తుపాకులతో కాల్చి..ఆపై కత్తులతో నరికి.. | Congress Leader's Murder In Maharashtra | Sakshi
Sakshi News home page

తుపాకులతో కాల్చి..ఆపై కత్తులతో నరికి..

Published Wed, Feb 15 2017 7:19 PM | Last Updated on Tue, Sep 5 2017 3:48 AM

తుపాకులతో కాల్చి..ఆపై కత్తులతో నరికి..

తుపాకులతో కాల్చి..ఆపై కత్తులతో నరికి..

భీవండి(ముంబై): ముంబై శివారు ప్రాంతంలో కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురయ్యారు. అత్యంత పాశవికంగా జరిగిన ఈ హత్యకు సంబంధించి వీడియో ఫుటేజీ మహారాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేపింది. వివరాలు.. కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పోరేటర్ మనోజ్ మెహట్రె(53) మంగళవారం ప్రెస్ కాన్ఫరెన్స్ ముంగించుకొని రాత్రి 9:30 గంటలకు ఓస్వల్వాడీలోని తన ఇంటికి వచ్చారు. కారును పార్క్ చేసి ఇంట్లోకి ప్రవేశిస్తుండగా ఇద్దరు దుండగులు మొదట అతనిపై కాల్పులు జరిపారు. దీంతో మనోజ్ అక్కడే కుప్పకూలిపోయాడు. అంతటితో ఆగకుండా దుండగులు  కిందపడ్డ మనోజ్పై కత్తులతో ఇష్టానుసారంగా దాడికి దిగారు. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీ కెమెరాకు చిక్కింది.
 
ఎప్పుడూ అత్యంత రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో నిందితులు మనోజ్పై దాడి చేసి అక్కడి నుంచి సులభంగా తప్పించుకున్నారు. తీవ్రగాయాలైన మనోజ్ను ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు ముగ్గురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. భీవండి-నిజాంపుర్ మున్సిపల్ కార్పొరేషన్కు వచ్చే మే లో ఎన్నికలు జరుగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement