తిరువనంతపురం: విధి నిర్వహణలో మద్యం సేవించి,స్థానికులతో కలిసి డ్యాన్స్ చేసినందుకు ఎస్‌ఐపై సస్పెన్షన్ వేటు పడింది. ఇడుక్కిలో ఆలయ ఉత్సవాల మధ్య మద్యం మత్తులో ఓ పోలీసు అధికారి డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన కొద్ది రోజుల్లోనే, పోలీసు శాఖ అనుచితంగా ప్రవర్తించినందుకు ఆ అధికారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.
నివేదికల ప్రకారం.. ఇడుక్కిలోని పూప్పర మరియమ్మన్ ఆలయంలో పండుగ సందర్భంగా ఎస్‌ఐ షాజీ అతని బృందం ఉత్సవాల భద్రతా విధుల కోసం ఆలయానికి చేరుకున్నారు. ఆ రోజు షాజీ మద్యం సేవించి విధులకు హాజరయ్యాడు. ఇంతలో ఆలయంలోని మైక్ సెట్ నుంచి ‘మరియమ్మ కాళియమ్మ’ అనే తమిళ పాట వినిపించడంతో ఆ అధికారి ఆగలేకపోయాడు.
రెచ్చిపోయి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఎస్సై డ్యాన్స్ చూసిన అక్కడి భక్తులు, స్థానికులు ఆశ్చర్యపోయారు. ఎస్‌ఐ షాజీ డ్యాన్స్ చేస్తుండగా స్థానికులు కొందరు వీడియోలు తీశారు. ఘటన జరిగిన సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నట్లు తేలింది. మున్నార్ డీవైఎస్పీ, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు జరిపిన విచారణ ఆధారంగా అతనిపై వేటు పడింది. ఈ మేరకు జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు నివేదిక కూడా అందజేశారు.
And the department gifted a suspension to the Santhanpara Sub Inspector soon after this video from Idukki Pooppara got viral pic.twitter.com/kwblipMkxI
— chandrakanthviswanat (@chandra_newsKer) April 6, 2023
Comments
Please login to add a commentAdd a comment