terror groups
-
పాకిస్థాన్ ఉగ్రవాది విషయంలో ఐక్యరాజ్య సమితి కీలక నిర్ణయం..
పాకిస్థాన్ ఉగ్రవాది విషయంలో ఐక్యరాజ్య సమితి కీలక నిర్ణయం తీసుకుంది. పాక్‌కు చెందిన లష్కరే తోయిబా(ఎల్ఈటీ) ఉగ్రవాది అబ్ధుల్ రెహ్మన్ మక్కీని యూఎన్ఓ భద్రతా మండలి గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించింది. భద్రతా మండలిలోని 1267 ఐఎస్‌ఐల్(దయిష్), ఆల్ ఖైదా ఆంక్షల కమిటీ కింద జనవరి 16న మక్కీని గ్లోబల్ టెర్రరిస్ట్ జాబితాలో చేర్చింది. ఐక్యరాజ్యసమితి గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించాక వారి ఆస్తులను స్తంభింపచేయడంతో పాటు ప్రయాణ, ఆయుధాలపై నిషేధం విధించింది. లష్కరే తోయిబా చీఫ్, ముంబాయి దాడుల సూత్రధారి అయిన హాఫీజ్ సయిద్ బావనే రెహ్మాన్ మక్కీ. కాగా గతేడాది జూన్‌లో యూఎన్ఎస్సీ 1267 ఆంక్షల కమిటీ కింద అబ్దుల్ రెహ్మాన్ మక్కీని గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించాలని ఐరాసలో భారత్ ప్రతిపాదించగా.. భారత్ ప్రతిపాదనకు చైనా అడ్డుపడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే భారత్, అమెరికా తమ దేశీయ చట్టాల ప్రకారం మక్కీని ఉగ్రవాది జాబితాలో చేర్చాయి. జమ్మూ కశ్మీర్లో ఎల్ఈటీ కార్యకలాపాల కోసం నిధుల సేకరణలో మక్కీ కీలక పాత్ర పోషించారు. అంతేగాక.. యువతను హింసకు ప్రోత్సహించడం, దాడులకు కుట్ర పన్నుతున్నాడని వెల్లడైంది. ఈ క్రమంలో తాజాగా అబ్దుల్ మక్కీని ఐరాస గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించింది. ఇదిలా ఉండగా 2020వ సంవత్సరంలో పాకిస్థాన్ తీవ్రవాద వ్యతిరేక న్యాయస్థానం అబ్దుల్ రెహ్మాన్ మక్కీ ఉగ్రవాదానికి ఆర్థిక సాయం చేశాడన్న కేసులో జైలు శిక్ష విధించింది. అయితే గతంలో కూడా పాకిస్థాన్ ఉగ్రవాదులపై నిషేధం విధించడంలో చైనా అడ్డంకులు సృష్టించింది. యూఎన్ నిషేధించిన పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ జైష్-ఎ- మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్‌ను నిషేధించాలన్న ప్రతిపాదనలను డ్రాగన్ దేశం పదేపదే అడ్డుకుంది. -
అక్కడ ఉగ్రవాదులకు అపరిమిత స్వేచ్ఛ.. ఐరాస ఆందోళన
ఐరాస: కల్లోలిత అఫ్గానిస్తాన్‌లో ఉగ్రవాద మూకలు అంతులేని స్వేచ్ఛను అనుభవిస్తున్నాయని, వాటికి ఎదురే లేకుండా పోయిందని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుట్టెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గానిస్తాన్‌లోని ఐసిస్ అనుబంధ సంస్థ ‘ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ లెవాంట్–ఖోరాసన్’కు సనావుల్లా గఫారీ అలియాస్ సాహ బ్ అల్-ముజాహిర్ నేతృత్వం వహిస్తున్నాడు. గత ఏడాది కాబూల్ ఎయిర్‌పోర్టుపై దాడికి సంబంధించి గఫారీపై అమెరికా సోమవారం 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. -
ఫేస్బుక్ ‘టెర్రర్’ వార్నింగ్..! పలు డాక్యుమెంట్లు లీక్..!
Facebook Secret List Leaked By Intercept: ఫేస్బుక్ పాలసీలకు వ్యతిరేకంగా ఉన్న గ్రూప్స్, వ్యక్తులపై ఫేస్బుక్ కఠినమైన ఆంక్షలను విధిస్తోంది. ప్రమాదకరమైన వ్యక్తులు, సంస్థలను గుర్తించడానకి ఫేస్బుక్ మూడంచెల వ్యవస్థను కల్గి ఉంది. టెర్రరిస్ట్ , ద్వేషపూరిత గ్రూప్స్, క్రిమినల్ ఆర్గనైజేషన్ గ్రూప్‌లను ఫేస్బుక్ బ్లాక్ లిస్ట్‌లో పెట్టినట్లు ఇంటర్సెప్ట్ పేర్కొంది. చదవండి: 4 నెలల పాటు ఉచిత ఇంటర్నెట్ సేవలు...! ఎలాగంటే... ఇండియాలో నాలుగువేలకు పైగా... ప్రజాస్వామ్య పద్దతులకు వ్యతిరేకంగా ఉండే గ్రూప్స్, వ్యక్తులపై, తీవ్రవాద సంస్థలపై ఫేస్బుక్ కఠిన చర్యలను తీసుకుంటుంది. సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్బుక్ సుమారు 4 వేలకు పైగా గ్రూప్స్‌ను, వ్యక్తుల ఖాతాలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ఫేస్బుక్ తన ప్లాట్‌ఫారమ్‌లో అనుమతించని 'ప్రమాదకరమైన వ్యక్తులు, సంస్థల(‘Dangerous Individuals and Organizations’)' జాబితా డాక్యుమెంట్లను ఇంటర్సెప్ట్ మంగళవారం రోజున లీక్ చేసింది. వీటిలో ఇండియన్ ముజాహిదీన్, జైషే-ఇ-మహమ్మద్, తాలిబన్లకు, సంబంధించిన గ్రూప్స్ ఇందులో ఉన్నాయి. ఇంటర్సెప్ట్ ద్వారా విడుదల చేయబడిన బ్లాక్లిస్ట్పై ఫేస్బుక్ స్పందించలేదు. సోషల్ మీడియానే ఆయుధంగా...! నేటి టెక్నాలజీ యుగంలో సోషల్‌మీడియా ఒక పదునైన ఆయుధం. సోషల్ మీడియాను సరైన దారిలో వాడుకుంటే ఎన్నో ఉపయోగాలు..అదే చెడు దారిలో వాడితే ఊహించలేని పర్యావసనాలు ఎదురవుతయ్యాయి. పలు ఉగ్రవాద సంస్థలు సోషల్‌మీడియాను ఒక ఆయుధంగా మార్చుకుంటూ తమ భావజాలాన్ని ముందుకు తీసుకేళ్తున్నారు. పలు సోషల్‌మీడియా సంస్థలు ప్రజాస్వామ్య పద్దతులకు వ్యతిరేకంగా ఉన్న గ్రూప్‌లను, పేజీలను గుర్తించి వాటిని బ్లాక్‌లిస్ట్‌లో పెడుతుంటాయి. చదవండి: చైనాకు భారీ షాకిచ్చిన మైక్రోసాఫ్ట్..! -
ఢిల్లీలో ఉగ్ర కలకలం..!
సాక్షి, న్యూఢిల్లీ: రైతుల ఉద్యమంతో దేశ రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలక్నొ సంగతి తెలిసిందే. ఇదే అదునుగా ముష్కరులు దేశంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు విపిపిస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం ఢిల్లీ పోలీసులకు, ఐదుగురు వ్యక్తులకు మధ్య ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. వీరిలో కొందరికి టెర్రర్ గ్రూపులతో సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తూర్పు ఢిల్లీలోని షాకార్‌పూర్ ప్రాంతంలో సోమవారం ఉదయం ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. పోలీసులు నిందితులని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు పంజాబ్‌కు చెందిన వారు కాగా.. ముగ్గురు జమ్మూ కశ్మీర్‌కు చెందిన వారు ఉన్నారు. (చదవండి: రైతుల కోసం రోడ్డెక్కుతాం..) ఈ సందర్భంగా స్పెషల్ సెల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు ప్రమోద్ సింగ్ కుశ్వాస్ మాట్లాడుతూ.. ‘ఎన్కౌంటర్ తర్వాత ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశాం. వీరి వద్ద నుంచి ఆయుధాలు, ఇతర నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నాము. వీరిలో కొందరికి ఉగ్రవాద సంస్థలతో సంబంధ ఉన్నట్లు అనుమానిస్తున్నాం. దీని గురించి విచారణ కొనసాగుతోంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’ అని తెలిపారు -
11 ఉగ్ర సంస్థలపై ఆంక్షలు
వాషింగ్టన్: ఉగ్రవాదంపై పోరును అమెరికా ముమ్మరం చేసింది. అల్‌కాయిదా దాడులు (9/11) జరిగి 18 ఏళ్లు అయిన సందర్భంగా ట్రంప్ ప్రభుత్వం బుధవారం సుమారు 11 ఉగ్రవాద సంస్థలపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ)కు చెందిన ముఫ్తీ నూర్ వలీ మెహ్సూద్పై ఆంక్షల కొరడా ఝుళిపించింది. ముల్లా ఫజల్ మరణం తరువాత గత ఏడాది జూన్ నుంచి నూర్ వలీ టీటీపీకి నేతృత్వం వహిస్తున్నారని, పలు ఉగ్రదాడులకు కారణమైన అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నామని ట్రంప్ ప్రభుత్వం తెలిపింది. ఈ ఆంక్షల ఉత్తర్వుల కారణంగా ఈ ఉగ్రవాదులను వెతికిపట్టుకోవడం, ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, ఉగ్రవాద శిక్షణలో పాల్గొన్న వారిని బంధించడం సులువు అవుతుందని ఆర్థిక శాఖ మంత్రి స్టీవెన్ మంచిన్ తెలిపారు. ఉగ్రవాద సంస్థలకు సాయం అందించే, వారితో ఆర్థిక వ్యవహారాలు జరిపే ఆర్థిక సంస్థ లపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు వీలుగా బుధవారం కొన్ని ఉత్తర్వులు జారీ చేసినట్లు మంచిన్ తెలిపారు. ఇరాన్‌లోని కుడ్స్ ఫోర్సెస్, హమాస్, ఐసిస్, అల్‌ఖైదా వాటి అనుబంధ సంస్థలపై ఈ ఉత్తర్వుల ప్రభావం ఉంటుందని తెలిపారు. -
29 ప్రాంతాలు టార్గెట్ చేసిన ఉగ్రవాదులు
న్యూఢిల్లీ: భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో దాడులు జరిపేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను నిఘా వర్గాలు పసిగట్టాయి. మొత్తం 29 ప్రాంతాలు లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందనే సమాచారం నిఘా సంస్థలకు అందినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించారనే సమాచారంతో ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. టార్గెట్ జాబితాను విడుదల చేసిన అధికారులు ప్రజలకు, రాజకీయ నాయకులకు పలు సూచనలు చేశారు. రాజకీయ పార్టీల కార్యాలయాలతో పాటు, రిటైర్డ్ ఆర్మీ, పోలీసు అధికారుల నివాసాలు లక్ష్యంగా దాడులు జరిగే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. చదవండి...(అభినందన్ విడుదలపై మరో మలుపు) టార్గెటెడ్ ప్రాంతాలు: 1. నేషనల్ డిఫెన్స్ కాలేజ్ 2. సేనా భవన్, 3. ఇస్రాయిల్ ఎంసీ 4. యూకే, యూఎస్ఏ ఎంబసీ 5. ఇండియా గేట్ 6. ప్రధాన న్యాయమూర్తి నివాసం 7. ఢిల్లీ ఎయిర్పోర్ట్ పార్కింగ్ ఏరియా 8. రాష్ట్రపతి భవన్ 9. ఢిల్లీ రైల్వే స్టేషన్, 10. ఢిల్లీ యూనివర్సిటీ 11. ఎయిమ్స్ 12. అక్షర్ధామ్ టెంపుల్ 13. రెడ్ ఫోర్ట్ పరిసరాలు 14. పార్లమెంట్ 15. విదేశాంగ శాఖ కార్యాలయం 16. ఐఐటీఎఫ్ 17. మెయిన్ బజార్(పహర్ గంజ్) 18. మాల్స్, సినిమా హాల్స్ 19. విదేశాలకు చెందిన ఎంబసీ అధికారులు పర్యటించే ప్రదేశాలు 20. దిల్లీ హాట్, ఐఎన్ఏ మార్కెట్ 21. పలికా బజార్ 22. చాందినీ చౌక్ 23. సరోజని నగర్ మార్కెట్ 24. సుప్రీం కోర్టు, ఢిల్లీ హైకోర్టు 25. లక్ష్మీనారాయణ్ టెంపుల్ 26. లోటస్ టెంపుల్ 27. మెట్రో రైల్ నెట్వర్క్ 28. కుతుబ్ మినార్ 29. రెడ్ ఫోర్ట్ -
ఇవిగో..ఉగ్రవాద సంస్థలు!
ఇస్లామాబాద్: భారత్, అఫ్గానిస్థాన్‌లో విధ్వంసమే లక్ష్యంగా, పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న 20 ఉగ్రవాద సంస్థల వివరాలను అమెరికా విడుదల చేసింది. పాక్‌కు పంపిన జాబితాలో హక్కానీ నెట్వర్క్, లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హెచ్‌యూఎం వంటి సంస్థల పేర్లు ఉన్నాయి. హక్కానీ గిరిజన ప్రాంతాల నుంచి కార్యకలాపాలు సాగిస్తూ అఫ్గన్‌పై తరచూ దాడులు చేస్తోంది. ఈ ఉగ్రవాద సంస్థలను అగ్రరాజ్యం మూడు వర్గాలుగా విభజించింది. ‘అఫ్గన్‌లో దాడులు చేసేవి, పాక్‌లోనే విధ్వంసం సృష్టించేవి, కశ్మీర్ లక్ష్యంగా దాడులు చేసేవి’గా విడదీశారు. వీటిలో హర్కతుల్ ముజాహిదీన్, జైషే మహ్మద్, లష్కరే తోయిబా భారత్ లక్ష్యంగా కుట్రలు పన్నుతున్నాయని అమెరికా తెలిపింది. జైషే మహ్మద్ కశ్మీర్లో హింసకు అధిక ప్రాధాన్యమిస్తోంది. లష్కరే దక్షిణాసియాలోనే ప్రమాదకర ఉగ్రవాద సంస్థ అని ఐరాస సైతం గుర్తించింది. దీనిని 1987 హఫీజ్ సయీద్ మరికొందరితో సాయంతో ఏర్పాటు చేశారు. లష్కరే భారత పార్లమెంటు, ముంబైపై దాడులు చేసి బీభత్సం సృష్టించింది. పాక్‌లోనూ ఇది వందలాది మందిని చంపుతోందని అమెరికా ఆరోపించింది. మరో ఉగ్రవాద సంస్థ తెహ్రీకీ తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) వివిధ మిలిటెంట్ గ్రూపుల కలయికతో ఏర్పడింది. ఇది ఇప్పుడు అఫ్గన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నా, గతంలో పాక్‌లో ఎన్నో దాడులు చేసింది. ఇదిలా ఉంటే అమెరికా విదేశాంగమంత్రి రెక్స్ టిల్లర్సన్ ఇటీవల పాక్‌లో పర్యటించినప్పుడు 75 మంది ఉగ్రవాదుల పేర్లతో కూడిన జాబితాను ఇక్కడి ప్రభుత్వానికి అందించినట్టు తెలిసింది. ఉగ్రవాద సంస్థల ఉనికిని నిరూపించే ఆధారాలు చూపితే వాటిపై చర్యలకు పాక్ సిద్ధంగా ఉందని ఆయన అమెరికా సెనేట్ కమిటీకి తెలిపారు. -
‘ఉగ్రమూకల పని పట్టండి’
వాషింగ్టన్: ఉగ్ర గ్రూపుల భరతం పట్టాలని పాకిస్తాన్‌కు అమెరికా స్పష్టం చేసింది. టెర్రరిస్టు గ్రూపులపై నిర్ణయాత్మక చర్యలు చేపట్టాలని, వారి స్ధావరాలను ధ్వంసం చేయాలని కోరింది. తమ భూభాగంలో ఉగ్ర మూకలను ఏరివేయాలని తాము పలుమార్లు పాక్‌ను కోరామని విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ చెప్పారు. ఉగ్రవాదుల స్ధావరాలు, కార్యకలాపాలపై తాము అవసరమైన సమాచారాన్ని పాక్‌కు చేరవేసి, వారి నుంచి నిర్థిష్ట చర్యలు కోరుతున్నామని దక్షిణాసియా పర్యటన ముగింపు సందర్భంగా టిల్లర్సన్ పేర్కొన్నారు. 75 మంది ఉగ్రవాదుల వాంటెడ్ జాబితాను పాక్‌కు అందించిన అమెరికా హఖాని నెట్‌వర్క్‌పై కఠిన చర్యలు చేపట్టాలని ఒత్తిడి పెంచింది. అయితే పాకిస్తాన్‌కు అమెరికా ఎలాంటి జాబితా ఇవ్వలేదని పాక్ విదేశాంగ మంత్రి ఖ్వాజా అసిఫ్ పేర్కొనడం గమనార్హం. తమ డిమాండ్లపై పాకిస్తాన్‌కు సవివర నివేదిక ఇచ్చామని పాక్ నుంచి చర్యల కోసం ఎదురుచూస్తున్నామని టిల్లర్సన్ చెప్పుకొచ్చారు. ఉగ్రమూకలు ఎక్కడున్నా వాటిని ఏరివేసేందుకు పాకిస్తాన్ చొరవ చూపేలా మరిన్ని చర్యలుంటాయని చెప్పారు. -
చైనా చాలా పెద్ద తప్పు చేసింది!
జియామెన్: బ్రిక్స్ వార్షిక సదస్సు సందర్భంగా చేసిన జియామెన్ డిక్లరేషన్‌లో పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ దేశాలకు చెందిన ఉగ్రవాద గ్రూపుల పేర్లు చేర్చడం చైనా చేసిన పెద్ద పొరపాటు అని ఆ దేశ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ చర్య వల్ల చైనాతో ఆయా దేశాలకు ఉన్న సంబంధాలు తీవ్రంగా దెబ్బతినవచ్చునని అంటున్నారు. ఆర్థిక వేదిక అయిన 'బ్రిక్స్' అజెండాను ఇది హైజాక్ చేయడమేనని విరుచుకుపడుతున్నారు. ఐదు బ్రిక్స్ దేశాల ఆమోదంతో వెలువడిన జియామెన్ డిక్లరేషన్‌లో 'తాలిబాన్, ఐఎస్ఐఎల్ /డాషే, అల్‌కాయిదా, దాని అనుబంధ సంస్థలైన తూర్పు టర్కిస్థాన్ ఇస్లామిక్ మూవ్మెంట్, ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్, హక్కాని నెట్వర్క్, లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్, టీటీపీ, హిజ్బ్ ఉట్-తహిర్ర్' తదితర ఉగ్రవాద గ్రూపుల పేర్లను ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అన్ని ఉగ్రవాద దాడులను ఖండిస్తామని, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా.. దానిని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించబోమని డిక్లరేషన్ స్పష్టం చేసింది. అయితే, ఈ డిక్లరేషన్‌లో సెలెక్టివ్ ఉగ్రవాద గ్రూపుల పేర్లను మాత్రమే ప్రస్తావించారంటూ చైనా విదేశాంగ నిపుణులు తప్పుబడుతున్నారు. '1960 తర్వాత చైనా-పాకిస్థాన్ సంబంధాలు అతిపెద్ద సవాలును ఎదుర్కోబోతున్నాయి. దీనివల్ల చాలా తీవ్రమైన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇది నిజంగా చాలా పెద్ద తప్పు. చైనా ప్రభుత్వం రాబోవుకాలంలో ఈ విషయాన్ని తెలుసుకుంటుంది' అని చైనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంటెంపరరీ ఇంటర్నేషనల్ రిలేషన్లో దక్షిణ, ఆగ్రేయాసియా, ఒషినియా వ్యవహారాలు చూసే హు షిషెంగ్ పేర్కొన్నారు. 'ఈ డిక్లరేషన్ ద్వారా భారత్ విజయం సాధించింది. తను కోరుకున్నది.. కావాలనుకున్నది సాధించుకోగలిగింది. చైనా ఇందుకు అనుమతించి ఉండాల్సింది కాదు' అని మరో నిపుణుడు పేర్కొన్నారు. ఉగ్రవాద సంస్థలకు, ఉగ్రవాదులకు పాక్ ఆశ్రయం కల్పిస్తోందని భారత్ ఆరోపిస్తున్నా.. చైనా గుడ్డిగా దాయాదిని వెనకేసుకొస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడికి సూత్రధారి అయిన జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్‌పై ఐరాసలో తీర్మానాన్ని చైనా మొండిగా అడ్డుకుంటోంది. బ్రిక్స్ డిక్లరేషన్‌లో జైషే మొహమ్మద్ పేరును ప్రస్తావించినప్పటికీ.. అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్ తీర్మానాన్ని చైనా ఆమోదించే అవకాశం లేదని అంటున్నారు. -
బ్రిక్స్ తీర్మానంపై పాక్‌లో ప్రకంపనలు
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై కొనసాగిస్తున్న పోరులో భారత్‌కు మరో భారీ దౌత్య విజయం దక్కగా దాయాది మాత్రం దీనిపై బుసలు కొడుతోంది. ఆసియా ప్రాంతంలో హింసకు పాల్పడుతున్న తాలిబాన్, ఐసిస్, అల్‌కాయిదాతోపాటుగా హక్కానీ నెట్వర్క్, లష్కరే తోయిబా, జైషే మహ్మద్ సంస్థల ఆగడాలను అరికట్టాలని బ్రిక్స్ సదస్సులో సోమవారం మోదీ ఇచ్చిన పిలుపు పాక్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. శాంతికి విఘాతం కల్పిస్తున్న ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని, ఉగ్రవాద సంస్థలపై సమైక్యంగా పోరాడాలని ప్రధాని నరేంద్ర మోదీతోపాటుగా చైనా, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాల అధ్యక్షులు జిన్‌పింగ్, వ్లాదిమిర్ పుతిన్, మైకెల్ టెమర్, జాకబ్ జుమాలు సోమవారం నిర్ణయం తీసుకున్నారు. ఉగ్రవాదాన్ని తమ దేశం ప్రోత్సహించడని, తమపై ఆ ఐదు దేశాల అధినేతలు చేసినవి తప్పుడు ఆరోపణలంటూ పాక్ కొట్టిపారేసింది. పాక్ రక్షణమంత్రి ఖుర్రం దస్తగిర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడుతూ.. బ్రిక్స్‌లో మోదీ సహా ఐదుగురు నేతలు చెప్పినట్లుగా తాము ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం లేదన్నారు. ఉగ్రమూకలను పాక్ ఏరిపారేస్తుందని, దానిపై ప్రత్యేక నిఘా ఉందని చెప్పారు. ఉగ్రవాదులకు ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్ స్వర్గధామం కాదని మరోసారి మంత్రి ఖుర్రం హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని ఏ దేశం హర్షించదని తమకు తెలుసునని, పాక్‌లోనూ ఉగ్రమూకలకు కష్టాలు తప్పవన్నారు. ఉగ్రవాదుల నిమాయకం, ఉగ్ర కదలికలు, విదేశీ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించటం, డ్రగ్స్ అక్రమ రవాణాతోపాటుగా ఉగ్రవాదులకు ఆయుధాల సరఫరా, ఆర్థిక సాయాన్ని అడ్డుకోవటం, ఉగ్ర కేంద్రాలను ధ్వంసం చేయటం, ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాల్ని దుర్వినియోగం చేయకుండా అడ్డుకట్టవేయటం ద్వారా ఉగ్రవాదంపై పోరాటం చేయాలని బ్రిక్స్ డిక్లరేషన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఉగ్రవాదంపై భద్రతామండలి తీర్మానాలు, ఎఫ్ఏటీఎఫ్ అంతర్జాతీయ ప్రమాణాలు ప్రపంచవ్యాప్తంగా సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలని అభిప్రాయపడింది. పాక్ మాత్రం తమను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారని, అందులో వాస్తవం లేదని పాక్ చెప్పడం గమనార్హం. -
పాక్ ఉగ్రమూకలకు బ్రిక్స్ వార్నింగ్!
-
పాక్ ఉగ్రమూకలకు బ్రిక్స్ వార్నింగ్!
సాక్షి, న్యూఢిల్లీ: భారత్, చైనా సభ్య దేశాలుగా ఉన్న బ్రిక్స్ కూటమి తొలిసారి పాకిస్థాన్ ఉగ్రమూకలకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఉగ్రవాదాన్ని ఖండిస్తూ పాక్‌కు చెందిన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హక్కానీ నెట్వర్క్ తదితర ఉగ్రవాద గ్రూపుల పేర్లను తొలిసారి ప్రస్తావించింది. ఉగ్రవాదం విషయంలో ఇన్నాళ్లు పాకిస్థాన్‌ను చైనా గుడ్డిగా వెనకేసుకొస్తున్న నేపథ్యంలో బ్రిక్స్ కూటమి నేరుగా పాక్‌లోని ఉగ్రమూకలను పేరు ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 'అమాయకులైన ఆఫ్గన్ ప్రజల మృతికి కారణమైన ఉగ్రవాద దాడులను మేం ఖండిస్తున్నాం. ఇదే విషయమై ఈ ప్రాంతంలో భద్రతా పరిస్థితులపై, తాలిబన్, ఐసిస్/డాషే, అల్‌కాయిదా, వాటి అనుబంధ సంస్థలైన తూర్పు టర్కిస్తాన్ ఇస్లామిక్ మూవ్మెంట్, ఉజ్బెకిస్తాన్ ఇస్లామిక్ మూవ్మెంట్, హక్కాని నెట్వర్క్, లష్కరే తోయిబా, జైష్ ఎ మొహమ్మద్, టీటీపీ, హిజ్బ్ ఉట్-తాహిర్ వాటి వల్ల తలెత్తుతున్న హింసపై, ఆందోళన వ్యక్తం చేస్తున్నాం' అని బ్రిక్స్ దేశాధినేతల ఉమ్మడి డిక్లరేషన్ స్పష్టం చేసింది. అంతేకాకుండా ఉత్తర కొరియా అణుపరీక్ష నిర్వహించడాన్ని బ్రిక్స్ తీవ్రంగా ఖండించింది. ప్రస్తుతం చైనా జియామెన్ నగరంలో జరుగుతున్న బ్రిక్స్ వార్షిక సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. -
93 మదర్సాలకు ఉగ్రవాదులతో లింక్
కరాచీ: సింధ్ ప్రావిన్స్‌లో దాదాపు 93 మదర్సాలకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. అవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉగ్రవాద సంస్థలతో, పాక్‌లో నిషేధించిన తీవ్ర భావజాలం ఉన్న సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు ఆ నివేదిక పేర్కొంది. దీంతో ప్రస్తుతం ఆ మదర్సాలన్నింటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సింధ్ ప్రాంత ముఖ్యమంత్రి మురాద్ అలీ షా రక్షణ బలగాలకు ఆదేశించినట్లు సమాచారం. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థలు సింధ్ ప్రావిన్స్‌లోని పరిస్థితులపై సర్వే చేయగా అక్కడి కొన్ని మదర్సాలు ఉగ్రవాదానికి హబ్ లుగా మారాయని గుర్తించి ఆ విషయాన్ని ముఖ్యమంత్రి మురాద్ కు వివరించాయి. దీంతో ఈ అంశంపై ప్రత్యేకంగా మంగళవారం ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.దీనికి పాక్ రేంజర్స్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ బిలాల్ అక్బర్, ఇతర ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. వీరంతా కలిసి మదర్సాలు చేస్తున్న చర్యలను తీవ్ర ఖండించారు. అలాంటి వాటిని ఏమాత్రం ప్రోత్సహించరాదని, వెంటనే వాటిపై చర్యలు తీసుకోవాలని ఆ సమావేశంలో రక్షణ బలగాల అధికారులకు సీఎం ఆదేశించారు. త్వరలోనే అలాంటి మదర్సాలపై చర్యలు ప్రారంభం కానున్నాయి. -
పాకిస్థాన్‌కు మరోసారి అమెరికా స్ట్రాంగ్ మెసేజ్!
వాషింగ్టన్: తన భూభాగాన్ని స్వర్గధామంగా మార్చుకొని కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాదులందరినీ ఏరిపారేయాల్సిందేనని పాకిస్థాన్‌కు అమెరికా మరోసారి స్పష్టం చేసింది. పాకిస్థాన్ భూభాగంలో పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులన్నింటినీ అక్రమమైనవిగా గుర్తించి.. నిర్మూలించాలని సూచించింది. 'పాకిస్థాన్ భూభాగంలో పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలన్నింటిపై ఉక్కుపాదం మోపాల్సిందేనని మేం ఆ దేశాన్ని కోరుతూనే ఉన్నాం' అని అమెరికా విదేశాంగ డిప్యూటీ అధికార ప్రతినిధి మార్క్ టోనర్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. ఉగ్రవాదులు, హింసాత్మక అతివాదుల కారణంగా పాకిస్థానే ఎక్కువగా నష్టపోయిందని ఆయన గుర్తుచేశారు. ఉగ్రవాద ముప్పుపై పోరాటంలో పాకిస్థాన్‌కు తాము సాయం అందిస్తామని, అయితే పాకిస్థాన్ భూభాగాన్ని తమకు స్వేచ్ఛాయుత ఆవాసంగా మార్చుకున్న ఉగ్రవాదులపై ఆ దేశం చర్య తీసుకోవాల్సిందేనని ఆయన స్పష్టంచేశారు. 19 మంది సైనికులను పొట్టనబెట్టుకున్న ఉడీ ఉగ్రవాద దాడితో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో భారత సైన్యం పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులపై భారత సైన్యం జరిపిన దాడులను అమెరికా సమర్థించింది. ఉడీ దాడీ సీమాంతర ఉగ్రవాదానికి స్పష్టమైన నిదర్శనమని తేల్చిచెప్పిన అగ్రరాజ్యం... ఉగ్రవాద ముప్పుపై సైనిక చర్యలతో బదులు చెప్పాల్సిన అవసరముందంటూ భారత్ వైఖరిని సమర్థించింది. -
పాకిస్తాన్‌కు రష్యా హెచ్చరికలు
పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద గ్రూపులపై ఆ దేశ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రష్యా హెచ్చరించింది. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య నియంత్రణ రేఖ వెంబడి నెలకొన్న టెన్షన్ వాతావరణం మరింత ఉధృతం కాక ముందే పరిస్థితిని అదుపులోకి తెచ్చుకోవాలని సూచించింది. ఇరు దేశాలు సంప్రదింపుల ద్వారా పరిస్థితిని చక్కబెట్టుకోవాలని ఆదేశించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక పోరాటంలో తాము అన్నివేళలా సహకరిస్తామని పరోక్షంగా పాకిస్తాన్‌కు రష్యా హెచ్చరికలు చేసింది. ఇండియా, పాకిస్తాన్ల మధ్య నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితులను నియంత్రణలోకి తెచ్చుకోలేని పక్షంలో మరింత ఉధృత వాతావరణం ఏర్పడే అవకాశముందన్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం తమ భూభాగంలోని ఉగ్రమూక గ్రూపులపై కఠిన చర్యలు అవలంభించాలని రష్యా విదేశీ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపారు. ఉడీ ఘటన అనంతరం పాక్ ఉగ్రవాదులపై ప్రతీకారంగా భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ అనంతరం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రష్యా ప్రభుత్వం ఈ ప్రకటన విడుదలచేసింది. నియంత్రణ రేఖ వెంబడి మొహరించి ఉన్న ఉగ్రమూకలను ఏరివేయడానికి సెప్టెంబర్ 28 అర్థరాత్రి భారత సైన్యం నిర్దేశిత దాడులు నిర్వహించింది. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి అగ్రరాజ్యం అమెరికా, రష్యా సహా పలు ప్రపంచ దేశాల నుంచి పూర్తి మద్దతు వస్తోంది. దీంతో పాక్ ఏకాకి మారుతోంది. -
ఐఎస్ఐఎస్కు 42 ఉగ్రవాద సంస్థల మద్దతు
ఆధునిక యుగంలో అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థగా రూపాంతరం చెందిన ఐఎస్ఐఎస్కు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన 42 ఉగ్రవాద సంస్థల సహకారం ఉన్నట్లు గ్లోబల్ టెర్రరిజమ్ ఇండెక్స్ నివేదిక తెలిపింది. ప్రపంచంలోని అత్యంత సంపన్న, క్రూరమైన ఉగ్రవాద సంస్థగా ఐఎస్ఐఎస్ రూపాంతరం చెందిన విషయం తెలిసిందే. తన వినూత్న ప్రచార కార్యక్రమాల ద్వారా ఐఎస్ వివిధ దేశాలకు చెందిన యువతను పెద్ద ఎత్తున ఆకర్షిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో స్థానిక ఉగ్రవాద సంస్థలు ఐఎస్ఐఎస్కు అనుబంధంగా కార్యకలాపాలను నిర్వహించడానికి పూనుకున్నట్లు తెలుస్తోంది. లిబియా, ట్యునీషియా, ఈజిప్ట్, ఉజ్బెకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థలు ఐఎస్ఐఎస్కు అత్యంత అనుకూలంగా పనిచేస్తున్నట్లు తేలింది. పాకిస్థాన్, ఆప్ఘనిస్తాన్లలోని ఉగ్రవాద సంస్థలు యువతను ఐఎస్ఐస్ తరపున పనిచేయడానికి పంపినట్లు నివేదిక వెల్లడించింది.