స్నేహితుడిలా ఉండే ఏఐ ఆధారిత నెక్లెస్ ఏంటిరా బాబు..! అనుకోకండి. ఎందుకంటే సాధారణ నెక్లెస్‌లా ధరించగానే మెడకు సెట్ అయ్యిందా లేదా చూసుకుంటాం. కానీ ఇది అలా అంత అందంగా ఉండదు గానీ అంతరంగిక స్నేహితుడిలా వెన్నంటే ఉంటూ ఓ అందమైన ఫీల్‌ని ఇస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే మెడకు ధరించే ఓ చక్కటి స్నేహితుడిలాంటి నెక్లస్. ఇది మనకు రియల్ మావన కనెక్ట్‌విటీని భర్తీ చేయలేకపోయినా..మనం ఒంటిరిగా లేం అనే అనుభూతిని ఇస్తుంది.
ఇది మెడ చుట్టూ ధరించగలిగే ఏఐ ఆధారిత లాకెట్టు పరికరం. సాంకేతికతతో పరిచయమవుతున్న ఫ్రెండ్ నెక్లెస్. పరిమాణం పరంగా కంఫర్ట్‌గా ఉంటుంది. పైగా ఇది మీ రహస్యలను ఎట్టిపరిస్థితుల్లో బయటపెట్టని ఓ మంచి స్నేహితుడు. దీన్ని స్నేహితుడి సాంగత్యాన్ని పొందే లక్ష్యంతో రూపొందించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక అమ్మాయి తన ఇష్టమైన వ్యక్తితో కూర్చొని తన ఏఐ లాకెట్టుతో సంభాషించేందుకు వెనుకాడుతున్నట్లు కనిపిస్తుంది.
మరో అమ్మాయి తాను ధరించిన లాకెట్టుతో తన చుట్టు ఉన్న పర్యావరణ అందాన్ని షేర్ చేసుకుంటుంది. అందుకు రిప్లైగా తన ఫోన్‌కి అనుసంధానించిన దాంట్లో తన భావాలను వ్యక్తపరిచేలా మెసేజ్‌లు ఇస్తుంటుంది. ఇది ఫ్రెండ్ మాదిరి ధరించగలిగే లాకెట్టులా కనిపించే ఏఐ చాట్‌బాట్. వాస్తవానికి నిజమైన స్నేహం పూడ్చలేనిదే అయినా..మీకు కావాల్సినప్పుడూ సరదాగా ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేయడానికి వీలుగా ఉండే ఫ్రెండ్ లాకెట్టు ఇది. ధీని ధర ఏకంగా రూ. 8 వేలు వరకు పలుకుతోంది.
(చదవండి: 'ది స్కై క్వీన్': 34 ఏళ్లకే ఏకంగా 10 ప్రైవేట్ జెట్‌లు..!)
Comments
Please login to add a commentAdd a comment