
ఎన్నో రకాల జ్యువెలరీలు చూసుంటారు. ఇలాంటి జ్యువెలరీని చూసే అవకాశమే లేదు. ముఖ్యంగా మహిళలు అందరికంటే విక్షణమైన డిజైన్‌తో కూడిన నగలు ధరించేందుకే ఇష్టపడతారు. చాక్లెట్‌లు, దీపావళి టపాసులతోటి విభిన్న అలంకరణాలు చూసుంటారు. ఇలా డ్రైఫ్రూట్స్‌తో జ్యువెలరీని మాత్రం చూసి ఉండరు. కానీ ఇది చూడటానికి అద్బుతంః అన్నంత రేంజ్‌లో ఉన్నాయి ఆ డ్రైఫ్రూట్ నగలు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది.
ఆ వీడియోలో మహిళ ధరించిన నగల్లో.. చెవికి పెట్టుకునే జుంకాల దగ్గర నుంచి వడ్డాణం వరకు అన్నింటిలో బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ కనిపిస్తాయి. జ్యువెలరీ కూడా భలే వెరైటీగా చూడముచ్చటగా ఉంది. కాకపోతే అమ్మో డ్రై ప్రూట్స్‌ని అలా వేస్ట్ అయిపోతున్నాయే! అని చివుక్కుమంటోంది మనసు. అయితే ఈ వీడియోని చూసిన నెటిజన్లు కూడా ఇలానే ఫీల్ అవ్వతూ.. సదరు మహిళపై మండిపడుతున్నారు.
ఆహారాన్ని వృధా చేస్తోదంటూ తిట్టిపోశారు. అయినా ఈ రోజుల్లో డ్రై ఫ్రూట్స్ బంగారంతో సమానం అలాంటి వాటిని ఇలా అలంకరణకు ఉపయోగిస్తావా? అంటూ తిట్ట దండకం మొదటు పెట్టారు. ఏదీఏమైనా వెరైటీగా ఉండేందుకుక ట్రై చేయడంలో తప్పులేదు. అయితే అది సమంజసంగా ఉందా లేదా అనేది కూడా చెక్ చేయాలి లేదంటే విమర్శల పాలవ్వక తప్పదు.
(చదవండి: పెళ్లిని ఇలా పర్వెక్ట్‌గా ప్లాన్‌తో చేస్తే..సూపర్‌గా ఉంటుంది!)
Comments
Please login to add a commentAdd a comment