కోల్‌కతా : ‘ఉల్లిగడ్డ పొట్టును ఏం చేస్తారు అందరూ.? ఏముంది చెత్త డబ్బాలో వేస్తారు. కానీ వినూత్నంగా ఆలోచించిన ఐఐటీ ఖరగ్‌పూర్ శాస్త్రవేత్తలు అద్భుతం సృష్టించారు. ఉల్లిగడ్డ పొట్టుతో విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ఓ పరికరాన్ని రూపొందించారు. దీంతో ఒక ఉల్లిగడ్డ పొట్టుతోనే 12 గ్రీన్ ఎల్‌ఈడీ బల్బులు వెలుగుతాయంటా. అంతే కాకుండా 6 ఉల్లి గడ్డల పొట్టుతో ఏంచక్కా మోబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌లకు చార్జింగ్ పెట్టుకోవచ్చంటున్నారు.
ఐఐటీ ఖరగ్‌పూర్ ఫ్రోఫెసర్ భానుభూషణ్, పీహెచ్‌డీ స్కాలర్ సుమంతా కుమన్ కరణ్‌లు ఈ పరికారాన్ని రూపోందించారు. ఇటీవలె దక్షిణా కొరియాలోని పోహాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (పోస్ట్చెక్) శాస్త్రవేత్త జిన్ కోన్ కిమ్ ఆధ్వర్యంలో విజయవంతంగా ఈ పరికరాన్ని పరీక్షించినట్లు నానో ఎనర్జీ జర్నల్ ప్రచురించింది.
రెస్టారెంట్లలో పెద్ద ఎత్తున ఉల్లి పొట్టు వృథా అవుతుందని గుర్తించి ఈ ప్రయోగం ప్రారంభించామని ఫ్రోఫెసర్ భానుభూషణ్ తెలిపారు. టెక్నాలజీని అందిపుచ్చుకునే రెస్టారెంట్లకు ఈ పరికరం ఉపయోగపడుతుందన్నారు. హాఫ్ ఇంచ్ ఉల్లిపొరతో 20 వోల్టుల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చన్నారు. ఆరు ఉల్లిగడ్డల పొట్టుతో 80 ఎల్‌ఈడీ బల్బులను వెలిగించవచ్చని, లాప్‌టాప్, మొబైల్ ఫోన్‌లను కూడా చార్జ్ చేసుకోవచ్చన్నారు.
ఇక ఈ ప్రయోగం ప్రాథమిక దశలో ఉందని, దీన్ని అందరూ వినియోగించేలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. దీనికి నానోజెనరేటర్‌గా నామకరణం చేసినట్లు ఫ్రోఫెసర్ పేర్కొన్నారు. ఉల్లిగడ్డ పొట్టులోని పియోజ్ ఎలక్ట్రిక్ గుణాలతో ఇది పని చేస్తోందని, పియోజ్ ఎలక్ట్రిక్ పదార్థాలకు యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తి మార్చే శక్తి ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment