
42వ వసంతంలోకి..
శ్యాండల్‌వుడ్‌తో పాటు ‘ఈగ’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు సైతం పరిచయమైన ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్ 42వ
బెంగళూరు: శ్యాండల్‌వుడ్‌తో పాటు ‘ఈగ’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు సైతం పరిచయమైన ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్ 42వ వసంతంలోకి అడుగుపెట్టారు. జె.పి.నగర్‌లోని సుదీప్ నివాసంలో బుధవారం తెల్లవారుఝాము నుంచే సుదీప్ పుట్టినరోజు సంబరాలు అంబరాన్నంటాయి. దేశ వ్యాప్త బం ద్ కొనసాగుతున్నప్పటికీ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి సుదీప్ అభిమానులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకున్నారు. అభిమానులందరి మధ్య సుదీప్ తన పుట్టినరోజు సంబరాలు జరుపుకున్నారు.
అభిమానులు తీసుకొచ్చిన 42 కేజీల భారీ కేక్‌ను కత్తిరించి అభిమానులకు పంచిపెడుతూ అభిమానుల పలకరించారు. తన పుట్టినరోజు సందర్భంగా తరలివచ్చిన అభిమానులందరికీ సుదీప్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. స్పర్శ చిత్రంతో శాండల్‌వుడ్‌లోకి అడుగుపెట్టిన సుదీప్ కిచ్చ సినిమా విజయవంతం కావడంతో కిచ్చా సుదీప్‌గా ప్రఖ్యాతిగాంచారు. ఇక ఆయన నటించిన శాంతినివాస, కెంపేగౌడ, విష్ణువర్థన్ తదితర చి త్రాలు శాండల్‌వుడ్‌లో ఆయనకు స్టార్‌డమ్‌ను తీసుకొచ్చాయి.