనే టెర్రరిజం బ్లాక్‌లిస్టులో చేర్చింది. ఈ జాబితాలో నూతన ప్రధానమంత్రి ముల్లా మొహమ్మద్ హసన్ అఖుంద్‌తోపాటు ఇద్దరు ఉపప్రధానుల పేర్లు సైతం ఉండడం గమనార్హం. అఫ్గానిస్తాన్‌లోని కొత్త మంత్రివర్గంలో కరడుగట్టిన ఉగ్రవాదులు స్థానం దక్కించుకోవడం పట్ల అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సిరాజుదీ్దన్ హక్కానీ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రపడ్డారు. అతడి తలపై అమెరికా ప్రభుత్వం 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. సిరాజుదీ్దన్ హక్కానీ మామ ఖలీల్ హక్కానీ కాందిశీకుల సంక్షేమ మంత్రిగా నియమితులయ్యారు. రక్షణ శాఖ మంత్రి ముల్లా యాకూబ్, విదేశాంగ మంత్రి ముల్లా అమీర్ ఖాన్ ముత్తాఖీ, విదేశాంగ శాఖ సహాయ మంత్రి షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్ తదితరులను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి చెందిన శాంక్షన్స్ కమిటీ(తాలిబన్ శాంక్షన్స్ కమిటీ) గతంలోనే టెర్రరిజం బ్లాక్‌లిస్టులో చేర్చింది. పాకిస్తాన్ ఆర్మీలో కీలక మార్పులు పాక్ ప్రభుత్వం ఆ దేశ ఆర్మీలో కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం నియంత్రణ రేఖ వెంట భద్రతా పరమైన విభాగాలను పర్యవేక్షిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ అజర్ అబ్బాస్‌ను చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్‌గా నియమించింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తర్వాత రెండో ప్రాధాన్యం ఉన్న పోస్టు చీఫ్ జనరల్ స్టాఫ్ కావడం గమనార్హం. జనరల్ అబ్బాస్ బలూచ్ రెజిమెంట్‌కు చెందిన వ్యక్తి. ఇప్పటి వరకూ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్‌గా పని చేసిన లెఫ్టినెంట్ జనరల్ షషీర్ శంషాద్ మీర్జాను రావల్పిండిలోని 10 కార్ప్స్ కమాండర్‌గా పంపించారు. ఇంకోవైపు ముల్తాన్ కార్ప్స్ కమాండర్‌గా లెఫ్టినెంట్ జనరల్ ముహమ్మద్ ఛిరాగ్ హైదర్‌ను నియమించారు. తాలిబన్లకు చైనా ఆర్థిక సాయం అఫ్గానిస్తాన్‌కు 3.1 కోట్ల డాలర్ల ఆర్థిక సాయాన్ని చైనా ప్రకటించింది. అఫ్గాన్‌లో తాలిబన్లు ఏర్పరిచిన తాత్కాలిక ప్రభుత్వాన్ని స్వాగతించింది. అశాంతిని పోగొట్టి, శాంతిని నెలకొల్పే చర్యగా ప్రభుత్వ ఏర్పాటును అభివర్ణించింది. అఫ్గాన్‌కు ఆహార ధాన్యాలు, టీకాలు, మందులు ఇస్తామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఇ చెప్పినట్లు అధికారిక మీడియా వెల్లడించింది. ఇరాన్, తజకిస్తాన్, తుర్కుమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనా విదేశాంగ మంత్రులతో పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఒక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి రష్యా హాజరు కాలేదు. అఫ్గానిస్తాన్ ప్రజలకు తొలి విడతలో 30 లక్షల టీకా డోసులు పంపుతామని వాంగ్ భరోసా ఇచ్చారు. చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్ వెంబిన్ మాట్లాడుతూ అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోబోమని పేర్కొన్నారు. చైనా ఎప్పుడూ అఫ్గానిస్తాన్ సార్వ¿ౌమత్వాన్ని, స్వాతంత్య్రాన్ని గౌరవిస్తుందని చెప్పారు. పీహెచ్డీ, మాస్టర్స్ డిగ్రీలకు విలువ లేదు తాము పూర్తిగా మారిపోయామని, అఫ్గాన్ ప్రజలకు సుపరిపాలన అందిస్తామని నమ్మబలుకుతున్న తాలిబన్లు మరోవైపు తమ అసలు రూపాన్ని బయటపెట్టుకుంటున్నారు. పవిత్రమైన షరియా చట్టాల ప్రకా రమే అఫ్గానిస్తాన్ పరిపాలన, ప్రజా జీవనాన్ని నిర్దేశిస్తామని తాలిబన్ అగ్రనేత హైబ తుల్లా అఖుంద్జాదా స్పష్టం చేశారు. అఫ్గాన్ నూతన ఉన్నత విద్యాశాఖ మంత్రి షేక్ మోల్వీ నూరుల్లా మునీర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మా రాయి. ‘‘పీహెచ్డీ, మాస్టర్స్ డిగ్రీలకు పెద్దగా విలు వలేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న తాలిబన్లు, ముల్లాలను చూడండి. వారిలో ఎవరికీ పీహెచ్డీ, మాస్టర్స్ డిగ్రీలు కాదు కదా కనీసం ఎంఏ, హైసూ్కల్ డిగ్రీలు కూడా లేవు. అయినప్పటికీ వారు ఉన్నత స్థాయికి చేరుకున్నారు’’ అని మునీర్ పేర్కొన్నారు. ప్రధాని మోదీతో నికొలాయ్ పాట్రుశేవ్ భేటీ న్యూఢిల్లీ: రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం భారత్‌కు చేరుకున్న రష్యా భద్రతా మండలి కార్యదర్శి నికొలాయ్ పాట్రుశేవ్ బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. తామిద్దరం కీలకమైన అంశాలపై సంప్రదింపులు జరిపినట్లు మోదీ తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. -
తప్పు తేలితే బోర్డు సభ్యులను బ్లాక్ చేయాలి
న్యూఢిల్లీ: కార్పొరేట్ పాలన విశ్వసనీయంగా ఉండే దిశగా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి పలు సూచనలు చేశారు. తప్పిదాలకు పాల్పడిన బోర్డు సభ్యులు, అధికారులను సెబీ బ్లాక్ లిస్ట్ (నిషేధిత జాబితా)లో పెట్టాలని, అప్పటి వరకు వారికి చెల్లించిన పారితోషికాలను ముక్కు పిండి వసూలు చేయాలని అభిప్రాయపడ్డారు. పోటీ సంస్థలకు మేలు చేసే విధంగా లేకపోతే తప్ప.. ప్రజావేగులు చేసే ఫిర్యాదులపై దర్యాప్తు సమాచారాన్ని కూడా వాటాదారులకు అందించాలన్నారు. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ ‘కార్పొరేట్ గవర్నెన్స్’పై నిర్వహించిన కార్యక్రమంలో మూర్తి పాల్గొని మాట్లాడారు. ‘‘ప్రజా వేగు ఫిర్యాదుపై విచారణలో భాగంగా కంపెనీ బోర్డు సభ్యులు, అధికారులు తమ విశ్వసనీయ విధులను సరిగ్గా న్విహించలేదని, పాలనా లోపం ఉన్నట్టు తేలితే రాజీనామా చేయాలని కోరాలి. ప్రజా వేగు ఫిర్యాదు అన్నది అసంతృప్త ఉద్యోగి నుంచి ప్రతీకార చర్య రూపంలో ఉండరాదు. తన ఫిర్యాదుకు ఆధారంగా అవసరమైన డేటా, వాస్తవాలను ఫిర్యాదిదారు అందించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఫిర్యాదిదారుకు వేధింపుల్లేకుండా కంపెనీ సరైన రక్షణ కల్పించాలి’’ అని నారాయణమూర్తి తన అభిప్రాయాలను వినిపించారు. పారదర్శకత అవసరం..‘‘ప్రజా వేగు ఫిర్యాదును పరిష్కరించే విధానం పారద్శకంగా, విశ్వసనీయతను పెంచే విధంగా ఉండడం తప్పనిసరి. ఒకవేళ ఫిర్యాదు మధ్య స్థాయి లేదా దిగువ స్థాయి ఉద్యోగికి వ్యతిరేకంగా వచ్చినట్టయితే.. ఆ ఉద్యోగితో సంబంధం లేని సీనియర్ ఉద్యోగులతో ఓ కమిటీని నియమించి విచారణ నిర్వహించాలి. ఒకవేళ బోర్డు సభ్యులు లేదా చైర్మన్ లేదా సీఈవోకు వ్యతిరేకంగా పిర్యాదు దాఖలైతే.. చాలా వరకు భారతీయ కంపెనీల బోర్డులు బయటి నుంచి ఓ న్యాయ సేవల సంస్థ సహకారంతో విచారణ చేసి అస్పష్టంగా ముగించేస్తున్నారు. కానీ ఇది మంచి ఆలోచన కాదు. ఎందుకంటే మీరు న్యాయమూర్తిగా వ్యవహరించకూడదు. అంతర్జాతీయంగా పేరున్న సంస్థలు ఇటువంటి ప్రజావేగు ఫిర్యాదులు వచ్చిన సందర్భాల్లో టాప్ టెన్ వాటాదారులు, సమాజంలో ఎంతో గౌరవనీయులైన వ్యక్తులను విచారణలో భాగం చేస్తున్నాయి’’ అంటూ నారాయణ మూర్తి కంపెనీల బోర్డులు, ఉద్యోగులకు వ్యతిరేకంగా వచ్చే ఫిర్యాదుల విచారణలో నిజాయితీ అవసరమని గుర్తు చేశారు. -
పాక్‌కు చివరి హెచ్చరిక
ఇస్లామాబాద్: ఉగ్రవాదులకు ఆర్థిక తోడ్పాటు, ద్రవ్య అక్రమ రవాణా అరికట్టే విషయంలో ఇకనైనా తీరు మార్చుకోవాలని, లేదంటే బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం ఖాయమని ఎఫ్ఏటీఎఫ్ పాకిస్తాన్‌కు చివరి హెచ్చరిక జారీ చేసింది. ఉగ్రవాదాన్ని అంతమొందించడంలో భాగంగా ఉగ్రమూకలకు ఆర్థిక తోడ్పాటుకు ముగింపు పలికేందుకు పాకిస్తాన్‌కు మరో నాలుగునెలల సమయాన్నిచ్చింది. 2020 ఫిబ్రవరి నాటికి 27 అంశాలతో కూడిన ఎఫ్ఏటీఎఫ్ నిర్దేశించిన కార్యాచరణ ప్రణాళికను పూర్తిస్థాయిలో అమలు చేయకపోతే ఆర్థిక ఆంక్షలు తప్పవని ఎఫ్ఏటీఎఫ్ అధ్యక్షుడు జియాంగ్మిన్ లియూ హెచ్చరించారు. పారిస్‌లో ఎఫ్ఏటీఎఫ్ సమావేశాలు జరుగుతున్నాయి. పూర్తిగా విఫలమైంది... పాక్‌ని ప్రస్తుతం ‘గ్రే లిస్ట్’లో కొనసాగించినా, లేక ‘డార్క్ గ్రే లిస్ట్’లో ఉంచినా ఆర్థిక ఆంక్షల చట్రం బిగుసుకుంటుంది. ఐఎంఎఫ్ నుంచి గానీ, యూరోపియన్ యూనియన్ నుంచి గానీ పాక్‌కు ఏవిధమైన ఆర్థిక సాయం ఉండదు. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో పాకిస్తాన్ తీవ్రంగా విఫలమైందని ఎఫ్ఏటీఎఫ్ సభ్యులంతా ముక్తకంఠంతో విమర్శించారు. ఉగ్రవాదులకు ఆర్థిక సాయాన్ని అదుపుచేయడం, డబ్బు అక్రమరవాణాకి స్వస్తిపలికేందుకు అదనపు చర్యలు తీసుకోవాల్సిందిగా పాకిస్తాన్‌ను ఎఫ్ఏటీఎఫ్ ఆదేశించింది. యాక్షన్ టాస్క్‌ఫోర్స్ నిర్దేశించిన 27 అంశాల్లో కేవలం ఐదంశాలను మాత్రమే పాక్ సరిగ్గా అమలు చేయగలిగిందని తెలిపింది. ఉగ్రవాదులకు ఆర్థిక తోడ్పాటు నిలిపివేయాలంటూ 2018లో పాక్‌ను ఎఫ్ఏటీఎఫ్ ‘గ్రే లిస్ట్’ లో పెట్టింది. లక్ష్యాలను చేరుకోవాలి.. అంతర్జాతీయ ఆర్థిక సమర్థత కోసం ఏర్పాటు చేసిన ఎఫ్ఏటీఎఫ్ 1989 నుంచి ప్రభుత్వ అంతర్ సంస్థగా మారింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 205 మంది ప్రతినిధులు పాల్గొన్న ఈ ప్లీనరీ సమావేశాల్లో ఐఎంఎఫ్, ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు, ప్రపంచ బ్యాంకు లాంటి ఆర్థిక సంస్థలు పాల్గొన్నాయి. లష్కరే తోయిబా వ్యవ స్థాపకుడు హఫీజ్ సయీద్, జైషే మొహమ్మద్ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజర్ లాంటి ఉగ్రనేతలను కట్టడి చేయాలని పాక్‌ను ఎఫ్ఏటీఎఫ్ నిర్దేశించింది. -
బ్లాక్‌లిస్టులో పాక్..!
న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు నిధులు అందకుండా చూడటంలో పాకిస్తాన్ విఫలమైందంటూ ఆ దేశాన్ని ఆర్థిక చర్యల టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) ఆసియా పసిఫిక్ గ్రూప్ బ్లాక్‌లిస్టులో పెట్టింది. ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలో రెండు రోజులపాటు జరిగిన సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. అక్టోబర్‌లో మళ్లీ ఈ చర్చలు జరగనున్నాయి. ఆ లోపు పాక్ తన వైఖరి మార్చుకొని ఉగ్రనిధులను ఆపకపోతే బ్లాక్ లిస్ట్‌లోనే ఉండిపోయే అవకాశం ఉంది. భారత్ కూడా సభ్యత్వం కలిగి ఉన్న ఈ ఎఫ్ఏటీఎఫ్ సదస్సుకు హోంశాఖ, విదేశాంగ శాఖ ప్రతినిధులు హాజరయ్యారు. పాక్ తరఫున పాకిస్తాన్ స్టేట్ బ్యాంక్ గవర్నర్ హాజరయ్యారు. ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి వాటికి నిధులు అందకుండా చేయడంలో పాక్ విఫలమైందన్నది ఎఫ్ఏటీఎఫ్ ప్రధాన అభియోగం. ఈ బృందంలో 41 మంది సభ్యులు ఉండగా వారికి పాక్ సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేకపోయింది. ఉగ్ర నిధులకు వ్యతిరేకంగా రూపొందించిన 11 అంశాల్లో పదింటిని కూడా చేరలేకపోయింది. ఇప్పటికే గ్రే లిస్టులో ఉన్న పాక్ అక్టోబర్ కల్లా బృంద సభ్యులను మెప్పించగలిగేలా ఉగ్రనిధులను కట్టడి చేయాల్సి ఉంటుందని మరో అధికారి స్పష్టం చేశారు. అంతర్జాతీయ సంస్థల నుంచి నిధుల కోసం ప్రయత్నిస్తున్న పాక్‌కు ఇది ఎదురు దెబ్బే. ఐరాసలో ‘కశ్మీర్’ మాటెత్తనున్న ఇమ్రాన్ ఇస్లామాబాద్: కశ్మీర్‌ను అంతర్జాతీయ సమస్యగా చూపించాలన్న ప్రయత్నాలు ఎప్పటికప్పుడు బెడిసికొడుతున్నా.. పాకిస్తాన్ వైఖరిలో మార్పు రావటం లేదు. త్వరలో జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో కశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్ ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు తెలిసింది. వచ్చే నెల 27వ తేదీన ప్రధాని ఇమ్రాన్ ఐరాసలో ప్రసంగించేలా షెడ్యూల్ ఖరారయిందని ‘ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ పత్రిక వెల్లడించింది. కశ్మీర్‌పై భారత్ ఇటీవలి కాలంలో తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇమ్రాన్ ప్రసంగించే అవకాశముందని పేర్కొంది. ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు న్యూయార్క్ చేరుకోనున్న భారత ప్రధాని మోదీ వద్ద... భారత్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని ముస్లిం సంఘాలు, మానవ హక్కుల సంఘాలకు ఇమ్రాన్ సూచించినట్లు కూడా విశ్వసనీయ సమాచారం ఉందని ఆ పత్రిక పేర్కొంది. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేయడంపై భారత్‌తో సంబంధాలను పాక్ తెగదెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. -
ఇమ్రాన్‌కు షాక్.. బ్లాక్‌లిస్ట్‌లోకి పాక్
ఇస్లామాబాద్: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న దాయాది దేశం పాకిస్తాన్‌కు అంతర్జాతీయంగా మరో ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తోన్న తీవ్రవాద సంస్థలకు నిధుల సరఫరాను నివారించడంలో విఫలమైనందుకు ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) పాక్‌కు భారీ షాకిచ్చింది. ఉగ్రవాదులకు నిధులను సమకూరుస్తున్నందున పాకిస్తాన్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెడుతున్నట్లు ఎఫ్ఏటీఎఫ్ శుక్రవారం ప్రకటించింది. ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలో సమావేశమైన కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాద సంస్థలపై చర్యలకు 11 అంశాలను పాక్‌కు వివరించామని, వాటిలో ఏ ఒక్కటీ ఇమ్రాన్ ప్రభుత్వం పాటించలేదని సంస్థ పేర్కొంది. 26/11 ముంబై పేలుళ్ల నిందితుడు హఫీజ్ సయీద్ సహా పలు పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలకు పాకిస్తాన్ కొమ్ముకాస్తోందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. గతంలో గ్రే లిస్టులో ఉన్న పాకిస్తాన్ తాజాగా బ్లాక్‌లిస్ట్‌లోకి చేరడంతో అంతర్జాతీయ పరంగా ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొనుంది. కాగా ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వానికి ఆర్థిక సహాయం చేయడానికి ఇప్పటికే అనేక అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో నిధులు సమకూర్చుకునేందుకు అనేక దారులను అన్వేషిస్తున్న ఇమ్రాన్.. గత్యంతరం లేక ప్రభుత్వ ఆస్తులను సైతం అమ్మకానికి పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశంలో జులాయిగా తిరుగుతున్న గాడిదలన్నింటినీ కంటైనర్లలో నింపి చైనాకు విక్రయించిన విషయం తెలిసిందే. ఇమ్రాన్‌ఖాన్ ఆ దేశ పగ్గాలను ఏ ముహూర్తంలో అందుకున్నారో గానీ.. అప్పటి నుంచీ ఆర్థిక వనరుల కోసం అల్లాడుతోంది. చివరికి విలాసవంతమైన కార్లను కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నుంచి వచ్చే నిధులతోనే కాలం గడుపుతోంది. ఎప్పటికప్పుడు ఐఎంఎఫ్ నుంచి బెయిల్ అవుట్ ప్యాకేజీలను తీసుకుంటోంది. ఈ చర్యలన్నీ ఆ దేశానికి తాత్కాలిక ఊరటను ఇచ్చేవి మాత్రమే. చదవండి: ఏంటయ్యా ఇమ్రాన్ నీ సమస్య..? -
మరోసారి ‘గ్రే’ జాబితాలో పాక్
న్యూఢిల్లీ: అక్రమ నగదు చెలామణి, ఉగ్రవాదులకు ఆర్థికసాయం నిలిపివేత విషయంలో పాకిస్తాన్ ఘోరంగా విఫలమైందని ది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) తెలిపింది. తాము నిర్దేశించిన 27 పాయింట్ల కార్యాచరణ ప్రణాళిక(యాక్షన్ ప్లాన్)ను పాక్ అమలు చేయలేకపోయిందని విమర్శించింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ను మరోసారి ‘గ్రే జాబితా’లోనే కొనసాగిస్తున్నామని వెల్లడించింది. ఈ సెప్టెంబర్ చివరికల్లా ఈ లక్ష్యాలను చేరుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అమెరికాలో సమావేశమైన ఎఫ్ఏటీఎఫ్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై ఎఫ్ఏటీఎఫ్ అధికార ప్రతినిధి స్పందిస్తూ..‘పాకిస్తాన్ నిర్ణీత లక్ష్యాలను చేరుకోనందున ఆ దేశాన్ని ‘గ్రే జాబితా’లో ఉంచాలని నిర్ణయం తీసుకున్నాం. తమ భూభాగంలోని ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందకుండా కచ్చితమైన, విశ్వసించదగ్గ స్థాయిలో, శాశ్వత ప్రభావం చూపేలా చర్యలు తీసుకోవాలని పాక్‌ను ఎఫ్ఏటీఎఫ్ ఆదేశించింది. గడువులోగా అంటే ఈ ఏడాది సెప్టెంబర్‌లోపు ఎఫ్ఏటీఎఫ్ కార్యాచరణ ప్రణాళికను అమలుచేయాలని స్పష్టం చేసింది’ అని తెలిపారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ కన్నెర్ర.. ఉగ్రసంస్థలు లష్కరే తోయిబా(ఎల్ఈటీ) చీఫ్ హఫీజ్ సయీద్, జైషే మొహమ్మద్(జేఈఎం) అధినేత మసూద్ అజర్‌లపై సరైన చర్యలు తీసుకోవడంలో పాక్ విఫలమైందని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎఫ్ఏటీఎఫ్ కార్యాచరణ ప్రణాళికను పూర్తిస్థాయిలో అమలుచేయడానికి పాకిస్తాన్ చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్ చేసింది. -
లాడెన్ కొడుకుపై ఐరాస ఆంక్షలు
ఐక్యరాజ్య సమితి: ఐక్యరాజ్య సమితి భద్రతా మండ లి అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్ (29)ను బ్లాక్‌లిస్టులో పెట్టింది. అతని ఆచూకీ లేదా సమాచారం ఇచ్చిన వారికి అమెరి కా రూ.7 కోట్లు రివార్డు ప్రకటించి రోజే భద్రతా మం డలి ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. హమ్జాపై ఐక్యరాజ్య సమితి ఆంక్షలు విధించడంతో ఇకపై అతడు స్వేచ్ఛగా తిరగలేడు. అతని ఆర్థిక వనరులను స్తంభింపజేయనున్నారు. అంతేకాకుండా ఆయు ధాలు కొనడం, అమ్మడంపై కూడా నిషేధం విధించనున్నారు. అలాగే సౌదీ అరేబియా కూడా హమ్జా పౌరసత్వాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు శుక్రవా రం ప్రకటించింది. పాక్–అఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో హమ్జా ఉన్నట్లు అమెరికా అనుమానం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం అల్ ఖైదా నాయకుడిగా ఉ న్న అమన్ అల్–జవహిరికి వారసుడిగా హమ్జా అవుతాడని భావిస్తోంది. 2015 ఆగస్టులో హమ్జా బిన్ లాడెన్ ఒక ఆడియో, వీడియో సందేశాలను విడుదల చేశాడు. అందులో అమెరికా దాని మిత్రదేశాలపై దాడులు చేయాలని అతని అనుచరులకు పిలుపునిచ్చాడు. -
ఇలాగైతే బ్లాక్ లిస్టులో పెడతాం..
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రఘాతుకాన్ని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) తీవ్రంగా ఖండించింది. జైషే ముహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలకు అందుతున్న ఆర్థిక సహాయాన్ని నిలువరించడంలో పాకిస్తాన్ విఫలమైందని పేర్కొంది. ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం నిలిపివేతకు సంబంధించి తాము జారీ చేసిన 27 అంశాల కార్యాచరణ ప్రణాళికను వచ్చే సెప్టెంబర్‌లోగా అమలు పరచకపోతే బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని పాక్‌ను హెచ్చరించింది. ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహాయాన్ని అరికట్టడం లక్ష్యంగా ఎఫ్ఏటీఎఫ్ పనిచేస్తోన్న విషయం తెలిసిందే. ఉగ్ర సంస్థలకు ఆర్థిక సహాయం వల్ల తలెత్తే తీవ్ర పరిణామాలను అంచనా వేయడంలో పాక్ విఫలమైందని, తాము ఇచ్చిన కార్యాచరణను సరైన విధంగా అమలు చేసేందుకు పాక్ తన వ్యూహాత్మక లోపాలను సరిచేసుకోవాలని వెల్లడించింది. తమ కార్యాచరణను అమలు చేయడంలో కొద్దిగా పురోగతి కనిపించిందని, 2019 మే నాటికి తమ కార్యాచరణను పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిం దేనని స్పష్టం చేసింది. అంతవరకు ప్రస్తుతం ఉన్న గ్రే లిస్ట్‌లోనే దాన్ని కొనసాగించాలని పారిస్‌లో వారం పాటు జరిగిన సమావేశం చివర్లో ఎఫ్ఏటీఎఫ్ నిర్ణయించింది. అలాగే పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన 40 మంది జవాన్ల కుటుంబాలకు ఎఫ్ఏటీఎఫ్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపింది. పుల్వామా దాడికి కారకులైన జైషే ముహమ్మద్ ఉగ్రవాద సంస్థకు పాకిస్తాన్ ఆర్థికంగా సహకరిస్తున్నందున దానిని బ్లాక్ లిస్టులో పెట్టాలంటూ భారత ప్రభుత్వం ఎఫ్‌ఏటీఎఫ్‌పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తోంది. పుల్వామా దాడిలో పాక్ పాత్రను నిరూపించే ఆధారాలతో ఒక పత్రాన్ని కూడా రూపొందించి ఎఫ్ఏటీఎఫ్కు అందజేసింది. ‘పాకిస్తాన్‌కు జైషే ముహమ్మద్ సంస్థతో ఎలాంటి సంబంధాలున్నాయో, ఆ ప్రభుత్వం జైషే ముహమ్మద్ ఉగ్రవాదులకు ఎలా ఆర్థిక సాయం చేస్తోందో ఆ పత్రంలో వివరంగా చెప్పాం. గతంలో ఆ సంస్థ భారత్‌లో జరిపిన దాడుల్ని కూడా ఉదహరించాం’అని ఈ ప్లీనరీకి భారత ప్రభుత్వం తరఫున హాజరైన భద్రతా అధికారి ఒకరు చెప్పారు. జూన్ 2019లో పునఃపరిశీలన.. ఈ సమీక్షకు భారత్ తరఫున హాజరైన ప్రతినిధి పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్న ఉగ్ర సంస్థలే పుల్వామా ఉగ్ర దాడికి కారణమని నిరూపించేందుకు కొత్త సమాచారాన్ని ప్లీనరీకి సమర్పిం చారు. వీటిని పరిశీలించిన ఎఫ్ఏటీఎఫ్ పాక్‌ను గ్రే లిస్టులోనే ఉంచాలని తీర్మానిం చింది. ఈ తీర్మానా నికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, భారత్ మద్దతు తెలిపాయి. తిరిగి ఈ ఏడాది జూన్‌లో గ్రే లిసుపై పరిశీలన జరిపి గ్రే లిస్టులోనే ఉంచాలా?బ్లాక్ లిస్టులో పెట్టాలా? అన్నది నిర్ణయిస్తుంది. బ్లాక్ లిస్టులో పెడితే.. ఏ దేశాన్నయినా బ్లాక్ లిస్టులో పెట్టడమంటే మనీ లాండరింగ్, ఉగ్రవాదులకు ఆర్థిక సాయాలను అరికట్టేందుకు అంతర్జాతీయంగా జరుగుతున్న పోరాటానికి ఆ దేశం సహకరించడం లేదని అర్థం. ఎఫ్ఏటీఎఫ్ పాక్‌ను బ్లాక్ లిస్టులోకి చేర్చడం వల్ల ఆ దేశానికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఐరోపా సమాజం వంటి రుణదాతలు ఆ దేశానికి గ్రేడ్ తగ్గిస్తాయి. దీంతో పాక్‌కు విదేశీ రుణాలు లభించడం కష్టమవుతుంది. అక్రమ నగదు లావాదేవీలు, ఉగ్రవాదులకు ఆర్థికసాయం అందకుండా ఉండేందుకు అవసరమైన చర్యలను పర్యవేక్షించేందుకు ఎఫ్ఏటీఎఫ్ ఏర్పడింది. గ్రే లిస్ట్‌లోకి ఇలా.. అక్రమ నగదు చలామణి, ఉగ్రవాదులకు నిధుల సరఫరాను అడ్డుకోవడానికి ప్రయత్నం చేయని దేశాలను ఎఫ్ఏటీఎఫ్ ముందు గ్రే లిస్ట్‌లో తర్వాత బ్లాక్ లిస్టులో పెడుతుంది. ఆయా దేశాలు ఉగ్రవాదులకు ఆర్థిక సాయాన్ని నిలిపివేశాయని నమ్మకం కలిగాక వాటిని ఆయా జాబితాల నుంచి తొలగిస్తుంది. గతేడాది జూన్‌లో పాకిస్తాన్‌ను గ్రే లిస్టులోకి చేరుస్తూ ఎఫ్ఏటీఎఫ్ నిర్ణయం తీసుకుంది. అలాగే గత అక్టోబర్‌లో గ్రే లిస్టుకు సంబంధించి మొదటి సమీక్ష నిర్వహించగా.. తాజాగా రెండోసారి సమీక్ష నిర్వహించింది. 2012–15 మధ్య కాలంలో పాక్ ఈ జాబితాలోనే ఉన్నా దాని వైఖరి మారకపోవడంతో మళ్లీ గతేడాది ఈ జాబితాలోకి ఎక్కింది. -
బ్లాక్‌లిస్ట్‌లో పాకిస్తాన్!
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌ను అంతర్జాతీయ వేదికలపై ఒంటరి చేసేందుకు భారత్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఉగ్రసంస్థలకు ఆర్థిక సాయంపై నిఘా ఉంచే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్)కు పుల్వామా ఘటనపై కీలక సాక్ష్యాధారాలను సమర్పించనుంది. వచ్చేవారం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఎఫ్ఏటీఏ ప్లీనరీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఉగ్రసంస్థ జైషే మొహమ్మద్‌కు పాకిస్తాన్ నిఘా సంస్థలు అందజేస్తున్న సాయాన్ని భారత్ ఎండగట్టనుంది. ఈ పత్రాలను భద్రతా సంస్థలు రూపొందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పారిస్‌లో జరిగే సమావేశంలో పాకిస్తాన్‌ను నిషేధిత జాబితా(బ్లాక్ లిస్ట్)లో చేర్చాల్సిందిగా కోరతామని తెలిపారు. మనీ లాండరింగ్‌తో పాటు ఉగ్రవాదులకు ఆర్థిక సాయమందించే దేశాలను ఎఫ్ఏటీఎఫ్ నిషేధిత జాబితాలో చేరుస్తుంది. దీనివల్ల అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ), యూరోపియన్ యూనియన్(ఈయూ)లు సదరు దేశపు రేటింగ్‌ను డౌన్‌గ్రేడింగ్ చేస్తాయి. దీంతో అంతర్జాతీయ సంస్థల నుంచి రుణసాయం, పెట్టుబడులు నిలిచిపోతాయి. అలాగే ఎస్అండ్పీ, ఫిచ్, మూడీస్ వంటి రేటింగ్ ఏజెన్సీలు సైతం పెట్టుబడులపై రిస్క్ రేటింగ్లను తగ్గించేస్తాయి. తద్వారా నిషేధిత దేశానికి అన్నివైపుల నుంచి దారులు మూసుకుపోతాయి. 2018, జూలైలో జరిగిన ప్లీనరీ సమావేశంలో ఎఫ్ఏటీఎఫ్ పాక్‌ను ‘గ్రే’ జాబితాలో చేర్చింది. నిర్దేశిత నిబంధనలను పాటించకుంటే నిషేధిత జాబితాలో చేరుస్తామని హెచ్చరించింది. ఎఫ్ఏటీఎఫ్లో 35 దేశాలు, ఈయూ కమిషన్, గల్ఫ్ సహకార మండలి సభ్యులుగా ఉన్నాయి. ఉత్తరకొరియా, ఇరాన్ దేశాలను ఎఫ్ఏటీఎఫ్ నిషేధిత జాబితాలో చేర్చింది. -
డిఫాల్టర్లకు చైనా ప్రభుత్వం చుక్కలు!
బీజింగ్: ఇచ్చిన రుణాలను వసూలు చేసుకోవడానికే భారత్‌లో నానా కష్టాలు పడుతుంటే చైనా ప్రభుత్వం అక్కడి డిఫాల్టర్లకు చుక్కలు చూపిస్తోంది. 2017 చివరినాటికి రుణాల ఎగవేతకు పాల్పడిన 95.9 లక్షల మంది ప్రజల్ని కోర్టులు నిషేధిత జాబితాలో చేర్చినట్లు సుప్రీం పీపుల్స్ కోర్టు(ఎస్పీసీ) తెలిపింది. డిఫాల్టర్ల రూ.1.76 లక్షల కోట్ల(27.7 బిలియన్ డాలర్లు) డిపాజిట్లను జప్తు చేశారు. పాస్‌పోర్టులు, గుర్తింపు కార్డుల ఆధారంగా విమానాలు, హైస్పీడ్ రైళ్లలో టికెట్లు కొనకుండా అడ్డుకున్నారు. డిఫాల్టర్లు దాఖలు చేసే రుణ, క్రెడిట్ కార్డ్ దరఖాస్తుల్ని తిరస్కరించేందుకు బ్యాంకులతో కలిసి పనిచేశారు. నిషేధిత జాబితాలోని వ్యక్తులు కార్పొరేట్ సంస్థల ప్రతినిధులుగా ఇకపై ఉండలేరు. -
ఎన్నిసార్లు చెబుతారు.. బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిస్తా
‘ముచ్చుమర్రి’ సైట్ మేనేజర్‌పై కలెక్టర్ ఆగ్రహం పగిడ్యాల: ఎన్నిసార్లు చెబుతారు.. బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిస్తానంటూ ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం సైట్ మేనేజర్ రాముడుపై జిల్లా కలెక్టర్ విజయ్‌మోహన్ మండిపడ్డారు. గురువారం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు చేస్తున్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నవంబర్ చివరికి ట్రయల్‌రన్ చేస్తామని చెప్పారు.. మోటార్లలో సాంకేతిలోపం తలెత్తిందని మరో మూడు రోజులు వ్యవధి తీసుకున్నారు.. చేతకాకపోతే చెప్పండి..ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిస్తాను’’ అంటూ హెచ్చరించారు. కరెంట్ సమస్య ఏమైనా ఉందా అని ప్రశ్నించడంతో అలాంటిది ఏమీలేదని ఎస్ఈ భార్గవరాముడు తెలిపారు. మోటార్లో తలెత్తిన సమస్యను సాయంత్రంలోగా గుర్తించాలని..ఈనెల 18న డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ట్రయల్ రన్ ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కేసీ కాలువ వద్ద ఏర్పాటు క్రాస్ రెగ్యూలేటర్‌ను పరిశీలించారు. కర్నూలుకు నీరు తీసుకెళ్లడానికి వీలుగా రెండు రోజులు రెగ్యూలేటర్లు బంద్ చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ నూతన కార్యాలయాలకు కనెక్షన్లు ఇచ్చి మీటర్లు అమర్చినప్పటికీ విద్యుత్ బిల్లులు రావడం లేదని అధికారులు.. కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే కనెక్షన్ కట్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జలవనురుల శాఖ ఎస్ఈ నారాయణస్వామి, ఈఈ రెడ్డిశేఖర్, డీఈలు బాలాజీ, ఆదిశేషారెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ భార్గవరాముడు, డీఈ ప్రభాకర్, తహసీల్దార్ కుమారస్వామి, ఎంపీడీవో విజయలక్ష్మి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
బ్లాక్‌లిస్టులో మరో ఎనిమిది స్టార్టప్‌లు!
కోల్కత్తా : అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలలో కంపెనీల బ్లాక్లిస్టుల జాబితా పెరుగుతోంది. తాజాగా ఐఐటీ ఖరగ్‌పూర్, తమ క్యాంపస్‌లో రిక్రూట్మెంట్ జరుపకుండా ఎనిమిది స్టార్టప్‌లపై నిషేధం విధించింది. ఉద్యోగ ఆఫర్లు ఇచ్చి అనంతరం వెనక్కి తగ్గేసిన నేపథ్యంలో ఈ స్టార్టప్‌లను ఖరగ్‌పూర్ బ్లాక్ లిస్టులో పెడుతున్నట్టు ప్రకటించింది. గతేడాది తమ విద్యార్థులకు ఈ స్టార్టప్‌లు ఆఫర్ లెటర్లు ఇచ్చారని, అనంతరం ఆ లెటర్లను ఉపసంహరించుకున్నారని ఇన్స్టిట్యూట్ ప్లేస్మెంట్ చైర్మన్ దేవాసిస్ దేవ్ తెలిపారు. దీంతో ఆ స్టార్టప్‌లను క్యాంపస్‌లోకి ఈ ఏడాది అడుగుపెట్టే వీలులేకుండా నిషేధం విధించినట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది 10 నుంచి 12 స్టార్టప్‌లకు క్యాంపస్‌లో ప్లేస్మెంట్లకు అనుమతిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు మొత్తం 31 స్టార్టప్‌లపై నిషేధం విధించాయి. ఆఫర్ లెటర్లు ఇచ్చి, అనంతరం ఉద్యోగంలో జాయిన్ చేసుకోకుండా జాప్యం చేయడం, లేదా ఆ ఆఫర్లను వెనక్కి తీసుకోవడం వంటి కారణాలతో ఆ కంపెనీలపై ఐఐటీలు వేటు వేస్తున్నాయి. -
బ్లాక్‌లిస్ట్
సాక్షి ప్రతినిధి, చెన్నై: పవిత్రమైన న్యాయవాద వృత్తిని అపవిత్రంగా మార్చారనే ఆరోపణలపై పది మంది న్యాయవాదులను తమిళనాడు బార్ కౌన్సిల్ బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. న్యాయవాద వృత్తికి జీవితాంతం దూరం చేస్తూ నిషేధం విధించింది. నిబంధనలకు విరుద్ధంగా టాస్మాక్ సంస్థలో ఉద్యోగం చేస్తూ న్యాయవాద వృత్తిని అభ్యసించడం, నేర చరిత్రను కలిగి ఉండడం వంటి కారణాలపై పదిమందిపై వేటుపడింది. న్యాయవాదిగా పట్టా పుచ్చుకున్న తరువాత సదరు వ్యక్తి తమిళనాడు బార్ కౌన్సిల్లో పేరును నమోదు చేసుకోవాలి. ఇలా నమోదు చేసుకునే సమయంలో తనపై ఎటువంటిక్రిమినల్ కేసులు లేవని డిక్లరేషన్ ఇవ్వాలి. అయితే కొందరు న్యాయవాదులు తమ నేరచరిత్రను దాచిపెట్టి తమ పేర్లను నమోదు చేసుకున్నారని తమిళనాడు బార్ కౌన్సిల్‌కు ఇటీవల అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో తమిళనాడు బార్‌కౌన్సిల్ పేర్లను నమోదు చేసుకున్నవారి వివరాలను సమీక్షించారు. కన్యాకుమారీ జిల్లాకు చెందిన కార్తికేయన్, ఆదికేశవన్, మురళీ, రామచంద్రన్, స్టాన్లీముల్లవర్ తమపై ఉన్న క్రిమినల్ కేసులను దాచిపెట్టిన సంగతి బైటపడింది. వీరందరికీ బార్ కౌన్సిల్ షోకాజ్ నోటీసులు పంపింది. అలాగే టాస్మాక్ సంస్థలో పనిచేస్తూ చదువుకున్న వెంకటేశన్, కవిదాసన్, తూయవన్, మనివణ్ణన్, ఫార్మసీ వ్యాపారం చేస్తూ న్యాయవాద కళాశాలకు వెళ్లిన రమేష్‌బాబులను కూడా గుర్తించారు. వీరికి కూడా షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసులకు వారు పంపిన సంజాయిషీ సంతృప్తికరంగా లేదంటూ పదిమందిని బార్ కౌన్సిల్ సభ్యత్వం నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అంతేగాక జీవితాతం వారు న్యాయవాద వృత్తిని చేపట్టరాదని ఆదేశించింది. ఇదిలా ఉండగా, నకిలీ పట్టాలతో న్యాయవాద వృత్తిని నిర్వహిస్తున్న వారిని సైతం గుర్తించేందుకు బార్ కౌన్సిల్ కసరత్తు చేస్తోంది. పునఃపరిశీనకు సర్టిఫికేట్లను సమర్పించాల్సిందిగా రాష్ట్రంలోని 90 వేల మంది న్యాయవాదులను బార్ కౌన్సిల్ కోరగా కేవలం 256 మంది మాత్రమే సమర్పించారు. సర్టిఫికెట్ల తనిఖీలకు సహకరించని న్యాయవాదులపై కూడా తగిన చర్య తీసుకుంటామని బార్ కౌన్సిల్ హెచ్చరించింది. ముగిసిన పదవీకాలం: ఇదిలా ఉండగా తమిళనాడు బార్ కౌన్సిల్ పదవీకాలం ఈనెల 19వ తేదీతో ముగిసింది. బార్ కౌన్సిల్‌ను నిర్వహించేందుకు ముగ్గురితో కూడిన ప్రత్యేక బృందాన్ని అడ్వకేట్ జనరల్ నియమించారు. అడ్వకేట్ జనరల్ ఆర్ ముత్తుకుమారస్వామి ఈ బృందానికి అధ్యక్షులుగా వ్యవహరిస్తుండగా టీ సెల్వం, పీఎస్ అమల్‌రాజ్ సభ్యులుగా నియమితులయ్యారు. ఈ బృందానికి సహాయకులుగా సీనియర్ న్యాయవాదులు ఏ నటరాజన్, ఏఏ వెంకటేశన్, కేఆర్ఆర్ అయ్యప్పమణి తదితర 16 మంది తాత్కాలికంగా నియమితులయ్యారు. -
20 కంపెనీలపై ఐఐటీలు నిషేధం
న్యూఢిల్లీ : 20 స్టార్టప్, ఈ-కామర్స్ కంపెనీలపై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీలు) నిషేధం విధించనున్నాయి. కళాశాల ప్రాంగణాల్లో నియామకాలు చేపట్టకుండా ఈ కంపెనీలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టనున్నాయి. అధికవేతనంతో జాబ్ ఆఫర్ చేస్తూ.. ప్రాంగణాల్లోనే నియామకాలు చేపడుతూ... ఆఫర్ లెటర్లను ఉపసంహరించుకోవడం వంటి ఘటనలపై సీరియస్‌గా స్పందించిన ఐఐటీలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే బ్లాక్‌లిస్టులో పెట్టిన కంపెనీల జాబితాను ఐఐటీల ప్లేస్మెంట్ కమిటీ(ఏఐసీసీ) ఇంకా వెల్లడించలేదు. బ్లాక్లిస్ట్తో పాటు ఆఫర్ లెటర్లు ఇచ్చి విత్ డ్రా చేసుకోవడం, ముందు ప్రకటించిన వేతనంలో కోత విధించడం, ఉద్యోగ నియామకాల్లో జాప్యం చేస్తుండటం వంటి వరుస ఘటనల నేపథ్యంలో కంపెనీలు సీరియస్ వార్నింగ్ లెటర్లు కూడా అందుకోనున్నాయి. గతేడాది ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సంస్థ ఉద్యోగాలిస్తామని చెప్పి నెలలు గడిచినా స్పందించకపోవడంతో, ఆ కంపెనీ కూడా వార్నింగ్ లెటర్‌ను అందుకోనుందని తెలుస్తోంది. అయితే ఫ్లిప్‌కార్ట్ జాబ్ ఆఫర్లను పూర్తిగా ఉపసంహరించుకోకపోవడం వల్ల బ్లాక్‌లిస్ట్ విధించిన జాబితాలో ఉండకపోవచ్చని ఏఐపీసీ కన్వినర్ కౌస్తుబా మోహంతి అన్నారు. వరుసగా రెండో ఏడాది కూడా జూమోటో కంపెనీని బ్లాక్‌లిస్ట్‌లో పెడుతున్నట్టు ప్రకటించారు. అయితే ఈ విషయంపై కంపెనీలు ఇంకా స్పందించలేదు. క్యాంపస్ రిక్రూట్మెంట్ వ్యవహారంలో కంపెనీలు చేస్తున్న నిర్లక్ష్యపూరితమైన అంశాలపై ఐఐటీలు సీరియస్‌గా స్పందించాయని, ఏకగ్రీవంగా కంపెనీలను బ్లాక్‌లిస్ట్ పెట్టడానికి ఆమోదించాయని చెప్పారు. ఐఐటీ కాన్పూర్‌లో 12 ఐఐటీలతో నిర్వహించిన 2017 ప్లేస్మెంట్ మీటింగ్‌లో ఏఐపీసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఐఐటీ బొంబై ఈ మీటింగ్‌కు హాజరుకాలేదని మోహంతి చెప్పారు. -
అమెరికా ఆశలకు ‘బ్లాక్‌లిస్ట్’ కష్టాలు!
* నాణ్యత కొరవడిన 150కి పైగా వర్సిటీలపై దృష్టిపెట్టిన అమెరికా ప్రభుత్వం * కాలిఫోర్నియాలో 22 విశ్వవిద్యాలయాలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినట్లు సమాచారం * ఆ లిస్టులోని వర్సిటీల్లో చేరుతున్న విదేశీ విద్యార్థుల్ని వెనక్కి పంపుతున్న వైనం * ఇమిగ్రేషన్ అధికారులు తిప్పి పంపిన భారత విద్యార్థులు 25కు పైనే.. సాక్షి ప్రత్యేక ప్రతినిధి : అమెరికా చదువు ఆశలకు ‘బ్లాక్‌లిస్ట్’ కష్టాలు దాపురించాయి. పలు యూనివర్సిటీల్లో అడ్మిషన్ తీసుకునేందుకు విమానం ఎక్కుతున్న భారత విద్యార్థులను అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు విమానాశ్రయాల నుంచే తిప్పి పంపుతున్నారు. విదేశీ విద్యార్థుల డిమాండ్ దృష్ట్యా కుప్పలు తెప్పలుగా బ్రాంచ్‌లు ఏర్పాటు చేస్తూ నాణ్యతకు తిలోదకాలు ఇచ్చిన 150కి పైగా విశ్వవిద్యాలయాలను అమెరికా ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడమే దీనికి కారణం. సరైన అవగాహన లేకపోవడం, అమెరికా వర్సిటీలో సీటు వస్తే చాలనుకుంటూ వెళ్లడం వంటివి విద్యార్థుల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు.. గత ఆరు నెలలుగా అమెరికా ప్రభుత్వం విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కాలేజీల్లో నాణ్యత, బోధనా ప్రమాణాలపై దృష్టి పెట్టిం ది. అక్కడి కాలిఫోర్నియాలోని 22కు పైగా కాలేజీలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినట్లు సమాచారం. ఆ జాబితాలోని రెండు వర్సిటీల్లో చేరిన భారత, చైనా విద్యార్థులను అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు విమానాశ్రయాల నుంచే వెనక్కి పంపుతున్నారు. ఇప్పటికే వెయ్యి మందికి పైగా చైనా విద్యార్థులను వెనక్కి పంపగా.. 25 మంది భారత విద్యార్థులను తిప్పిపంపారు. సిలికాన్ వ్యాలీ వర్సిటీ, నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఎంఎస్ డిగ్రీ కోసం భారత్ నుంచి 875 మంది విద్యార్థులు చేరినట్లు తెలిసింది. వారిలో దాదాపు 600 మంది ఇప్పటికే అమెరికాకు చేరుకున్నారు. వారి భవిష్యత్ ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. 1,600 విశ్వవిద్యాలయాలు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో దాదాపు 1,600 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వాటిలో 300 ప్రభుత్వ రంగ వర్సిటీలు, మరో 600 వివిధ ట్రస్టులు, ప్రముఖ విద్యా సంస్థల అధీనంలో ఉన్నాయి. మిగతా 700 యూనివర్సిటీలు, వాటి స్థితిగతుల సమాచారం లేకపోవడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు. సాధారణంగా అమెరికా వర్సిటీల్లో జీఆర్ఈ, టోఫెల్ ఉత్తీర్ణత, ఆ పరీక్షల్లో సాధించిన పాయింట్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. కానీ ఈ 700 వర్సిటీలు జీఆర్ఈ, టోఫెల్ పరీక్షలకు హాజరైతే చాలు అడ్మిషన్లు ఇచ్చేస్తున్నాయి. ఎన్ని మార్కులు సాధించారన్నదానితో నిమిత్తం లేకుండానే ఎంఎస్ డిగ్రీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని విశ్వవిద్యాలయాలు జీఆర్ఈ లేకపోయినా సీటు ఇస్తామంటూ భారత్, అమెరికాలోని స్థానిక ప్రభుత్వాలు, వర్సిటీలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. షికాగోకు చెందిన ఓ వర్సిటీ ఇలా నిజామాబాద్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వర్సిటీలో చదివిన విద్యార్థులు జీఆర్ఈ లేకపోయినా అమెరికా వర్సిటీలో చేరవచ్చన్నది ఆ ఒప్పందం. ఇలాంటి వాటితోనే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తప్పుదోవ పట్టి ఇబ్బందుల పాలవుతున్నారు. కన్సల్టెన్సీలకూ నజరానాలు అమెరికాలో ఎంఎస్ డిగ్రీకి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని అక్కడి కొన్ని విశ్వవిద్యాలయాలు భారత్‌లో కన్సల్టెన్సీలతో సంబంధాలు పెట్టుకుంటున్నాయి. ఒక్కో విద్యార్థి అడ్మిషన్‌కు 250 డాలర్లు (సుమారు రూ. 15 వేలు) కన్సల్టెన్సీలకు ఇస్తున్నాయి. ఈ సొమ్ము కు ఆశపడిన పలు కన్సల్టెన్సీలు మంచి జీఆర్ ఈ, టోఫెల్ స్కోరు సాధించిన విద్యార్థులతో కూడా చెత్త వర్సిటీలకు దరఖాస్తు చేయిస్తున్నాయి. కనీస మార్కులు వచ్చిన విద్యార్థులే వీటివల్ల అధికంగా నష్టపోతున్నారు. ఆ వర్సిటీల జాబితా బయటపెట్టాలి అమెరికా ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన వర్సిటీల జాబితాను బయటపెట్టకపోతే ఇలాంటి అనర్థాలు తప్పవని నిపుణులు అంటున్నారు. అమెరికాలో ఏయే వర్సిటీలను నిషేధిత జాబితాలో చేర్చారనే వివరాలను అమెరికా కాన్సులేట్ కార్యాలయాలకు అందించాలని... అలా చేస్తే ఆయా వర్సిటీలు జారీ చేసిన ఐ20 పత్రాల ఆధారంగా వచ్చిన వీసా దరఖాస్తులను తిరస్కరించడానికి వీలు కలుగుతుందని అంటున్నారు. ‘బ్లాక్‌లిస్ట్’ వర్సిటీల వివరాలు ప్రకటిస్తాం: సుష్మా స్వరాజ్ సాక్షి, న్యూఢిల్లీ: అమెరికాలో బ్లాక్‌లిస్టులో పెట్టిన వర్సిటీలు, గుర్తింపు పొందిన వర్సిటీల జాబితాను అందచేస్తామని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ హామీ ఇచ్చారు. గుర్తింపులేని వర్సిటీల సర్టిఫికెట్లకు ప్రపంచంలో ఎక్కడా గుర్తింపు ఉండదని.. జాబితా విడుదల చేసే వరకు విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లకుంటేనే మంచిదని సూచించారు. అమెరికాకు వెళ్లే భారత విద్యార్థుల సమస్యలను కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు మంగళవారం సుష్మా దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం అశోక్‌గజపతిరాజు, రామ్మోహనరావు మీడియాతో మాట్లాడారు. బ్లాక్‌లిస్టు జాబితా అందే వరకు విద్యార్థులు వేచి ఉండాలని కోరారు. ఇది ఎయిర్‌లైన్స్ సమస్య కాదని.. ఏ ఎయిర్‌లైన్స్ ద్వారా అమెరికా వెళ్లినా ఇమిగ్రేషన్‌లో ఆపేస్తారని స్పష్టం చేశారు. బ్లాక్‌లిస్టులో లేము: సిలికాన్ వ్యాలీ, నార్త్ వెస్ట్రన్ వర్సిటీలు వాషింగ్టన్: తమ వర్సిటీలను అమెరికా ప్రభుత్వం బ్లాక్‌లిస్టు పెట్టిందని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ, నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ ప్రకటించాయి. ఈ వివరాలను యూఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ అధికారులకు పంపామని తెలిపాయి. ఉగ్రదాడుల నేపథ్యంలో దేశంలో భద్రతను కట్టుదిట్టం చేయడంతో విద్యార్థులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని... ఇమిగ్రేషన్ అధికారులకు సరైన వివరాలు చూపని పక్షంలోనూ తిప్పి పంపుతున్నారని వెల్లడించాయి. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని యూఎస్ ఎంబసీ, ఎయిర్ ఇండియా అధికారులకు వర్సిటీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. -
బ్లాక్‌లిస్టులో 31.4 లక్షల కంపెనీలు
బీజింగ్ : పారదర్శకత లోపించిందని భావించిన చైనా ప్రభుత్వం 3.14 మిలియన్ల(31.4 లక్షలు) సంస్థలు, కంపెనీలను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. ఆయా సంస్థలు ప్రభుత్వానికి అందించిన వివరాలు, నిర్వహణ లోపాలు, పన్నుల ఎగవేత, తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అధికారులు ఇటీవలే వెల్లడించారు. బ్లాక్‌లిస్ట్ కంపెనీల వివరాలను నేషనల్ ఎంటర్ప్రైజ్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ పబ్లిసిటీ సిస్టమ్ అనే వెబ్సైట్లో పొందుపరిచినట్లు పారిశ్రామిక, వాణిజ్యశాఖల డిప్యూటీ చీఫ్ లీయు యుటింగ్ పేర్కొన్నారు. వెబ్సైట్ సిస్టమ్ ఆ కంపెనీల రిజిస్ట్రేషన్, అడ్మినిష్ట్రేషన్ వ్యవహారాలు, ప్రభుత్వ పన్నులు, జరిమానాలు లాంటి పూర్తివివరాలను అందిస్తుందని ఆయన వివరించారు. -
120 అసభ్యకర గీతాలపై నిషేధం
బీజింగ్: చూసేందుకు ఏవగింపుకలిగించే, జుగుప్సాకరంగా ఉన్న కొన్ని వీడియో గీతాలపై చైనా నిషేధం విధించింది. అసభ్యకరంగా చిత్రీకరించిన 120 పాటలను వెంటనే ఆయా వెబ్సైట్ల నుంచి తొలగించాలని నిర్ణయించింది. వాటి జాబితా విడుదల చేస్తూ కఠిన ఆదేశాలు జారీ చేసింది. చైనాకు చెందిన సామాజిక సాంస్కృతిక సంబంధాల శాఖ ఈ ఆదేశాలు వెలువరించింది. 'అసభ్యత, హింస, నేరపూరిత, సామాజిక విలువలకు భంగం కలిగించేలా 120 పాటలు ఉన్నాయి. వాటిని వెంటనే తొలగించండి' అని ఒక ప్రకటనలో పేర్కొంది. ఇలా నిషేధం విధించిన పాటల్లో తైవాన్ పాప్ సింగర్ చాంగ్ సన్ యక్, నటి స్టాన్లీ హువాంగ్వి కూడా ఉన్నాయి. -
బోగస్ కనెక్షన్లు 68 వేలు
చమురు కంపెనీల సర్వేలో బయటపడిన నిజాలు ఒకే పేరు, ఒకే అడ్రస్‌తో ఎన్నో కనెక్షన్లు ఆధార్ సాయంతో గుర్తిస్తున్న అధికారులు వేర్వేరు కంపెనీల్లో అకౌంట్ ఉన్న వారికి సరఫరా నిలిపివేత ‘దీపం’ కనెక్షన్లరునా రద్దే.. విజయవాడ : బోగస్ గ్యాస్ కనెక్షన్ల ఏరివేత ముమ్మరంగా సాగుతోంది. ఒకే పేరు, ఒకే అడ్రస్‌తో ఉన్న రెండు, మూడు గ్యాస్ కనెక్షన్లను ఏజెన్సీల నిర్వాహకులు బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేస్తున్నారు. ఇలాంటి కనెక్షన్లను రద్దుచేసేందుకు ప్రతిపాదనలు తయూరుచేస్తున్నారు. ఆధార్ నంబర్ల సహాయంతో ఈ ప్రక్రియ చేపడుతున్నారు. జిల్లాలో బినామీ పేర్లతో, రకరకాల అడ్రస్‌లు సృష్టించి వివిధ కంపెనీల గ్యాస్ కనెక్షన్లు తీసుకున్న వినియోగదారుల వివరాలు తెలుసుకునేందుకు చమురు కంపెనీలు ఓ సర్వే నిర్వహించాయి. నెలరోజుల పాటు జరిగిన ఈ సర్వేలో హైదరాబాద్ తరువాత జిల్లావ్యాప్తంగా విజయవాడలో 68వేల దొంగ కనెక్షన్లు ఉన్నట్లు గుర్తించారు. పట్టుబడిన బోగస్ గ్యాస్ కనెక్షన్లు రద్దు చేయటానికి నిర్ణయించారు. సర్వే ప్రక్రియ ఇదీ.. జిల్లాలో 77 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. బీపీసీ, హెచ్పీసీ, ఇండేన్ గ్యాస్ కంపెనీలకు సంబంధించి జిల్లాలో 10,94,104 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీరిలో 8,59,071 మంది తమ ఆధార్ నంబర్లు గ్యాస్ కనెక్షన్‌కు అనుసంధానం చేసుకున్నారు. ఇంకా 2,35,033 మంది ఈ ప్రక్రియ పూర్తిచేయలేదు. వీరిలో దాదాపు 1,67,033 మందికి ఇంకా ఆధార్‌కార్డు రాలేదు. మిగిలిన 68 వేలమంది వినియోగదారులకు దొంగ కనెక్షన్లు ఉన్నట్లు చమురు కంపెనీలు గుర్తించాయి. మూడు రకాలుగా దొంగ కనెక్షన్లు గ్యాస్ ఏజెన్సీలు జరిపిన సర్వేలో మూడు రకాలైన దొంగ కనెక్షన్లు గుర్తించారు. ఒకే అడ్రస్, ఒకే పేరుతో వేల సంఖ్యలో కనెక్షన్లు ఉన్నాయి. వేరే పేరు, వేరే అడ్రస్‌తో కూడా చాలామంది కనెక్షన్లు తీసుకున్నారు. దీపం గ్యాస్ కనెక్షన్లు పొందిన వేలాది మంది వాటిని అన్యాక్రాంతం చేసి ఇతరులకు విక్రయించారు. దీపం పథకం ద్వారా పొందిన కనెక్షన్‌ను కొందరు ఇతరులకు అమ్ముకుని, తిరిగి వేరొక కంపెనీలో తమ సొంత పేర్లతో కొత్త కనెక్షన్ తీసుకున్నారు. ఇలా.. గ్యాస్ కనెక్షన్ పొందిన వారిని సర్వేలో గుర్తించారు. చమురు కంపెనీలను ఆన్లైన్లో అనుసంధానం చేసుకుని ఒకే పేరుతో ఉన్న గ్యాస్ కనెక్షన్లను పట్టుకున్నారు. మూడు కంపెనీలలో ఒకే పేరు ఉన్న వారికి గ్యాస్ సరఫరా నిలిపివేశారు. మిగిలిన రెండు కంపెనీల్లో కనెక్షన్లు రద్దుచేసుకుని అక్కడి డిపాజిట్లను వెనక్కి తీసుకెళ్లిన వారికి మూడో కంపెనీకి చెందిన గ్యాస్‌ను రెగ్యులర్ చేస్తామని చమురు కంపెనీల అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. -
బీవీజీ కాంట్రాక్ట్ రద్దుకు సభ్యుల డిమాండ్
బెంగళూరు, న్యూస్‌లైన్ : బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) పరిధిలో చెత్త తొలగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బీవీజీ కంపెనీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలంటూ పాలికె కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం బీబీఎంపీ సర్వసభ్య సమావేశంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సమావేశం ప్రారంభం కాగానే సీనియర్ కార్పొరేటర్ సి.కె.రామ్మూర్తి సహా పలువురు కార్పొరేటర్లు నగరంలో చెత్త పేరుకుపోవడంపై మండిపడ్డారు. చెత్త తొలగింపుల కాంట్రాక్ట్ తీసుకున్న బీవీజీ సంస్థ వైఖరి వల్ల బెంగళూరుకి చెడ్డపేరు వస్తోందని అసహనం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఈ సంస్థ ఇలాగే ప్రవర్తిస్తే కాంట్రాక్ట్‌ను అప్పటి మేయర్ ఎస్.కె.నాగరాజు రద్దు చేశారని గుర్తు చేశారు. మళ్లీ అదే కంపెనీకి కాంట్రాక్ట్‌ను అప్పగించి నగర ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడడం సరికాదని హితవు పలికారు. కార్పొరేటర్ యశోద కృష్ణప్ప మాట్లాడుతూ... తన వార్డులో చెత్త తొలగించడం లేదని స్వయంగా తానే ధర్నా చేసినా బీవీజీ ప్రతినిధులు స్పందించలేదని ఆరోపించారు. వెంటనే సంస్థ కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు మూకుమ్మడిగా డిమాండ్ చేశారు. ఇదే సందర్భంగా బీబీఎంపీలో ఖాళీగా ఉన్న నాలుగు వేల పారిశుద్ధ కార్మికుల ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు మాట్లాడుతూ... ప్రజా సమస్యలు పరిష్కరించలేని ఈ బీజేపీ పాలన ఉన్నా, లేకున్నా ఒక్కటే నని ఎద్దేవా చేశారు. కేవలం అధికారం కోసం బీజేపీ నేతలు పాకులాడుతున్నారని దుయ్యబట్టారు. సమావేశం ప్రారంభంలో మాజీ మంత్రి, దివంగత ఎ.కృష్ణప్పకు సభ్యులు నివాళులర్పించారు.