గొర్రెలకు కాపలాగా వెళ్లిన ఓ మహిళ వడదెబ్బకు గురై మృతి చెందింది.
గొర్రెలకు కాపలాగా వెళ్లిన ఓ మహిళ వడదెబ్బకు గురై మృతి చెందింది. వైఎస్సార్ జిల్లా వీరబల్లి మండలం వంగిమళ్ల పంచాయతీ పొలిమేరపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓరంపాటి సావిత్రమ్మ(52) మంగళవారం గొర్రెలను తోలుకుని పొలానికి వెళ్లింది. ఎండతీవ్రతకు అస్వస్థతకు గురైన ఆమెను సాయంత్రం కుటుంబసభ్యులు రాయచోటి ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయింది.