సీఎం వైఎస్‌ జగన్‌కు శుభాకాంక్షల వెల్లువ | CM YS Jagan Birthday Is On 21st December | Sakshi
Sakshi News home page

నేడు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు

Published Mon, Dec 21 2020 3:59 AM | Last Updated on Mon, Dec 21 2020 1:18 PM

CM YS Jagan Birthday Is On 21st December - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సీఎం జగన్‌ జన్మదినం పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు సోమవారం తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాల చేపట్టారు.  విప్లవాత్మక నిర్ణయాలు, చరిత్రాత్మక పథకాలతో అన్ని వర్గాల ప్రజల ఆదరణ చూరగొన్న సీఎం.. ఏడాదిన్నర కాలంలోనే 90 శాతం హామీలు నెరవేర్చిన విషయం తెలిసిందే.

గుడివాడ
సీఎం జగన్‌ పుట్టినరోజు సందర్భంగా మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో గుడివాడ వైఎస్సార్‌సీపీ  కార్యాలయంలో రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

తూర్పు గోదావరి‌‌
రాజానగరం నియోజకవర్గం దివాన్ చెరువు గ్రామంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో  సీఎం వైఎస్‌ జగన్‌ బర్త్‌డే సందర్భంగా భారీ రక్త దాన శిబిరం ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో రక్త  అభిమానులు, కార్యకర్తలు వితరణ చేస్తున్నారు.

శ్రీకాకుళం
పలాసలో సీఎం జగన్‌ జన్మదినం సందర్భంగా మత్స్యశాఖ మంత్రి డా. సిదిరి అప్పలరాజు రక్తదాన శిభిరాన్ని ప్రారంభించారు.

పశ్చిమ గోదావరి: 
ఏలూరు రూరల్ వైఎస్సార్ కాలనీలో  సీఎం జగన్‌ పుట్టిన రోజు సందర్బంగా  ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరాన్ని మంత్రి ఆళ్ల నాని ప్రారంభించారు. అనంతరం బర్త్‌డే కేక్‌ కట్ చేశారు.

అనంతపురం: 
సీఎం జగన్‌ జన్మదినం సందర్బంగా పెనుకొండ వైఎస్సార్‌ సర్కిల్‌లో మంత్రి శంకర్ నారాయణ కేక్ కట్ చేసిన అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

తూర్పు గోదావరి 
రాజమండ్రిలో వైఎస్సార్‌సీపీ నాయకుడు చందనా నాగేశ్వర్ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మార్గాని భరత్ పాల్గొని రక్త దానం చేశారు. పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు.

వైఎస్సార్
కడప నగరంలోని అపూర్వ కళ్యాణమాండపంలో సీఎం జగన్‌ బర్త్‌డే సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా భారీ కేక్ కట్ చేసశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

పశ్చిమ గోదావరి 
సీఎం జగన్‌ పుట్టినరోజు సందర్భంగా పెనుగొండ, ఆచంట మండలాల్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి చెరుకువాడ శ్రీ రంగనాధరాజు  పాల్గొన్నారు. పెనుగొండ గాంధీ బొమ్మల సెంటర్ లో కేక్ కట్‌ చేసి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం తూర్పు పాలెం క్యాంపు కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి  ప్రారంభించారు. అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌
రాయచోటి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఘనంగా సీఎం జగన్‌ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జకీయా ఖానం కేక్ కట్ చేశారు. పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రొద్దుటూరులో మెగా రక్త దానం శిబిరాన్ని ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్‌రెడ్డి ప్రారంభించారు. 

నెల్లూరు 
కావలి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సీఎం జగన్‌ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి  కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యకమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గుంటూరు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎం జగన్‌ జన్మదినం సందర్భంగా శాసనసభ్యులు కిలారి వెంకట రోశయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ బోనిగల వేణు ప్రసాద్, జిల్లా వ్యవసాయ సలహా మండలి డైరెక్టర్ వడ్రాణం ప్రసాదరావు, మహిళా మాజీ కౌన్సిలర్లు కార్యకర్తలు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి 
సీఎం జగన్‌ జన్మదినం సందర్భంగా ద్రాక్షరామ భీమేశ్వర ఆలయంలో మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామచంద్రపురంలో రక్తదాన శిబిరం చేపట్టారు.


తిరుపతిలోని ఎస్‌వీయూ యూనివర్సిటీలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి నేతలు సీఎం జగన్‌ పుట్టిన సందర్భంగా కేక్ కట్‌ చేసి, భారీ బైక్ ర్యాలీ చేపట్టారు.

చిత్తూరు: జననేత సీఎం జగన్‌ జన్మదినోత్సవ వేడుక సందర్భంగా తిరుపతి రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుమారుడు మోహిత్ రెడ్డి రక్తదానం చేశారు. పలువురు కార్యకర్తలు, అభిమానుల పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

కర్నూలు
కల్లూరు మండలంలోని రావూరి గార్డెన్స్‌లో సీఎం జగన్‌ పుట్టినరోజు సందర్భంగా అక్కిమి హనుమంతురెడ్డి, లక్ష్మీ కాంతరెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి  పాల్గొన్నారు. బర్త్ డే కేకును కట్ చేసి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సీఎం జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గుంటూరు
మాజేటి గురవయ్య హై స్కూల్‌లో ఎమ్మెల్యే మద్దాల గిరిధర్ ఆధ్వర్యంలో  సీఎం జగన్‌ పుట్టినరోజు  వేడుకలు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మేకతోటి సుచరిత మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

వైఎస్సార్
జమ్మలమడుగులో ఘనంగా సీఎం జగన్‌ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పేషెంట్లకు ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి పండ్లు, బ్రెడ్‌ పంపిణీ చేశారు. అదేవిధంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రంలో పెద్ద ఎత్తున నాయకులు పాల్గొన్నారు.

ప్రకాశం 
చీరాల మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్‌లో  సీఎం జగన్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. చీరాల నియోజకవర్గ వైసిపి పార్టీ ఇంచార్జ్ ఆమంచి కృష్ణమోహన్ బర్త్‌డే కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హైస్కూల్‌లో ఆమంచి కృష్ణమోహన్ మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. 

వైఎస్సార్‌:
మైదుకూరులో  సీఎం జగన్‌ జన్మదిన వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కేక్ కట్ చేశారు. ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు స్వీట్లు పంచి పెట్టారు. ఎమ్మెల్యేతో పాటు డీసీసీ బ్యాంక్‌ చైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

కృష్ణా
విజయవాడలోని వైఎస్సార్‌సీపీ నగర కార్యాలయంలో ఘనంగా సీఎం జగన్‌ జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో నగర అధ్యక్షులు బొప్పన భవకుమార్ పాల్గొని, కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా బొప్పన భవకుమార్ మాట్లాడుతూ.. సీఎం జగన్‌కి జన్మదిన శుభాకాంక్షలు తలిపారు. అంబేద్కర్, పూలే, మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్‌ సంక్షేమ పాలన అందిస్తున్నారని కొనియాడారు.

ప్రకాశం 
జిల్లాలోని దర్శి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఆధ్వర్యంలో సీఎం​ జగన్‌ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ ప్రారంభించారు. రాజంపల్లి నుండి దర్శి గడియారం స్తంభం సెంటర్ వరకు అభిమానలు, కార్యకర్తలు భారీ ర్యాలీ తీశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

పశ్చిమ గోదావరి 
జిల్లాలోని దెందులూరు మండలంలో సీఎం వైఎస్ జగన్ పుట్టిన సందర్భంగా నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే కొఠారి అబ్బాయి చౌదరి ఆధ్వర్యంలో ప్రతి మండలంలో ఒక చోట రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేసి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

►  భీమవరంలో సీఎం జగన్‌ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పంచారామ క్షేత్రంలో  సీఎం జగన్‌ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు ప్రార్థనలు చేశారు. రెడ్‌ క్రాస్ భవనంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. లెప్రసి వృద్ధులకు దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు.

► గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు సీఎం జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

► బుట్టాయిగూడెంలో ఎమ్మెల్యే తెల్లంబాలరాజు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించి,  నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు చేపట్టారు.

విశాఖపట్నం:
జిల్లాలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా భారీ ఎత్తున  వేడకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాసరావు, పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, విశాఖ ఈస్ట్ వెస్ట్ నార్త్ కన్వీనర్లు అక్రమాని విజయనిర్మల, మల్ల విజయప్రసాద్‌, కేకే రాజు, వైఎస్సార్‌సీపీ నాయకులు చొక్కాకుల వెంకట్రావు, అభిమనులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. సీఎం జగన్‌ ఏపీకి ఓ పెద్ద శక్తి అని, ఆ శక్తి ఇప్పుడు దేశానికి ఆదర్శంగా మారిందని కొనియాడారు. రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాసంకల్పయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని దార్శనికునిగా సీఎం జగన్‌ పాలన అందిస్తున్నారని గుర్తు చేశారు. గ్రామ స్వరాజ్యం ఆకాంక్షతోనే సచివాలయ వ్యవస్థ రూపకల్పన జరిగిందని పేర్కొన్నారు. రాబోయే 25 సంవత్సరాలు సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి  పాలన వుంటుందని తెలిపారు. ప్రతి కుటుంబంలో ఓ వ్యక్తి ప్రభుత్వ పథకం లబ్ధి పొందేలా సీఎం జగన్‌ పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. రక్తదానం ద్వారా విశాఖ నగరం ఏపీలో రికార్డు సృష్టించనుందన్నారు. వైఎస్సార్‌ క్రికెట్ కప్ ద్వారా యువతను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 

► ఆంధ్రా యూనివర్సిటీలో సీఎం జగన్‌ పుట్టిన రోజు పురస్కరించుకుని వైఎస్సార్‌ విగ్రహం ఎదుట వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కాంతారావు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థి సంఘాల నాయకులు క్రాంతి కిరణ్, మోహన్ బాబు, జోగరావు, ధీరజ్ పాల్గొన్నారు. పారిశుధ్య కార్మికులుకు  బియ్యం పంపిణీ చేశారు. 

తాడేపల్లి
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వేడకల్లో భాగంగా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, స్కిల్ డెవెలెప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి  రక్త దాన శిబిరాన్ని ప్రారంభించారు.

► సీఎం వైఎస్ జగన్ జన్మదినం సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా రక్తదానం కార్యక్రమాలను వైఎస్సార్‌సీపీ పార్టీ శ్రేణులు, అభిమానులు చేపట్టారు. కరోనా నేపథ్యంలో రక్తం యూనిట్ల కొరతను తీర్చేందుకు పెద్దఎత్తున అభిమానుల రక్తదానం చేశారు. ఏపీతో పాటు హైదరాబాద్, చెన్నై, పూణే, బెంగుళూరుల్లోనూ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో రక్తదానం చేస్తున్న సంఖ్యను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ రికార్డ్ చేస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఒకే సారి 10500 యూనిట్స్ రక్తదానం రికార్డ్‌గా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నమోదుతో ఆ రికార్డ్ అధిగమించే అవకాశం కనిపిస్తోంది. రక్తదానాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, స్కిల్ డెవెలెప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

పేదల అభ్యున్నతే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్న తమ అభిమాన నేత జన్మదినం సందర్భంగా పార్టీ నేతలు పలు కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. జననేత ప్రజా రంజక పాలన వల్ల ప్రజలు సుఖ శాంతులతో జీవిస్తున్నారని, కలకాలం ఈ పాలన కొనసాగాలని కాంక్షిస్తూ పూజలు చేశారు. అలాగే  రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు.

తూర్పు గోదావరిలో సర్వమత ప్రార్థనలు
తూర్పు గోదావరి: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడకలు జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. అయినవిల్లి విగ్నేశ్వర స్వామి ఆలయంలో సీఎం వైఎస్‌ జగన్ పేరిట ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వైఎస్‌ జగన్ పుట్టినరోజు వేడుకలను రాజోలు కోఆర్డినేటర్ పెద్దపాటి అమ్మాజీ ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు  హాజరయ్యారు. సీఎం జగన్‌కు మేలు జరగాలని కోరుతూ సర్వమత ప్రార్ధనలు చేశారు. పలు సాంస్కృతిక, సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

అనంతపురంలో ఘనంగా సీఎం జగన్‌ జన్మదిన వేడుకలు..
అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రె​డ్డి ‌జన్మదిన సందర్భంగా మడకశిర మసీదులో ముస్లింలు ప్రార్థన చేశారు. ఉరవకొండలో ఘనంగా సీఎం  జన్మదిన వేడుకలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

► ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలు అనంతపురం జిల్లాలో అత్యంత వైభవంగా జరిగాయి. సీఎం జగన్‌ బర్త్ డే సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలు నిర్వహించాయి. అనంతపురం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీ రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ శమంతకమణి కేక్ కట్ చేశారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అలాగే శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

పులివెందులతో సీఎం జగన్‌ జన్మదిన వేడుకలు..
వైఎస్సార్: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను పులివెందులలో ఘనంగా నిర్వహించారు. భాకరపురంలోని వైఎస్సార్ ఆడిటోరియంలో 48 కేజీల భారీ కేక్‌ను వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ అభిషేక్‌రెడ్డి కట్‌ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ మెగా రక్తదాన శిబిరాన్ని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రారంభించారు. సింహాద్రిపురం మండలం బలపనూరు గ్రామంలో పార్టీ నాయకుడు వెలుగోటి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను నాయకులు కట్‌ చేశారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎన్. శివప్రకాశ్ రెడ్డి 700 మంది డ్వాక్రా మహిళలకు చీరలు పంపిణీ చేశారు.

పులివెందులలోని బీసీ బాలికల హాస్టల్‌లో సీఎం వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా మాజీ మున్సిపల్‌ చైర్మన్ రుక్మిణీ దేవి కేక్‌ కట్‌ చేశారు. అనంతరం విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement