కేజ్రీవాల్ను పొగడ్తల్లో ముంచెత్తిన పారిక్కర్ | Manohar Parrikar praises fellow IITian Arvind Kejriwal | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్ను పొగడ్తల్లో ముంచెత్తిన పారిక్కర్

Published Wed, Jan 1 2014 5:01 PM | Last Updated on Sat, Sep 2 2017 2:11 AM

కేజ్రీవాల్ను పొగడ్తల్లో ముంచెత్తిన పారిక్కర్

కేజ్రీవాల్ను పొగడ్తల్లో ముంచెత్తిన పారిక్కర్

పనాజీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారిక్కర్, అరవింద్ కేజ్రీవాల్.. ఇద్దరూ ఐఐటీ ఖరగ్పూర్లో ఇంజనీరింగ్ చదివారు. ఇద్దరూ రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు. అయితే, బీజేపీ-ఆప్ల మధ్య ఇప్పుడు ఏమంత సత్సంబంధాలు లేవు. అయినా కూడా.. తమ కాలేజీలోనే చదివిన కేజ్రీవాల్ను పారిక్కర్ పొగడ్తల్లో ముంచెత్తారు.

కేజ్రీవాల్ ఉన్నత విద్యావేత్తగా తానెంటో రుజువు చేసుకున్నారని కొనియాడారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ ఎన్నికల్లో మంచి వాగ్దానాలు చేశారని.. వాటిని ఎలా నెరవేరుస్తారో మాత్రం చూడాలని ఆయన అన్నారు. కేజ్రీవాల్, తాను ఖరగ్పూర్ ఐఐటీలో ఒకేసారి డిగ్రీ తీసుకున్నట్లు ఆయన చెప్పారు. పారిక్కర్ బుధవారం బీజేపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖరగ్పూర్ ఐఐటీలో తాను మెటలర్జీ ఇంజినీరింగ్ చదివినట్టు చెప్పారు. అక్కడ  చదివిన వారిలో తాను గోవా ఐఐటీ తొలి ముఖ్యమంత్రి కాగా, తనతోపాటు అక్కడే మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ అద్మీ పార్టీని స్థాపించి, ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement