సాక్షి, కోల్‌కతా : నిత్యం జీవితంలో ఒత్తిడి అన్ని వయసుల వారినీ వేధిస్తోంది. ఆధునిక జీవితంలో ప్రధాన సవాల్‌గా పరిణమించిన ఒత్తిడిని అధిగమించేందుకు ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన నిపుణుల బృందం ఓ మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేసింది. ఈ యాప్‌ను యూజర్లు తమ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని విశ్లేషించడం, దాన్ని సమర్ధంగా ఎదుర్కొనేలా నిపుణులు డిజైన్ చేశారు. ధ్యాన్‌యాండ్రాయిడ్ పేరిట ఈ యాప్‌ను అభివృద్ధి చేశారు. జూన్ 10న ఈ యాప్‌ను ప్రారంభించనున్నారు. రెండు వెర్షన్లలో లభ్యమయ్యే ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్, యాప్ స్టోర్ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
యూజర్ భావోద్వేగాలను సమస్థితిలో ఉంచుతూ కుంగుబాటును నియంత్రంచేలా ఈ యాప్ పనిచేస్తుంది. యూజర్ల ఒత్తిడి స్థాయిలను అంచనా వేస్తూ ధ్యానం ద్వారా వారికి స్వాంతన చేకూర్చేలా డిజైన్ చేశారు. పలు ప్రశ్నల ద్వారా యూజర్ల ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో ఈ యాప్ పరిశీలిస్తుంది. రియల్ టైమ్‌లో యూజర్లు ఎంత ఒత్తిడికి గురువుతున్నారన్నది ఈ యాప్ పసిగట్టి అప్రమత్తం చేస్తుంది. ఇక మెడిటేషన్ పరంగా సులభమైన శ్వాస, యోగ ఎక్సర్‌సైజ్‌లను యాప్ సూచిస్తుంది. థర్మల్ ఇమేజింగ్, సంగీతం, వైబ్రేషన్ల ద్వారా థ్యాన మందిరంలో ఉన్నామన్న భావనను యూజర్లకు కల్పిస్తూ వారిని ఒత్తిడి రహిత స్థితికి చేర్చడంలో తోడ్పడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment