savitramma
-
ఎన్ని తరాలు చూసినా కొత్తగా అనిపించే కల్ట్ క్లాసిక్ 'గుండమ్మ కథ'
ఏ సినీ ఇండస్ట్రీలోనైనా కొన్ని క్లాసిక్స్ ఉంటాయి. వాటిని ఎన్నిసార్లు, ఎన్ని తరాలు చూసినా కొత్త ఆవకాయలా ఘాటుగా, తియ్యటి బంగినపల్లి మామిడిలా ఉంటాయి. అలాంటి సినిమాల్లో ‘గుండమ్మ కథ’ ఒకటి. 1962 జూన్ 7న విడుదలైన ఇలాంటి సినిమా అసలు ఎవరు చూస్తారు? అన్న దగ్గర మొదలై... ఈ సినిమా చూడని వారు ఉన్నారా? అనేవరకూ వెళ్లింది. అలాంటి కల్ట్ క్లాసిక్ గురించి కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు... సావిత్రి, జమున వంటి హేమాహేమీలున్న సినిమాకు సూర్యకాంతం వంటి నటి టైటిల్ రోల్లో ‘గుండమ్మ కథ’ పేరు పెట్టడం అప్పట్లో పెద్ద సంచలనం. వాస్తవానికి గుండమ్మ పేరు మన తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కనిపించదు. ఇది కన్నడ పేరు. ‘పాతాళ భైరవి, మిస్సమ్మ, మాయా బజార్’ వంటి క్లాసిక్స్ తీసిన విజయా సంస్థ తొలిసారిగా రీమేక్ చేసిన సినిమా ‘గుండమ్మ కథ’. కన్నడంలో విఠలాచార్య తీసిన ‘మనె తుంబిద హెణ్ణు’ సినిమాకు రీమేక్ ఇది. ఇందులో ఓ ప్రధాన పాత్ర పేరు గుండమ్మ. ఆ పాత్రకు తెలుగులో ఏ పేరు పెట్టాలా? అని ఆలోచిస్తుండగా అదే పేరు ఉంచమని చక్రపాణి సలహా ఇచ్చారు. చివరకు దాన్నే సినిమా పేరుగా కూడా ఖాయం చేశారు. అలా సినిమాలో టాప్ స్టార్లున్నా ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పేరుపై టైటిల్ పెట్టడం విశేషం. ఈ ప్రాజెక్టును విజయా వారు చేయడానికి కారణం.. సినిమాను మద్రాసులోని నాగిరెడ్డి స్టూడియోలో తీస్తుండగా.. విఠలాచార్య ఆయన్నుంచి కొంత ఆర్థిక సహాయం పొందారు. దానికి కృతజ్ఞతగా రీమేక్ రైట్స్‌ను నాగిరెడ్డికి ఇచ్చారు విఠలాచార్య.కథేంటంటే...ఈ చిత్రకథ విషయానికొస్తే.. గుండుపోగుల వెంకట్రామయ్య రెండో భార్య సూర్యకాంతం. ఈమె తన సవతి కూతురు లక్ష్మి (సావిత్రి)ని పని మనిషిలా చూస్తూ ఇంటి చాకిరి మొత్తం చేయిస్తుంటుంది. తన కూతురు సరోజ (జమున)ను మాత్రం గారాభంగా పెంచుతుంది. వెంకట్రామయ్య బాల్య స్నేహితుడు ఎస్వీఆర్ ఇద్దరు కొడుకులు ఎన్టీఆర్ (అంజి), ఏఎన్నార్ (రాజా) ఆ ఇంట్లో చెరో దారిన ప్రవేశించి గుండమ్మ కూతుళ్లను పెళ్లి చేసుకుంటారు. తర్వాత గుండమ్మ కూతురు సరోజకు రెండో అల్లుడు రాజా ఎలా బుద్ధి చెప్పాడు? గుండమ్మ తన తప్పు ఎలా తెలుసుకుంది? అనేదే ‘గుండమ్మ కథ’ స్టోరీ.‘టేమింగ్ ఆఫ్ ది ష్రూ’ స్ఫూర్తితో...‘గుండమ్మ కథ’ను ముందుగా బీఎన్ రెడ్డి డైరక్షన్ లో తీద్దామనుకున్నారు. ఓ రీమేక్‌ను అంత పెద్ద దర్శకుడితో తీయిస్తే బాగుండదని పుల్లయ్యతో చేద్దామని చర్చించుకున్నారు. అయితే... నరసరాజు రాసిన డైలాగ్ వెర్షన్ ఆయనకు పంపితే ‘ఈ ట్రీట్మెంట్ నాకంత నచ్చలేదు’ అని పుల్లయ్య అన్నారట. దీంతో నాగిరెడ్డి రంగంలోకి దిగి కమలాకర కామేశ్వరరావుకు డైరక్షన్ అప్పగించారు. మరో విషయం ఏంటంటే... కామేశ్వరరావు అప్పటి వరకూ పౌరాణిక సినిమాలే తీశారు. ఈ సినిమాతో తొలిసారి ఓ సాంఘిక చిత్రానికి దర్శకత్వం వహించారు. కన్నడ సినిమాలో ఉన్న కొన్ని సీన్లు నచ్చని చక్రపాణి షేక్స్పియర్ రచన ‘టేమింగ్ ఆఫ్ ది ష్రూ’ నుంచి కొంత స్ఫూర్తి పొంది అచ్చ తెలుగు కథను సిద్ధం చేశారు.గుండమ్మగా ఆమే కరెక్ట్సినిమా కోసం ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి, జమున, ఎస్వీఆర్, రమణారెడ్డి వంటి వారంతా డేట్స్ ఇచ్చినా సినిమా మాత్రం మొదలు పెట్టలేదు. కారణం ‘గుండమ్మ’ పాత్ర ఎవరు చేయాలి అని. ఓ షూటింగ్లో సూర్యకాంతం మాట తీరు గమనించిన నాగిరెడ్డి ‘గుండమ్మ’ పాత్రకు ఆమైతేనే కరెక్ట్ అని భావించారు. ఇదే విషయాన్ని ఎన్టీఆర్‌తో ప్రస్తావిస్తే ఆయన వెంటనే ఓకే అనేశారట.గార్డెన్స్‌లోనే ప్రేమ యాత్రలకు బృందావనమూ...సినిమాలోని అన్ని పాటలను పింగళ నాగేంద్రరావు రాశారు. ఘంటసాల సంగీతం అందించారు. ప్రతీ పాట ఓ క్లాసిక్. ‘ప్రేమ యాత్రలకు బృందావనమూ...’ పాట వెనుక ఓ చిత్రమైన చర్చ జరిగింది. చక్రపాణితో రచయిత పింగళి నెక్ట్స్ డ్యూయెట్ ఎక్కడ తీస్తున్నారు? అని అడగ్గా... ఎక్కడో ఎందుకు? పాటలో దమ్ముంటే విజయా గార్డెన్స్‌లోనే చాలు... ఊటీ, కశ్మీర్, కొడైకెనాల్ ఎందుకు? అని అన్నారట. ఆయన మాటల్ని దృష్టిలో పెట్టుకుని, ‘ప్రేమ యాత్రలకు బృందావనమూ...’ పాట రాశారు పింగళి.ఇద్దరికీ నూరవ చిత్రమేహీరోలుగా ఎన్టీఆర్, ఏఎన్నార్లకు ఇది 100వ చిత్రం. అప్పటికి ఎన్టీఆర్ తెలుగులో రారాజు. అలాంటి వ్యక్తి అంజి పాత్ర ఒప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పైగా తనకు దీటుగా నటించే ఏఎన్నార్ ఈ సినిమాలో స్టైలిష్‌గా కనిపిస్తారు. ఎన్టీఆర్ మాత్రం సినిమాలో ఎక్కువ భాగం నిక్కర్‌తో కనిపిస్తారు. పైగా పిండి రుబ్బుతారు. నటనపై ఎన్టీఆర్‌కున్న నిబద్ధతకు ఈ సినిమా ఓ చిన్న ఉదాహరణ. ఈ సినిమాను తమిళంలో జెమినీ గణేషన్, ఏఎన్నార్లతో రీమేక్ చేశారు.ఫొటోలతో టైటిల్స్ఎన్టీఆర్, ఏయన్నార్ కలిసి నటించినప్పడల్లా ఓ సమస్య ఉండేది. స్క్రీన్ పై ముందు ఎవరి పేరు వేయాలి అని. ‘గుండమ్మ కథ’కూ అదే సమస్య వచ్చింది. దీనికి నాగిరెడ్డి ఓ ప్లాన్ ఆలోచించారు. స్క్రీన్‌పై అసలు పేర్లే వేయకుండా ఫొటోలు చూపించాలని డిసైడయ్యారు. అలా టైటిల్ తర్వాత ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి, జమున, ఎస్వీఆర్ ఫొటోలు పడతాయి. ఇలా హీరో పేర్లు కాకుండా ఫొటోలతో టైటిల్స్ వేయడం ఈ సినిమాతోనే మొదలైంది.‘గుండమ్మ కథ’ రీమేక్?ఎన్టీఆర్, ఏఎన్నార్ పలు చిత్రాల్లో నటించారు. వారి వారసులు బాలకృష్ణ, నాగార్జున కూడా ఓ సినిమాలో కలిసి నటించాలనుకున్నారు. కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు. తర్వాత వీళ్లిద్దరూ ‘గుండమ్మ కథ’ను రీమేక్ చేద్దామనుకున్నారు. అదీ వర్కౌట్ కాలేదు. మరి అక్కినేని, నందమూరి మూడో తరం వారసులైనా ‘గుండమ్మ కథ’ను చేస్తారేమో చూడాలి.– అలిపిరి సురేష్ -
నూరవ పుట్టిన రోజు
సంగీతరావు! సినీ సంగీత ప్రియులందరికీ సుపరిచితులు. ఘంటసాల స్వరపరచిన ప్రతి చిత్రానికీ సంగీతరావు సహాయకులుగా పనిచేశారు. సంగీతం ఘంటసాల – సహాయకులు పట్రాయని సంగీతరావు అని సినిమా టైటిల్స్‌లో పడుతుంది. ఘంటసాల గురువు పట్రాయని సీతారామశాస్త్రి. ఆయనంటే ఘంటసాలకు అపారమైన గౌరవం. ఆ గౌరవమే సంగీతరావుతో సాన్నిహిత్యాన్ని ఏర్పరచింది. 1920 నవంబరు 2న జన్మించిన సంగీతరావు నిన్న (నవంబరు 2, 2019) నూరవ పుట్టినరోజు పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా చెన్నైలో ఘంటసాల సతీమణి సావిత్రమ్మ, పిల్లలతో కలిసి, సంగీతరావు ఇంటికి వచ్చి, శుభాకాంక్షలు, అభినందనలు తెలిపి వెళ్లారు. ఘంటసాల గతించి, 45 సంవత్సరాలు గడిచిపోయినా, ఈ రెండు కుటుంబాల మధ్య అనుబంధం కొనసాగుతూనే ఉందనడానికి ఈ సంఘటన ప్రత్యక్ష నిదర్శనం. -
కనుమూరి రాజాబాబుకు జగన్ పరామర్శ
గన్నవరం : వైఎస్ఆర్ సీపీ నేతల కనుమూరి రాజాబాబు, శివాజీరాజాలను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఫోన్లో పరామర్శించారు. ఇటీవలే కనుమూరి రాజాబాబుకు మాతృవియోగం కలిగింది. ఈ సందర్భంగా సావిత్రమ్మ మృతిపట్ల వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
సావిత్రమ్మ.. నీకు సాటిలేరమ్మా..!
కేవలం తన కుటుంబం కోసమే ఆమె ఆలోచించి ఉంటే.. ఆమె ఈ రోజున ఒట్టి సావిత్రిగానే మిగిలేది. కానీ ఆమె ఆలా చేయలేదు. తాను పీకల్లోతు కష్టాల్లో ఉన్నా పక్కనున్న కార్మికుల కోసం ఆలోచించింది. కొన్ని పరిస్థితుల కారణంగా కుటుంబ బాధ్యతను స్వీకరించి, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ బతుకు పోరాటం సాగించింది. భర్త లేని సంసారాన్ని రెక్కల కష్టంపై మోస్తూనే.. సాటి కార్మికుల కోసం ఉద్యమాలు చేసింది. సాటి కార్మికుల బతుకుల్లో ‘చెమ్మ’చీకటిని పారద్రోలి వారి బతుకుల్లో వెలుగులు నింపింది. అందరికీ సావిత్రమ్మ అయ్యింది. ఆమే ఆకివీడుకు చెందిన కార్మికోద్యమ నాయకురాలు సావిత్రమ్మ. ఆమె జీవిత గాథ.. ఆమె మాటల్లోనే.. ఆకివీడు : నా పేరు సావిత్రి. కాని సావిత్రమ్మ అంటారు. 1944లో కృష్ణా జిల్లా తాడేపల్లి అనే చిన్న పల్లెలో పుట్టాను. మక్కా వెంకన్న, వరహాలమ్మ దంపతులకు జన్మించాను. 1965 దశకంలో వివాహమైంది. నా భర్త మారుబోయిన సాంబశివరావు విద్యుత్ శాఖలో లైన్మెన్గా పనిచేసేవారు. తిరుపతిలో విద్యుత్ స్తంభంపైకి ఎక్కి పని చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టి కిందకు పడిపోయారు. తలకు బలమైన గాయం అయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే కన్పించకుండా వెళ్లిపోయారు. అప్పటికి నేను గర్భవతిని. నేటికీ ఆయన తిరిగి రాలేదు. నా తండ్రి వెంకన్న రైల్వే డిపార్టుమెంట్లో చిరుద్యోగి. అల్లుడు కోసం ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ చేసి, కాళ్లు అరిగేలా తిరిగిన ఆయన అలసి సొలసిపోయారు. అల్లుడు కన్పించకపోవడం, చుట్టుపక్కలవారి సూటిపోటి మాటలు పడలేకపోయారు. అప్పుడే బతుకుపై భయమేసింది. చేతిలో చిల్లి గవ్వలేక తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. నాకు ప్రసవ సమయం దగ్గర పడింది. పండంటి బిడ్డ పుట్టాడు. పల్లెటూరులో జీవనం సాగించలేక, బతుకు తెరువు కోసం తల్లిని, తండ్రిని వెంటబెట్టుకుని చంకలో చంటి బిడ్డతో ఆకివీడు వచ్చాను. కన్నప్రేగు తడారకుండానే కార్మికురాలిగా.. నా... అన్న వారు లేకపోయినా, మానవత్వం నిండిన వారు ఉండకపోతారా అని వెతుక్కుంటూ వచ్చిన నన్ను ఆకివీడు ప్రజలు ఆదరించారు. కన్న ప్రేగు తడారకుండానే రైసుమిల్లులో కార్మికురాలిగా చేరాను. ధాన్యం, బియ్యం డబ్బాలను మోసి బతుకు బండిని గెంటుకువచ్చాను. రోజుకు రూ. 2.50 కూలితో ముగ్గురం బతుకుతూ, పిల్లవాడిని పెంచాం. తండ్రి వెంకన్న స్థానిక పెద్దల సహకారంతో రైస్‌మిల్లులో నైట్‌వాచ్‌మెన్‌గా చేరారు. రైస్ మిల్లు కార్మికురాలిగా పనిచేస్తూ, తోటి కార్మికులు పడుతున్న అవస్థల్ని చూడలేకపోయాను. ఇంట్లో పరిస్థితి అధ్వానంగా ఉన్నప్పటికీ తోటి కార్మికుల ఇబ్బందులను భుజాన వేసుకుంటూ పనిచేశాను. కార్మికులు పడుతున్న అవస్థలు, దోపిడీకి గురవుతున్నారని తెలుసుకుని వాటిని ఎదిరించాలని నిర్ణయించుకుని ముందుకు వెళ్లాను. ఆకలి బాధలు, కార్మికుల తిప్పలు కార్మికోద్యమ నేతగా నన్ను నిలబెట్టాయి. నా ఆవేదన, ఆలోచన, ఆక్రందనలను వింటున్న కార్మికోద్యమ నేత నంద్యాల సుబ్బారావు నేతృత్వంలో కార్మిక సంఘంలో చేరాను. రైస్‌మిల్లు కార్మికల సంఘం ఏర్పాటు చేసి వేతనాల కోసం, పని గంటల కోసం వీరోచితంగా పోరాడాను. కార్మికులకు ప్రత్యేక చట్టాలు, ప్రతి రెండేళ్లకు వేతనాలు, కూలీల «వేతనాల పెంపు, బోనస్‌లు, íపీఎఫ్‌లు, గ్రాట్యుటీ వంటి వాటిని కల్పించడంలో శక్తి వంచన లేకుండా కృషి చేశాను. నాటి వేతన ఒప్పందం నేటీకి అమలులోనే ఉంది. నాదారిలోనే నా కుమారుడు కార్మికురాలిగా పిల్లవాడ్ని చదివించడానికి డబ్బు సరిపోదని చిన్నపాటి హోటల్ పెట్టాను. చీటీలు కట్టించుకుని కార్మికులకు చేదోడు వాదోడుగా ఉంటూ కుమారుడ్ని బీఈడీ చేయించాను. అదే చీటీల వ్యాపారాన్ని వృద్ధి చేసిన కుమారుడు మారుబోయిన రమణ ఉద్యమాల్లో పాల్గొంటూ కార్మికులకు ఆసరాగా నిలబడ్డారు. నిజాయితీగా, నిబద్దతతో కార్మికులకు అండగా నిలుస్తున్న రమణను స్థానిక పెద్ద, కమ్యునిస్టువాది గాదిరాజు సుబ్బరాజు రమణకు లెనిన్ ఆశయాలున్నాయంటూ లెనిన్‌గా నామకరణం చేశారు. లెనిన్‌బాబుకు అరుణకుమారితో వివాహం చేశాను. లెనిన్ నేడు వ్యాపారం, రొయ్యల చెరువులు, ఐస్ ఫ్యాక్టరీని నడుపుతున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం పుట్టుకతో రావడంతో నేటికీ కార్మిక ఉద్యమాల్లోనూ, కార్మికుల బాధల్లో పాలుపంచుకుంటూ జీవనం గడుపుతున్నాం. ప్రజాసమస్యల పరిష్కార వేదికనయ్యాను కార్మికుల సమస్యల నుంచి ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికనయ్యాను. 1980 ప్రాంతం నుండే వితంతువులకు, వికలాంగులకు, వృద్ధులకు పింఛన్ల కోసం పోరాటాలు చేశాను. ప్రజల సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సామరస్యంగా పరిష్కరించా. మహిళా సంఘాలు ఏర్పాటు చేసి వారిలో చైతన్యం తీసుకువచ్చాను. నేడు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు భయంకరంగా ఉంటున్నాయి. చిన్న పిల్లలు గ్రామాల్లో కూడా తిరగలేని పరిస్థితి నెలకొంది. మేధస్సు పెరిగినా మానవత్వం విలువలు చనిపోతున్నాయి. చంద్ర మండలంలో కాపురం ఉండేందుకు మేధస్సు ఉపయోగపడుతున్నా భూమండలంలో వికృత చేష్టలు పాతాళానికి తీసుకు వెళ్తున్నాయి. జనాభాలో సగంకు పైగా ఉన్న మహిళలకు స్వేచ్ఛ ఎప్పుడు వస్తుందనేది నా బాధ. అణచివేతపై మహిళలు తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని.. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఏనాడూ ఎదురు చూడలేదు. ఎదురు చూసి ఉంటే ఈనాడు ఇలా ఉండేదాన్ని కాదు. కొడుకు కోడలుతో పాటు మనవరాళ్లతో ఆనందమయమైన జీవనం గడుపుతున్నాను. -
వృద్ధురాలిపై పేపర్ బోయ్ హత్యాయత్నం
వైఎస్సార్ జిల్లా: పొద్దున్నే పేపర్ వేయటానికి వచ్చిన ఓ యువకుడు ఒంటరిగా ఉన్న మహిళను దోచుకుని, చంపేందుకు యత్నించాడు. వైఎస్సార్ జిల్లా పొద్దుటూరు పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక రెండు కుళాయిల వీధిలో ఉండే సుబ్బయ్య ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగి. ఆయన శనివారం ఉదయం మార్నింగ్ వాక్కు వెళ్లగా భార్య సావిత్రమ్మ ఒంటరిగా ఉంది. అదే సమయంలో వచ్చిన పేపర్ బాయ్ డోర్ కాలింగ్ బెల్ కొట్టాడు. తలుపు తెరిచిన సావిత్రమ్మను బెదిరించి ఇంట్లోకి ప్రవేశించాడు. భయకంపితురాలైన సావిత్రమ్మ గట్టిగా కేకలు వేసింది. అయితే, వెంట తెచ్చుకున్న కత్తితో సావిత్రమ్మను పొడిచి, ఇంట్లోని బీరువాలో ఉన్న రూ.10వేల నగదును తీసుకున్నాడు. అనంతరం ఆమెను ఓ గదిలో బంధించి చంపుతానంటూ వంట గదిలో ఉన్న గ్యాస్ సిలిండర్‌ను అక్కడికి తీసుకువచ్చాడు. అయితే, గ్యాస్ లీక్ చేసి నిప్పుపెట్టేందుకు అవసరమైన అగ్గి పెట్టె దొరకలేదు. దీంతో సావిత్రమ్మను గది నుంచి వెలుపలికి తీసుకువచ్చి అగ్గిపెట్టె ఎక్కడుందో వెతకమని బెదిరించాడు. ఈ లోగా చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. ప్రమాదం గ్రహించిన ఆగంతకుడు అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. -
కత్తులతో పొడిచి మహిళ దారుణ హత్య
మోత్కూరు: నల్గొండ జిల్లా మోత్కూరు మండలం తాటిమట్ల గ్రామంలో పట్నూరు సావిత్రమ్మ(48) అనే మహిళ బుధవారం ఉదయం దారుణ హత్యకు గురైంది. భర్త నుంచి విడిపోయి సావిత్రమ్మ కొంతకాలం నుంచి ఒంటరిగా ఉంటోంది. గుర్తుతెలియని దుండగులు బుధవారం వేకువజామున ఆమె ఇంట్లోకి ప్రవేశించి కత్తులతో పొడిచి హత్యచేశారు. నగలు, డబ్బు కోసం ఈ దారుణానికి పాల్పడ్డారా?. లేక పాత కక్షలేమైనా ఉన్నాయా? అనేది తేలాల్సి ఉంది. సావిత్రమ్మ విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంట్లో ఆమె తప్ప ఎవరూ లేకపోవడంతో పూర్తి వివరాలు తెలియరాలేదు. -
వడదెబ్బతో గొర్రెల కాపరి మృతి
గొర్రెలకు కాపలాగా వెళ్లిన ఓ మహిళ వడదెబ్బకు గురై మృతి చెందింది. వైఎస్సార్ జిల్లా వీరబల్లి మండలం వంగిమళ్ల పంచాయతీ పొలిమేరపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓరంపాటి సావిత్రమ్మ(52) మంగళవారం గొర్రెలను తోలుకుని పొలానికి వెళ్లింది. ఎండతీవ్రతకు అస్వస్థతకు గురైన ఆమెను సాయంత్రం కుటుంబసభ్యులు రాయచోటి ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయింది. -
కొడుకుతో కలిసి భర్తకు నిప్పు పెట్టింది...
రంగారెడ్డి జిల్లా యాలాల మండలం అక్కంపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి 12 గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న రాములు(60) అనే వృద్ధుడిపై అతని భార్య సావిత్రమ్మ, కుమారుడు ఆంజేయులు కలిసి కిరోసిన్ పోసి నిప్పంటించారు. తీవ్రగాయాలపాలైన రాములు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సావిత్రమ్మను, ఆంజనేయులను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా.. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి
చివ్వెమ్ల మండలం ఐలాపురం వద్ద ఆదివారం సాయంత్రం ట్రాక్టర్ రోడ్డు దాటుతున్న ఓ మహిళను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన సావిత్రమ్మ(45) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
'ప్రభుత్వం నుంచి నాకు ఏ ఆదేశాలు రాలేదు'
కాకినాడ : డీఎం అండ్ హెచ్ఓ గా డాక్టర్ పవన్‌కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. పుష్కర విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఇప్పటివరకు ఆ హోదాలో ఉన్న సావిత్రమ్మను తూర్పు గోదావరి కలెక్టర్ ప్రభుత్వానికి సరెండర్ చేసిన విషయం తెలిసిందే. కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆమె బాధ్యతలు కొనసాగిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం డీఎం అండ్ హెచ్ఓ కార్యాలయానికి వెళ్లి సావిత్రమ్మ కూర్చోవడంతో ఈ వివాదం మొదలైనట్లు కనిపిస్తోంది. ఈ విషయంపై మీడియా ఆమెను సంప్రదించగా... ప్రభుత్వం నుంచి తనకు ఎటువంటి ఆదేశాలు రాలేదని సావిత్రమ్మ స్పష్టంచేశారు. -
కొత్తపల్లి ఎంపీపీ పీఠం వైఎస్సార్సీపీదే
ఆత్మకూరు/కొత్తపల్లి: కర్నూలు జిల్లా కొత్తపల్లి మండల ఎంపీపీ పీఠం ఎట్టకేలకు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 4న ఎంపీపీ ఎన్నికలు నిర్వహించగా.. కొత్తపల్లి మండలంలో సభ్యులు హాజరు కాకపోవడంతో వాయిదా వేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారి శోభారాణి ఆధ్వర్యంలో తిరిగి ఎన్నిక నిర్వహించారు. మొత్తం 9 ఎంపీటీసీ స్థానాల్లో ఆరు వైఎస్ఆర్సీపీ, మూడు టీడీపీ కైవసం చేసుకున్నాయి. మొదట కో ఆప్షన్ సభ్యుడి ఎంపిక చేపట్టగా.. వైఎస్ఆర్సీపీ తరఫున ముసలమడుగు గ్రామానికి చెందిన మూసా కరిముల్లాతో నామినేషన్ వేయించారు. టీడీపీ తరఫున ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎంపికైనట్లు అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం ఎంపీపీ సమావేశ హాలులో వైఎస్ఆర్సీపీ, టీడీపీ ఎంపీటీసీలచే ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఎంపీపీ ఎన్నిక ప్రారంభమైంది. దుద్యాల ఎంపీటీసీ-2 స్థానంలో గెలుపొందిన సావిత్రమ్మను వైఎస్ఆర్సీపీ తరఫున ప్రతిపాదించగా గువ్వలకుంట్ల ఎంపీటీసీ సభ్యురాలు రవణమ్మ బలపర్చారు. వైఎస్ఆర్సీపీకి చెందిన 8 మంది ఎంపీటీసీ సభ్యులు ఆమెకు మద్దతుగా చేతులు ఎత్తడంతో సావిత్రమ్మ ఎంపీపీగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించి ప్రమాణస్వీకారం చేయించారు. వైస్ ఎంపీపీగా ఎర్రమఠం ఎంపీటీసీ సభ్యుడు ఎస్.మహబూబ్‌బాషా ఎన్నికయ్యారు. డీఎస్పీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటైంది. ఫలించిన ఎమ్మెల్యే వ్యూహం- టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డికి చుక్కెదురు నందికొట్కూరు: కొత్తపల్లి ఎంపీపీ పీఠం వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునేందుకు ఎమ్మెల్యే ఐజయ్య రచించిన వ్యూహం ఫలించింది. మండలంలోని తొమ్మిది ఎంపీటీసీ స్థానాల్లో ఆరింటిని వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. అయితే ఇటీవల వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలో చేరిన మాండ శివానందరెడ్డి కొత్తపల్లి మండల ఎంపీపీ పీఠం ఆ పార్టీ ఖాతాలో జమ చేసేందుకు సర్వశక్తులు ఒడ్డారు. ఆయన ఎత్తులను ఎమ్మెల్యే ఐజయ్య చిత్తు చేశారు. ఎంపీపీ పీఠం విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తనదైన శైలిలో తెరదించారు. టీడీపీ శ్రేణులు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఎంపీటీసీ సభ్యులు తాము వైఎస్ఆర్సీపీని వీడేది లేదని తేల్చి చెప్పడం విశేషం.