
నాయకుల ఫ్యాక్టరీ.. ఐఐటీ ఖరగ్ పూర్
న్యూఢిల్లీ: దేశ చరిత్రలో ఉన్నత విద్య అభ్యసించిన రాజకీయవేత్తలలో ఒకరు గోవా ముఖ్యమంత్రి మనోహర్ పర్రీకర్ కాగా, మరొకరు ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు 45ఏళ్ల అరవింద్ కేజ్రీవాల్. వీరిద్దరిలో తొలి ఐఐటీ ముఖ్యమంత్రిగా మనోహర్ పర్రీకర్ మొదటిస్థానంలో నిలవగా, ఆ తరువాత అరవింద్ కేజ్రీవాల్ ఐఐటీ ముఖ్యమంత్రిగా రెండోస్థానంలో నిలిచారు. వీరితోపాటు మరో ఇద్దరు ఐఐటీ నేతలు అజిత్ సింగ్, జైరాం రమేష్ లు కేంద్రమంత్రులుగా ఉన్నారు. వీరంతా విద్యను అభ్యసించింది ఎక్కడో కాదు ఖరగపూర్ ఐఐటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) నుంచే. ఒక్కమాటలో చెప్పాలంటే ఖరగపూర్ ఐఐటీ నాయకుల ఫ్యాక్టరీగా చెప్పవచ్చు. అయితే మనోహర్ ముంబైలోని ఐఐటీలో మెటలార్జీకల్ ఇంజినీర్ పూర్తి చేశారు. కేజ్రీవాల్ 1989లో ఖరగపూర్ ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రులు అయ్యారు. వీరితోపాటు కేంద్రమంత్రి అజిత్ సింగ్ ఖరగపూర్ ఐఐటీలో బీటెక్లో కంప్యూటర్ ఇంజినీర్ పూర్తిచేశారు. కాగా, జైరాం రమేశ్ కూడా ముంబైలోని ఐఐటీలో బీటెక్, మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు.
ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఏడాదికాలంలోనే అధికార పీఠాన్ని అధిరోహించింది. ఈ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ రంగప్రవేశం చేసిన తొలి ఏడాదిలోనే ఢిల్లీ ఏడో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అరవింద్ కేజ్రివాల్ భారతీయ సామాజికవేత్త, రాజకీయ నాయకుడు. హర్యానా లో జన్మించిన కేజ్రివాల్ ఐఐటి ఖరగపూర్ లో మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రులు అయ్యారు. మొదట భారతీయ రెవెన్యూ సర్వీసులో కొంతకాలం పనిచేశారు. అవినీతి ప్రక్షాళనే లక్ష్యంగా రాజకీయ రంగంపైకి దూసుకొచ్చిన కేజ్రీవాల్ ఇండియన్ రివెన్యూ సర్వీసెల్ లో ఉద్యోగాన్ని వదిలి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే.