సంగీతరావు! సినీ సంగీత ప్రియులందరికీ సుపరిచితులు. ఘంటసాల స్వరపరచిన ప్రతి చిత్రానికీ సంగీతరావు సహాయకులుగా పనిచేశారు. సంగీతం ఘంటసాల – సహాయకులు పట్రాయని సంగీతరావు అని సినిమా టైటిల్స్‌లో పడుతుంది. ఘంటసాల గురువు పట్రాయని సీతారామశాస్త్రి. ఆయనంటే ఘంటసాలకు అపారమైన గౌరవం. ఆ గౌరవమే సంగీతరావుతో సాన్నిహిత్యాన్ని ఏర్పరచింది.
1920 నవంబరు 2న జన్మించిన సంగీతరావు నిన్న (నవంబరు 2, 2019) నూరవ పుట్టినరోజు పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా చెన్నైలో ఘంటసాల సతీమణి సావిత్రమ్మ, పిల్లలతో కలిసి, సంగీతరావు ఇంటికి వచ్చి, శుభాకాంక్షలు, అభినందనలు తెలిపి వెళ్లారు. ఘంటసాల గతించి, 45 సంవత్సరాలు గడిచిపోయినా, ఈ రెండు కుటుంబాల మధ్య అనుబంధం కొనసాగుతూనే ఉందనడానికి ఈ సంఘటన ప్రత్యక్ష నిదర్శనం.
Comments
Please login to add a commentAdd a comment