రెండో ఇన్నింగ్స్‌ సూపర్‌ | second innings Super | Sakshi
Sakshi News home page

రెండో ఇన్నింగ్స్‌ సూపర్‌

Published Fri, Jan 20 2017 11:49 PM | Last Updated on Tue, Sep 5 2017 1:42 AM

రెండో ఇన్నింగ్స్‌ సూపర్‌

రెండో ఇన్నింగ్స్‌ సూపర్‌

– కృష్ణ
‘నరేశ్‌ పలు విజయవంతమైన చిత్రాలతో పాటు హండ్రడ్‌ డేస్, సిల్వర్‌ జూబ్లీ చిత్రాల్లో నటించాడు. కొంత విరామం తర్వాత సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసి, వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తున్నాడు. తను మరిన్ని మంచి పాత్రలు పోషించి, ఇంకా పేరు తెచ్చుకోవాలి’’ అని సూపర్‌స్టార్‌ కృష్ణ అన్నారు. నటుడు నరేశ్‌ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం హైదరాబాద్‌లో జరిగాయి.

నటి, దర్శకురాలు విజయనిర్మల మాట్లాడుతూ– ‘‘దృశ్యం, గుంటూరు టాకీస్, అ..ఆ, శతమానం భవతి వంటి చిత్రాల్లో నరేశ్‌ మంచి పాత్రలు చేశాడు. తనను ఆశీర్వదించేందుకు ఎక్కడెక్కడి నుంచో అభిమానులు రావడం సంతోషంగా ఉంది’’ అని చెప్పారు. అనంతపురం కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. రాజేంద్రప్రసాద్,  శివాజీరాజా, గౌతంరాజు, జయసుధ, హేమ, బీఏ రాజు, వినాయకరావు, సురేశ్‌ కొండేటి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement