Facebook Secret List Leaked By Intercept: ఫేస్‌బుక్ పాలసీలకు వ్యతిరేకంగా ఉన్న గ్రూప్స్, వ్యక్తులపై ఫేస్‌బుక్ కఠినమైన ఆంక్షలను విధిస్తోంది. ప్రమాదకరమైన వ్యక్తులు, సంస్థలను గుర్తించడానకి ఫేస్‌బుక్ మూడంచెల వ్యవస్థను కల్గి ఉంది. టెర్రరిస్ట్ , ద్వేషపూరిత గ్రూప్స్, క్రిమినల్ ఆర్గనైజేషన్ గ్రూప్‌లను ఫేస్‌బుక్ బ్లాక్ లిస్ట్‌లో పెట్టినట్లు ఇంటర్‌సెప్ట్ పేర్కొంది.
చదవండి: 4 నెలల పాటు ఉచిత ఇంటర్నెట్ సేవలు...! ఎలాగంటే...
ఇండియాలో నాలుగువేలకు పైగా...
ప్రజాస్వామ్య పద్దతులకు వ్యతిరేకంగా ఉండే గ్రూప్స్, వ్యక్తులపై, తీవ్రవాద సంస్థలపై ఫేస్‌బుక్ కఠిన చర్యలను తీసుకుంటుంది. సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సుమారు 4 వేలకు పైగా గ్రూప్స్‌ను, వ్యక్తుల ఖాతాలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ఫేస్‌బుక్ తన ప్లాట్‌ఫారమ్‌లో అనుమతించని 'ప్రమాదకరమైన వ్యక్తులు, సంస్థల(‘Dangerous Individuals and Organizations’)' జాబితా డాక్యుమెంట్లను ఇంటర్‌సెప్ట్ మంగళవారం రోజున లీక్ చేసింది. వీటిలో ఇండియన్ ముజాహిదీన్, జైషే-ఇ-మహమ్మద్, తాలిబన్లకు, సంబంధించిన గ్రూప్స్ ఇందులో ఉన్నాయి. ఇంటర్‌సెప్ట్ ద్వారా విడుదల చేయబడిన బ్లాక్‌లిస్ట్‌పై ఫేస్‌బుక్ స్పందించలేదు.
సోషల్ మీడియానే ఆయుధంగా...!
నేటి టెక్నాలజీ యుగంలో సోషల్‌మీడియా ఒక పదునైన ఆయుధం. సోషల్ మీడియాను సరైన దారిలో వాడుకుంటే ఎన్నో ఉపయోగాలు..అదే చెడు దారిలో వాడితే ఊహించలేని పర్యావసనాలు ఎదురవుతయ్యాయి. పలు ఉగ్రవాద సంస్థలు సోషల్‌మీడియాను ఒక ఆయుధంగా మార్చుకుంటూ తమ భావజాలాన్ని ముందుకు తీసుకేళ్తున్నారు. పలు సోషల్‌మీడియా సంస్థలు ప్రజాస్వామ్య పద్దతులకు వ్యతిరేకంగా ఉన్న గ్రూప్‌లను, పేజీలను గుర్తించి వాటిని బ్లాక్‌లిస్ట్‌లో పెడుతుంటాయి.
చదవండి: చైనాకు భారీ షాకిచ్చిన మైక్రోసాఫ్ట్..!
Comments
Please login to add a commentAdd a comment