అస్సాంలోని ఒక ప్రాథమిక పాఠశాల హెడ్ మాష్టారు కొడవలితో రావడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదీగాక ఈ ఘటన గురించి పోలీసులుకు పలు కాల్స్ వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు హెడ్ మాష్టారుని ధృతిమేధ దాస్‌గా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. దాస్ ఆయుధాన్ని దాచేందుకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు.
తాము ఆ పాఠశాలకు వెళ్లినప్పుడూ ఇతర టీచర్లు, పిల్లలు భయపడుతున్నట్లు గమనించామన్నారు. ఐతే సదరు హెడ్ మాష్టారు దాస్ ఇతర టీచర్లు విధులు సరిగా నిర్వర్తించకపోవడంతో కాస్త అసహనానికి గురై కోపంగా ఉన్నట్లు కాచర్ జిల్లా పాఠశాలల డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ పర్వేజ్ హజారీ తెలిపారు. అదీగాక ఆ పాఠశాలలో ఏకంగా 13 మంది ఉపాధ్యాయులు ఉన్నారని, అక్కడ ఏడుగురు ఉపాధ్యాయులు మాత్రమే అవసరమని చెప్పారు. క్రమశిక్షణ కోసం దాస్ ఇలా ప్రవర్తించినట్లు హజరీ పేర్కొన్నారు.
ఐతే హెడ్ మాష్టార్ దాస్‌పై ఇతర టీచర్లు, విద్యాశాఖ గానీ అధికారికంగా ఫిర్యాదు చేయలేదు. ప్రస్తుతం అతన్ని తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. ఐతే పోలీసులు అతని వద్ద నుంచి రెండు నోట్లు లభించాయి. వాటిలో తనకేదైనా జరిగితే ఆ నలుగురు టీచర్లే కారణమని, మరోక నోట్‌లో తాను ముగ్గురు టీచర్లను చంపాలనుకున్నట్లు రాశాడని తెలిపారు.
(చదవండి: యాక్సిడెంట్‌గా చిత్రీకరించి మర్డర్‌కి ప్లాన్! మాజీ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ మృతి)
Comments
Please login to add a commentAdd a comment