బర్త్‌డే కేక్‌ కట్‌ చేశాడు.. అందరూ కటకటాల పాలయ్యారు | Chennai: Six Youths Arrested Birthday Cake Cut With Machete | Sakshi
Sakshi News home page

కేక్‌ కట్‌ చేశాడు.. మిత్రులతో సహా జైలు పాలయ్యాడు

Published Wed, Jun 9 2021 7:37 PM | Last Updated on Wed, Jun 9 2021 8:26 PM

Chennai: Six Youths Arrested Birthday Cake Cut With Machete - Sakshi

చెన్నై: పుట్టిన రోజు సందర్భంగా కేక్‌ కట్‌ చేసినందుకు ఆరుగురు యువకులు కటకటాల పాలయ్యారు. ఈ వింత ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. గ‌త ఆదివారం రోజు సునిల్ అనే యువ‌కుడి తన పుట్టిన రోజు వేడుకను జరుపుకున్నాడు. చెన్నైలోని క‌న్నాగి న‌గ‌ర్ హౌజింగ్ బోర్డు క్వార్ట‌ర్స్‌లో ఈ సంబ‌రాలు జ‌రిగాయి. ఆ రోజు మిత్రులు కేక్‌ ఆర్డర్‌ చేసి తెప్పించారు.

అంతవరకు బాగానే ఉంది కానీ ఆ యువకుడు కేక్‌ను కట్‌ చేయడానికి సాధారణంగా పుట్టిన రోజు నాడు కట్‌చేసే చాక్‌, కత్తి లాంటిది కాకుండా ఓ పొడవాటి కత్తితో కేక్‌ను కట్‌ చేశాడు. అందులోను ఆ కత్తి చూడటానికి ప్రమాదకరమైన ఆయుధంలా ఉంది. వారు ఈ సంబరాలను వీడియో తీసి సోషల్‌ మీడియాలో కూడా పోస్ట్‌ చేశారు. ఈ నేప‌థ్యంలో ఆ యువ‌కుల‌పై కేసు న‌మోదు అయ్యింది. అయితే ఓ ఫిర్యాదు ఆధారంగా వారిపై కేసు బుక్ చేశామని పోలీసులు తెలిపారు. ప్ర‌మాద‌క‌ర‌మైన ఆయుధం క‌లిగి ఉన్న కోణంలో యువ‌కుల‌పై కేసు ఫైల్ చేశామన్నారు. వాళ్లు వేడుకలు జరుపుకుంటున్న స‌మ‌యంలో పెద్దగా మ్యూజిక్ వింటూ చుట్టు పక్కల ప్రజలకు న్యూసెన్స్ క్రియేట్ చేసిన‌ట్లు ఫిర్యాదులు కూడా అందినట్లు తెలిపారు. 

చదవండి: కోడలిని 80 వేలకు అమ్మేసిన మామ, కొడుకుకు తెలిసి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement