బీజింగ్: చూసేందుకు ఏవగింపుకలిగించే, జుగుప్సాకరంగా ఉన్న కొన్ని వీడియో గీతాలపై చైనా నిషేధం విధించింది. అసభ్యకరంగా చిత్రీకరించిన 120 పాటలను వెంటనే ఆయా వెబ్సైట్ల నుంచి తొలగించాలని నిర్ణయించింది. వాటి జాబితా విడుదల చేస్తూ కఠిన ఆదేశాలు జారీ చేసింది. చైనాకు చెందిన సామాజిక సాంస్కృతిక సంబంధాల శాఖ ఈ ఆదేశాలు వెలువరించింది.
'అసభ్యత, హింస, నేరపూరిత, సామాజిక విలువలకు భంగం కలిగించేలా 120 పాటలు ఉన్నాయి. వాటిని వెంటనే తొలగించండి' అని ఒక ప్రకటనలో పేర్కొంది. ఇలా నిషేధం విధించిన పాటల్లో తైవాన్ పాప్ సింగర్ చాంగ్ సన్ యక్, నటి స్టాన్లీ హువాంగ్వి కూడా ఉన్నాయి.
120 అసభ్యకర గీతాలపై నిషేధం
Published Tue, Aug 11 2015 1:09 PM | Last Updated on Sun, Sep 3 2017 7:14 AM
Advertisement
Advertisement