stress level
-
ముందస్తుగా స్ట్రెస్ టెస్ట్
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పథకాలకు సంబంధించి స్ట్రెస్ టెస్ట్‌ను ముందస్తుగా నిర్వహించాలని పరిశ్రమను కోరినట్టు సెబీ హోల్‌టైమ్ సభ్యుడు అనంత్ నారాయణ్ గోపాలకృష్ణన్ తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్‌పై నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. స్ట్రెస్ టెస్ట్ కేవలం పథకాల కోసమో లేదా ఫండ్స్ సంస్థల కోసమే కాదని.. మొత్తం మ్యూచువల్ ఫండ్ వ్యవస్థకు సంబంధించినదిగా పేర్కొన్నారు. తీవ్ర ఆర్థిక అనిశి్చతులు, ఆటుపోట్ల పరిస్థితుల్లో ఇన్వెస్టర్ల నుంచి ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఉపసంహరణ ఒత్తిళ్లు (లిక్విడిటీ రిస్క్) ఎదురైతే.. వాటిని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు, పరిశ్రమ ఎలా అధిగమించగలవో స్ట్రెస్ టెస్ట్ ఫలితాలు తెలియజేస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థల (ఏఎంసీల) సన్నద్ధతను ఇది పెంచుతుంది. ముఖ్యంగా స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ పథకాల్లో లిక్విడిటీ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. దీనిపై ఇన్వెస్టర్లకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో సెబీ ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం తెలిసిందే. వివిధ మ్యూచువల్ ఫండ్ పథకాల పరిధిలో ఉండే రిస్క్‌పై ఇన్వెస్టర్లకు అవగాహన కల్పించేందుకు మెరుగైన మార్గాలను గుర్తించేందుకు ఇది సాయపడుతుందని గోపాలకృష్ణన్ పేర్కొన్నారు. ప్రస్తుతమున్న రిస్క్ నిర్వహణ విధానం.. వివిధ పథకాల్లో ఉండే వేర్వేరు రిస్క్ స్థాయిలను ప్రతిబింబించడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వేర్వేరు రిస్క్ స్థాయిలు ఉన్నప్పటికీ.. చాలా పథకాలకు కేవలం అధిక రిస్క్ ట్యాగ్ వేస్తున్నట్టు చెప్పారు. కనుక ఈ వ్యత్యాసాలను మరింత పారదర్శకంగా తెలియజేయడమే కొత్త వ్యవస్థ లక్ష్యమన్నారు. సులభంగా ఉండాలి.. ‘‘పోర్ట్‌ఫోలియోలో అంతర్లీనంగా ఉండే ఆటుపోట్లను అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇందుకు గాను రిస్‌్కలను సులభంగా అర్థం చేసుకునే విధంగా సమాచారం ఉండాలి. పోర్ట్‌ఫోలియో స్ట్రెస్ టెస్ట్ ఫలితాలు ఈ దిశగా మరింత స్పష్టతనిస్తాయి’’అని గోపాలకృష్ణన్ తెలిపారు. కార్యకలాపాలు క్రమబదీ్ధకరించడం, ఇన్వెస్టర్లకు మరింత కచ్చితత్వంతో సేవలు అందించడంపై దృష్టి పెట్టాలని మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమకు సూచించారు. అప్పటికప్పుడే నిధుల బదిలీకి మన వ్యవస్థలు వీలు కలి్పస్తున్న తరుణంలో.. సెటిల్మెంట్ రోజే ఇన్వెస్టర్లకు నిధుల బదిలీ చేయాలా చూడాలన్నారు. విక్రయించిన మరుసటి రోజు లేదా రెండు రోజుల తర్వాత ప్రస్తుతం ఇన్వెస్టర్లకు ఫండ్స్ సంస్థలు నిధులు బదిలీ చేస్తుండడంతో గోపాలకృష్ణన్ సూచనకు ప్రాధాన్యం సంతరించుకుంది. -
Stress Test: మీ పెట్టుబడులకు రక్షణ ఉందా?
రిటైల్ ఇన్వెస్టర్లకు చిన్న కంపెనీలంటే చెప్పలేనంత ఆకర్షణ. అందుకే నేరుగా స్టాక్స్‌లో లేదంటే మ్యూచువల్ ఫండ్స్ రూపంలో స్మాల్, మిడ్‌క్యాప్ కంపెనీల్లోనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. పెద్ద కంపెనీలతో పోల్చి చూస్తే, దీర్ఘకాలంలో చిన్న, మధ్యస్థాయి కంపెనీల్లో అధిక రాబడులు వారిని ఆకట్టుకుంటున్నాయి. కానీ, పెద్ద కంపెనీలతో పోలిస్తే వీటిల్లో రిస్క్ పాళ్లు అధికం. ఈ రిస్‌్కను రిటైల్ ఇన్వెస్టర్లలో అధిక శాతం మంది పట్టించుకోవడం లేదు. ఫలితం మార్కెట్ దిద్దుబాట్లలో తప్పటడుగుల కారణంగా భారీగా నష్టపోవాల్సి వస్తోంది. ఈ రిస్క్‌ను ఇన్వెస్టర్లు అర్థం చేసుకునేందుకు తీసుకొచి్చందే స్ట్రెస్ టెస్ట్. గడిచిన మూడేళ్ల డేటాను గమనించినట్టయితే స్మాల్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి భారీ మొత్తంలో పెట్టుబడులు వచి్చనట్టు తెలుస్తోంది. ఒక్క 2023 సంత్సరంలోనే మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.23,000 కోట్లు వస్తే.. చిన్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే స్మాల్‌క్యాప్ పథకాలు రూ.41,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. 2022లోనూ మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.20,500 కోట్లు, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.19,795 కోట్ల చొప్పున వచ్చాయి. కానీ, అస్థిరతలు తక్కువగా ఉండే లార్జ్‌క్యాప్ పథకాల నుంచి 2023లో ఇన్వెస్టర్లు రూ.3,000 కోట్లను ఉపసంహరించుకోవడం గమనార్హం. మూడేళ్ల కాలంలో స్మాల్‌క్యాప్ ఫండ్స్ ఏటా 24 శాతం చొప్పున రాబడిని ఇవ్వగా, మిడ్‌క్యాప్ ఫండ్స్ ఏటా 22 శాతం చొప్పున ఇన్వెస్టర్లకు పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించాయి. ఈ స్థాయి రాబడిని చూసి ఇన్వెస్టర్లు మరింతగా పెట్టుబడులను ఈ పథకాల్లోకి కుమ్మరిస్తున్నారు. వచ్చే పెట్టుబడుల ప్రవాహానికి తగ్గట్టు ఫండ్స్ సంస్థలు చిన్న, మధ్య స్థాయి కంపెనీల్లో ఆ మేరకు పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. ఇవన్నీ కలసి స్టాక్స్ వ్యాల్యూషన్లు ఓ బుడగ మాదిరి తయారవుతున్నట్టు క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ ఆందోళన చెందింది. ఫలితంగా కొన్ని అసాధారణ నిర్ణయాలు తీసుకుంది. చిన్న, మధ్య స్థాయి కంపెనీల్లో ఉండే రిస్క్ నుంచి ఇన్వెస్టర్ల ప్రయోజనాల రక్షణకు కార్యాచరణ రూపొందించుకోవాలని, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి పెట్టుబడులను నియంత్రించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, అన్ని స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌కు సంబంధించి ‘స్ట్రెస్ టెస్ట్’ నిర్వహించాలని ఫండ్స్ సంస్థలను (ఏఎంసీలు) ఆదేశించింది. లిక్విడిటీ స్ట్రెస్ టెస్ట్ ఫలితాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ప్రకటిస్తున్నాయి. వీటి గురించి తెలుసుకోవడం అవసరం. ఏమిటీ ఈ స్ట్రెస్ టెస్ట్? పైకి ఎలాంటి అనారోగ్య సమస్యలూ కనిపించకపోవచ్చు. మరి అనూహ్యంగా హార్ట్ ఎటాక్‌తో చిన్న వయసులోనే కొందరు ఎందుకు మరణిస్తున్నట్టు? గుండె సామర్థ్యాన్ని, సమీప కాలంలో వచ్చే ముప్పును తెలుసుకునేందుకు వైద్యులు థ్రెడ్ మిల్ టెస్ట్ (టీఎంటీ) నిర్వహిస్తుంటారు. మెషిన్‌పై శ్రమతో నడస్తున్న సమయంలో గుండె స్పందనలు ఎలా ఉన్నాయనే దాని ఆధారంగా భవిష్యత్ రిస్‌్కలను వైద్యులు అంచనా వేస్తారు. మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించిన స్ట్రెస్ టెస్ట్ కూడా ఇదే మాదిరి అనుకోవచ్చు. 2020 కరోనా సమయంలో స్టాక్ మారెŠక్ క్రాష్ గుర్తుండే ఉంటుంది. ఈ తరహా పతనాల్లో మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు తమ నిర్వహణలోని పెట్టుబడుల (ఏయూఎం)ను ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తాయి? రిస్‌్కను ఎలా ఎదుర్కొంటాయి? ఇన్వెస్టర్ల ప్రయోజనాలను ఎంత మేరకు కాపాడగలవు? ఇన్వెస్టర్లు ఒక్కసారిగా తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తే తిరిగిచ్చే సామర్థ్యం ఫండ్స్ సంస్థలకు ఉంటుందా? ఇత్యాది అంశాలన్నీ తెలుసుకోవడానికి ఈ స్ట్రెస్ టెస్ట్ ఉపకరిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి ఇది కొత్తగా విని ఉండొచ్చేమో..! కానీ ఆర్బీఐ ప్రతి ఆరు నెలలకు ఒకసారి బ్యాంక్‌లకు సంబంధించి లిక్విడిటీ స్ట్రెస్ టెస్ట్‌ను నిర్వహిస్తుంటుంది. బ్యాంకుల్లో నగదు లభ్యత ఎలా ఉంది? కొరతను ఎదుర్కొంటున్నాయా? అన్నది ఆర్బీఐ మదింపు చేస్తుంటుంది. దీని అవసరం..? బాండ్ల మార్కెట్లలో మాదిరే ప్రతికూల సమయాల్లో స్మాల్, మిడ్‌క్యాప్ పథకాలకు సంబంధించి కూడా లిక్విడిటీ సమస్య ఏర్పడుతుంటుంది. ఒక మోస్తరు ఆస్తులను (పెట్టుబడులు/ఏయూఎం) నిర్వహిస్తున్నంత వరకు ఈ లిక్విడిటీ అనేది మ్యూచువల్ ఫండ్స్‌కు పెద్ద సమస్య కాబోదు. కానీ, గడిచిన ఏడాది రెండేళ్లలో స్మాల్, మిడ్‌క్యాప్ పథకాల్లోకి వస్తున్న భారీ పెట్టుబడులు లిక్విడిటీ పరంగా కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. 2024 ఫిబ్రవరి నాటికి అన్ని స్మాల్‌క్యాప్ ఫండ్స్ నిర్వహణలోని ఏయూఎం రూ.2.49 లక్షల కోట్లకు చేరితే, మిడ్‌క్యాప్ ఫండ్స్ ఏయూఎం రూ.2.95 లక్షల కోట్లకు చేరుకోవడాన్ని ఇక్కడ గమనించాలి. ఇప్పుడు ఈ విభాగాల్లోని పెద్ద పథకాలు ఒక్కో దాని నిర్వహణలోని ఆస్తులు రూ.25,000–60,000 కోట్లకు చేరాయంటే ఏ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. రూ.60,000 కోట్ల ఆస్తులు నిర్వహించే పథకం ఒక శాతం (రూ.600 కోట్లు) మేర స్టాక్స్‌ను విక్రయించినా దాన్ని మార్కెట్ సర్దుబాటు చేసుకోవడం కష్టంగానే ఉంటుంది. ముఖ్యంగా లిక్విడిటీ తక్కువగా ఉండే స్టాక్స్‌లో (తక్కువ వ్యాల్యూమ్ ట్రేడ్ అయ్యేవి) ఈ రిస్క్ ఇంకా ఎక్కువ. కొద్ది అమ్మకాలకే స్టాక్ ధరలు నేలచూపులు చూస్తాయి. దీంతో ఆయా పథకాల యూనిట్ నెట్ అస్సెట్ వ్యాల్యూ (ఎన్ఏవీ) అదే స్థాయిలో పడిపోతుంది. స్ట్రెస్ టెస్ట్ ఎలా నిర్వహిస్తారు? పథకాల పోర్ట్‌ఫోలియోలో 50, 25 శాతం మేర స్టాక్స్‌ను విక్రయించేందుకు వీలుగా మ్యూచువల్ ఫండ్స్ సంస్థల మేనేజర్లు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. తమ స్టాక్స్‌కు సంబంధించి గడిచిన మూడు నెలల్లో సగటు ట్రేడింగ్ వ్యాల్యూమ్ను పరిశీలిస్తారు. లిక్విడిటీ (వ్యాల్యూ మ్) చాలా తక్కువగా ఉన్న దిగువ స్థాయి 20 శాతం స్టాక్స్‌ను మినహాయిస్తారు. మిగిలిన స్టాక్స్ వాల్యూమ్ మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కొనే సమయంలో ఏ మేరకు పెరుగుతుందన్నది ఊహాత్మక గణాంకాల ఆధారంగా అంచనా వేస్తా రు. ఈ గణాంకాల ఆధారంగా పోర్ట్‌ఫోలియోలోని స్టాక్స్ (హోల్డింగ్స్)ను ఎన్ని రోజుల్లో విక్రయించగలమనే అంచనాకు వస్తాయి. ఒక పథకం తన పెట్టబడుల్లో 25 శాతాన్ని, 50 శాతాన్ని ఎన్ని రోజుల్లో విక్రయించగలదన్నది దీని ద్వారా తెలుస్తుంది. సెబీ ఆదేశాల ప్రకారం ఫండ్స్ ప్రతి నెలా ఈ విధమైన స్ట్రెస్ టెస్ట్ నిర్వహించి, ఫలితాలను తర్వాతి 15 రోజుల్లోపు ఆన్లైన్ పోర్టల్‌పై వెల్లడించాలి. ఆయా పథకాల్లో పెట్టుబడులు పెట్టిన టాప్–10 ఇన్వెస్టర్ల వివరాలను కూడా ఫండ్స్ వెల్లడించాల్సి ఉంటుంది. వర్రీ అక్కర్లేదు.. ఒక పథకం తన నిర్వహణ పెట్టుబడుల్లో 50 శాతం విక్రయించేందుకు 60 రోజుల సమయం పడుతుందని వెల్లడించిన సందర్భాల్లో.. ఇన్వెస్టర్ల ఉపసంహరణ క్లెయిమ్‌లు ఒకే సారి ఎక్కువ మొత్తంలో వస్తే ఆమోదిస్తుందా? అన్న సందేహం అక్కర్లేదు. ఈ స్ట్రెస్ టెస్ట్ ఫలితాలు అన్నీ కూడా వాస్తవంగా మార్కెట్లో విక్రయించి, వెల్లడించిన డేటా కాదు. మార్కెట్ పతనాల్లో ఎన్ని రోజుల్లో విక్రయించగలమో ఊహాత్మకంగా వేసిన అంచనాలే. ఆయా సమయంలో ఫండ్స్ పెట్టుబడుల్లో ఉండే రిస్‌్కల గురించి తెలుసుకునేందుకు ఈ డేటా ఇన్వెస్టర్లకు సాయంగా ఉంటుంది. ముఖ్యంగా పెట్టుబడుల్లో 25 శాతం నుంచి 50 శాతం మేర ఉపసంహరణ ఒత్తిళ్లు రావడం అన్నది చాలా అరుదుగానే ఉంటుంది. ఎక్కువ సందర్భాల్లో పెట్టుబడుల ఉపసంహరణ ఒత్తిళ్లు 10 శాతం మించవు. దీనికంటే కూడా మార్కెట్లు పడడం మొదలైన తర్వాత ఇన్వెస్టర్లు తాజా పెట్టుబడులు నిలిపివేయడం మన దేశంలో ఎక్కువగా కనిపిస్తుంది. అంతే కానీ అప్పటికే చేసిన ఫండ్స్ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం అరుదు. నష్టభయమే దీనికి కారణం. నిజానికి మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థలైన అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (ఏఎంసీలు) లిక్విడిటీ రిస్క్ విషయంలో తగిన సన్నద్దంగానే ఉంటాయి. అందుకే స్మాల్‌క్యాప్ అయినా, మిడ్‌క్యాప్ అయినా పెట్టుబడుల్లో 35 శాతం వరకు తీసుకెళ్లి లార్జ్‌క్యాప్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ఎదురైతే ముందుగా లార్జ్‌క్యాప్ పెట్టుబడులనే నగదుగా మార్చుకుంటాయి. దీనికి తోడు పథకంలో కొంత మేర నగదు నిల్వలు కూడా ఉంటాయి. వీటికి అదనంగా పథకం మొత్తం పెట్టుబడుల విలువలో 20 శాతం మేర రుణం తీసుకుని స్వల్పకాల అమ్మకాల ఒత్తిడిని అధిగమించేందుకు సెబీ నిబంధనలు అనుమతిస్తున్నాయి. విశ్లేషణకు కీలక డేటా స్ట్రెస్ టెస్ట్ డేటాతో ఇన్వెస్టర్లకు తాము ఇన్వెస్ట్ చేసిన పథకాల్లో ఉండే రిస్క్ ఎంతన్నది తెలుస్తుంది. ఎన్ని రోజుల్లో పెట్టుబడులను ఫండ్ మేనేజర్లు నగదుగా మార్చుకుంటున్నారన్నది ఇందులో కీలకమైన అంశం. ఇప్పటి వరకు విడుదలైన స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ స్ట్రెస్ టెస్ట్ ఫలితాలను ఒక్కసారి తప్పకుండా గమనించాలి. స్మాల్‌క్యాప్ పథకాలు తమ పెట్టుబడుల్లో 50 శాతాన్ని విక్రయించి నగదుగా మార్చుకునేందుకు సగటున 22 నుంచి 60 రోజులు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అదే 25 శాతం పెట్టుబడులను విక్రయించేందుకు 11–30 రోజుల సమయం పడుతోంది. మొత్తం ఒకే రోజు విక్రయించేందుకు ఇక్కడ అవకాశాలు పరిమితం. ఎందుకంటే ఆయా స్టాక్స్‌లో లిక్విడిటీ (ట్రేడింగ్ వ్యాల్యూమ్) చాలా తక్కువగా ఉంటుందన్న అంశాన్ని గుర్తు పెట్టుకోవాలి. సాధారణంగా స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ పథకాల వద్ద నగదు నిల్వలు 4.5 శాతం నుంచి 11 శాతం మధ్య ఉన్నాయి. ఒకేసారి అమ్మకాల ఒత్తిడి ఎదురైతే తొలుత ఈ నగదు నిల్వలతో ఫండ్స్ గట్టెక్కగలవు. అప్పటికీ రిడెంప్షన్ (ఉపసంహరణ) ఒత్తిడి ఆగకపోతే పెట్టుబడులను విక్రయించాల్సి వస్తుంది. ఆయా పథకంలో కేవలం కొద్ది మంది ఇన్వెస్టర్లే ఎక్కువ పెట్టుబడులు కలిగి ఉన్నారా? లేదా అన్నది తెలుస్తుంది. ఉదాహరణకు ఒక పథకం నిర్వహణలో రూ.2,000 కోట్ల పెట్టుబడులు ఉన్నాయని అనుకుందాం. కేవలం ఐదు, పది మంది ఇన్వెస్టర్లకు సంబంధించే రూ.500 కోట్ల పెట్టుబడులు ఉంటే, అది రిస్‌్కకు దారితీస్తుంది. ఆ స్థాయిలో పెట్టుబడులు కలిగి ఉన్నవారు స్మార్ట్ ఇన్వెస్టర్ల కిందకే వస్తారు. మార్కెట్ పతనం మొదలైన వెంటనే, ముందుగా వారు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు ప్రయతి్నస్తే పథకం ఎన్ఏవీ దారుణంగా పడిపోతుంది. ఇది మిగిలిన ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువను గణనీ యంగా ప్రభావితం చేస్తుంది. అయితే, తాజా స్ట్రెస్ టెస్ట్ ఫలితాలను గమనిస్తే ఈ రిస్క్ దాదాపు లేనట్టేనని తెలుస్తోంది. ఒక పథకం పెట్టుబడుల విలు వలలో టాప్–10 ఇన్వెస్టర్లకు సంబంధించి పెట్టుబడుల విలువ 0.61–2.1 శాతం మించి లేదు. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ పథకాలు అయినప్పటికీ లార్జ్‌క్యాప్ కంపెనీలకు సైతం చెప్పుకోతగ్గ మేర కేటాయింపులు చేసిన పథకాల్లో లిక్విడిటీ రిస్క్ చాలా తక్కువ. ఎందుకంటే లార్జ్‌క్యాప్‌లో లిక్విడిటీ సమస్య ఉండదు. కావాలంటే ఒకే రోజు మొత్తం పెట్టుబడులను విక్రయించుకోగలవు. ఇక స్మాల్‌క్యాప్ ఫండ్స్‌తో పోలిస్తే మిడ్‌క్యాప్ ఫండ్స్ లిక్విడిటీ మెరుగ్గా ఉంది. స్మాల్‌క్యాప్ పథకాలతో పోలిస్తే సగం వ్యవధిలోనే మిడ్‌క్యాప్ ఫండ్స్ తమ పెట్టుబడులను విక్రయించుకోగలవని స్ట్రెస్ టెస్ట్ డేటా తెలియజేస్తోంది. కాకపోతే మిడ్‌క్యాప్ పథకాల్లో టాప్–10 ఇన్వెస్టర్లకు సంబంధించిన పెట్టుబడులు 1.3–4.9 శాతం మధ్య ఉన్నాయి. అంటే కొంచెం కాన్సన్ట్రేషన్ రిస్క్ ఉన్నట్టు. అవసరమైతే డేటా విశ్లేషణకు నిపుణుల సలహాలు తీసుకోవచ్చు. సంక్షోభాల్లో ఎలా..? తీవ్ర ప్రపంచ ప్రతికూల పరిణామాల్లో మార్కెట్లు కుప్పకూలితే, ఫండ్స్ పథకాలు లిక్విడిటీ రిస్‌్కను గట్టెక్కుతాయా? అంటే అవుననే చెప్పుకోవాలి. కానీ, వాస్తవ పరిస్థితుల్లో ఫలితాలు ఇలానే ఉండాలని లేదు. అప్పుడు ఇన్వెస్టర్లు ఎలా ప్రతిస్పందిస్తారు..? ప్రతికూల పరిణామాలు స్వల్ప కాలమా? లేక దీర్ఘకాలమా? తదితర అంశాలు అప్పటి వాస్తవ లిక్విడిటీ రిస్‌్కను ప్రభావితం చేస్తాయి. ఎలాంటి ప్రతికూల పరిణామాలు అయినా సరే తమ పెట్టుబడులను వెనక్కి ఇవ్వాలని ఇన్వెస్టర్లు కోరితే.. ఫండ్స్ సంస్థలు తప్పకుండా అనుసరించాల్సిందే. నష్టానికి అయినా అవి అమ్మి చెల్లింపులు చేస్తాయి. మార్గం ఏంటి? స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఫండ్స్ లిక్విడిటీ తక్కువగా ఉండే స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అంతేకానీ, పెట్టుబడుల ఉపసంహరణకు ఇది సంకేతం కాదు. రిస్‌్కలను అర్థం చేసుకోలేని వారు, ఎన్ఏవీలు గణనీయంగా పడిపోయినప్పుడు ఓపిక పట్టలేని వారు ఈ తరహా పెట్టబడులను తగ్గించుకోవాలి. దీర్ఘకాల లక్ష్యాల కోసం ఉద్దేశించిన పెట్టుబడులను స్వల్పకాలిక ఆటుపోట్లను చూసి విక్రయించుకోవడం సరైన నిర్ణయం అనిపించుకోదు. అంత రిస్క్ వద్దనుకుంటే లార్జ్‌క్యాప్‌నకు ఎక్కువ కేటాయింపులు చేసుకోవాలి. ఒకేసారి ఒక పథకం నుంచి 25–50 శాతం పెట్టుబడులు బయటకు వెళ్లిపోవడం సాధారణంగా జరగదు. కనుక స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ పెట్టుబడులకు దూరంగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఇవీ ఉదాహరణలు ► రూ.46,000 కోట్ల పెట్టుబడులను నిర్వహించే నిప్పన్ ఇండియా స్మాల్‌క్యాప్ ఫండ్.. తన పెట్టుబడుల్లో 50 శాతాన్ని నగదుగా మార్చుకునేందుకు 27 రోజులు, 25 శాతం పెట్టుబడుల విక్రయానికి 13 రోజులు పడుతుందని స్ట్రెస్ టెస్ట్ ఫలితాలను విడుదల చేసింది. ► రూ.17,193 కోట్ల పెట్టుబడులను నిర్వహించే క్వాంట్ స్మాల్‌క్యాప్ ఫండ్ తన పెట్టుబడుల్లో 50 శాతం విక్రయించేందుకు 22 రోజులు, 25 శాతాన్ని విక్రయించేందుకు 11 రోజులు తీసుకుంటుందని తెలిపింది. ► రూ.25,500 కోట్లు నిర్వహించే ఎస్బీఐ స్మాల్‌క్యాప్ ఫండ్ 50 శాతం పెట్టుబడుల విక్రయానికి 60 రోజులు పడుతుందని వెల్లడించింది. ► క్వాంట్ మిడ్‌క్యాప్ ఫండ్ 100% పెట్టుబడుల విక్రయానికి 10 రోజులు, 25% పెట్టుబడుల అమ్మకానికి 5 రోజులు చాలని ప్రకటించింది. ► అదే యాక్సిస్ మిడ్‌క్యాప్ ఫండ్ 50 % పెట్టుబడులను 12 రోజుల్లో, 25% పెట్టుబడులను 6 రోజుల్లో నగదుగా మార్చుకోగలనని పేర్కొంది. -
అలా చేస్తే తెల్లజుట్టు నల్లబడేనా?
వయసు ముదిరే కొద్దీ తలనెరవడం కామన్. కానీ యుక్త వయసులోనే నెరవడం ఆరంభమై, మధ్యవయసు వచ్చేసరికి తల ముగ్గుబుట్టలాగా మారడం చాలామందిలో కనిపిస్తోంది. తెల్లబడుతున్న జుట్టు యువతలో మానసికాందోళనకు కారణమవుతోంది. దీన్ని కవర్ చేయలేక, ఎలా ఆపాలో తెలియక పలువురు సతమతమవుతుంటారు. ఈ తరుణంలో ఎలాంటి చిట్కా చెప్పినా పాటించేందుకు రెడీ అవుతుంటారు. అంతర్జాతీయంగా కూడా ఈ అంశంపై పలు పరిశోధనలు జరిగాయి. ఒత్తిడి వల్ల జుట్టు త్వరగా తెల్లబడిపోతుందన్నది నిజమేనంటోంది సైన్స్. ఈ విషయం ఆధారంగా తాజాగా జరిగిన ఒక పరిశోధన ఆశలు రేకిత్తించే ఫలితాలనిచ్చింది. ఈ పరిశోధనలో నల్లజట్టు తొందరగా తెల్లబడేందుకు ఒత్తిడే కారణమని భావించి కొలంబియా యూనివర్సిటీలో ప్రయోగాలు చేశారు. ఒత్తిడిని అదుపులో పెట్టుకోగలిగితే జుట్టు మళ్లీ నల్లబడుతుందని ‘ఈలైఫ్’ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం చెబుతోంది. ‘ఒత్తిడికి, తెల్లజుట్టుకు ఉన్న సంబంధం గురించి చాలా ఏళ్లుగా పరిశోధన చేస్తూ ఉన్నాం. మానసిక ఒత్తిడికి, జుట్టు పండిపోవడానికి కచ్చితమైన సంబంధం ఉంది అని తెలిపే అధ్యయనం ఇది. ఒత్తిడి తగ్గించుకుంటే అనూహ్యంగా కొంతమేర జుట్టు తిరిగి సహజ రంగులోకి మారుతుందనేందుకు ఆధారాలు లభించాయి’ అని కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మార్టిన్ పికార్డ్ తెలిపారు. ప్రయోగంలో భాగంగా ప్రతి వెంట్రుకను అధ్యయనం చేస్తూ, దాన్లో ఉన్న పిగ్మెంటేషన్ నష్టాన్ని అంచనా వేసేందుకు ఈ పరిశోధక బృందం ఒక కొత్త పద్ధతిని అభివృద్ధి చేసింది. అనంతరం వివిధ వయసులకు చెందిన 14 మంది వలంటీర్లను ఎంపిక చేసుకుని, ప్రతి వారం వాళ్ల ఒత్తిడి స్థాయిలు ఎలా ఉన్నాయో నమోదు చేయమన్నారు. ఈ 14 మంది శరీరంలోని వివిధ భాగాల నుంచి వెంట్రుకలు పరిశీలించారు. ఆశ్చర్యకరంగా ఈ ప్రయోగంలో పాల్గొన్నవారిలో అతి పిన్నవయస్కుల జీవితాల్లో ఒత్తిడి మాయమైపోయినప్పుడు జుట్టు వారి సహజ రంగుకు తిరిగి వచ్చేసిందని గమనించారు. వీరిలో ఒక వ్యక్తి రెండు వారాలు సెలవులు తీసుకుని, ఏ ఒత్తిడి లేకుండా హాయిగా గడిపిన తరువాత ఆయన వెంట్రుకల్లో కొన్ని వాటి సహజ రంగును తిరిగి పొందాయి. ఒత్తిడి లేకుంటే చాలా? జీవితంలో అనుభవించే టెన్షన్లు, ఒత్తిళ్లు మాయం కాగానే తెల్లబడిపోయిన జుట్టంతా వెంటనే నల్లగా మారిపోతుందని భావించకూడదని సైంటిస్టులు చెప్పారు. కేవలం కుదుళ్ల నుంచి పెరుగుతున్న వెంట్రుకలు తమ సహజ రంగుకు వచ్చేస్తాయని పికార్డ్ స్పష్టం చేశారు. అంటే అప్పటికే కుదురు నుంచి పైకి వచ్చిన వెంట్రుక రంగు మారదు. ఎందుకని ఇలా జరుగుతోందనేందుకు ఒత్తిడి కారణంగా మైటోకాండ్రియాలో జరిగే మార్పుల వల్లనే జుట్టు రంగు మారుతోందని సైంటిస్టులు వివరించారు. మైటోకాండ్రియాలు కణలకు శక్తి సరఫరా కేంద్రాలు. ‘మానసిక ఒత్తిడి వలన మైటోకాండ్రియా విడుదల చేసే శక్తిలో మార్పులు వస్తాయి. మైటోకాండ్రియా సరిగా పనిచేయకపోతే కుదుళ్ల కింద ఉండే కణాలు సరిగా పనిచేయక జుట్టు పింగ్మెంట్‌ను కోల్పోతుంది’ అని పరిశోధకులు చెప్పారు. అయితే ఒత్తిడి తగ్గగానే మైటోకాండ్రియా శక్తి విడుదలలో మార్పులు సర్దుకుంటాయని, అందువల్ల కుదుళ్ల నుంచి మొలిచే కొత్త జుట్టు తన సహజ రంగును తిరిగి పొందుతుందని తెలిపారు. అయితే అందరిలో ఇది సాధ్యమేనా? అంటే కాదనే సమాధానమే వస్తోంది. ముఖ్యంగా దీర్ఘకాలంపాటు తెల్లజుట్టు ఉన్నవారికి నల్లరంగు మళ్లీ రాదు. ‘ప్రతి ఒక్కరికి ఒక బయోలాజికల్ లిమిట్ (జీవసంబంధమైన పరిమితి) ఉంటుంది. అంటే ఒక వయసొచ్చాక జుట్టు పండిపోతుంది. ఆ పరిమితికి దగ్గర్లో ఉన్నప్పుడు మానసిక ఒత్తిడి పెరిగితే రావలసిన సమయం కన్నా ముందే తెల్లజుట్టు వచ్చేస్తుంది. అంటే నిర్ణీత వయసు దాటిపోయి చాలాకాలం అయిపోతే తెల్ల జుట్టు నల్లగా మారడం దాదాపు అసాధ్యం’ అని పరిశోధకులు వివరించారు. అంటే ఒత్తిడి తగ్గిపోయిన ప్రతివారికీ నల్లజుట్టు పెరగడం ప్రారంభమవుతుందని కాదు. కానీ చిన్న వయసులోనే మానసిక ఒత్తిడి కారణంగా జుట్టు తెల్లబడినవారికి మాత్రం ఒత్తిడి తగ్గితే మళ్లీ నల్లజుట్టు పెరిగే అవకాశం ఉంటుంది. కేవలం జుట్టు రంగు మార్పు గురించే కాకుండా వృద్ధాప్యంతో ముడిపడి ఉన్న ఇతర అంశాలను మానసిక ఒత్తిడి ఎలా ప్రభావితం చేస్తుంది, అలాంటి మార్పులను రివర్స్ చేయగలమా లేదా అనే అంశాలపై తమ బృందం పరిశోధన కొనసాగిస్తోందని పికార్డ్ తెలిపారు. ఈ ప్రయోగాలు సత్ఫలితాలనిస్తే మానవ జీవన గమనంలో మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. -
Stress Relief:: నువ్వులు.. గుడ్లు.. శనగలు..షెల్ఫిష్!
ఒత్తిడి ఎదుర్కోని మనిషి ప్రస్తుత సమాజంలో కనిపించడం అరుదు. ఆధునిక సాంకేతికత కొత్త పుంతలు తొక్కి మనిషి జీవితం ఉరుకులు పరుగుల మయం అయ్యాక ఎన్నో శారీరక, మానసిక సమస్యలు విజంభిస్తున్నాయి. అలాంటి వాటిలో ఒత్తిడి(స్ట్రెస్) ఒకటి. ఆఫీసులో అప్పగించిన పనిని సకాలంలో పూర్తిచేయాలని టార్గెట్లు పెట్టడం, పోటీ రంగంలో ఇతరులు ముందుకు దూసుకెళ్లుతుండడం, అనుకున్న లక్ష్యాల్ని చేరుకొనే క్రమంలో ఆలస్యం కావడం వంటివి ఒత్తిడికి కారణమవుతున్నాయి. ఫలితంగా హృద్రోగాలు, బీపీ, మధుమేహం వంటివి చుట్టుముడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఒక్కోసారి ఈ ఒత్తిడి డిప్రెషన్‌గా మారి బలవన్మరణాలకు సైతం ప్రేరేపిస్తోంది. అందువల్ల శారీరక మానసిక ఆరోగ్యంతో ఉండాలంటే ఒత్తిడిని దరిచేరనీయకపోవడం అత్యుత్తమం. దీనికోసం తోడ్పడే కొన్ని రకాల ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం... చిలగడ దుంపలు ఇందులో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఒత్తిడికి కారణమయ్యే కార్టిసోల్ హార్మోన్ స్థాయిని ఇవి తగ్గిస్తున్నట్లు ఓ పరిశోధనలో తేలింది. ఊబకాయం, అధిక బరువుతో ఉండే కొందరు మహిళలను ఎంచుకొని వారికి కొన్ని రోజుల పాటు చిలగడ దుంపలను ఆహారంగా ఇచ్చారు. అనంతరం వారికి పరీక్షలు చేసినప్పడు అంతకుముందుతో పోలిస్తే కార్టిసోల్ స్థాయిలు తగ్గినట్లు గుర్తించారు. చిలగడ దుంపల్లో ఉండే విటమిన్ సి, పొటాషియం ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు కనుగొన్నారు. మచా పొడి గ్రీన్ టీ ఆకులతో చేసే ఈ పొడి జపాన్‌లో చాలా ప్రసిద్ధి. ఇందులో ఎల్–థియానిన్ అనే ప్రొటీనేతర అమైనో ఆమ్లం ఎక్కువ పాళ్లలో ఉంటుంది. ఇది ఒత్తిడిని సమర్థంగా తగ్గిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీనికోసం కొంతమందిని ఎంచుకొని వారికి రోజుకు 4.5గ్రాముల మచా పొడి ఉన్న బిస్కెట్లను 15 రోజుల పాటు ఆహారంగా ఇచ్చారు. ఆ తర్వాత పరీక్షించగా వారిలో ఒత్తిడి చాలా వరకు తగ్గినట్లు గుర్తించారు. కాగా, ఈ పొడి తయారీకి గ్రీన్ టీ ఆకులను ఒక ప్రత్యేక పద్ధతిలో సేకరిస్తారు. షెల్ఫిష్ అంటే రక్షణ కవచాలు ఉన్న నత్తలు, ఆల్చిప్పలు, మస్సెల్స్ వంటివి. వీటిలో అమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ప్రత్యేకంగా మనసును ఉల్లాసంగా ఉంచగలిగే టారిన్ ఎక్కువగా ఉంటుంది. దీనితోపాటు ఉండే డోపమైన్ ఒత్తిడి నిరోధకంగా పనిచేస్తున్నట్లు అనేక సర్వేలు వెల్లడించాయి. స్విస్ చార్డ్ సాధారణంగా శరీరంలో మెగ్నీషియం ఉండాల్సిన స్థాయి కంటే తక్కువ ఉన్నప్పుడు ఆందోళన, ఒత్తిడి లక్షణాలు కనిపిస్తాయి. దీనికి విరుగుడుగా స్విస్ చార్డ్ అనే వంటకం సమర్థంగా పనిచేస్తున్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు. స్విస్ చార్డ్ అంటే క్యాబేజీని తలపించే ఒక దుంప చెట్టు. దీని ఆకుల్లో ఒత్తిడితో పోరాడే పోషకాలున్నాయి. ప్రత్యేకంగా మెగ్నీషియం పాళ్లు కొంచెం అధికం. 175 గ్రాముల స్విస్ చార్డ్ ఆకులను కూరగా వండినప్పుడు అందులో 36శాతం మెగ్నీషియం ఉంటుంది. ఇది శరీరంలో ఒత్తిడి తగ్గేందుకు ఉపయోగపడుతుంది. ఆర్గాన్ మీట్ అంటే అవయవ మాంసం. కోళ్లు, పొట్టేళ్లు, మేకలు వంటి జంతువుల గుండె, కాలేయం, మూత్రపిండాలతో చేసే వంటకాల్లో బి12, బి16, రైబోఫ్లవిన్, ఫ్లోట్ వంటి విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంలో సమర్థంగా పనిచేస్తాయి. దాదాపు 18 సర్వేలు దీనిని రుజువు చేశాయి. అసిరోలా చెర్రీ పొడి ఎర్రటి రేగు పండ్లలా అనిపించే అసిరోలా అనే ఒక రకం చెర్రీ పొడి ఒత్తిడి నివారణకు ఉపయోగపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ చెర్రీలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. సిట్రస్ జాతి రకాలైన నిమ్మ, నారింజ, బత్తాయి వంటి వాటికంటే ఇందులో 50 నుంచి 100శాతం విటమిన్ సి అధికంగా ఉంటుంది. అసిరోలా పండ్లు, లేదా పొడిని తిన్నప్పుడు అందులోని విటమిన్ సి ఉల్లాసంగా ఉంచడంతో డిప్రెషన్, కోపం తగ్గిస్తోందని గుర్తించారు. పొద్దుతిరుగుడు విత్తనాలు: వీటిలో విటమిన్ ‘ఇ’ అధిక స్థాయిలో ఉంటుంది. ఇది మానసిక ఆరోగ్యం మెరుగుపరచడంలోనూ సమర్థంగా పనిచేస్తుంది. విటమిన్ ‘ఇ’ తక్కువ పాళ్లలో ఉన్నవారిలో డిప్రెషన్ ఉన్నట్లు గుర్తించారు. ఫాటీ ఫిష్ ఒమెగా 3 ఆమ్లాలు, విటమిన్ డి అధికంగా ఉండే చేపలను ఆహారంగా తీసుకోవడం వల్ల అవి ఒత్తిడి స్థాయిలను తగ్గించడంతోపాటు మనసును ఉల్లాసంగా చేస్తున్నట్లు తేలింది. సాధారణంగా మెదడు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడే ఒమేగా–3 ఆమ్లాలు ఒత్తిడిని తగ్గించడంలోనూ సమర్థంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఇంకా చెప్పాలంటే ఒమేగా–3 తగినంత స్థాయిలో లేకపోవడం వల్లే ఆందోళన, డిప్రెషన్‌కు గురయ్యే వారి సంఖ్య పశ్చిమ దేశాల్లో ఎక్కువగా ఉంటోన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. కిమ్చి ఇది క్యాబేజీ, ముల్లంగితో తయారుచేసే ఒక రకం ఆవకాయ. దీనిని ఎక్కువగా ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, జపాన్ దేశాల్లో తయారుచేస్తారు. ఇందులో ప్రొబయాటిక్స్, విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్ అధికస్థాయిలో ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంలో సమర్థంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీనికోసం వివిధ రకాల ఒత్తిళ్లతో బాధపడే 710 మంది యువతను ఎంచుకొని ఓ సర్వే నిర్వహించారు. వీరూ రోజూ తీసుకునే ఆహారంలో కిమ్చి తప్పనిసరిగా ఉండేట్లు చేశారు. కొన్ని రోజుల తర్వాత వీరికి పరీక్షలు జరిపినప్పుడు ఒత్తిడిని కలిగించే మూలకాలు అతి తక్కువ ఉన్నట్లు గుర్తించారు. వెల్లుల్లి వెల్లుల్లిలో సల్ఫర్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి గ్లటాథియోన్ అనే యాంటీ ఆక్సిడెంట్‌ను ఉత్పత్తిచేస్తాయి. ఇది ఒత్తిడిని ఎదుర్కొనే రక్షణఛత్రంలో మొదటి మూలకంగా పనిచేస్తుంది. అనేక ప్రయోగాల్లో ఇది రుజువైంది. చమోమిలే టీ చమోమిలే(సీమ చేమంతి) టీని తాగడం ద్వారా మంచి నిద్ర రావడంతోపాటు ఒత్తిడిని తగ్గిస్తున్నట్లు వైద్యనిపుణులు గుర్తించారు. సీమ చేమంతి పూలను ఎండబెట్టి ఆ పొడిని బాగా మరిగించిన ఓ గ్లాసు నీళ్లలో వేసి మూడు నిమిషాలు కలియబెట్టాలి. ఆ తర్వాత కొద్దిగా తేనె కానీ నిమ్మరసం కానీ అందులో పిండితే చమోమిలే టీ సిద్ధం. 45 మందికి రోజూ 1.5 గ్రాముల పొడి వేసి ఇచ్చిన చమోమిలే టీని 8 వారాల పాటు ఇచ్చి పరిశీలించగా వారిలో ఒత్తిడిని కలిగించే కారిస్టోల్ హార్మన్ గణనీయంగా తగ్గినట్లు తేలింది. నువ్వులు నువ్వులతో తయారుచేసే పిండి ముద్దల్లో ఎల్–ట్రిప్టోపాన్ అనే అమైనో ఆమ్లం పాళ్లు ఎక్కువ. ఇది మనసును ఉల్లాసంగా ఉంచే డోపమైన్, సెరటోనిన్ ఉత్పత్తిలో ఉపయోగపడుతుంది. అలాగే డిప్రెషన్, ఒత్తిడిని తగ్గించేందుకు తోడ్పడుతుంది. 25 మంది యువకులకు నాలుగు రోజుల పాటు నువ్వుల పిండి ముద్దలను ఆహారంగా ఇచ్చి పరిశీలించినప్పుడు వారిలో ఆందోళన, ఒత్తిడి స్థాయిలు గణనీయంగా తగ్గినట్లు ఓ సర్వేలో తేలింది. గుడ్లు గుడ్లలో పోషకాలు పుష్కలం అనే విషయం తెలిసిందే. వీటిలో విటమిన్లు, మినరల్స్, అమైనో ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్స్ సంతప్త స్థాయిలో లభిస్తాయి. ప్రత్యేకంగా ఇందులో చోలిన్ అనే పోషకం పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతోందని, అలాగే ఒత్తిడి నివారణకు సమర్థంగా పనిచేస్తోందని వైద్యులు గుర్తించారు. శనగలు ఒత్తిడిని తగ్గించడంలో కీలకపాత్ర పోషించే మెగ్నీషియం, పొటాషియం, బి విటమిన్స్, జింక్, మాంగనీస్, సెలినియం, కాపర్ మూలకాలు శనగల్లో అధిక స్థాయిలో ఉంటాయి. అలాగే ఎల్–ట్రిప్టోపాన్ సైతం ఎక్కువగానే ఉంటుంది. ఇవన్నీ మనిషిని ఉల్లాసంగా ఉంచడంతోపాటు ఒత్తిడి తగ్గేందుకు దోహదం చేస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. చదవండి: నోటి దుర్వాసనా.. ఇలా దూరం చేసుకోండి! -
నడుస్తూ ధ్యానం చేయవచ్చని తెలుసా?!
ధ్యానం.. మనలోని అనవసర ఆందోళనలు, భయాలు మాయం చేసిమనసుకు ప్రశాంతత చేకూర్చే చక్కని మార్గం. అందుకే భారతీయసంప్రదాయంలో ధ్యానానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. రుషులు, మునులుసదా అనుసరించేదిదే. అలాగే బుద్ధిజంలోనూ దీని పాత్ర అధికం. చక్కని వాతావరణంలో పద్మాసనం వేసుకొని కూర్చొని కాసేపు కళ్లు మూసుకొని అన్నింటినీ మరచిపోయి శ్వాస మీద ధ్యాస కేంద్రీకరించడమే ధ్యానంగా ఎక్కువ మంది భావిస్తారు. అయితే, నడుస్తూ కూడా ధ్యానం చేసే ప్రక్రియ(మెడిటేషన్ వాక్) ఉందనే విషయం అందరికీ తెలీదు. వాకింగ్ మెడిటేషన్‌ను బౌద్ధంలో ‘‘కిన్హిన్ ’’అంటారు. దీనికే ‘సూత్ర వాక్’ అని మరోపేరుంది. జెన్ మెడిటేషన్, ఛన్ బుద్ధిజం, వియత్నమీస్ థైన్ తదితర విభాగాల్లో మెడిటేషన్ వాక్ ఒక భాగంగా భావిస్తారు. ఒక చోట కూర్చుని ధ్యానం చేసే బదులుగా మధ్య మధ్యలో ఇలా వాకింగ్ మెడిటేషన్నూ చేస్తారు. కిన్హిన్ అనేది జాజెన్కు(కూర్చొని ధ్యానం చేయడం) వ్యతిరేక ప్రక్రియ. ఎలా చేస్తారు? మెడిటేషన్ వాక్‌లో ఒక చేతిపిడికిలి బిగించి మరో చేతితో ఆ పిడికిలిని మూస్తారు. అనంతరం క్లాక్‌వైజ్ డైరక్షన్లో నెమ్మదైన అడుగులు వేస్తూ వృత్తాకారంలో తిరుగుతారు. ఒక్కో అడుగుకు ముందు ఒక బ్రీత్(ఒక ఉచ్ఛాశ్వ, నిశ్వాస) పూర్తి చేస్తారు. కిన్హిన్ అంటే చైనా భాషలో ఒక దాని గుండా ప్రయాణించడమని అర్ధం. అంటే మనం ప్రశాంతత గుండా ప్రయాణించడమని అర్ధం చేసుకోవచ్చు. ఉపయోగాలు: 1. రక్తప్రసరణ మెరుగుపర్చడం తరచూ వాకింగ్ మెడిటేషన్ చేసేవారిలో రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా వారి పాదాల్లో రక్తం సక్రమంగా సరఫరా అవడంలో తోడ్పడుతుంది. కాళ్ల అలసట, మందస్థితిని పోగొడుతుంది. అంతేకాదు శరీరంలో శక్తిస్థాయిల్ని పెంచుతుంది. 2. జీర్ణశక్తిని పెంచుతుంది ఆహారం తీసుకున్న తర్వాత కాసేపు ప్రశాంతంగా అటూ ఇటూ నడిస్తే జీర్ణశక్తి మెరుగవుతుంది. ప్రత్యేకించి కడుపు నిండా తిన్నప్పుడు ఇలా నడవడం ద్వారా ఆహారం జీర్ణకోశ ప్రాంతంలో సమంగా పంపిణీ అవుతుంది. అంతేకాదు మలబద్ధకం నివారిస్తుంది. 3. ఒత్తిడి తగ్గిస్తుంది ఒత్తిడిని తగ్గించుకోవాలంటే కూర్చొని చేసే ధ్యానం కన్నా నడుస్తూ చేసే ధ్యానంతో ఎక్కువ ఫలితం ఉంటుంది. 2017లో వెలువడిన ఓ నివేదిక ప్రకారం మధ్య వయస్కుల్లో ఒత్తిడి, ఆందోళన లక్షణాలు వాకింగ్ మెడిటేషన్ ద్వారా సమర్థంగా తగ్గినట్లు తేలింది. అయితే, కనీసం 10 నిమిషాల సమయం మెడిటేషన్ వాక్ చేయాల్సి ఉంటుంది. 4. చక్కెర స్థాయిల్ని నియంత్రిస్తుంది టైప్ 2 మధుమేహం ఉన్నవారిలో చక్కెర స్థాయిల్ని బౌద్ధంలోని ఓ మెడిటేషన్ వాక్ ప్రక్రియ సమర్థంగా నియంత్రించినట్లు 2016లో వెలువడిన ఓ నివేదిక వెల్లడించింది. వారానికి మూడుసార్లు రోజూ కనీసం అరగంట చొప్పున సాధారణ వాకింగ్ చేసేవాళ్లతో పోలిస్తే బౌద్ధ మెడిటేషన్ వాక్ చేసిన వాళ్లలో మధుమేహం నియంత్రణ, చక్కటి రక్తప్రసరణ జరుగుతున్నట్లు గుర్తించారు. 5. డిప్రెషన్ తొలగిస్తుంది 2014లో వెలువడిన ఓ సర్వే ప్రకారం బౌద్ధంలోని ఓ మెడిటేషన్ వాక్ ప్రక్రియను అనుసరించిన వృద్ధుల్లో డిప్రెషన్‌కు సంబంధించిన లక్షణాలు చాలా వరకు తగ్గినట్లు గుర్తించారు. అలాగే వారిలో రక్తప్రసరణ, ఫిట్నెస్ మెరుగవడం గుర్తించారు. ఇది దాదాపు యుక్తవయసువారు చేసే రోజువారీ వ్యాయామం ఫలితంతో సమానంగా ఉన్నట్లు తేలింది. ఈ బౌద్ధ మెడిటేషన్ వాక్ ప్రక్రియను వారానికి కనీసం మూడుసార్లు చొప్పున 12 వారాల పాటు వారు అనుసరించారు. 6. ఆరోగ్యాన్ని పెంచుతుంది ప్రకృతి(ఏదైనా పార్క్/తోట/ వనం)లో కాసేపు నడుస్తూ ధ్యానం చేయడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే సమతుల స్థితి చేకూరుతుంది. 2018లో వెలువడిన ఓ సర్వే ప్రకారం కనీసం 15 నిమిషాల పాటు వెదురు వనంలో మెడిటేషన్ వాక్ చేసిన వారిలో ఆందోళన, ఒత్తిడి, రక్తపోటు తగ్గినట్లు గుర్తించారు. వీటితోపాటు నిద్ర, సృజనాత్మకత, ప్రశాంతత తదితర వాటినీ మెడిటేషన్ వాక్ మెరుగుపరుస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. -
స్కూల్లో బాలిక ఆత్మ'హత్య'?
కోల్‌కతా రాణికుతి ప్రాంతంలోని ఓ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న ఓ బాలిక శుక్రవారం అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. స్కూల్ వాష్‌రూమ్‌లో పడి ఉన్న ఆ బాలిక మొహం చుట్టూ ప్లాస్టిక్ కవర్ చుట్టి ఉంది. ఆమెను దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. బాలిక ఎడమ మణికట్టు దగ్గర చిన్న గాయాలు ఉన్నాయని, అయితే ఆ గాయాల కారణంగా బాలిక మృతి చెందలేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దీంతో స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వాష్‌రూమ్‌లో బాలిక మృతదేహానికి దగ్గరలో కొన్ని పేజీల నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నోట్లో ‘మూడు నెలల నుంచి సదరు బాలిక నిద్రపోలేనంత ఒత్తిడికి గురైందని’ ఉంది. అయితే బాలిక తన క్లాస్‌లో టాపర్ అని, చదువులో ముందుండేదని, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్కి వెళ్లడానికి ఆసక్తి కనబర్చేదని తెలిసింది. మృతిచెందిన బాలికది ఆత్మహత్యానా? లేక హత్యనా? అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఘటనాస్థలికి చేరుకొన్ప ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారు. స్కూల్ సీసీటీవి ఫుటేజిని చెక్ చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
భర్తలూ చిన్న పిల్లలే!
సాక్షి, హైదరాబాద్: పసి పిల్లలు తమ తల్లులను చాలా ఒత్తిడికి గురి చేయడం చూస్తూనే ఉంటాము. అయితే భర్తలు కూడా అదే స్థాయిలో తమను ఒత్తిడికి గురి చేస్తున్నారని గృహిణులు అభిప్రాయపడుతున్నారు. కర్తవ్య నిర్వహణలో కూడా మహిళలు ముందుండి వారిని ప్రోత్సాహించాల్సి వస్తోందని టుడే.కామ్ అనే వెబ్సైట్ నిర్వహించిన సర్వేలో తేలింది. ఏమిటా సర్వే..? మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తున్న అంశాలేమిటి అని 7000 మందికి పైగా తల్లులను ఆ వెబ్సైట్ ప్రశ్నించింది. ఇంట్లో ఉన్న పలు పనులను భర్తతో పంచుకోవడం ఎలా ఉందని అడిగారు. అలాగే ఇంటి పనులు, పిల్లల పెంపకం, భర్తను చూసుకోవడం ఎలా ఉందంటూ పలు కోణాల్లో ప్రశ్నలను అడిగారు. కనుక్కున్నదేమిటంటే..... ! ఈ ప్రశ్నలకు గృహిణులు ఇచ్చిన సమాధానాలు షాకింగ్‌గా ఉన్నాయి. తమ పిల్లల కంటే భర్తలే ఎక్కువ ఒత్తిడికి గురి చేస్తున్నారని 46 శాతం మంది తల్లులు చెప్పారు. పిల్లలకు చేసినట్లే చాలా పనులు భర్తకూ చేయాల్సి వస్తోందని వాపోయారు. అత్యధిక ఒత్తిడిని (10 పాయింట్లలో 8.5 పాయింట్లు) తల్లులు అనుభవిస్తున్నారని ఈ సర్వేలో బయటపడింది. తల్లులు ఎందుకిలా భావిస్తున్నారు..? సర్వేలో పాల్గొన్న ప్రతి నలుగురిలో ముగ్గురు మహిళలు పిల్లలను చూసుకోవడంతో పాటు ఇంటి పనంతా తామే చేయాల్సిరావడం వల్ల ఇలా భావించామన్నారు. ప్రతీ అయిదుగురిలో ఒకరు తమ భర్త ఇంటి పనుల్లో చిన్న సహాయం కూడా చేయట్లేదని అన్నారు. ఇది మాత్రమే గాక పనుల్లో చిన్న ఆలస్యమైనా కోప్పడుతున్నారని బాధపడ్డారు. ఇప్పుడేం చేయాలి..? ఒకవేళ మీ భర్త చిన్న చిన్న పనులకే మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తున్నాడని అనిపిస్తే వెంటనే ఈ విషయాన్ని సావధానంగా అతనికి అర్థమయ్యేలా చెప్పండి. ఒత్తిడి ఎక్కువైతే అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దానితో పాటు పిల్లల పెంపకం మీదా, వారి చదువుల మీదా, ఇంటి పనుల మీద అది ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనికి భర్తలే ముందడుగు వేసి రోజువారి పనులను సమానంగా పంచుకోవడానికి ప్రయత్నించాలి. భర్త అంటే భరించేవాడు అన్న విషయాన్ని పురుషులు గుర్తుంచుకోవాలి. ఈ ఆధునిక యుగంలో కూడా మహిళలను వంటింటికే పరిమితం చేయాలనుకోవడం సరైనది కాదు. భాగస్వామి చేయాల్సిన పనులన్నింటినీ చేయకపోయినా కొద్దిగ తోడ్పాటును వారికి అందిస్తే మరింత ఉత్సాహంగా, సంతోషంగా ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు. -
మిలీనియల్స్‌కు రక్తపోటు ముప్పు
లండన్ : ఆధునిక ప్రపంచాన్ని ముందుకు నడిపించాల్సిన మిలీనియల్స్ ఒత్తిడి ఊబిలో చిత్తవుతున్నారని తాజా అథ్యయనం హెచ్చరించింది. 18 నుంచి 34 ఏళ్ల మధ్యన మిలీనియల్స్‌గా పిలవబడే ఈతరం యువత తీవ్ర ఒత్తడితో సతమతమవుతూ అధిక రక్తపోటు బారిన పడే ప్రమాదం ఉందని తేల్చిచెప్పారు.మిలీనియల్స్‌లో 96 శాతం మంది ఒత్తిడిలో కూరుకుపోయారని, వారితో పోలిస్తే 55 ఏళ్లు పైబడిన వారిలో కేవలం 66 శాతం మందే తాము ఒత్తిడికి గురవుతున్నామని చెబుతున్నారని సర్వేలో వెల్లడైందని ప్రముఖ ఐర్లాండ్ వైద్యురాలు, టీవీ వ్యాఖ్యాత డాక్టర్ పిక్సీ మెకెనా వెల్లడించారు. రక్తపోటుకు పోషకాహార లోపం, మద్యపానం వంటి కారణాలతో పాటు ఒత్తిడి ప్రధాన కారణమని మెకెనా చెప్పుకొచ్చారు. రక్తపోటు ఇక ఎంతమాత్రం వయసుపైబడిన వారిలో కనిపించే వ్యాధి కానేకాదని తమ అథ్యయనంలో వెల్లడైందన్నారు. వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి, మద్యపానం, అధిక బరువు, అధికంగా ఉప్పు తీసుకోవడం వంటి కారణాలతో మిలీనియల్స్‌లో అధిక రక్తపోటు రిస్క్ అధికంగా ఉందని చెప్పారు. తాము నిర్వహించిన సర్వేలో బాధ్యతలు మీదపడుతున్నప్పటికీ మధ్యవయస్కుల్లో ఒత్తిడి స్ధాయి తక్కువగా ఉన్నట్టు వెల్లడైందన్నారు. -
ఒక వైపే చూడొద్దు..
లండన్ : జీవితంలో ఎప్పుడూ అంతా మంచే జరుగుతుందని ఒక వైపే చూడటం శ్రేయస్కరం కాదని తాజా అథ్యయనం పేర్కొంది. ఒత్తిడిని ఎదుర్కోవడం కూడా గడ్డు పరిస్థితులను దీటుగా అధిగమించేందుకు ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒత్తిడి కొన్ని సందర్భాల్లో మేలు చేస్తుందని, కుంగుబాటును సమర్ధంగా ఎదుర్కొనేందుకు దోహదపడుతుందని పరిశోధకులు తెలిపారు. యూనివర్సిటీ కాలేజ్ లండన్ సైకాలజిస్టులు చేపట్టిన అథ్యయనంలో ఈ విషయాలు వెలుగుచూశాయి. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఆశావహ దృక్పథం కలిగిన వారు సమయానుకూలంగా స్పందించడంలో తడబడితే, ఒత్తిడిని ఎదుర్కొనేవారు ఇలాంటి పరిస్థితులను సానుకూల దృక్పధంతో తీసుకోవడంతో పాటు వాటికి అనుగుణంగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారని తమ అథ్యయనంలో వారు గుర్తించారు. ఒత్తిడి మానవాళికి కొత్తేమీ కాదని, మన శరీరంలో ఉండే ఒత్తిడిని ఎదుర్కొనే వ్యవస్థ మనకు మేలు చేస్తుందని ప్రమాదకర పరిస్థితుల్లో ఇది మనల్ని అప్రమత్తం చేస్తుందని పరిశోధనకు నేతృత్వం వహించిన యూనివర్సిటీ కాలేజ్ లండన్ సైకాలజిస్ట్ డాక్టర్ నీల్ గారెట్ చెప్పారు. అయితే ఒత్తిడి హార్మోన్లను మెరుగ్గా నిర్వహించడంతోనే మేలు చేకూరుతుందని, నిరంతర ఒత్తిడి మంచిది కాదని అథ్యయనం స్పష్టం చేసింది. అథ్యయన వివరాలు -
ఒత్తిడిని చిత్తు చేసే యాప్
సాక్షి, కోల్‌కతా : నిత్యం జీవితంలో ఒత్తిడి అన్ని వయసుల వారినీ వేధిస్తోంది. ఆధునిక జీవితంలో ప్రధాన సవాల్‌గా పరిణమించిన ఒత్తిడిని అధిగమించేందుకు ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన నిపుణుల బృందం ఓ మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేసింది. ఈ యాప్‌ను యూజర్లు తమ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని విశ్లేషించడం, దాన్ని సమర్ధంగా ఎదుర్కొనేలా నిపుణులు డిజైన్ చేశారు. ధ్యాన్యాండ్రాయిడ్ పేరిట ఈ యాప్‌ను అభివృద్ధి చేశారు. జూన్ 10న ఈ యాప్‌ను ప్రారంభించనున్నారు. రెండు వెర్షన్లలో లభ్యమయ్యే ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్, యాప్ స్టోర్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూజర్ భావోద్వేగాలను సమస్థితిలో ఉంచుతూ కుంగుబాటును నియంత్రంచేలా ఈ యాప్ పనిచేస్తుంది. యూజర్ల ఒత్తిడి స్థాయిలను అంచనా వేస్తూ ధ్యానం ద్వారా వారికి స్వాంతన చేకూర్చేలా డిజైన్ చేశారు. పలు ప్రశ్నల ద్వారా యూజర్ల ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో ఈ యాప్ పరిశీలిస్తుంది. రియల్ టైమ్‌లో యూజర్లు ఎంత ఒత్తిడికి గురువుతున్నారన్నది ఈ యాప్ పసిగట్టి అప్రమత్తం చేస్తుంది. ఇక మెడిటేషన్ పరంగా సులభమైన శ్వాస, యోగ ఎక్సర్‌సైజ్‌లను యాప్ సూచిస్తుంది. థర్మల్ ఇమేజింగ్, సంగీతం, వైబ్రేషన్ల ద్వారా థ్యాన మందిరంలో ఉన్నామన్న భావనను యూజర్లకు కల్పిస్తూ వారిని ఒత్తిడి రహిత స్థితికి చేర్చడంలో తోడ్పడుతుంది. -
వైఫల్యాలనూ గుర్తుంచుకోవాలి..
లండన్ : గతంలో చోటుచేసుకున్న ప్రతికూల పరిణామాలు, వైఫల్యాలను గుర్తుచేసుకుని నిరుత్సాహపడటం సరైంది కాదని అందరూ చెబుతున్న మాటే. అయితే గత వైఫల్యాలను విశ్లేషించుకుని, ఎదురుదెబ్బలను తరచిచూసుకుంటే భవిష్యత్‌లో ఎదురయ్యే ఒత్తిడిని సులభంగా అధిగమించవచ్చని తాజా అథ్యయనం తేల్చింది. ప్రతికూల పరిణామాలను మెరుగ్గా విశ్లేషించుకునే వారు ఒత్తిడిని సమర్ధంగా ఎదుర్కొంటారని, విద్యా, క్రీడలు వంటి పలు రంగాల్లో మెరుగైన సామర్థ్యం కనబరుస్తారని రజెర్స్ యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. తీవ్రమైన ఒత్తిడి వ్యక్తుల సామర్ధ్యాన్ని దెబ్బతీస్తుందని..అయితే గతంలో ఎదురైన వైఫల్యాల వంటి ప్రతికూల పరిణామాలను తలుచుకుని, వాటి గురించి వివరంగా రాసుకుంటే మనో నిబ్బరం పెరుగుతుందని ముఖ్యంగా శ్రద్ధతో చేయాల్సిన పనుల్లో సామర్థ్యం మెరుగవుతుందని అథ్యయనం నిర్వహించిన రజెర్స్ వర్సిటీ పరిశోధకులు బ్రైన్ డిమెనిచి వెల్లడించారు. గత వైఫల్యాలను నిక్షిప్తం చేసుకుంటే అవి భవిష్యత్‌లో ఒత్తిడిని ఎంత మేర తగ్గిస్తాయని 86 మందిని పరీక్షించి ఫలితాలను విశ్లేషించారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, డ్యూక్ యూనివర్సిటీ రీసెర్చర్ల సహకారంతో డిమెనిచి ఈ కసరత్తు సాగించారు. -
స్ట్రెస్ మంచిదే...
సాక్షి,న్యూఢిల్లీ: ఒత్తిడితో ఆరోగ్యం చిత్తవుతుందని పలు సర్వేలు హెచ్చరిస్తుంటే కొద్దిపాటి ఒత్తిడి మానవ ఆరోగ్యానికి మంచిదేనని తాజా పరిశోధన వెల్లడించింది. కొద్దిపాటి స్ట్రెస్ శరీరంలో మందకొడితనాన్ని పారదోలుతుందని, వయసుమీరుతున్న కణాలను కాపాడటంతో పాటు వ్యాధుల రిస్క్‌ను జాప్యం చేయడంలో తోడ్పడుతుందని ఈ పరిశోధన పేర్కొంది. ఒత్తిడి కారణంగా మానసిక అలజడి, గుండె జబ్బులు, స్ట్రోక్, రక్తపోటు వంటి జీవనశైలి వ్యాధులు ముంచుకొస్తాయని ఇప్పటివరకూ పలు అథ్యయనాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. తాజా పరిశోధనలో వెలుగుచూసిన అంశాలతో మానవ శరీరంలో కణాల వ్యవస్థకు వయసు మీరడం, వృద్ధాప్య సంబంధ వ్యాధులు ప్రబలడానికి మధ్య సంబంధాన్ని అర్థం చేసుకునేందుకు పరిశోధకులు ఉపకరిస్తుందని భావిస్తున్నారు. వ్యాధులకు దారితీసే కణాలు బలహీనపడకుండా అలాగే కొనసాగించడం, వృద్ధాప్య లక్షణాలను జాప్యం చేయడం దిశగా తమ పరిశోధనలో తేలిన అంశాలు పరిశోధకులు సరికొత్త బాటను చూపుతాయని పరిశోధనకు నేతృత్వం వహించిన నార్త్‌వెస్ర్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రిచర్డ్ మరిమటో చెప్పారు. ప్రజలను దీర్ఘకాలం జీవించేలా చేసేందుకు ప్రయత్నించడం తమ లక్ష్యం కాదని, మానవ జీవన కాలానికి అనుగుణంగా ఆరోగ్యాన్ని అందించేందుకు అవసరమైన వ్యవస్థకు రూపకల్పన చేయడమేనని అన్నారు. -
వారం మధ్యలో బ్రేక్ ఇస్తే!
సాఫ్ట్వేర్ ఉద్యోగులకు అన్నిరకాలుగా ఒత్తిడి పెరిగిపోతోంది. వారాంతంలో ఇచ్చే రెండు రోజుల సెలవులు వెంటవెంటనే రావడంతో ఆ రెండు రోజులు ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నాయి. దీనికి తోడు రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్సులు.. ఇలా అన్నిచోట్లా ఆ రెండు రోజులు విపరీతమైన రద్దీ ఉంటోంది. దీనంతటికీ పరిష్కారంగా వారాంతంలో ఇచ్చే రెండు రోజుల సెలవును కొద్దిగా మార్చి, ఆదివారం ఒక రోజు.. వారం మధ్యలో మరో రోజు ఇస్తే ఎలా ఉంటుందని బెంగళూరులోని కొన్ని దిగ్గజ ఐటీ కంపెనీలు ఆలోచిస్తున్నాయి. ఈ విషయాన్ని అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) ఎంఏ సలీం కూడా నిర్ధరించారు. బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డు మీద ఉన్న మాన్యత టెక్ పార్కులోను, వైట్‌ఫీల్డ్, ఐటీబీపీ ప్రాంతాల్లో ఉన్న చాలా ఐటీ కంపెనీలు తమ సిబ్బందికి ఇచ్చే వారాంతపు సెలవుల పద్ధతిని మార్చేందుకు ఓకే అంటున్నాయని ఆయన చెప్పారు. ఇదే అన్ని రకాలుగా మంచిదని తాము కూడా చెబుతున్నామని, దానివల్ల రోడ్డు మీద ట్రాఫిక్ తగ్గడంతో పాటు, ఉద్యోగులకు కూడా ఒత్తిడి చాలావరకు తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఐదు రోజుల పాటు వరుసగా పనిచేయడం వల్ల ఉద్యోగులకు చాలా ఒత్తిడి ఉంటుందని, ఇంత ఎక్కువ స్థాయిలో ఒత్తిడి ఉండే ఉద్యోగాలలో వరుసగా పనిచేయించడం తమకూ అంత మంచిది కాదని, అదే మధ్యలో ఒకరోజు బ్రేక్ ఇస్తే.. వాల్లు మరింత ప్రశాంతంగా పని చేయగలుగుతున్నారని సీనియర్ హెచ్ఆర్ మేనేజర్ అనురాగ్ పటేల్ చెప్పారు. శుక్రవారం సాయంత్రానికి చాలావరకు ఉద్యోగులు విపరీతంగా ఒత్తిడికి గురై పబ్‌లకు వెళ్లిపోతున్నారని, ఈ ట్రెండు తగ్గాలంటే వారానికి రెండు రోజులు వరుసగా కాకుండా వేర్వేరుగా సెలవులు ఇవ్వడమే సరైన ఉపాయమని ఐటీ ఉద్యోగి అంకిత్ చెప్పాడు.