Police Bravely Subduing Attacker Armed With Giant Machete, Video Viral - Sakshi
Sakshi News home page

Viral Video: సినిమాలో హీరో మాదిరి కింద పడేశాడు!

Published Sun, Jun 19 2022 9:03 PM | Last Updated on Mon, Jun 20 2022 8:36 AM

Police Bravely Subduing Attacker Armed With Giant Machete Gone Viral  - Sakshi

సినిమాల్లో హీరో పై విలన్‌ దాడి చేస్తున్న సీన్‌లు చూస్తుంటాం. అందులో విలన్‌ చేతిలో పెద్ద ఆయుధం ఉండి, హీరో వద్ద ఏ ఆయుధం లేకపోయిన ధైర్యంగా ఫైట్‌ చేస్తుంటాడు. అబ్బా గ్రేట్‌ అని మురిసిపోతుంటాం. నిజజీవితంలో అలా ఫైట్‌ చేయటానికి చాలా గట్స్‌ ఉండాలి. కానీ ఇక్కడోక పోలీసు మాత్రం అచ్చం హీరో మాదిరి ఫైట్‌ చేశాడు.

వివరాల్లోకెళ్తే...కేరళలోని ఒక రహదారిపై పోలీసు వాహనం ఒకవైపు ఆగుతుంది. ఇంతలో డోర్‌ ఓపెన్‌ చేసుకుని అధికారి దిగుతుంటాడు. అంతే ఇంతలో అక్కడే ఉన్న ఒక వ్యక్తి పెద్ద కొడవలితో దాడి చేస్తాడు. దీంతో సదరు పోలీసు అధికారి ఆయుధం లేకపోయినా ఏ మాత్రం భయపడకుండా అతన్ని ఎదుర్కొంటాడు. చివరికి ఆ వ్యక్తిని కిందపడేసి అతని చేతిలోంచి ఆయుధాన్ని లాక్కుంటాడు. అంతేకాదు అక్కడే ఉన్న కొంతమంది కూడా ఆ అధికారికి సాయం చేస్తారు.

ఐతే ఆ అధికారి అలప్పజ నూరనాడ్‌ పోలీస్టేషన్‌లో పనిచేస్తున్నా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ అరుణ్‌ కుమార్‌గా గుర్తించారు.  ఈ ఘటన పారాజంక్షన్‌ సమీపంలో చోటు చేసుకుంది. ఆ వ్యక్తి దాడి కారణంగా అధికారి చేతికి గాయమవ్వడంతో ఏడు కుట్లు కూడా పడ్డాయి. కొడవలితో దాడి చేసిన వ్యక్తి సుగతన్‌గా గుర్తించారు. ఈ వీడియోని పోలీస్ సర్వీస్ అధికారి స్వాతి లక్రా ట్విట్టర్‌లో 'అసలైన హీరో ఇలా ఉంటాడు' అనే క్యాప్షన్‌ని జోడించి మరీ పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: షాకింగ్‌ వీడియో.. మ్యాన్‌హోల్‌లో పడిపోయిన జంట.. ఆ తర్వాత..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement