Machete
-
పాఠశాలకు కొడవలితో వస్తున్న ప్రధానోపాధ్యాయుడు
అస్సాంలోని ఒక ప్రాథమిక పాఠశాల హెడ్ మాష్టారు కొడవలితో రావడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదీగాక ఈ ఘటన గురించి పోలీసులుకు పలు కాల్స్ వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు హెడ్ మాష్టారుని ధృతిమేధ దాస్‌గా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. దాస్ ఆయుధాన్ని దాచేందుకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. తాము ఆ పాఠశాలకు వెళ్లినప్పుడూ ఇతర టీచర్లు, పిల్లలు భయపడుతున్నట్లు గమనించామన్నారు. ఐతే సదరు హెడ్ మాష్టారు దాస్ ఇతర టీచర్లు విధులు సరిగా నిర్వర్తించకపోవడంతో కాస్త అసహనానికి గురై కోపంగా ఉన్నట్లు కాచర్ జిల్లా పాఠశాలల డిప్యూటీ ఇన్స్పెక్టర్ పర్వేజ్ హజారీ తెలిపారు. అదీగాక ఆ పాఠశాలలో ఏకంగా 13 మంది ఉపాధ్యాయులు ఉన్నారని, అక్కడ ఏడుగురు ఉపాధ్యాయులు మాత్రమే అవసరమని చెప్పారు. క్రమశిక్షణ కోసం దాస్ ఇలా ప్రవర్తించినట్లు హజరీ పేర్కొన్నారు. ఐతే హెడ్ మాష్టార్ దాస్‌పై ఇతర టీచర్లు, విద్యాశాఖ గానీ అధికారికంగా ఫిర్యాదు చేయలేదు. ప్రస్తుతం అతన్ని తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. ఐతే పోలీసులు అతని వద్ద నుంచి రెండు నోట్లు లభించాయి. వాటిలో తనకేదైనా జరిగితే ఆ నలుగురు టీచర్లే కారణమని, మరోక నోట్లో తాను ముగ్గురు టీచర్లను చంపాలనుకున్నట్లు రాశాడని తెలిపారు. (చదవండి: యాక్సిడెంట్‌గా చిత్రీకరించి మర్డర్‌కి ప్లాన్! మాజీ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ మృతి) -
వాటే ఏ పోలీస్! ఏం చేసావయ్యా.. హీరో మాదిరి...
సినిమాల్లో హీరో పై విలన్ దాడి చేస్తున్న సీన్లు చూస్తుంటాం. అందులో విలన్ చేతిలో పెద్ద ఆయుధం ఉండి, హీరో వద్ద ఏ ఆయుధం లేకపోయిన ధైర్యంగా ఫైట్ చేస్తుంటాడు. అబ్బా గ్రేట్ అని మురిసిపోతుంటాం. నిజజీవితంలో అలా ఫైట్ చేయటానికి చాలా గట్స్ ఉండాలి. కానీ ఇక్కడోక పోలీసు మాత్రం అచ్చం హీరో మాదిరి ఫైట్ చేశాడు. వివరాల్లోకెళ్తే...కేరళలోని ఒక రహదారిపై పోలీసు వాహనం ఒకవైపు ఆగుతుంది. ఇంతలో డోర్ ఓపెన్ చేసుకుని అధికారి దిగుతుంటాడు. అంతే ఇంతలో అక్కడే ఉన్న ఒక వ్యక్తి పెద్ద కొడవలితో దాడి చేస్తాడు. దీంతో సదరు పోలీసు అధికారి ఆయుధం లేకపోయినా ఏ మాత్రం భయపడకుండా అతన్ని ఎదుర్కొంటాడు. చివరికి ఆ వ్యక్తిని కిందపడేసి అతని చేతిలోంచి ఆయుధాన్ని లాక్కుంటాడు. అంతేకాదు అక్కడే ఉన్న కొంతమంది కూడా ఆ అధికారికి సాయం చేస్తారు. ఐతే ఆ అధికారి అలప్పజ నూరనాడ్ పోలీస్టేషన్లో పనిచేస్తున్నా సబ్ ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్‌గా గుర్తించారు. ఈ ఘటన పారాజంక్షన్ సమీపంలో చోటు చేసుకుంది. ఆ వ్యక్తి దాడి కారణంగా అధికారి చేతికి గాయమవ్వడంతో ఏడు కుట్లు కూడా పడ్డాయి. కొడవలితో దాడి చేసిన వ్యక్తి సుగతన్గా గుర్తించారు. ఈ వీడియోని పోలీస్ సర్వీస్ అధికారి స్వాతి లక్రా ట్విట్టర్లో 'అసలైన హీరో ఇలా ఉంటాడు' అనే క్యాప్షన్‌ని జోడించి మరీ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. How a real #hero looks like…👨🏽✈️💪🏽 Kudos to this Sub Inspector of Police from Kerala @TheKeralaPolice pic.twitter.com/UZfX5Wya7J — Swati Lakra (@SwatiLakra_IPS) June 19, 2022 (చదవండి: షాకింగ్ వీడియో.. మ్యాన్‌హోల్‌లో పడిపోయిన జంట.. ఆ తర్వాత..) -
బర్త్‌డే కేక్ కట్ చేశాడు.. అందరూ కటకటాల పాలయ్యారు
చెన్నై: పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసినందుకు ఆరుగురు యువకులు కటకటాల పాలయ్యారు. ఈ వింత ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. గత ఆదివారం రోజు సునిల్ అనే యువకుడి తన పుట్టిన రోజు వేడుకను జరుపుకున్నాడు. చెన్నైలోని కన్నాగి నగర్ హౌజింగ్ బోర్డు క్వార్టర్స్‌లో ఈ సంబరాలు జరిగాయి. ఆ రోజు మిత్రులు కేక్ ఆర్డర్ చేసి తెప్పించారు. అంతవరకు బాగానే ఉంది కానీ ఆ యువకుడు కేక్‌ను కట్ చేయడానికి సాధారణంగా పుట్టిన రోజు నాడు కట్‌చేసే చాక్, కత్తి లాంటిది కాకుండా ఓ పొడవాటి కత్తితో కేక్‌ను కట్ చేశాడు. అందులోను ఆ కత్తి చూడటానికి ప్రమాదకరమైన ఆయుధంలా ఉంది. వారు ఈ సంబరాలను వీడియో తీసి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ యువకులపై కేసు నమోదు అయ్యింది. అయితే ఓ ఫిర్యాదు ఆధారంగా వారిపై కేసు బుక్ చేశామని పోలీసులు తెలిపారు. ప్రమాదకరమైన ఆయుధం కలిగి ఉన్న కోణంలో యువకులపై కేసు ఫైల్ చేశామన్నారు. వాళ్లు వేడుకలు జరుపుకుంటున్న సమయంలో పెద్దగా మ్యూజిక్ వింటూ చుట్టు పక్కల ప్రజలకు న్యూసెన్స్ క్రియేట్ చేసినట్లు ఫిర్యాదులు కూడా అందినట్లు తెలిపారు. చదవండి: కోడలిని 80 వేలకు అమ్మేసిన మామ, కొడుకుకు తెలిసి.. -
తుపాకులతో కాల్చి..ఆపై కత్తులతో నరికి..
భీవండి(ముంబై): ముంబై శివారు ప్రాంతంలో కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురయ్యారు. అత్యంత పాశవికంగా జరిగిన ఈ హత్యకు సంబంధించి వీడియో ఫుటేజీ మహారాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేపింది. వివరాలు.. కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పోరేటర్ మనోజ్ మెహట్రె(53) మంగళవారం ప్రెస్ కాన్ఫరెన్స్ ముంగించుకొని రాత్రి 9:30 గంటలకు ఓస్వల్వాడీలోని తన ఇంటికి వచ్చారు. కారును పార్క్ చేసి ఇంట్లోకి ప్రవేశిస్తుండగా ఇద్దరు దుండగులు మొదట అతనిపై కాల్పులు జరిపారు. దీంతో మనోజ్ అక్కడే కుప్పకూలిపోయాడు. అంతటితో ఆగకుండా దుండగులు కిందపడ్డ మనోజ్‌పై కత్తులతో ఇష్టానుసారంగా దాడికి దిగారు. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీ కెమెరాకు చిక్కింది. ఎప్పుడూ అత్యంత రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో నిందితులు మనోజ్‌పై దాడి చేసి అక్కడి నుంచి సులభంగా తప్పించుకున్నారు. తీవ్రగాయాలైన మనోజ్‌ను ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు ముగ్గురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. భీవండి-నిజాంపుర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు వచ్చే మే లో ఎన్నికలు జరుగనున్నాయి. -
ప్రియురాలిని చంపి కత్తి అమ్మకానికి పెట్టాడు
సాన్ డియాగో: తన ప్రియురాలిని కత్తితో కిరాతకంగా చంపి.. ఆ కత్తి గురించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడో ప్రబుద్ధుడు. 'ఒకరిని ముక్కలు ముక్కలుగా చేసేందుకు ఒక్కసారి మాత్రమే ఈ కత్తిని ఉపయోగించాను. ఇది ఇప్పటికీ కొత్తదే. దీనిని ఎవరైనా కొంటారా?' అంటూ ఫేస్బుక్లో పోస్టు పెట్టాడు. ఈ మేరకు తన గర్ల్‌ఫ్రెండ్‌ను అతి కిరాతకంగా హతమార్చిన 40 ఏళ్ల బ్రియాన్ బ్రిమేజర్కు అమెరికా కోర్టుకు 26 ఏళ్ల శిక్ష విధించింది. కాలిఫోర్నియాకు చెందిన అతను 2011లో తన ప్రియురాలైన 42 ఏళ్ల యోన్నెలీ బాల్డెలీని పనామాలో అతికిరాతకంగా పొడిచి చంపాడు. ఆ తర్వాత ఆమె దేహాన్ని ముక్కముక్కలు చేసి పనామాలోని ఓ దీవిలో విసిరేశాడు. పనామాలో రెండు నెలలపాటు వారిద్దరు కలిసి నివసించిన అనంతరం ఈ ఘటన జరిగింది. గతంలో సాన్‌డియాగోలో నావికుడిగా పనిచేసిన అతను హత్య చేసిన వెంటనే తన స్నేహితుడికి ఓ ఈమెయిల్ కూడా పంపాడు. 'పనామాలో తాను ఆనందభరితమైన జీవితాన్ని గడుపుతున్న'ట్టు ఆ ఈమెయిల్లో తెలిపాడు. 2013లో పనామా వాసులు ఓ మహిళ అస్తిపంజరాన్ని గుర్తించడంతో అతడు చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. తాజాగా కోర్టు విచారణలో అతడు నేరం అంగీకరించి.. యోన్నెలి కుటుంబసభ్యులకు క్షమాపణలు చెప్పాడు. అయితే, అతడిని క్షమించవద్దని, కఠినంగా శిక్షించాలని బాధితురాలు యోన్నెలీ కుటుంబసభ్యులు కోరారు. దీంతో కోర్టు అతడికి 26 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.