లక్నో: యువతకు రేసింగ్‌లు, స్టంట్‌లపై క్రేజ్ పెరిగిపోతుంది. బైక్, కార్లతో రోడ్లపై రయ్ రయ్ మంటూ రచ్చ చేస్తుంటారు. ర్యాష్ డ్రైవింగ్‌తో విన్యాలు చేస్తూ ప్రమాదాల బారినపడటమే కాకుండా ఇతరుల జీవితాలను కూడా రిస్క్‌లో పడేస్తున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొంతమందిలో మార్పు రావడం లేదు.. ఏరికోరి ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు.
అయితే బైక్ స్టంట్‌లు చేసిన వారిపై జరిమానా విధించాల్సిన కొంతమంది పోలీసులే నిబంధనలు అతిక్రమిస్తున్నారు. తాజాగా ఓ పోలీస్ బైక్ స్టంట్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. గోరఖ్‌పూర్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న సందీప్ కుమార్ చైబే.. యూనిఫాం ధరించి బైక్‌పై ప్రమాదకరంగా విన్యాసాలు చేశాడు.
తన రేసింగ్‌ను మరొకరితో వీడియో తీయించాడు. దీనికి డైలాగ్ జోడించి వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఇంకేముంది ఈ రీల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీస్ చర్యపై నెటిజన్లు మండిపడుతున్నారు. అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన పోలీసులు ఇలా ప్రవర్తించడం సరికాదంటూ, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
చివరికి ఈ విషయం ఉన్నతాధికారులకు చేరడంతో అతనిపై చర్యలు తీసుకున్నారు. విధుల నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీచేశారు. అంతేగాక ఈ ఘటనపై దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించారు. కాగా ఏ పోలీసు సిబ్బంది వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదని ఉత్తరప్రదేశ్ పోలీసులు ఫిబ్రవరి 8, 2023న ఆదేశాలు జారీ చేశారని ఎస్‌ఎస్పీ క్టర్ గౌరవ్ గ్రోవర్ తెలిపారు. అయిన్నప్పటికీ.. కానిస్టేబుల్ సందీప్ కుమార్ చౌబే తన వీడియోను పోస్ట్ చేయడం ద్వారా నిబంధనలు ఉల్లంఘించినందుకు సస్పెండ్ చేశామని పేర్కొన్నారు.
చదవండి: ఘోర ప్రమాదం.. కారును ఢీకొట్టిన ట్రక్కు.. సీఐ దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment