ఐఐటీ ఖరగ్‌పూర్ ఎంటర్‌ప్రీన్యూరియర్ విభాగం (ఈ-సెల్) ‘ఎంప్రెస్సారియో14’ బిజినెస్ ప్లాన్ పోటీలకు శ్రీకారం చుట్టింది.
ఈ-సెల్ ‘ఎంప్రెస్సారియో14’ పోటీకి ఆహ్వానం..
Published Sun, Aug 18 2013 1:09 AM | Last Updated on Fri, Sep 1 2017 9:53 PM
ఐఐటీ ఖరగ్‌పూర్ ఎంటర్‌ప్రీన్యూరియర్ విభాగం (ఈ-సెల్) ‘ఎంప్రెస్సారియో14’ బిజినెస్ ప్లాన్ పోటీలకు శ్రీకారం చుట్టింది. యువతలో ‘వ్యవస్థాపకత’లక్షణాలను గుర్తించి, సంబంధిత నైపుణ్యతను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ-సెల్ ఈ పోటీలను నిర్వహిస్తోంది. ప్రొడక్ట్, సర్వీస్ నుంచి సామాజిక అంశం వరకూ అత్యుత్తమ ‘బిజినెస్ ఐడియా’లను గుర్తించి, ప్రోత్సహించడానికి ఉద్దేశించి దేశ వ్యాప్తంగా 20 పట్టణాల్లోని ప్రధాన కళాశాలల్లో ఈ పోటీని ఈ-సెల్ నిర్వహించనుంది.
విజేతలకు రూ.2.5 కోట్ల ప్రోత్సాహక నగదు గెలుచుకునే అవకాశం ఉంది. పోటీలో పాల్గొనదలచినవారు తొలిదశలో తమ బిజినెస్ ఐడియాలకు సంబంధించి ఒక ప్రశ్నపత్రాన్ని పూర్తిచేసి 2013 అక్టోబర్ 30నాటికి సమర్పించాలి. దీన్ని www. ecelliitkgp.org/ empresarioద్వారా పొందవచ్చు. ఎన్‌విజన్ పేరుతో మరో ప్రొడక్ట్ డిజైన్ కాంపిటేషన్ కూడా ఈ-సెల్ నిర్వహిస్తోంది. ఈ పోటీలో పాల్గొనదలచిన విద్యార్థులు తమ ప్రొడక్టు డిజైన్‌కు సంబంధించిన టెక్నికల్ రైటప్‌ను అక్టోబర్ 30లోపుenvision @ecelliitkgp.orgకి పంపాల్సి ఉంటుంది.
Advertisement
Advertisement