కింగ్‌ బర్త్‌డే: దేనికైనా అతనే బాస్‌.. | Tollywood actor nagarjuna Birthday Special Article | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 29 2020 9:59 AM | Last Updated on Sat, Aug 29 2020 12:41 PM

Tollywood actor nagarjuna Birthday Special Article - Sakshi

అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విభిన్నమైన చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు టాలీవుడ్‌ కింగ్‌ అక్కినేని నాగార్జున. ముఖ్యంగా అనేక ప్రేమ కథా చిత్రాల్లో నటించి యువతుల మనసులను కొల్లగొట్టారు. అమ్మాయిల గుండెల్లో నవ మన్మధుడిగా నిలిచిపోయారు. 34 ఏళ్లుగా టాలీవుడ్‌లో ఎన్నో మరుపురాని చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోగా పేరు తెచ్చకున్నారు. ‘క్లాస్ అయినా..మాస్‌ అయినా..భక్తి అయినా..రక్తి అయినా. అతనే బాస్’ అనేంతలా ఎదిగారు. వెండితెరపైనే కాకుండా బుల్లితెరలోనూ నాగార్జున తన సత్తా చాటుతున్నారు. మీలో ఎవరు కోటిశ్వరుడు, బిగ్ బాస్ వంటి షోలు ఆయనకి మంచి పేరును తీసుకువచ్చాయి. (టీవీల‌కు అతుక్కుపోయే టైమ్ వ‌చ్చేసింది)

టాలీవుడ్‌ కింగ్‌, మన్మధుడు అక్కినేని నాగార్జున ఈ రోజు పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ రోజుతో ఆయన 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని 61 వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ సందర్భంగా నాగ్‌కు అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు అక్కినేని కోడలు నాగ చైతన్య సతీమణి సమంత..తన మామకు బర్త్‌డే విషెస్‌ తెలిపారు. ‘కింగ్‌.. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తాను. గౌరవిస్తాను. చేతులు జోడించి మీకు పుట్టిన రోజున హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను.’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. (తొలిసారి ఆ ప్ర‌య‌త్నం చేసిన స‌మంత‌)

ఆగష్టు 29, 1959లో జన్మించిన నాగార్జున.. సుడిగుండాలు చిత్రం ద్వారా బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. 1984లో ప్రముఖ నిర్మాత రామానాయుడు కుమార్తె లక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి నాగచైతన్య అనే కుమారుడు ఉన్నాడు. ఆ తర్వాత 1986లో వచ్చిన విక్రమ్‌ సినిమాతో హీరోగా మారారు. అనంతరం శివ సినిమా చేసి హీరోగా మంచి పేరు సంపాదించారు. ఈ సినిమాతో రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకుడిగా పరిచయం అయ్యారు. 1990 మొదటిభార్యకు లక్ష్మికి విడాకులు ఇచ్చి, 1992లో అమలను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకి అఖిల్ జన్మించారు. ఆ తర్వాత నిన్నే పెళ్లాడతా, అన్నమయ్య, నిన్నే ప్రేమిస్తా, సంతోషం మన్మధుడు వంటి సినిమాలతో బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ను సంపాదించాడు. మొత్తం నాగార్జున ఇప్పటివరకు ఒక జాతీయ అవార్డు(అన్నమయ్య), 9 రాష్ట్ర నంది అవార్డులు మరియు 3 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకున్నాడు. ప్రస్తుతం టెలివిజన్‌ షో బిగ్‌బాస్‌ సీజన్‌ 4 కోసం సిద్ధమవుతున్నాడు. (అభిమానికి బ్రెయిన్ ట్యూమ‌ర్‌: చ‌లించిపోయిన నాగ్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement