హోటల్లో అంట్లు కడిగాడు,ఆత్మహత్యాయత్నం..కట్‌ చేస్తే.. రూ 500 కోట్లు | Sabyasachi Mukherjee 25 years From Washing Dishes to Global Brand | Sakshi
Sakshi News home page

హోటల్లో అంట్లు కడిగాడు,ఆత్మహత్యాయత్నం..కట్‌ చేస్తే.. రూ 500 కోట్లు

Published Tue, Jan 28 2025 3:48 PM | Last Updated on Tue, Jan 28 2025 4:42 PM

Sabyasachi Mukherjee 25 years From Washing Dishes to Global Brand

ప్రముఖ ఫ్యాషన్  డిజైనర్‌  రిటైలర్, నగల డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా  టాప్‌ డిజైనర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే  ఆయన ఈసక్సెస్‌ అంత ఈజీగారాలేదు.  సామాన్య నేపథ్యంనుంచి వచ్చి గ్లోబల్‌ ఐకాన్‌గా ఎదగడానికి చాలా కష్టాలుపడాల్సి  వచ్చింది.  విపరీతమైన డిప్రెషన్‌, ఆత్మహత్యకు ప్రయత్నించాడు.  తన సోదరి నుంచి 20వేల  రూపాయల అప్పుగా తీసుకొని ప్రారంభించిన ప్రయాణం  పాతికేళ్ల తరువాత నేడు రూ. 500కోట్లకు  చేరింది. సబ్యసాచి అసలు ఎక్కడివాడు, ఆయన కరీర్‌ మొదలైన విషయాల గురించి తెలుసుకుందాం రండి!

సబ్యసాచి 1974లో ఒక మధ్యతరగతి బెంగాలీ కుటుంబంలో జన్మించాడు.తల్లిదండ్రులు బంగ్లాదేశీయులు. అతని తండ్రి బంగ్లాదేశ్ నుండి భారతదేశానికి శరణార్థిగా వలస వచ్చారు. తండ్రి ఉన్ని మిల్లులో ఉద్యోగం కోల్పోవడంతో కుటుంబం  కష్టాల్లో పడింది. అపుడు 15  ఏళ్ల వయస్సులో  గోవాకు పారిపోయాడు సబ్యసాచి.  అక్కడ వెయిటర్‌గా పనిచేశాడు ,గిన్నెలు కడిగాడు. అప్పుడే డిజైనర్ కావాలనే కల కన్నాడు. ఇందుకోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT)చదువు కోవాలనుకున్నాడు. కానీ అడ్మిషన్‌కు డబ్బులు లేవన్నారు. అయినా పట్టువీడలేదు. ఎలాగో అలా కష్టపడి అడ్మిషన్‌ తీసుకున్నాడు.  

1999లో అహ్మదాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఇండియాస్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుండి పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత కొన్ని నెలల తర్వాత కేవలం ముగ్గురు సిబ్బందితో  కోల్‌కతాలో  తొలి స్టూడియోను ప్రారంభించాడు. అలా తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించాడు. అదీ సోదరి దగ్గర 20 వేల రూపాయలను అప్పుగా తీసుకొని మరీ.   అలా ప్రస్థానం పాకిస్తాన్ ,యుఎఇ, ఇటలీ , దుబాయ్  ఫ్యాషన్‌ ప్రియులు ఇష్టపడే  తొలి భారత గ్లోబల్ బ్రాండ్‌ ప్రస్తానానికి  పునాది పడింది.  ఇక అప్పటినుంచి  అన్నీ అవార్డులు, రివార్డులు, ప్రశంసలే తప్ప వెనక్కి తీరిగి చూసింది లేదు.

రేయింబవళ్లు కష్టపడి 2002లో లక్మే ఫ్యాషన్ వీక్‌లో తన తొలి కలెక్షన్‌ను ప్రదర్శించి, ఫ్యాషన్ మాస్ట్రోగా మారారు సబ్యసాచి ముఖర్జీ.  సింగపూర్‌లో జరిగిన మెర్సిడెస్-బెంజ్ న్యూ ఆసియా ఫ్యాషన్ వీక్‌లో తొలి అంతర్జాతీయ అవార్డు (గ్రాండ్ విన్నర్ అవార్డు) గెలుచుకున్నాడు.

డిప్రెషన్‌, ఆత్మహత్యాయత్నం
తాను యుక్తవయసులో డిప్రెషన్‌కు గురయ్యానని, ఆత్మహత్య చేసుకునేందుకు కూడా ప్రయత్నించి విఫలమయ్యాడు.తీవ్రమైన నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యకు కూడా ప్రయత్నించానని ఒక సందర్భంగా సబ్యసాచి వెల్లడించాడు. “నేను నిరాశకు లోనయ్యాను మరియు ఆత్మహత్యకు ప్రయత్నించాను. నేను అపస్మారక స్థితిలో ఉన్నాను.  అమ్మ చెంపదెబ్బ కొట్టింది. జలుబు ఎంత సాధారణమో డిప్రెషన్ కూడా అంతే సాధారణం. మీరు డిప్రెషన్‌లో లేకుంటే, మీరు మామూలుగా లేరు అని అర్థం” అంటూ తన జర్నీని వివరించారు. అంతేకాదు తాను నిరాశను ఎదుర్కోకపోతే, ఫ్యాషన్ దిగ్గజంగా మారడానికి బదులుగా, వేరే కెరీర్ మార్గాన్ని అనుసరించేవాడినని పేర్కొన్నాడు. బహుశా శాన్ ఫ్రాన్సిస్కోలోని గూగుల్ వంటి కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడినని  చెప్పుకొచ్చాడు. 
 

చదవండి: పదేళ్ల తరువాత తొలిసారి : తన బాడీ చూసి మురిసిపోతున్న పాప్‌ సింగర్‌


సబ్యసాచి ముఖర్జీ కెరీర్ మైలు రాళ్లు

  • సబ్యసాచి ముఖర్జీ 2001లో ఫెమినా బ్రిటీష్ కౌన్సిల్ యొక్క మోస్ట్ ఔట్‌స్టాండింగ్ యంగ్ డిజైనర్ ఆఫ్ ఇండియా అవార్డు

  • అసాధారణ డిజైనర్ జార్జినా వాన్ ఎట్జ్‌డోర్ఫ్‌తో ఇంటర్న్‌షిప్ కోసం లండన్. 

  • 2002లో ఇండియన్ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్న తర్వాత చాలా మీడియా దృష్టిని ఆకర్షించారు. 

  • 2003లో  తొలి విదేశీ "గ్రాండ్ విన్నర్ అవార్డ్" గెలుచుకున్న తరువాత పారిస్‌లో జీన్-పాల్ గౌల్టియర్ , అజెడిన్ అలైతో వర్క్‌షాప్‌కు దారితీసింది.

  • 2004లో మయామి ఫ్యాషన్ వీక్‌లో ‘ ది ఫ్రాగ్ ప్రిన్సెస్  కలెక్షన్‌,’, భారతీయ వస్త్ర సౌందర్యం ప్రపంచానికి మరింత బాగా తెలిసి వచ్చింది.

  • బ్లాక్‌ సినిమాకు ఉత్తమ   కాస్ట్యూమ్‌  డిజైనర్‌గా జాతీయ అవార్డు

ప్రపంచవ్యాప్త గుర్తింపు
2005లో ది నాయర్ సిస్టర్స్‌ను ప్రారంభించాడు. హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్, ఎంబ్రాయిడరీలు, బగ్రూ లాంటి కలెప్రేరణ పొందిన వసంత-వేసవి సేకరణ. అతని క్రియేషన్స్ ప్రసిద్ధ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వార్షిక బ్లాక్-టై ఛారిటీ డిన్నర్ ఫ్యాషన్ షోలో ప్రదర్శించడానికి ఆహ్వానం

2006లో న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో సబ్యసాచి ప్రారంభ స్ప్రింగ్ సమ్మర్ కలెక్షన్ 07 విమర్శకుల ప్రశంసలు అందుకుంది. న్యూయార్క్, మిలన్ మరియు లండన్ అనే మూడు ప్రధాన ఫ్యాషన్ వారాల్లో పాల్గొన్న తొలి భారతీయ ఫ్యాషన్ డిజైనర్.

సబ్యసాచి న్యూయార్క్ ,లండన్ ఫ్యాషన్ వీక్స్, అలాగే బ్రైడల్ ఆసియా 2007, లాక్మే ఇండియా ఫ్యాషన్ వీక్ , 2007లో భారతదేశంలో జరిగిన వోగ్ లాంచ్‌లకు హాజరయ్యాడు. 

2008లో  నగల కలెక్షన్‌కూడా షురూ చేశాడు. GAJA బ్రాండ్ సహకారంతో  2016 వోగ్ వెడ్డింగ్ షోలో ప్రారంభమైంది. బాలీవుడ్ నటి నేహా ధూపియాతో 2012లో ఒక క్యాలెండర్‌ను రూపొందించారు,  ఆ తరువాతఫ్రెంచ్ లగ్జరీ పాదరక్షలు మరియు దుస్తులు డిజైనర్ క్రిస్టియన్ లౌబౌటిన్‌తో భాగస్వామిగా  పనిచేశాడు.

బ్రైడల్ కలెక్షన్‌తో పాపులర్‌
2007లో తన  తొలి బ్రైడల్ కలెక్షన్‌ను ఆవిష్కరించాడు,యు తన డిజైన్లతో వివాహ పరిశ్రమలో ఒక సంచలనం సృష్టించాడు. భారతీయ సంప్రదాయ వస్త్రాలు, చేనేత, చేతితో తయారు చేసిన తనదైన శైలితో   డిజైనర్‌ వెడ్డింగ్‌  దుస్తులకు పేరుగాంచాడు.
హై-ఎండ్ లగ్జరీ ఇండియన్ టెక్స్‌టైల్స్‌ను ఉపయోగించిన తొలివ్యక్గాపేరుతెచ్చకున్నాడు.  బంధాని, గోటా వర్క్, బ్లాక్-ప్రింటింగ్ , హ్యాండ్-డైయింగ్  లాంటి వర్క్స్‌తో  ట్రెండ్‌ క్రియేట్‌ చేశాడు.


బాలీవుడ్ సినిమాలకు
సబ్యసాచి సంజయ్ లీలా బన్సాలీ చిత్రం బ్లాక్‌కి కాస్ట్యూమ్ డిజైనర్‌గా అరంగేట్రం చేశారు.  2005లో ఒక ఫీచర్ ఫిల్మ్‌కి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా జాతీయ అవార్డుతో సహా చిత్రానికి చాలా ప్రశంసలు అందుకున్నాడు. బాబుల్,
లాగ చునారి మే దాగ్,రావణ్‌, గుజారిష్, పా,నో వన్‌ కిల్‌డ్‌ జెస్సికా,ఇంగ్లీష్ వింగ్లీష్,బ్లాక్‌ లాంటి  అనేక సినిమాలకు  కాస్ట్యూమ్‌ డిజైన్స్‌ అందించారు.

ప్రముఖుల వివాహాలు నటి విద్యాబాలన్ ,అనుష్క శర్మ , విరాట్ కోహ్లీ, దీపికా పదుకొణె, రణవీర్ సింగ్, నిక్ జోనాస్ , ప్రియాంక, అలియా పీవీ సింధు  వివాహ దుస్తులను సబ్యసాచి డిజైన్ చేశారు. ఇంకా శ్రీదేవి, కత్రినా కైఫ్, టబు, షబానా అజ్మీ, ఐశ్వర్య రాయ్ బచ్చన్,శ్రద్ధా కపూర్, సుస్మితా సేన్, కరీనా,  నీతా అంబానీ, శ్లోకా, ఇషా, రాధిక  అంబానీ  సహసబ్యసాచి సెలబ్రిటీ క్లయింట్లే కావడం విశేషం. 

25 సంవత్సరాల కృషి తర్వాత, సబ్యసాచి ముఖర్జీ బ్రాండ్‌ రూ. 500 కోట్ల విలువకు చేరింది. ఈ ఘనతను సాధించిన భారతదేశపు మొట్టమొదటి గ్లోబల్ బ్రాండ్‌గా  ఎదిగింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement