‘త్వరలో బిగ్‌బాస్‌ 4 షూటింగ్‌లో పాల్గొంటా’ | Today Is My 31st Birthday Says Akkineni Nagarjuna | Sakshi
Sakshi News home page

ఇవాళ నా 31వ పుట్టిన రోజు: నాగ్‌ 

Published Sat, Aug 29 2020 5:21 PM | Last Updated on Sat, Aug 29 2020 5:56 PM

Today Is My 31st Birthday Says Akkineni Nagarjuna - Sakshi

టాలీవుడ్‌ మన్మథుడు, కింగ్‌ నాగార్జున‌ నేటితో 60 ఏళ్లు పూర్తిచేసుకుని 61వ పడిలోకి అడుగుపెట్టారు. నిన్నటినుంచే అభిమానులు, సినీ, రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఆయన ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ ‘‘అంతులేని ప్రేమ, అభిమానం చూపిస్తున్న సీనియర్‌, జూనియర్‌ అక్కినేని అభిమానులకు ధన్యవాదాలు. ఇండస్ట్రీ మిత్రులతో పాటు ఇతర మిత్రులందరికీ నా కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు. (నాగార్జున ఏం తింటున్నారో: వర్మ)

ట్విటర్‌లో ఓ వీడియోను కూడా ఆయన విడుదల చేశారు. ఆ వీడియోలో ‘‘ ఇవాళ నా 31వ పుట్టిన రోజు. నిన్నటి నుంచి చాలా మంది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రేమ, అభిమానంతో మెసేజ్‌లు చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. 5 నెలల తర్వాత పని చేయబోతున్నందుకు సంతోషంగా ఉంది. త్వరలో బిగ్‌బాస్‌ సీజన్‌ 4 షూటింగ్‌లో పాల్గొంటాను. బిగ్‌బాస్‌ సీజన్‌ 3ని విజయవంతం చేసినట్లే సీజన్‌ 4ను కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నా’’ నని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement