నాగ్‌ బర్త్‌డే : ఫ్యాన్స్‌కు స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్ | Nagarjuna Wild Dog Movie New Poster Released | Sakshi
Sakshi News home page

నాగ్‌ బర్త్‌డే : ఫ్యాన్స్‌కు స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్

Published Sat, Aug 29 2020 12:29 PM | Last Updated on Sat, Aug 29 2020 1:49 PM

Nagarjuna Wild Dog Movie New Poster Released - Sakshi

ఆరు పదుల వయసులోనూ అమ్మాయిల మనసుల్ని కొల్లగొడుతున్న నవ మన్మథుడు నాగార్జున. ప్రస్తుతం ఆయన వయసు 60 ఏళ్లు దాటాయంటే నమ్మడం కష్టంగానే ఉంటుంది. నేటితో(ఆగస్ట్‌ 29) ఆయన 60 ఏళ్లు పూర్తి చేసుకొని 61 వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ సందర్భంగా నాగార్జునకి అభిమానులు, సెలబ్రిటీలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక నాగ్‌ బర్త్‌డే సందర్భంగా ఆయన నటిస్తున్న ‘వైల్డ్ డాగ్’ మూవీకి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పోస్ట‌ర్ అభిమానులని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.
(చదవండి : కింగ్‌ బర్త్‌డే: దేనికైనా అతనే బాస్‌..)

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఇప్పటి వరకు 12 మిషన్స్‌ను చేసినట్టు ఉంది. అతనికి సహాయకులుగా మరో ఐదుగురు అధికారులు నటిస్తున్నారు. అందులో ఓ లేడీ ఆఫీసర్ కూడా ఉంది. ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా నాగ్‌ లుక్‌ ఆసక్తిని కలిగిస్తోంది. మ్యాట్నీ ఎంటర్మమెంట్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రలో నాగార్జున డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకు అహిసార్ సాల్మన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తైన ఈ చిత్రంలో నాగార్జునకు జోడిగా దియా మీర్జా కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement