Ghantasala
-
ఘంటసాల సినిమా చూడటం తెలుగు వారి కర్తవ్యం: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
‘‘ఘంటసాలగారిని శతాబ్ది గాయకుడు (సింగర్ ఆఫ్ సెంచరీ) అంటారు. ఆయన్ను నేను అమర గాయకుడు అంటాను. ఒక సాధారణ వ్యక్తిగా మొదలైన ఆయన జీవితం సంగీతంతో సాగుతూ... స్వాతంత్య్ర సమరయోధుడిగానే కాకుండా, సినీ గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, భగవద్గీత గానాన్ని అందించిన తొలి తెలుగు స్ఫూర్తిగా భావితరాలకు ఆయన ఆదర్శంగా నిలుస్తారని భావిస్తున్నాను’’ అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. దివంగత ప్రముఖ గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘ఘంటసాల: ది గ్రేట్’.ఈ చిత్రంలో ఘంటసాలపాత్రలో కృష్ణచైతన్య నటించారు. ఘంటసాల భార్య సావిత్రిపాత్రలో కృష్ణచైతన్య భార్య మృదుల నటించారు. సీహెచ్ రామారావు దర్శకత్వంలో సీహెచ్ ఫణి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్పోస్టర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ– ‘‘ఘంటసాలగారిపై సినిమా తీసినందుకు ఫణిగారిని అభినందిస్తున్నాను. కృష్ణచైతన్య, మృదులలను మెచ్చుకుంటున్నాను.సదుద్దేశంతో తీసిన ఈ సినిమా చూడటం తెలుగు వారి కర్తవ్యం’’ అన్నారు. మరో అతిథి దర్శక–నిర్మాత–నటుడు ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలి. ఉత్తరాది గాయకులకు ఇచ్చి ఆయనకు ఎందుకు ఇవ్వలేదు? ఎంజీఆర్‌కు భారతరత్న ఇచ్చి ఎన్టీఆర్‌కు ఇవ్వలేదు. ఆయనకూ ఇవ్వాలి’’ అని అన్నారు. ‘‘మా సినిమాను ప్రేక్షకులకు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు కృష్ణచైతన్య. ‘‘ఘంటసాలగారిపాట ఎంత గొప్పదో అందరికీ తెలుసు. కానీ ఆయన వ్యక్తిత్వం కొందరికే తెలుసు. ఆయన వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని ఈ సినిమాలో చెప్పడం జరిగింది’’ అని తెలిపారు సీహెచ్ రామారావు. -
TG: ‘ఘంటసాల’ విగ్రహాన్ని ఆవిష్కరించిన డీఆర్డీవో మాజీ చైర్మన్
సాక్షి,మహబూబ్‌నగర్:డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో) మాజీ చైర్మన్ డాక్టర్.జిసతీష్‌రెడ్డి బుధవారం(మే29) తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత జిల్లాలోని దిండి చింతపల్లి గ్రామంలో ప్రముఖ సంగీత దర్శకులు, నేపథ్య గాయకులు ఘంటసాల వెంకటేశ్వర్రావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం అదే గ్రామంలో శంకర నేత్రాలయ ఐ సర్జరీ క్యాంపులో జరిగిన ఫేర్వెల్ వేడుకలో చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్నారు. -
Ghantasala: మధుర కంఠశాల
జయ జననీ పరమ పావని జయ జయ భారత జననీ... దేశం తాలూకు ప్రేమ స్పష్టంగా వినిపించిన గాత్రం. ‘మన దేశం’లోని ఈ పాట ఎవర్గ్రీన్.కలవర మాయె మదిలో.. నా మదిలో... కన్నులలోన గారడి ఆయే... ‘పాతాళ భైరవి’లో అదే గాత్రం ప్రేమ కురిపించింది.శేషశైలవాస.. శ్రీవెంకటేశా... ‘వెంకటేశ్వర మహత్మ్యం’లో ఆ గాత్రంలోని భక్తిభావం అద్భుతం. ఎట్టాగొ ఉన్నాది ఓ లమ్మీ... ప్రేయసితో గారాలు పోయింది ఆ గాత్రం..జగమే మాయ బతుకే మాయ.. వేదాలలో సారమింతేనయా.. ‘దేవదాసు’లో మత్తు నింపిన గాత్రం అది..లేచింది నిద్ర లేచింది మహిళాలోకం... ‘గుండమ్మ కథ’లో సమాజాన్ని మేల్కొల్పిన గాత్రం అది.దైవ భక్తి, దేశ భక్తి, ప్రేమ, విరహం, ఉత్సాహం... ఇలా అన్నింటినీ మధురంగా పలికించిన కంఠం అది. అందుకే ఘంటసాల దూరం అయినా ఆ స్వరం దూరం కాలేదు.. తెలుగు ప్రజల మనసుల్లో అలా నిలిచిపోయింది. ఆ ‘మధుర కంఠశాల’ ఘంటసాల 50వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఘంటసాల మాస్టారు జీవితంలోని కొన్ని విశేషాలు ఈ విధంగా... ఘంటసాల వెంకటేశ్వర రావ్ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని చౌటుపల్లిలో 1922 డిసెంబరు 4న సామాన్య కుటుంబంలో జన్మించారు. తండ్రి పేరు సూరయ్య, తల్లి పేరు రత్తమ్మ. ఘంటసాలకు సంగీతమంటే ప్రాణం. స్వతహాగా మంచి గాయకుడైన ఆయన శ్రీ నారాయణతీర్థుల తరంగాలను వినసొంపుగా పాడేవారు. మృదంగ వాయిద్యంలో కూడా ఘంటసాలకి మంచి ప్రవేశం ఉంది. ఆయన పాటలు పాడటంతో పాటు నృత్యం కూడా చేసేవారు. శ్రీ నారాయణ తీర్థుల తరంగాలను పాడటంలో తండ్రికి సహాయంగా ఉండేవారు ఘంటసాల. అలా పాటలు పాడుతూ, నృత్యాన్ని అభినయించే ఘంటసాలను అందరూ ‘బాల భరతుడు’ అని పిలిచేవారు. ఒకానొక సందర్భంలో ఘంటసాల సంగీత కచేరీ చేస్తున్నప్పుడు కొందరు ఆయన సంగీత పరిజ్ఞానాన్ని హేళన చేశారు. ఆ హేళనను ఆయన ఒక సవాల్‌గా స్వీకరించి, సంగీతంలో మంచిప్రావీణ్యాన్ని సంపాదించటానికి విజయనగరం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే అందుకు ఆయన కుటుంబ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో తన బంగారు ఉంగరం విక్రయించి, సంగీతం నేర్చుకోవడానికి విజయనగరం చేరుకున్నారు. అక్కడ ఓ కళాశాలలో ప్రవేశం పొంది, విద్వాన్ పట్టాతో కళాశాల నుంచి బయట ప్రపంచంలోకి అడుగుపెట్టారు. తన 14వ ఏట వయొలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు ప్రోత్సాహంతో పట్రాయని సీతారామశాస్త్రి వద్ద శాస్త్రీయ సంగీతం అధ్యయనం చేశారు. హఠాత్తుగా తన తండ్రి సూరయ్య మృతి చెందడంతో మేనమామ శ్రీ ర్యాలి పిచ్చిరామయ్య వద్దకు చేరుకున్నారు ఘంటసాల. ఆ తర్వాత 1944 మార్చి 4న ఆయన కుమార్తె సావిత్రిని పెళ్లాడారు. సమీప బంధువైన సినీరంగ ప్రముఖుడు సముద్రాల రాఘవాచారి ఆశీస్సులతో 1944లో మద్రాసు చేరుకుని, గాయకుడిగా అవకాశాల కోసం ఏడాది పాటు ఎదురు చూశారు ఘంటసాల. 1945లో తొలిసారి ‘స్వర్గసీమ’ సినిమాలోని ‘గాజులపిల్ల..’ అనే పాట ద్వారా ఆయన గొంతు తెలుగు వారికి పరిచయమైంది. ఈ పాటకు ఆయన అందుకున్న పారితోషికం రూ. 116. ఆ తర్వాత ఎన్నో గీతాలు పాడారు. అలాగే తెలుగులో దాదాపు ఎనభై చిత్రాలకు, తమిళం, కన్నడంలో కొన్ని చిత్రాలకు సంగీతదర్శకత్వం వహించారు. ఇక ఘంటసాలకు దేశభక్తి కూడా ఎక్కువే. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుపాలయ్యారు. ఘంటసాల చివరిగా పాడిన పాట ‘యశోదకృష్ణ’ సినిమాలోని ‘చక్కనివాడే భలే టక్కరివాడే..’. ఆ తర్వాత ఆయన తన జీవితమంతా పరితపించిన భగవద్గీత ప్రయివేటు రికార్డును పూర్తి చేసి, మరణించారు. జీవిత చరమాంకంలో చేసిన భగవద్గీత ఆయనకు శాశ్వత కీర్తిని సంపాదించి పెట్టింది. 1972లో హైదరాబాద్ రవీంద్రభారతిలో కచేరీ చేస్తుండగా ఆయనకు గుండెలో నొప్పిగా అనిపించడంతో ఆస్పత్రికి వెళ్లారు. దాదాపు నెల రోజులు ఆస్పత్రిలో ఉన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లు బాగానే ఉన్నారు. అయితే ఆ తర్వాత అనారోగ్యంపాలు కావడంతో ఒక విలేకరి సూచించిన నాటు మందు వాడారు. అది వికటించడంతో ఆరోగ్యం ఇంకా క్షీణించింది. చివరికి 1974 ఫిబ్రవరి 11న ఘంటసాల తుది శ్వాస విడిచారు. ‘శ్రీనివాసా... బాధ లేకుండా పోతే ఫర్వాలేదు’ అని చనిపోయే నాడు ఉదయం ఆస్పత్రిలో అన్నారట. ఘంటసాల పలికిన చివరి మాట ఇదేనట. తెలుగు చిత్రసీమ ఉన్నంతవరకూ నిలిచిపోయేలా పాటల రూపంలో మధురాన్ని పంచిన ఘంటసాల 52 ఏళ్ల వయసుకే దూరమయ్యారు. ఘంటసాలకు నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు సంతానం. ఓ నిర్మాత మన సినిమాలోని పాటలన్నీ హిట్ కావాలని సంగీత దర్శకుడు ఇళయారాజాకి చెప్పారట. అయితే ఇది ఒక్క ఘంటసాలగారికే సాధ్యం అన్నారట ఇళయరాజా. ఈయనే కాదు.. అప్పట్లో ఏ సంగీతదర్శకుడికైనా తొలిప్రాధాన్యం ఘంటసాలకే. పాటలు మాత్రమే కాదు.. పద్యాలు పాడటంలోనూ ఘంటసాల సూపర్. కొంతమంది సంగీత దర్శకులు వారి సినిమాల్లోని పద్యాలను ఘంటసాలతోనే పాడించుకున్నారు. స్వతహాగా ఘంటసాలకు కూడా పద్యాలు పాడటం అంటే చాలా ఇష్టం. ‘తెనాలి రామకృష్ణ’ సినిమాలో చాలా పద్యాలు ఉంటాయి. తొలుత ఈ పద్యాలను పాడినందుకు ఘంటసాల పారితోషికం తీసుకోలేదట. ‘పద్యాలే కదా ఫర్వాలేదులే’ అన్నారట. కానీ ఈ చిత్రనిర్మాత బీఎస్ రంగా పద్యానికి వంద రూపాయల చొప్పున లెక్కగట్టి ఘంటసాలకి ఇచ్చారట. అలాగే ‘రహస్యం’ (1967) సినిమాకు ఎంతో ఇష్టపడి సంగీతం ఇచ్చారట ఘంటసాల. కానీ ఆ సినిమా ఫ్లాప్ కావడంతో ఘంటసాల చాలా నిరాశ చెందారట. అలాగే తిరుమలేశునిపై ఎక్కవ పాటలు స్వరపరిచి, గానం చేసిన గాయకుల్లో ఘంటసాల పేరు ముందు వరుసలో ఉంటుంది. -
ఘంటసాల గారు నేను సంగీతం కోసమే పుట్టాం
-
మా ఆయన ఘంటసాలను బెదిరించాడు ఎందుకంటే..!
-
ఘంటసాల పై ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం వ్యాఖ్యలు
-
నాన్న చివరి కోరిక.. అమ్మ చనిపోయింది: ఘంటసాల కుమారుడు
అమరగాయకుడు ఘంటసాల స్వరం వినిపిస్తే చాలు.. పులకించిపోయే జనాలు చాలామంది ఉన్నారు. జానపదాల నుంచి జావళీల దాకా, భక్తి గీతాల నుంచి అష్టపదుల దాకా ఆయన ముద్ర కనిపిస్తుంది. ఆయనకు ఇద్దరు భార్యలన్న విషయం చాలా తక్కువమందికి తెలుసు. ఒకరు సావిత్రి అయితే మరొకరు సరళ. ఘంటసాల- సరళల సంతానమే రవి కుమార్. తాజాగా రవి కుమార్ ఓ ఇంటర్వ్యూలో తన తల్లిదండ్రుల గరించి మాట్లాడారు. 'నాన్నకు మానస సరోవర యాత్ర వెళ్లాలని ఎప్పటినుంచో కోరిక. కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన కన్నుమూశారు. అయితే ఎలాగైనా ఆ యాత్ర పూర్తి చేయాలని అమ్మ భావించింది. ఒక బృందంతో కలిసి మానస సరోవర యాత్రకు వెళ్లింది. ఎంతో సంతోషంతో మాకు ఫోన్ చేసి తన యాత్ర విశేషాలు చెప్పింది. సరోవర యాత్ర పూర్తి చేసుకున్నాక అందరికీ బాయ్ చెప్పి టెంట్‌లోకి వెళ్లి నిద్రించింది. అక్కడే తుదిశ్వాస విడిచింది' అని చెప్పుకొచ్చారు. చదవండి: బిగ్‌బాస్ 7లో రష్మీ, స్పందించిన యాంకర్ -
దేశం గర్వించదగ్గ గాయకుడు ఘంటసాల : ఆర్కే రోజా
-
కృష్ణవేణికి ఘంటసాల శతాబ్ది పురస్కారం
ప్రముఖ సీనియర్ నటి, నిర్మాత కృష్ణవేణి ‘ఆకృతి– ఘంటసాల శతాబ్ది పురస్కారం’ అందుకున్నారు. ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆకృతి–ఘంటసాల శతాబ్ది పురస్కారాన్ని కృష్ణవేణికి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ఎవరినైనా సక్సెస్ తర్వాతే గుర్తు పెట్టుకుంటారు. కానీ, ఎంతోమందికి సక్సెస్ ఇచ్చిన కృష్ణవేణిగారికి తగినంత గుర్తింపు రాకపోవడం బాధాకరం’’ అన్నారు. ‘‘నేటి తరం సినిమా వాళ్లకు కృష్ణవేణిగారి జీవితం పుస్తకంలా ఉపయోగపడుతుంది’’ అన్నారు తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కొల్లేటి దామోదర్. ‘‘కృష్ణవేణిగారు ఒక లెజెండ్’’ అన్నారు నటి రోజా రమణి. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవరాలు అజిత, ఫిక్కీ సీఎండీ అచ్యుత జగదీష్ చంద్ర, నటుడు మోహనకృష్ణ, ‘ఆకృతి’ సుధాకర్ పాల్గొన్నారు. -
ఘంటసాల జీవితం వడ్డించిన విస్తరి కాదు.. ఆయన పారితోషికం ఎంతో తెలుసా?
ఆ స్వరం వింటే చాలు తెలుగు వారు పులకించి పోతారు. ఆ పేరు విన్నా.. తలచినా.. పాట మురిసి పోతుంది. పద్యం పరవశించి పోతుంది. జానపదాల నుంచి జావళీల దాకా భక్తి గీతాల నుంచి అష్టపదుల దాకా ఆయన ముద్ర కనిపిస్తుంది. ఇంతింతై వటుడింతై అన్నట్టు కృష్టాజిల్లా గుడివాడ సమీపంలోని చౌటపల్లిలో పుట్టిన ఒక సామాన్యమైన వ్యక్తి తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారంటే స్వరస్వతీ దేవి ఆయన నాలుక మీద బీజాక్షరాలు రాయబట్టే. ఆయనే తెలుగువారంతా గర్వంగా చెప్పుకునే ఘంటసాల వెంకటేశ్వరరావు. డిశంబరు 4 ఆయన శతజయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం. కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని చౌటపల్లిలో 1922 డిసెంబరు 4 వ తేదీన సామాన్య కుటుంబంలో జన్మించిన ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితం వడ్డించిన విస్తరి కాదు. బాల్యంలో బాలారిష్టాలతో గడిచింది. 1936లో తన 14వ ఏట తన దగ్గరున్న బంగారు ఉంగరాన్ని అమ్మి సంగీతం నేర్చుకోవడానికి విజయనగరం చేరుకున్నారు. విజయనగరం రాజులు కళా పోషకులు కావడంతో అనేక విద్యాలయాలను ప్రారంభించారు. వయొలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు ప్రోత్సాహంతో పాట్రాయని సీతారామశాస్త్రి వద్ద శాస్త్రీయ సంగీతం అధ్యయనం చేశారు. 1941లో విద్వాన్ పట్టాతో కళాశాల నుంచి బయట ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. 1944లో మేనమామ కుమార్తెను వివాహం చేసుకున్నారు. అదే సంవత్సరం మద్రాసు ప్రయాణమైన ఘంటసాల సినీ ప్రస్థానం 1974 పిబ్రవరి 11న ముగిసింది. సినీ ప్రస్ధానం: ఘంటసాల మాస్టారి సమీప బంధువైన సినీరంగ ప్రముఖుడు సముద్రాల రాఘవాచారి ఆశీస్సులతో 1944లో మద్రాసు చేరుకున్నారు. అవకాశాల కోసం ఏడాది పాటు ఎదురు చూశారు. 1945లో తొలిసారిగా ఆయన స్వరం గాజులపిల్ల పాట(స్వర్గసీమ) ద్వారా తెలుగు వారికి పరిచయమైంది. ఇక ఆయన వెనక్కు తిరిగి చూసుకునే అవసరం లేక పోయింది. వేలాది గీతాలు పాడారు. భక్తి గీతాలు, విషాద గీతాలు. సోలో ఇలా... పాట ఏదైనా మాస్టారి పాటలకు మంత్రముగ్ధులు కాని తెలుగు వారు లేరంటే అతిశయోక్తి లేదు. ఘంటసాల కేవలం సినీ గాయకుడే కాదు...స్వాతంత్య్ర సమరయోధుడు, సినీ నిర్మాత, సంగీత దర్శకుడు. పలు భాషల్లోని చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. తన జీవిత చరమాంకంలో ఘంటసాల గానం చేసిన భగవద్గీత ఆయనకు శాశ్వత కీర్తిని సంపాదించి పెట్టింది. విదేశాలలో సహితం అక్కడున్న తెలుగువారికి గాన విందు పంచి పెట్టారు ఘంటసాల. సినిమాలో ఆయన తొలి పారితోషికం 116 రూపాయలు. అప్పటి సినీ నేపథ్యగాయకులు, గాయనీమణులు దాదాపుగా ఆయనతో కలసి పాటలు పాడారు. హెచ్ఎంవీ సంస్థ తొలి దశలో ఆయన స్వరం రికార్డులకు పనికి రాదంది. తరువాత వారే ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఘంటసాల పేరుతో పోస్టల్ స్టాంప్ ఘంటశాల మరణానంతరం 2003లో ఆయన పేరుతో తపాలా శాఖ పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసి ఆయన పట్ల తన భక్తిని చాటుకుంది. అభిమానులు ఊరూరా ఘంటసాల విగ్రహాలను ఏర్పాటు చేసుకుని తమ అభిమానం చాటుకున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో శత జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో డిసెంబరు నాలుగవ తేదీన ఘంటసాల శత జయంతి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆయన అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో శతజయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. 1970 లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది.1972లో రవీంద్రభారతిలో కచేరీ నిర్వహిస్తూ ఉండగా ఆయనకు తొలిసారిగా గుండెనొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరారు.1974లో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. అదే ఏడాది ఫిబ్రవరి 11న మద్రాస్‌లోని విజయా హాస్పిటల్లో తెలుగు ప్రేక్షకుల హృదయాలను విడిచి ఆయన గంధర్వలోకానికి తరలిపోయారు. టేకుపల్లిలో 4న ఘంటసాల కళామండపానికి శంకుస్థాపన అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు తండ్రి సూర్యనారాయణ స్వగ్రామం కృష్ణాజిల్లా మోపిదేవి మండలం టేకుపల్లి గ్రామం. ఘంటసాల గుడివాడ సమీపంలోని చౌటపల్లిలో మేనమామ ర్యాలీ పిచ్చిరామయ్య ఇంటి వద్ద జన్మించారు. తండ్రి సూర్యనారాయణ స్థానిక రామేశ్వరస్వామివారి ఆలయంలో పూజారిగా ఉండేవారు. పేదరికం వల్ల తండ్రి మృదంగం వీపున కట్టుకుని, గ్రామాల్లో భగవత్ కీర్తనలు ఆలపిస్తుండగా ఘంటసాల నృత్యం చేస్తుండేవారు. 11వ ఏటనే తండ్రిని కోల్పోవడంతో చౌటపల్లిలో మేనమామ వద్దనే పెరిగారు. ఘంటసాల స్వగ్రామమైన టేకుపల్లిలో ఆయన శత జయంతి సందర్భంగా ఈ నెల 4వ తేదీన ఘంటసాల పేరుతో కళా మండపానికి శంకుస్థాపన చేయనున్నారు. ఘంటసాల పాటల చరిత్ర భావితరాలకు అందాలి అమరగాయకుడు ఘంటసాల గాన చరిత్ర భావితరాలకు అందించాలనే సంకల్పంతో ఘంటసాల పాటలను సేకరించడం మొదలు పెట్టాను. వందలాది పాటలతో పుస్తక రూపంలోకి తీసుకువచ్చాను. నేను సేకరించిన ఘంటసాల సంపూర్ణ తెలుగు పాటలను శతవర్ష ఘంటసాల పేరుతో వచ్చిన పుస్తకాన్ని మాజీ ఉప రాష్ట్రపతి ఆవిష్కరించారు. –చల్లా సుబ్బారాయుడు ఘంటసాల పాటల సేవకుడు -
'ఘంటసాలకు భారతరత్న వస్తే అవార్డుకే అందం'
స్వాతంత్ర సమరయోధుడు, పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావుకు భారతరత్న వచ్చేందుకు మనమంతా కృషి చేయాలని ప్రముఖ టాలీవుడ్ దర్శకులు ఆదిత్య, హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఘంటసాల శత జయంతి వేడుకల సందర్భంగా కేంద్రం అవార్డు ప్రకటించాలని కోరారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని నీలిమ గడ్డమణగు వ్యాఖ్యాతగా సెప్టెంబర్ 18న వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సంస్థలను ఏకతాటిపైకి తీసుకొస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ అంశంపై అమెరికాలోని శంకర నేత్రాలయ అధ్యక్షుడు బాలరెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో టీవీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దర్శకుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ ' మీరందరు విదేశాల్లో ఉండి కూడా ఘంటసాలకి భారతరత్న రావాలన్న మీ ప్రయత్నాలకు మా అందరి తరఫున అభినందనలు. ముఖ్యంగా ఘంటసాల కుటుంబ సభ్యులను భాగస్వామ్యం చేయడం, అందరినీ కలుపుకొని పోవడం అభినందనీయం. ప్రభుత్వాలు చేయాల్సిన పనిని మనం చేస్తున్నాం. ఎందుకంటే ఘంటసాల జాతీయ సంపద.. స్వాతంత్ర సమరయోధుడు. వందల సినిమాలకు సంగీత దర్శకత్వం వహించడం, కొన్ని వేల పాటలు పాడటం ఇలా అన్ని విధాలుగా వారు భారతరత్నకు అర్హులు' అని అన్నారు. దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ 'ఈ కార్యక్రమం గురించి ఈ మధ్యనే విన్నా. ఘంటసాలకు భారతరత్న వస్తే అది భారతరత్నకే అందం. తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు అందిస్తే మా నాన్న నాకు ఘంటసాల పాటలు, సాహిత్యాన్ని అందించారు. అదే మా నాన్న నాకిచ్చిన వారసత్వం. ఆయన పాటలు, సాహిత్యాన్ని భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందిస్తూ వారికి పూర్తి సహకారం అందిస్తానని' తెలిపారు. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ 'ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషం. ఇది చాలా గొప్ప కార్యక్రమం. మా ముందు తరాల వారికీ ఆయన ఒక దేవుడు. సంగీతం లో గాన గంధర్వుడు. మంచి గాయకుడే కాకుండా 100కు పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. నాకు ఘంటసాల పాటలు అంటే చాలా ఇష్టం. ఆయన సంగీత దర్శకత్వం వహించిన రెండు సినిమాలు మాయాబజార్, గుండమ్మ కథ. ఆ సినిమాలో వారు పాడిన పాటలు ఇప్పటికి ఎప్పటికీ గుర్తుంటాయి. ఆయన శతజయంతి ఉత్సవాలు జరపడం గొప్ప విషయం. మీ అందరికీ ప్రత్యేక అభినందనలు. ఆయనకు భారతరత్న రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా'అని అన్నారు. ఘంటసాలకు భారతరత్న దక్కకపోవడం చాలా బాధాకరమని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15 కోట్ల మంది తెలుగువారి ఆత్మ గౌరవమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఘంటసాలకి కేంద్రం భారతరత్న అవార్డుతో సత్కరించాలని కోరారు. విదేశాల్లోని తెలుగు సంస్థలు, ఇతర సంస్థలు ఏకతాటిపై వచ్చి భారతరత్న వచ్చేంతవరకు అందరూ సమష్టిగా కృషి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో గతంలో ఘంటసాల కార్యక్రమాలకు సాంకేతిక సహాయం అందించిన ప్రమీలకు నిర్వాహకులు అభినందనలు తెలిపారు. ప్రముఖ మిమిక్రీ కళాకారులు శివారెడ్డి, ప్రముఖ సింగర్స్ గీత మాధురి, మాళవిక, ఇండియన్ ఐడల్ రన్నరప్ రోహిత్, అనురూప్, తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు, శంకర్ నేత్రాలయ, యూఎస్ఏ బోర్డు సభ్యులు సౌమియా నారాయణన్, లక్ష్మయ్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పింగళి కుమార్తె సీతామహాలక్ష్మి కన్నుమూత.. సీఎం జగన్ సంతాపం
సాక్షి, పల్నాడు: జాతీయ జెండా రూపకర్త దివంగత పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతా మహాలక్ష్మి (100) కన్నుమూశారు. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని ప్రియదర్శిని కాలనీలో ఉంటున్న ఆమె కుమారుడు జీవీ నరసింహారావు ఇంట్లో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. చాలా రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతు న్నారు. గత ఏడాది ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా మాచర్లకు వచ్చి ఆమెను సత్కరించి రూ.75 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ఆమెతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. కాగా, పింగళి సీతామహాలక్ష్మీ మృతి పట్ల ఏపీ సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. -
స్నేహమొక్కటి నిలిచి వెలుగును
ఉస్తాద్ బడే గులామ్ అలీఖాన్ ఎప్పుడు మద్రాసు వచ్చినా ఘంటసాల ఇంట్లో బస చేసేవారు. ఇప్పటిలా ఉదయమొచ్చి సాయంత్రానికి వెళ్లిపోవడం కాదు. నెలా రెండు నెలలు ఉండిపోవడమే. మేడ మీద వారు ఉంటే అన్నము, రొట్టెలు నిరాటంకంగా ఘంటసాల ఇంటి నుంచి వెళ్లేవి. బడే గులామ్ అలీఖాన్ ‘మొఘల్ ఏ ఆజమ్’లో నాలుగైదు నిమిషాల ఆలాపనకు 25 వేల రూపాయలు తీసుకున్నారు– 1960లో. అంటే నేటి విలువ 20 కోట్లు. అంత ఖరీదైన, మహా గాత్ర విద్వాంసుడైన బడే గులామ్ అలీఖాన్ ఏం చేసేవారో తెలుసా? తనకు బస ఇచ్చిన ఘంటసాల స్నేహాన్ని గౌరవిస్తూ, అన్నం పెడుతున్న ఘంటసాల సతీమణి సావిత్రమ్మను గౌరవిస్తూ తాను ఉన్నన్నాళ్లు ప్రతి శుక్రవారం పిలిచి ప్రత్యేకం వారిద్దరి కోసమే పాడేవారు. గంట.. రెండు గంటలు... పాడుతూనే ఉండిపోయేవారు. స్నేహం అలా చేయిస్తుంది. లతా మంగేష్కర్ వృద్ధిలోకి వచ్చిందని ఎవరికో కన్ను కుట్టింది. ఆమెకు స్లో పాయిజన్ ఇచ్చి చంపడానికి వంట మాస్టర్ని ప్రవేశ పెడితే స్లో పాయిజన్ ఉన్న వంట తినీ తినీ ఒక్కసారిగా ఆమె జబ్బు పడింది. మూడు నెలలు మంచం పట్టింది. బతుకుతుందో లేదో, మరల పాడుతుందో లేదో తెలియదు. కానీ గీతకర్త మజ్రూ సుల్తాన్‌పురి ఆమెను రోజూ మధ్యాహ్నం చూడటానికి వచ్చేవాడు. సాయంత్రం ఏడూ ఎనిమిది వరకు కబుర్లు చెబుతూ కూచునేవాడు. ఒక రోజు కాదు రెండు రోజులు కాదు... ఆమె తిరిగి రికార్డింగ్ థియేటర్లో అడుగుపెట్టే రోజు వరకూ అతడా పని మానలేదు. స్నేహం అలానే చేయిస్తుంది. గబ్బర్‌సింగ్‌గా విఖ్యాతుడైన అంజాద్ ఖాన్, అమితాబ్‌కు ఆప్తమిత్రుడు. కుటుంబంతో గోవా వెళుతూ తీవ్రమైన కారు యాక్సిడెంట్ జరిగితే అందరూ చచ్చిపోతాడనే అనుకున్నారు. అమితాబ్‌కు ఈ విషయం తెలిసి ఆగమేఘాల మీద ఆస్పత్రికి వచ్చాడు. ఇంటికెళ్లక దివారాత్రాలు కాపలా కాశాడు. ఏమి సాయం కావాలంటే ఆ సాయం చేయడానికి సిద్ధం. అతి కష్టమ్మీద అంజాద్ ఖాన్ బతికాడు. స్నేహితుడు అమితాబ్ బచ్చన్ తన కంటికి కునుకు పట్టే అనుమతినిచ్చాడు. ఈద్ అంటారొకరు. పండగ అంటారొకరు. దువా అంటారొకరు. ప్రార్థన అంటారొకరు. మక్కా మదీనాల ఫొటో ఒక గుమ్మం మీద! విఘ్నేశ్వరుడి చిత్రపటం ఒక వాకిలికి! అమ్మ వండితే ‘ఖీర్’ అంటారొకరు. ‘పాయసం’ అని లొట్టలు వేస్తారొకరు. విరజాజుల పూలతీవ ఇరు ఇళ్ల మీద ఒక్కలాంటి పరిమళమే వెదజల్లుతుంది. ప్రభాతాన సుప్రభాతం అయితే ఏమిటి... వినిపించే అజాన్ అయితే ఏమిటి... ఒడలు పులకరింప చేస్తుంది. ‘క్యా భాయ్’ అని ఒకరు.. ‘ఏవోయ్’ అని ఒకరు! స్నేహం దేవుళ్ల అనుమతితో జరగదు. అది హృదయాల దగ్గరితనంతో సంభవిస్తుంది. కళే మతం అనుకునే కళాకారులకు ఈ స్నేహం ఒక ఆరాధనగా ఉంటుంది. ‘ప్యార్ కియా జాయ్’ (ప్రేమించి చూడు)లో మెహమూద్, ఓం ప్రకాశ్‌ల కామెడీ విపరీతంగా పండింది. సినిమా పిచ్చోడైన మెహమూద్, తండ్రి ఓం ప్రకాశ్‌ను పెట్టుబడి పెట్టమని పీడించుకు తింటుంటాడు. చివరకు ఒకనాడు ‘అసలేం తీస్తావో కథ చెప్పు’ అని ఓం ప్రకాశ్ అంటే మెహమూద్ దడుచుకు చచ్చే హారర్ స్టోరీ చెబుతాడు. నవ్వూ, భయమూ ఏకకాలంలో కలిగే ఆ సన్నివేశంలో మెహమూద్ యాక్షన్ ఎంత ముఖ్యమో ఓం ప్రకాశ్ రియాక్షన్ అంతే ముఖ్యం. ఆ సన్నివేశం మెహమూద్‌కు ఆ సంవత్సరం బెస్ట్ కమెడియన్‌గా ఫిల్మ్‌ఫేర్ సంపాదించి పెడితే వేదిక మీద అవార్డ్ అందుకున్న మెహమూద్ కారు ఎక్కి ఆనందబాష్పాలతో నేరుగా ఓం ప్రకాశ్ ఇంటికి వెళ్లాడు. ‘మనిద్దరం చేసిన దానికి నాకొక్కడికే అవార్డు ఏంటి? ఇది నీదీ నాదీ’ అని పాదాల దగ్గర పెట్టాడు. స్నేహితులు ఇలాగే ఉంటారు. స్నేహారాధన తెలిసిన కళాకారులు ఇలాగే! కళ ఈ దేశంలో ఎప్పుడూ మతాన్ని గుర్తు చేయనివ్వలేదు. మతం మనిషికి మించింది కాదని చెబుతూనే వచ్చింది. ఒక హిందూ సితార్తో ఒక ముస్లిం తబలా జుగల్బందీ చేసింది. ఒక హిందూ గాత్రంతో ఒక ముస్లిం సారంగి వంత పాడింది. ఒక హిందూ నర్తనతో ఒక ముస్లిం షెహనాయి గంతులేసింది. ‘మిమ్మల్ని అమెరికా పట్టుకెళతాం... హాయిగా సెటిల్ అవ్వండి’ అని బిస్మిల్లా ఖాన్‌తో అంటే, ‘తీసుకెళతారు నిజమే... నేను పుట్టిన ఈ కాశీ పురవీధులు, ఈ పవిత్ర గంగమ్మ ధార... వీటిని నాతో పాటు తేగలరా’ అని జవాబు పలికాడు. ఈ జవాబే ఈ దేశ సిసలైన సంస్కృతి. సంతూర్ విద్వాంసుడు పండిట్ శివ్‌కుమార్ శర్మ మొన్నటి దినాన మరణిస్తే ఆయనతో సుదీర్ఘ స్నేహంలో ఉన్న, కలిసి వందలాది కచ్చేరీలు చేసిన తబలా మేస్ట్రో ఉస్తాద్ జకీర్ హుసేన్ ఆయన పార్థివ దేహానికి తన భుజం ఇచ్చాడు. దహన సంస్కారాలు మొదలయ్యాక అందరూ పక్కకు తొలగినా స్నేహితుణ్ణి విడిచి రాను మనసొప్పక పక్కనే ఒక్కడే చేతులు కట్టుకుని నిలుచున్నాడు. ఈ ఫొటో వైరల్‌గా మారితే... ‘ఇది గదా ఈ దేశపు నిజమైన సంస్కారం’ అని ఎందరో కళ్లు చెమరింప చేసుకున్నారు. కష్టపెట్టేవాటిని ప్రకృతి ఎక్కువ కాలం అనుమతించదు. వడగాడ్పులను, తుపాన్లను, భూ ప్రకంపనాలను, విలయాలను లిప్తపాటే అనుమతిస్తుంది. ద్వేషానికి, విద్వేషానికి కూడా అంతే తక్కువ స్థానం, సమయం ఇస్తుంది. ప్రేమ దాని శిశువు. స్నేహం దాని గారాల బిడ్డ. ఆ గారాల బిడ్డకు అది పాలు కుడుపుతూనే ఉంటుంది. ఈ దేశం ప్రేమ, స్నేహాలతో తప్పక వర్ధిల్లుతుంది. -
ఘంటసాలకు భారతరత్న వచ్చే వరకు కృషి చేద్దాం
అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావుకి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్‌తో శంక నేత్రాలయ (యూఎస్ఏ) మరో నిర్విరామంగా కార్యక్రమాలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్ మాట్లాడుతూ ఘంటసాల గారి పాటలు విని పెరిగామని, వారి లేని లోటుని ఎవరు భర్తీ చేయలేరని అని అన్నారు. ఘంటసాల పాటలలోని వైవిధ్యాన్ని వివరించారు. ముఖ్యంగా ఒక శ్యామలా దండకం, శివశంకరి వంటి పాటలు ఇంకో వెయ్యేళ్ల తర్వాత కూడా ఎవరు ఘంటసాల లాగా పాడలేరని తెలిపారు. గిన్నిస్ బుక్ పురస్కార గ్రహీత కలైమామణి డాక్టర్ పార్వతి రవి ఘంటసాల మాట్లాడుతూ మనందరి ప్రయత్నాలు సఫలమై త్వరలోనే ఘంటసాలకి భారతరత్న రావాలని ఆకాంక్షించారు. ఇతర వక్తలు మాట్లాడుతూ విదేశాలలో నివసిస్తున్న తెలుగు సంస్థలతో పాటు తెలుగేతర సంస్థలన్నింటినీ ఏకతాటిపై తెచ్చి ఘంటసాలకు భారతరత్న వచ్చేంతవరకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అమెరికా నుంచి ఆపి (ఏఏపీఐ)అధ్యక్షులు డా. అనుపమ గోటిముకుల, విద్యావేత్త, ఆవిష్కర్త డా. బి కె కిషోర్, సేవా ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులు స్వదేష్ కటోచ్, బ్రూనై నుంచి తెలుగు సమాజం అధ్యక్షులు వెంకట రమణ (నాని), బోత్సవాన నుంచి తెలుగు అసోసియేషన్ అఫ్ బోత్సవాన అధ్యక్షులు వెంకట్ తోటకూర, మారిషస్ నుంచి ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్, తెలుగు మహాసభ ఆర్గనైజర్ సీమాద్రి లచ్చయ్య తదితరులు పాల్గొని ఘంటసాల పాటలతో తమకున్న అభిమానాన్ని, వారి పాటలలోని మాధుర్యాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికా లోని పలు తెలుగు జాతీయ సంస్థల సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులతో పాటు, బ్రూనై, బోత్సవాన, మారిషస్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా లోని పలు తెలుగు సంస్థలతో 73 టీవీ కార్యక్రమాలను నిర్వహించామని, ఈ టీవీ చర్చా కార్యక్రమాలకు ప్రపంచ దేశాలలోని తెలుగు సంఘాలకి అనుసంధాన కర్తగా సింగపూర్ నుండి రత్న కుమార్ కవుటూరు, న్యూజీలాండ్ నుండి శ్రీలత మగతల, ఆస్ట్రేలియా నుండి ఆదిశేషు వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కావలసిన సహకారాన్ని ఘంటసాల కృష్ణ కుమారి అందిస్తున్నారు. ఉగాది పర్వదిన వసంత నవరాత్రులు సందర్భంగా ఘంటసాల కు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్యస్పందన లభిస్తోందని నిర్వాహుకులు తెలిపారు. -
100 రోజులకు చేరుకున్న ‘ఘంటసాల స్వర రాగ మహాయాగం’
ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, "వంశీ ఇంటర్నేషనల్" & "శుభోదయం గ్రూప్స్" కలిసి నిర్వహించిన అమరగాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి సంవత్సర వేడుకల సందర్భంగా 366 రోజులపాటు నిర్వహించనున్న "ఘంటసాల స్వర రాగ మహాయాగం" కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతూ నేడు 100వ రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. "2021 డిసెంబర్ 4వ తేదీన ప్రారంభమై దిగ్విజయంగా కొనసాగుతున్న ఈ బృహత్ కార్యక్రమంలో ఇప్పటికే భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, హాంగ్ కాంగ్, ఖతార్, బహరైన్, ఒమాన్, అమెరికా మొదలైన దేశాలనుండి గాయనీ గాయకులు పాల్గొని ఘంటసాల వారి గీతాలను ఆలపించారు. ఇదే ఉత్సాహంతో సింగపూర్‌లో జరగబోయే ముగింపు సభ, "ఘంటసాల శత జయంతి" ఉత్సవాలకు సిద్ధమవుతున్నామని" వంశీ సంస్థల అధ్యక్షులు డా. వంశీ రామరాజు తెలిపారు. 100వ రోజు సందర్భంగా ప్రముఖ సినీ కవి భువనచంద్ర, అమెరికా నుండి ఇందుర్తి బాల రెడ్డి నిర్వాహక సంస్థల అధినేతలు డా వంగూరి చిట్టెన్ రాజు, డా వంశీ రామరాజు, సింగపూర్ నుండి కవుటూరు రత్న కుమార్, డా లక్ష్మీ ప్రసాద్, సమన్వయకర్త ప్రసన్నలక్ష్మి తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఘంటసాల వారికి 'భారతరత్న' పురస్కారం లభించడం సమంజసమని ప్రముఖులందరూ కలసి అభిప్రాయం వ్యక్తం చేశారు. అతిధుల సమక్షంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయనీగాయకులందరకు ఇవ్వబడే ధృవపత్రాలను వంశీ సంస్థ ఆవిష్కరించింది. ప్రముఖ గాయకుడు తాతా బాలకామేశ్వర రావు ఘంటసాల వారి చక్కటి వైవిధ్యభరితమైన పాటలను, పద్యాలను ఆలపించి ప్రేక్షకులను అలరించారు. కార్యక్రమ ప్రధాన సమన్వయకర్త రాధిక మంగిపూడి వ్యాఖ్యాతగా సభానిర్వహణ గావించగా, శుభోదయం మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడిన ఈ కార్యక్రమాన్ని వివిధ దేశాలలోని తెలుగువారందరూ వీక్షించి ఆనందించారు. (చదవండి: క్యాబ్ డ్రైవర్‌గా మారిన దిగ్గజ కంపెనీ సీఈఓ.. ఎందుకో తెలుసా?) -
‘ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలి’
పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు వర్ధంతి సందర్భంగా శుక్రవారం సాయంత్రం ‘ఘంటావధాని’గా బిరుదు పొందిన విశాఖ వాస్తవ్యులు, డా. సయ్యద్ రహమతుల్లా గారి గానావధానం కార్యక్రమం అంతర్జాల వేదికపై 14 దేశాల ప్రతినిధుల సమక్షంలో ఘనంగా నిర్వహించబడింది. ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, వంశీ ఇంటర్నేషనల్, శుభోదయం సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, ఘంటసాల శతజయంతి సంవత్సరంగా 366 రోజులపాటు నిర్వహింపబడుతున్న నిర్వహింపబడుతున్న “ఘంటసాల స్వర రాగ మహా యాగం” కార్యక్రమంలో భాగంగా 70వ రోజు విశేషంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. డా. వంశీ రామరాజు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు ఘంటసాల గారికి భారతరత్న పురస్కారంతో గౌరవించాలని, ఆంధ్ర రాష్ట్రంలో ఒక జిల్లాకు ఘంటసాల పేరు పెట్టాలని సూచించారు. వంశీ సంస్థ తరఫున ఘంటసాల చదువుకున్న విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో ప్రతి సంవత్సరం, ఉత్తమ విద్యార్థికి స్కాలర్షిప్ అందించబోతున్నామని ప్రకటించారు. 14 దేశాల నుంచి సుమారు 20 మంది పృచ్ఛకులు పాల్గొని ఘంటసాల మాస్టారి పాటలపై, వారి జీవిత విశేషాలపై వివిధ కోణాలనుంచి ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగి సభను రక్తి కట్టించారు. సమయోచితంగా అడిగిన ప్రతి ప్రశ్నకు వెంటనే సంపూర్ణమైన వివరణతో అవధాని సమాధానాలను అందించి అందరిని అబ్బురపరిచారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా మండలి బుద్ధ ప్రసాద్, మాధవపెద్ది సురేష్, సాలూరి వాసూరావు, భువనచంద్ర వంటి ప్రముఖులు విచ్చేసి విచ్చేసి ప్రసంగించారు. నిర్వాహకులుగా అమెరికా నుంచి డా. వంగూరి చిట్టెన్ రాజు సింగపూర్ నుంచి కవుటూరు రత్న కుమార్ పాల్గొనగా, రాధిక మంగిపూడి వ్యాఖ్యాతగా సభానిర్వహణ గావించారు. పృచ్ఛకులుగా గోవర్ధన్ మల్లెల, న్యూజిలాండ్, తటవర్తి కళ్యాణ్ చక్రవర్తి, రమకంచిభొట్ల, ఆస్ట్రేలియా, రాధిక నోరి, అమెరికా, లక్ష్మి రాయవరపు, కెనడా సత్య మల్లుల, మలేషియా, సింగపూర్ నుంచి ఊలపల్లి భాస్కర్, గుంటూరు వెంకటేష్, సుబ్బు వి పాలకుర్తి, కాత్యాయని గణేశ్న, ఉసిరికల తాతాజీ, ఖతార్, డాక్టర్ బూరుగుపల్లి వ్యాసకృష్ణ, ఉగాండా, విక్రమ్ కుమార్ పెట్లూరు, దక్షిణాఫ్రికా, వెంకప్ప భాగవతుల, ఖతార్, శ్రీమతి రాణి మాధవ్, ఒమాన్, డాక్టర్ వెంకటపతి తరిగోపుల, నార్వే, పీసపాటి జయ, హాంకాంగ్, రాజేష్ తోలేటి, యూ.కె, ఆర్ ప్రసన్నలక్ష్మి పాల్గొన్నారు. చదవండి: మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. మెల్బోర్న్లో గ్లెన్ మాక్స్వెల్ పెళ్లి -
‘శత వసంతాల ఘంటసాల’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: మహాగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావుపై సాంస్కృతికశాఖ డైరెక్టర్ రేగుళ్ల మల్లికార్జునరావు రూపొందించిన ‘శతవసంతాల ఘంటసాల’ పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఆయన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఆయన జీవిత చరిత్ర, కుటుంబ సభ్యులు, వివిధ రంగాల్లో ప్రముఖులు రాసిన అభిప్రాయాలతో పాటు, ఘంటసాల చిత్రమాలికలతో కూడిన పుస్తకాన్ని సాంస్కృతిక శాఖ డైరెక్టర్ రేగుళ్ల మల్లికార్జునరావు రూపొందించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. చదవండి: సీఎం జగన్ కడప జిల్లా పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే -
ఘంటసాల పుట్టిన రోజు: పాటకు భలే మంచిరోజు
Veteran Singer Ghantasala 100th Birth Anniversary: సాక్షి, హైదరాబాద్: అమరగాయకుడు ఘంటసాల మాస్టారు బతికుంటే నేటికి నూరేళ్లు. తెలుగుజాతికి అమూల్యవరంలా లభించిన ఆ మహాగాయకుడి గురించి ఎంతని రాయగలం. ఘంటసాసాల పుట్టిన రోజంటే తెలుగు పాట పుట్టిన రోజు. ఆ స్వరధార ఇప్పటికీ, ఎప్పటికీ అమృతమే. గాన గంధర్వడు, పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తోంది సాక్షి. 1922 డిసెంబర్ 4 న గుడివాడ సమీపములోని చౌటపల్లి గ్రామంలో ఘంటసాల సూర్యనారాయణ, రత్నమ్మ దంపతులకు జన్మించారు ఘంటసాల వెంకటేశ్వర్రావు. తండ్రి నుంచి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని గాయకుడిగా, స్వరకర్తగా తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలో లెజెండ్‌గా నిలిచారు. ఘంటసాల కంఠం ఒక మంత్రదండం. నండూరి ఎంకి అయినా, పుష్పవిలామైనా, భగవద్గీత అయిన అదొక పారవశ్యం. ఘంటసాల గురించి మాట్లాడుకోవడం అంటే భలేమంచి రోజు అని పాడుకోవడమే. తెలుగు సినిమా సంగీతాన్ని ఎవరెస్ట్ ఎత్తుకు చేర్చిన ఘనత ఘంటశాల మాస్టారుది. బెజవాడ నుంచి బ్రెజిల్ దాకా, పంజాబ్ నుంచి పారిస్ దాకా ఆయన ఖ్యాతి ఎరుగని వారుండరు. గేయ రచయితలు అక్షరాలకు ప్రాణం పోసేస్తే..ఆ మాటలను మల్లియల మాలికలు చేసి శ్రోతలను ఉర్రూతలూగించిన గళం. శిలలపై చిక్కిన శిల్పాల సరిగమలతో సమో్మహనం చేసిన స్వరం. ఆయన నిష్క్రమించి నాలుగు దశాబ్దాలు దాటిపోయినా సినీ సంగీతంలో ఓలలాడించిన జగదేకవీరుడాయన. ఇరవై ఏళ్ల నవ యవకుడిగా క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అంతేకాదు పద్దెనిమిది నెలల జైలు శిక్ష కూడా అనుభవించారు.ఆతరువాత సముద్రాల రాఘవాచార్యతో ఏర్పడిన పరిచయం ఆయన జీవితాన్ని అద్భుత మలుపు తిప్పింది. గాయకుడిగా పాడిన తొలి సినిమా స్వర్గసీమ, ఆ పాటకుగాను ఆయన అందుకున్న పారితోషికం 116 రూపాయలు. వేన వేల పాటలు పాడటమే కాదు, స్వరకర్తగా తన ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగించారు. ఆయన జీవితాన్ని మలుపుతిప్పిన చిత్రం పాతాళ భైరవి. దీంతోపాటు కీలు గుర్రం, మనదేశం, మాయాబజారు, లవకుశ, గుండమ్మ కథ, మిస్పమ్మ , రహస్యం, దేవదాసు, షావుకారు భక్త తుకారం, దేవుడు చేసిన మనుషులు లాంటి గొప్ప గొప్ప సినిమాలతోపాటు మరెన్నో భక్తిరస గీతాలు, పద్యాలతో తెలుగు సినీ అభిమానులను ఓలలాడించారు. ఆయన పాటలు గురించి మాట్లాడుకోడమంటే ఆకాశంలో చుక్కలు ఏరుకోవడమే. తెలుగు సినిమాకు ఆయన కాలం ఒక స్వర్ణయుగం. తరాలు మారినా వేణునాదమై, అమృత వర్షపై కురిసిన ఆణిముత్యల్లాంటి ఆయన పాటలు మరో సహస్ర కోటి సంవత్సరాలు గడిచినా నులివెచ్చగా మన హృదయాల్ని తాకుతాయి. పాడవోయి భారతీయుడా, తెలుగు వీర లేవరా అని వెన్నుతట్టిన లేపిన ఆయన పాట విని రోమాంచితం కాని అభిమాని ఎవరుంటారు. ఈ జీవన చదరంగంలో అన్నా, నేను పుట్టాను ఈ లోకం ఏడ్చింది అన్నా, నిన్నటి కన్నా మొన్న మిన్నగా అంటూ విరహ వీణలను మోగించినా ఆయనకే చెల్లు. జోలపాడినా, వెన్నుతట్టినా, మొట్టికాయలేసినా, భావగీతమైనా, విషాదగీతమైనా, విప్లవగీతమైనా ఘంటసాల తరువాతే ఎవరైనా. కేవలం 51 ఏళ్ల వయసులోనే ఆయనను కోల్పోవడం తెలుగు జాతి దురదృష్టం. 1974 ఫిబ్రవరి 11న ఘంటసాల తుదిశ్వాస విడిచి పాటను దుంఖ సాగరంలో ముంచేశారు. 1970లో భారత రాష్ట్రపతి వీవీ గిరి చేతుల మీదుగా నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 2003లో, భారత ప్రభుత్వం ప్రత్యేక తపాలా స్టాంపు విడుదల చేసింది. తెలుగు పాట ఖ్యాతిని అజరామరం చేసిన ఆ అమరగాయకుడికి మరోసారి శతసహస్ర వందనాలు చెబుదాం. అమరగాయకుడు 366 రోజులపాటు ఘంటసాల స్వర రాగ మహాయాగం నిర్వహిస్తున్నారు. 2021 డిసెంబరు 04 నుంచి 2022 డిసెంబరు 04 వరకు ప్రతీ శని, ఆదివారాలలో భారత కాలమానం ప్రకారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు వర్చువల్‌గా ఈ వేడుకలు జరుగుతాయి. ప్రారంభోత్సవ ప్రత్యేక కార్యక్రమం డిసెంబరు 4 సాయంత్రం 5:30 గంటలకు మొదలవుతుంది. ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్, వంశీ ఇంటర్నేషనల్, శుభోదయం గ్రూప్స్ సంయుక్త ఆధ్వర్యంలో అమరగాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శతజయంతి సంవత్సరం సందర్భంగా 366 రోజులపాటు ఘంటసాల స్వర రాగ మహాయాగం నిర్వహిస్తున్నారు. -
ఘంటసాల కుమారుడు కన్నుమూత
చెన్నై: సుప్రసిద్ధ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు రెండో కుమారుడు రత్న కుమార్ కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని కావేరి హాస్పిటల్లో చేరిన ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇంతకుముందే ఆయనకు కరోనా సోకగా, రెండు రోజుల క్రితమే కోవిడ్ నెగిటివ్ వచ్చింది. అయితే చాలాకాలంగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతూ డయాలసిస్‌పై ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన నేడు మరణించారు. రత్నకుమార్ ఆకస్మిక మరణంతో ఘంటసాల కుటుంబంలో విషాదం నెలకొంది. రత్నకుమార్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఘంటసాల, సావిత్రి దంపతుల రెండో కుమారుడే రత్న కుమార్. ఈయన ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. ఒకానొక సందర్భంలో ఏకధాటిగా ఎనిమిది గంటల పాటు డబ్బింగ్ చెప్పి రత్నకుమార్ రికార్డు సృష్టించారు. తెలుగు, తమిళ, మలయాళ సహా వివిధ భాషల్లో కొన్ని వేల సినిమాలకు, సీరియల్స్‌కు రత్నకుమార్ డబ్బింగ్ చెప్పారు. చదవండి : ఎవరింట్లోనైనా నాన్న అలాగే ఉంటాడు! 'తొమ్మిదో ఏట వివాహం.. అప్పుడు నా భార్యకు మూడేళ్లు' -
'తొమ్మిదో ఏట వివాహం.. అప్పుడు నా భార్యకు మూడేళ్లు'
ఘంటసాల సంగీతం సమకూర్చిన సినిమాల టైటిల్స్‌లో.. ‘సంగీతం – ఘంటసాల, సహాయకులు – పట్రాయని సంగీతరావు’ అని కనిపించేవి.అలా సంగీతరావు పేరు సినీ ప్రేక్షకులకు సుపరిచితం. ఘంటసాల గురువులు పట్రాయని సీతారామశాస్త్రి. వారి కుమారుడే సంగీతరావు.గురువుగారి మీద భక్తి మాత్రమే కాదు, తన ఆలోచలకు తగినవానిగా భావించి ఘంటసాల, సంగీతరావును తనకు సహాయకుడిని చేసుకున్నారు. జూన్ 2, 2021 రాత్రి 7 గం. 50 ని.లకు 101 సంవత్సరాల వయసులో సంగీతరావు కన్నుమూశారు.ఈ సందర్భంగా..సంగీతరావు సుమారు నాలుగు మాసాల క్రితం సాక్షికి ఇచ్చిన ఆఖరి ఇంటర్వ్యూ వివరాలు. నేను రౌద్రి నామ సంవత్సరంలో పుట్టాను. నా తరవాత ఇద్దరు తమ్ముళ్లు. నారాయణమూర్తి, ప్రభాకరరావు. ఆ తరవాత ఆడపిల్ల పుట్టినప్పుడు అమ్మ నిర్యాణం చెందింది. ఆడపిల్ల కూడా కన్నుమూసింది. ఆ తరవాత మా జీవితం కష్టసాధనం అయింది. మా నాన్నగారికి మమ్మలి పెంచడం కష్టమైంది. నాన్నగారు సాలూరు వచ్చేశారు. అక్కడ మాకు ఒక చిన్న ఇల్లు ఉండేది. అక్కడ మా ముగ్గురు అన్నదమ్ముల్ని మా దొడ్డమ్మ ఓలేటి లక్ష్మినరసమ్మ పెంచింది. ఆవిడ మంచి సమర్థురాలు. ఆవిడకు సాహిత్య జ్ఞానం ఉండేది. ఆవిడ పోయేవరకు మా ఇంట్లోనే ఉంది. అక్కడ చాలామంది సంగీత విద్యార్థులు సంగీతం నేర్చుకోవటానికి నాన్న దగ్గర వచ్చేవారు. రొంబ నరసింహరెడ్డి అనే విద్యార్థి కూడా వచ్చేవాడు. అతను మంచి వ్యాయామ విశారద. నా చేత కూడా చేయించేవాడు. బాగా పాడేవాడు. హరికథలు కూడా చెప్పేవారు. మా తాతగారిది కిండ్లాం అగ్రహారం. అది ఆరామద్రావిడ గ్రామం అది. మాదిసంగీత కుటుంబం కావటం చేత బాల్యంలోనే సరళీ స్వరాల దగ్గర నుంచి అన్ని రకాల పాటలు పాడుతూ ఉండటం అలవాటైంది నాకు. మా కుటుంబంలో మా తాతయ్యగారి దగ్గర నుంచి అందరూ ఒక రకమైన భక్తిప్రపత్తులతో ఉండేవారు. విశిష్టంగా పూజలు చేయటం వంటివి ఉండేది కాదు. సహజంగా భగవంతుని మీద భక్తి ఉండేది. తాతగారి శిక్షణలో తాత్విక రచనలు కంఠస్థం అయ్యేవి. నాగావళి ఒడ్డున... ఐదో ఏట అక్షారాభ్యాసం చేసినప్పటి నుంచి స్కూల్‌కి వెళ్లడం, ఇంటికి రావడం అలవాటు. నేను చదువుకునే రోజుల్లో చాలా బహుమతులు అందుకున్నాను. అందులో ముఖ్యంగా గుర్తున్నది ఆక్స్‌ఫర్ట్ డిక్షనరీ. స్పోర్ట్స్‌లో కూడా బహుమతులు వచ్చాయి. నాగావళి నది బ్రిడ్జి పక్కనే ఉన్న ఎలిమెంటరీ స్కూల్లో 1926లో ఒకటో తరగతి శివరావుపంతులు గారి దగ్గర చదివాను. చదువుకున్నాను. ఆ స్కూల్‌ని ఒక పురోహితుల కుటుంబం నడిపేది. ఆ పక్కనే కొబ్బరి ఉండలు అమ్మే దుకాణం ఉండేది. అక్కడ కానీకి మూడు ఉండలు ఇచ్చేవారు. గ్రామఫోను వింటూ సాధన.. శివరావు పంతులు గారు ఆ గ్రామంలో సంగీతాభిలాష ఉన్నవారికి నాన్నతో సంగీతం చెప్పించడానికి పిలిపించారు. అప్పుడు మేం శ్రీపాద సుబ్బారావు పంతులు గారు అనే పండితుడి ఇంట్లో ఒక భాగంలో ఉండేవాళ్లం. వాళ్లమ్మాయికి నాకు అప్పట్లో నాన్న సరిగమలు చెప్పటం గుర్తుంది. ప్రతి రోజూ నేను స్కూల్ నుంచి వస్తున్నప్పుడు ఒక గ్రామఫోను రికార్డు వినేవాడిని. అది విన్నప్పుడు నాకు అత్యాశ్చర్యం వేసింది. ఇంటికి వచ్చి, అమ్మతో, ‘డబ్బాలో నుంచి పాటలు వస్తున్నాయి’ అని చెప్పాను. అప్పుడే గ్రామఫోను రికార్డులు కొత్తగా వచ్చాయి. బిడాలం రాసప్ప అనే ఆయన పెద్ద గొంతుకతో పాడిన పాటలు ఆ రికార్డులో విన్నాను. రాసప్పగారి గ్రామఫోను రికార్డులు వింటూ పాటలు పాడటం అలవాటైంది. చిన్నతనం నుంచి నేర్చుకోవటం కంటె విని గ్రహించిందే ఎక్కువ. అలా పాడటం అలవాటైంది. ఏ మాత్రం మొహమాటం లేకుండా, ఎవరు పాడమన్నా గట్టిగా పాడేసేవాడిని. అప్పట్లోనే అక్కడ నాన్నకి కొత్తకొత్త పరిచయాలు ఏర్పడ్డాయి. కొన్ని కుటుంబాల వారు నాన్న చేత సంగీతం చెప్పించుకునేవారు. ఇవి కాకుండా, ఆర్థికంగా శ్రీమంతులు కూడా కొందరు నాన్న దగ్గర సంగీత సాధన చేసేవారు. గరిమెళ్ల గోదావరి శర్మ అనే ఆయన మా నాన్న దగ్గరే సంగీత కృషి చేశారు. ఆయన నాటకాల్లో లెగ్ హార్మోనియం వాయించేవారు. ముఖ్యంగా రోషనారా నాటకంలో ఆయన హార్మోనియం ప్రత్యేకం. చిర్రావూరు నరసింహారావు అనే కళాకారుడు రోషనారా వేషం వేసేవారు. బొబ్బిలి కోటలో... బొబ్బిలి రాజు గారికి పట్టాభిషేకం జరిగే సమయంలో ఆయన పట్టాభిషేకం మీద నారాయణశాస్త్రిగారు అనే పండితుడు రాగమాలికలో కృతి రచించి నాతో పాడించారు. బొబ్బిలి రాజావారికి పూజామహల్ అని ఒక పూజా గృహం ఉండేది. అక్కడ పూజ సందర్భంలో సంగీతం పాడేవారు మా గురువు గారు. నన్ను కూడా రోజూ తీసుకువెళ్తుండేవారు. ఆ కార్యక్రమానికి వచ్చినవారికి బొబ్బిలి రాజదాసీలు తాంబూలాలు ఇచ్చేవారు. సంభావన కూడా అందించేవారు. ఆరోజుల్లో బొబ్బిలి వైభవోపేతంగా ఉండేది. బొబ్బిలికి దగ్గరలోనే ఆయనకు పట్టాభిషేకం జరిగింది. అక్కడ తాజ్‌మహల్‌లాంటి మహల్ ఉండేది. అది ఇప్పటికీ ఉంది. దానిని గెస్ట్ హౌస్ అనేవారు. బొబ్బిలి రాజా చీఫ్ మినిస్టర్‌గా ఉండేవారు. అలా బొబ్బిలిలో ఐదు వరకు చదువుకున్నాను. రెండు మూడు తరాల పేర్లు... నాన్నకి ఏదో ఒకటి రాసుకోవటం బాగా అలవాటు. ఆయనను అనుకరించటం చేత మాకూ అదే అలవాటైంది. చిన్నతనం నుంచి పుస్తక పఠనం ఉండేది. మొగలాయి దర్బారు వంటి సంప్రదాయ రచనలు, భయంకర నారీ పిశాచి వంటి డిటెక్టివ్ నవలలు అన్నీ చదివేవాడిని. నా పదేళ్ల నుంచి చదివిన జ్ఞాపకం ఉంది. మా మాతామహులు పురాణ శ్రవణం చేసేవారు. అలా భాగవతం పద్యాలన్నీ కంఠస్థం వచ్చాయి. చిన్నప్పటి నుంచి కవీశ్వరుల గురించి వినటం అలవాటు. తిరుపతి వేంకట కవుల గురించి నాన్నగారు చెప్పేవారు. ఇంజరం, యానాము, పల్లెపాలెము అంటూ చెప్పిన పద్యాలు వినేవాడిని. మా తాతయ్య అతి బాల్యం నుంచి భారతరామాయణ భారతాలు చెప్పేవారు. పౌరాణిక గాథలన్నీ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఆయన సహజంగా ఒక అమాయకమైన భక్తుడు కూడాను. అప్పట్లోనే వెంకటపార్వతీశ కవులు, తిరుపతి వెంకట కవులు, వీరేశలింగం,... తెలుగు సాహిత్యంలో ఉండే రెండు మూడు తరాల కవుల పేర్లు తెలుసు. వివాహం... మా తల్లి నా చిన్నతనంలోనే గతించారు. నాకు తొమ్మిదో ఏట వివాహం అయిపోయింది. అప్పుడే శారదా బిల్లు అమలులోకి వస్తోంది. ఆ బిల్లు ప్రకారం బాల్య వివాహాలు చేసుకోకూడదు. అందువల్ల ఆ బిల్లు ఇంకా అమలులోకి రాకముందే కిళ్లా అగ్రహారం వాస్తవ్యులు ఆకొండి లింగమూర్తి గారి అమ్మాయితో వివాహం జరిగిపోయింది. నా వివాహ సమయానికి నా భార్య వయసు మూడేళ్లు. పేరు శ్రీలక్ష్మి. స్వరపల్లవి గ్రంథం... అప్పట్లో నాన్నగారు సంచారంలో సంగీత కచేరీలకు తిరుగుతుండేవారు. అక్కడ ఆకొండి నారాయణ శాస్త్రి అనే సంగీత పండితుడు ఉండేవారు. నన్ను ఆయన దగ్గరకు సంగీతానికి పంపించారు. ఆయన వీణ, వయొలిన్ వాయించేవారు. బొబ్బిలి గరల్స్ స్కూల్లో సంగీతం మాస్టారుగా ఉండేవారు. అక్కడ పని చేసే వారికి సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌కి ఉన్నంత గౌరవం ఉండేది. నేను అక్కడ ‘స్వర పల్లవి’ అనే గ్రంథం గురించి తెలుసుకున్నాను. స్వర పల్లవులు నేర్చుకున్నాను. ఆ రోజుల్లో ఈ స్వర పల్లవులు మిగతా వారు చెప్పేవారు కాదు. ఈ గ్రంథం బొబ్బిలిలో ఉండే ‘వాసా’ వారు రచించారు. ఆ రచనల్నీ వీణ మీద వాయించడానికి వీలుగా ఉండేవి. కల్యాణి రాగం, హిందోళ రాగం కలిపి మొత్తం పది స్వర పల్లవులు చెప్పుకున్నాను. అక్కడే నవరాగ మాలిక వర్ణం కూడా చెప్పుకున్నాను. సంగీత నిర్వహణ.. నా చిన్నతనం నుంచే సంగీత నృత్య రూపకాలకు సంగీతం చేసే అవకాశం వచ్చింది. క్షీరసాగర మథనం, చండాలిక, శాకుంతలం, శ్రీనివాస కల్యాణం, హరవిలాసం, కల్యాణ రుక్మిణి వంటి నృత్యరూపకాలకు సంగీతం అందించాను. కూచిపూడి నాటకాలకు బాలాంత్రపు రజనీకాంతరావు, ద్వారం భావనారాయణ, మల్లిక్ వంటివారు సంగీతం అందించేవారు. ‘శ్రీనివాస కల్యాణం’ నృత్య రూపకానికి సంగీతం సమకూర్చటం గురించి చర్చ జరిగినప్పుడు బిఎన్ రెడ్డిగారు డైరెక్టరుగా ఉన్నారు. ఆయన క్షీరసాగర మథనం, చండాలిక, శాకుంతలం వంటి సంగీత రూపకాలకు నన్ను సంగీతం సమకూర్చమన్నారు. శ్రీనివాస కల్యాణం తరవాత హరవిలాసం, కల్యాణ రుక్మిణి చేశాను. నాన్నకు శిష్యుడయ్యారు.. 1936లో మ్యూజిక్ కాలేజీకి ఆదిభొట్ల నారాయణదాసు ఆ తరవాత ద్వారం వెంకటస్వామినాయుడుగారు ప్రిన్సిపాల్‌గా పని చేశారు. ఆయన తరవాత ప్రిన్సిపాల్‌గా అపాయింట్ చేయటానికి... ద్వారం నాయుడుగారు ఎనమండుగురిని సెలక్ట్ చేశారు. అందులో నాన్నగారు ఉన్నారు. అక్కడ అప్పటికే నాన్నగారు గానకచేరీలు చేస్తుండేవారు. స్థానిక విద్వాంసులంతా నాన్న మీద అభిమానంతో ఉన్నారు. విజయనగరంలో ఉండే వారిని సెలక్ట్ చేసుకోవటం మంచిదనే సూచనతో, నాన్న ఆ కాలేజీ ప్రిన్సిపాల్ అయ్యారు. ఆ సమయంలోనే ఘంటసాల గారు నాన్నకు శిష్యుడయ్యారు. మద్రాసుకి... 1952లో మద్రాసు వచ్చాను. అప్పుడు ఘంటసాల ‘పరోపకారం’ సినిమా తీస్తున్నారు. నేను ఆయన దగ్గరే ఉన్నాను. ఆయనకు కొన్ని పాటలు పాడి, మళ్లీ విజయనగరం వెళ్లిపోయాను. ఆ తరవాత మళ్లీ 1954లో తిరుపతి వెళ్లాను. అప్పుడు ఘంటసాల గారు నన్ను పిలిపించి, నన్ను ఆయన దగ్గరే ఉండిపోమన్నారు. ఆయన మాట ప్రకారం ఘంటసాలగారితో అక్కడే ఉండిపోయాను. 1971 వరకు కూడా ఘంటసాల గారితో వాళ్లింటోనే ఒక భాగంలో ఉండేవాడిని. 1971 నాటికి ఆయన ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. ఉత్సాహంగా ఉండే వారు కాదు. కూచిపూడి ఆర్ట్ అకాడెమీ... కూచిపూడి ఆర్డ్ అకాడెమీని వెంపటి చిన సత్యం గారు నిర్వహించేవారు. అక్కడ నన్ను సంగీతం క్లాసులు నిర్వహించమన్నారు. ఘంటసాల గారిని అడిగితే ఆయన ‘ప్రస్తుతం పనులు లేవు కదా! వెళ్లు’ అన్నారు. అలా కూచిపూడి ఆర్డ్ అకాడెమీలో చేరి, గాయకుడిగా, వాద్య కారుడిగా వారి దగ్గరే ఉండిపోయాను. 1974లో ప్రవేశించి 2012లో వెంపటి చిన సత్యం గారు పోయేవరకు అక్కడే ఉండిపోయాను. నా జీవితమంతా అక్కడే గడిచిపోయింది. ఘంటసాలగారితో అప్పట్లో జర్మనీ, ఇంగ్లండ్ వెళ్లాను. ఆ తరవాత అమెరికా వెళ్లాను. కూచిపూడి ఆర్ట్ అకాడెమీలో ప్రవేశించాక యూరప్, హవాయ్ ద్వీపాలు, అమెరికాలోని అన్ని ప్రదేశాలు తిరిగాను. అమెరికా, రష్యాలకు ఇండియా ఫెస్టివల్స్ జరిగినప్పుడు వెళ్లాను. ఆహారపు అలవాట్లు... సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం వల్ల నా ఆహారపు అలవాట్లు కూడా అవే ఉండేవి. పప్పు, కూర, పచ్చడి, పులుసు, ఊరగాయలు తినేవాడిని. ఆవకాయ, అప్పడాలు, వడియాలతో పాటు,.ఆవకాయలు, నిమ్మకాయ, దబ్బకాయ వంటి సంవత్సరమంతా నిల్వ ఉండే పదార్థాలన్నీ తినేవాడిని. నా వయసు వాళ్లందరికీ ఇప్పుడు ఉండే స్వీట్ల కంటె...మినప సున్ని, పాకం చలిమిడి వంటి వాటి మీదే మక్కువ ఉండేది. అన్నిరకాల స్వీట్లు తెలిసినా, నేను దేనికోసమూ తాపత్రయ పడినట్లు జ్ఞాపకం లేదు.మా కుటుంబంలో సంగీత సాధన చేసిన మొట్టమొదటి మనిషి మా తాతగారు వెంకటనరసింహశాస్త్రి పట్రాయని. మా ఇంటి పేరు గురించి చెప్పినప్పుడు ఒక మాట చెప్పాలి. మా ముందు తర ం వారు ‘పట్రాయుడు’ అని చెప్పేవారట. మా నాన్న దగ్గర నుంచి ‘పట్రాయని’ గా మారింది. ఒకాయన చేత శతావధానం చేయించారు మా నాన్న. ఆయన మా ఇంటి పేరు విని, ఇంటి పేర్లు ద్వితీయా విభక్తిలో ఉండాలి అన్నారట. దానితో మా ఇంటి పేరు పట్రాయుడు నుంచి పట్రాయనిగా మారింది. ఆ కషాయం తాగితే దగ్గు బాగా తగ్గుతుందనేవారు అరవయ్యేళ్ల తరవాత కూడా నేను వార్ధక్యం వచ్చిందనుకోలేదు. తొంభయ్యేళ్లు వచ్చిన తరవాత కూడా వార్ధక్యం వచ్చిందన్న అనుభూతి లేదు. ఈ మధ్యనే అంటే వందేళ్లు నిండిన తరవాత క్రమేపీ దృష్టి అవి తగ్గుతుంటే, ‘ఏమిటీ ఇలా ఉన్నాను’ అనే భావన కలుగుతోంది.మా చిన్నతనంలో సాలూరులో ప్రతి సంవత్సరం కలరా వచ్చేది. ఆ వ్యాధితో పోయిన వారిని సన్నాయి మేళంతో తీసుకువెళ్లేవారు. నేను రెండు మూడు క్లాసులు చదువుత్ను రోజుల్లో ఆ ప్రాంతంలో మలేరియా ఎక్కువ ఉండేది. నేను మద్రాసు వచ్చేదాకా కూడా ఈ వ్యాధి ఉన్నట్టు గుర్తు. మీజిల్స్ వ్యాధి చాలా సార్లు వచ్చింది. ఆ రోజుఎల్లో ఎక్కువగా ఆయుర్వేద వైద్యులుండేవారు. సాలూరులో రాజకుంటుంబాలకు సంబంధించిన ఒక వైద్యుడు ఉండేవారు. చాలా మంచి మనిషి. ఆయనకు ఒక ఆశ్రమం కట్టిచ్చారు. అందులోనే ఒక కొట్లో ఉండేవారు. ఆయన ఏదో మందు ఇస్తూ ఉండేవారు. ఎవ్వరినీ కానీ కూడా అడిగేవారు కాదు. కాని అక్కడకు వచ్చినవారు ఒక కానీ ఇచ్చేవారు. ఆయన చనిపోయిన తరవాత చూస్తే రెండు బస్తాల కాన్లు వచ్చాయి. సాలూరు ప్రాంతంలో అడ్డసరం చెట్లు ఎక్కువగా ఉండేవి. అవి వైద్యానికి బాగా ఉపయోగపడేవి. వాటి ఆకులను పుటం పెట్టి, ఆ కషాయం తాగితే దగ్గు బాగా తగ్గుతుందనేవారు. ఆ రోజుల్లోనే ఘంటసాల అరెస్టు అయ్యారు నా చిన్నతనంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్లు తెల్లదొరలే ఉండేవారు. స్వాతంత్రం వచ్చేనాటికి నేను సంసారంలో ప్రవేశించాను. అప్పుడు కలివెరలో ఐదేళ్లున్నాను. తమ్మినేని పాపారావు అన్నాయన ఆ గ్రామానికి ఎంఎల్ఏగా ఉండేవారు. స్వతంత్ర సాధన గురించి రాజకీయాలు ఎక్కువగా ఉండేవి. చాలామంది అరెస్టులు అవుతుండేవారు. అల్లర్లు జరిగాయి. రాజకీయ పోరాటాలు జరిగాయి. ఆ రోజుల్లోనే ఘంటసాల అరెస్టు అయ్యారు. అప్పట్లో ఆయన రోడ్డు మీదకు వెళ్లి అల్లర్లకు సంబంధించి పాటలు పాడేవారు.1936లో జరిగిన ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ పోటీ చేసింది. సాలూరు నుంచి పోటీ చేసిన వి. వి. గిరి గారు పోటీ చేశారు. ఆయనకు పోటీగా బొబ్బిలిరాజు నిలబడ్డారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన వి. వి. గిరిగారు, అక్కడ ఉన్న పేరయ్య హోటల్లో భోజనం చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనే గెలిచారు. – సంభాషణ: వైజయంతి పురాణపండ -
ఎవరింట్లోనైనా నాన్న అలాగే ఉంటాడు!
నాన్న ఏ కూతురికైనా ఎన్నాళ్లు గడిచినా మనసులో నిలిచి ఉంటాడు. మరి రోజూ ఎక్కడో ఒకచోట ఏదో ఒక సందర్భంలో తన పాటతో వినిపించే ఘంటసాల వంటి తండ్రికి పుట్టిన కూతురు ఆ నాన్నను ఎలా మరచిపోగలదు? ఘంటసాల పెద్ద కుమార్తె శ్యామల నేడు ఆయన జయంతి సందర్భంగా సాక్షితో పంచుకుంటున్న జ్ఞాపకాలివి ఆమె మాటల్లోనే... ‘మీ నాన్నగారు అంత గొప్ప గాయకులు, సంగీత దర్శకులు కదా! మరి ఇంట్లో మీ అందరితో ఎలా ఉండేవారు? మామూలుగా మాట్లాడేవారా?’ – ఇవి మేము కొన్ని వందలసార్లు అడిగించుకున్నాం. ఇవేం ప్రశ్నలు? ఎవరింట్లోనైనా నాన్న అనే వ్యక్తి అందరితో మామూలుగా మాట్లాడక మరొకలా ఎలా ఉంటారబ్బా? మనమూ అందరిలాంటి వాళ్లమే కదా? మరెందుకు అంత కుతూహలంగా అడుగుతున్నారు? అని ఆశ్చర్యంగాను, తికమకగాను ఉండేది. అప్పట్లో బాగా చిన్న వాళ్లం అవడం వల్ల నాన్నగారి ప్రత్యేకత తెలిసేది కాదు’’ సాదాసీదాగా నాన్నగారు సినిమా పరిశ్రమకి చెందినవారైనా మా ఇంట్లో ఆ ప్రభావం ఏమాత్రం ఉండేది కాదు. అందరం నేల మీద చిరుచాపలు పరచుకుని కూర్చునే భోజనం చేసేవాళ్లం. హాల్లో కింద కూర్చుని ఎవరి స్కూలు పెట్టి వాళ్లు ఒళ్లో పెట్టుకుని హోమ్‌వర్కు రాసుకునేవాళ్లం. రాత్రివేళ వరుసగా నవారు మంచాలు వేసుకుని పడుకునేవాళ్లం. వేసవి కాలమైతే డాబా మీద చాపలు వేసుకుని నక్షత్రాలను చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ, నిద్రలోకి జారుకునేవాళ్లం. ఏ రోజైనా ఉదయం ఆరు గంటలకి పక్కలు తీసి సర్దిపెట్టాలిసిందే. పెద్దవాళ్లకి మాత్రం కాఫీ, టిఫిను. పిల్లలకి ఊరగాయ, పెరుగు కలిపి చద్దన్నమే. ఎనిమిదిన్నరకల్లా పిల్లల సెక్షన్ పని పూర్తి. వేసవి సెలవులకి పిన్నిగారి పిల్లలు, మావయ్యగారి పిల్లలు వచ్చేవారు. సంగీతరావుగారి పిల్లలు, మేము అందరం కలిపి దాదాపు పదిహేనుమంది ఉండేవాళ్లం. పెద్ద ఆవరణలో ఇంటి చుట్టూ పరుగెత్తడానికి కావలసినంత చోటుండేది. దొంగ పోలీసు, దాగుడు మూతలు, ఏడు రాళ్లు, చెడుగుడు, ప్లేబాల్, బొంగరాలు, గోళీలు, స్కిప్పింగ్, రింగ్, షటిల్‌కాక్... అబ్బ! ఎన్ని ఆటలు ఆడేవాళ్లమో.. అప్పుడప్పుడు నాన్నగారు విశ్రాంతిగా ఇంట్లో పడుకున్నప్పుడు దాక్కోవటానికి ఆయన మంచం కింద దూరేవాళ్లం. అమ్మ వచ్చి, ‘బయటికిపోయి ఆడుకోండి’ అని కసిరేది. నాన్నగారు మాత్రం నిద్రపోతున్నట్లు నటించేవారు. కానీ ఆయనలో తన్నుకు వస్తున్న నవ్వు మెలకువగా ఉన్నట్లు పట్టించేసేది. అంతమంది కలిసి బిగ్గరగా అరుచుకుంటూ, పరిగెత్తుతూ, కొట్టుకుంటూ, అలుగుతూ, గోలగోల చేస్తుంటే నాన్న ఎంత సంబరంగా చూసేవారో!! అన్నీ ఇంట్లోనే.. నాన్నగారికి విడిగా ఆఫీసు లేదు. ఎవరినైనా ఇంటికే రమ్మనేవారు. అందువల్ల ఇంటికి ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తుండేవారు. సముద్రాల, కృష్ణశాస్త్రి, యామిజాల పద్మనాభస్వామి, కొసరాజు, కోట సత్య రంగయ్య శాస్త్రి వంటి సాహిత్య మూర్తులతో పాటు, ఆర్కెస్ట్రా వాళ్లు, సంగీత దర్శకులు, గాయకులు.. అందరితో ఇల్లు కళకళలాడుతూ ఉండేది. అందరం పాటల పోటీలు, నాటకాలు – చాలా బిజీగా ఉండేవాళ్లం. ప్రైజు సాధించుకుని వచ్చేవాళ్లం. మొదటిసారి నా పన్నెండవ ఏట రేడియో నాటకానికి చెక్కు ఇచ్చారు. ఆ తరువాత చిన్నన్నయ్యకి చెక్కు వచ్చింది. ఆ రోజు నాన్నగారి సంతోషానికి పట్టపగ్గాలు లేవు. ‘నా పిల్లలు కేవలం గుర్తింపు తెచ్చుకోవడమే కాదు, అప్పుడే సంపాదనపరులు కూడా అయ్యారు’ అంటూ పొంగిపోయేవారు. అప్పటికప్పుడు స్వీట్లు తెప్పించేవారు. పండుగలకు పాటలు.. వినాయకచవితి నాడు పూజ పూర్తయ్యాక అందరం కలిసి పాటలు పాడడం, దసరాకి బొమ్మల కొలువులు, పేరంటాలు, దీపావళికి ఇంట్లో చిచ్చుబుడ్లు, మతాబులు చుట్టించడం, సంక్రాంతికి ముందు నెలరోజులు ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలని తీర్చడం, భోగిమంటలు – ఇవి మాత్రమే పండుగలు కావు – నాన్నగారితో గడిపిన ప్రతీ క్షణం ఒక పండగలాగే గడిచిపోయింది. చుప్పనాతి దేవుడు నాన్నగారిని మాకు కనిపించకుండా లాక్కుపోయాడు గానీ, ఆయన జ్ఞాపకాలని, ఆయన ఉనికిని, మాటని ఆలోచనలని మాత్రం ఈ నాటికీ అంగుళమైనా కదిలించలేకపోయాడు. – సంభాషణ: డా. వైజయంతి పురాణపండ నాన్న మంచి నేర్పారు.. ‘చిన్న పెద్ద అని వయోభేదం గానీ, స్థాయీ భేదం గానీ చూడకుండా ఎవరికి యివ్వవలసిన ప్రాధాన్యాన్ని వారికి ఇవ్వాలి, మన అభిప్రాయాలు మనకి ఉన్నట్లే అందరికీ ఉంటాయి, వాటిని గౌరవించాలి, ఎక్కడ ఎలా ఉన్నా లోపాలు ఎన్నక అందరినీ కలుపుకుని పోవాలి, ఏది కావాలన్నా దానికి కృషి చేయడమే మన వంతు. ఫలితం అనుకూలంగా వస్తే మరొక లక్ష్యం వైపు దృష్టి పెట్టు, ప్రతికూలిస్తే మళ్లీ ప్రయత్నించు. ఎలాగో అలా మరమనిషిలా బ్రతికేయడం కాదు, బుద్ధితో మనసుని అనుసంధానం చేసి జీవించు, అలా చేయగలిగినప్పుడే ఆనందం, తృప్తి నిన్ను అంటిపెట్టుకుని ఉంటాయి’ అని నాన్న నిరంతరం చెబుతుండేవారు. కానీ ఈ రోజుల్లో కాలం విలువ నేర్పే పెద్దలకి తీరిక లేదు. పిల్లలకి సమయమూ లేదు. – ఘంటసాల శ్యామల (ఘంటసాల పెద్ద కుమార్తె) -
నూరవ పుట్టిన రోజు
సంగీతరావు! సినీ సంగీత ప్రియులందరికీ సుపరిచితులు. ఘంటసాల స్వరపరచిన ప్రతి చిత్రానికీ సంగీతరావు సహాయకులుగా పనిచేశారు. సంగీతం ఘంటసాల – సహాయకులు పట్రాయని సంగీతరావు అని సినిమా టైటిల్స్‌లో పడుతుంది. ఘంటసాల గురువు పట్రాయని సీతారామశాస్త్రి. ఆయనంటే ఘంటసాలకు అపారమైన గౌరవం. ఆ గౌరవమే సంగీతరావుతో సాన్నిహిత్యాన్ని ఏర్పరచింది. 1920 నవంబరు 2న జన్మించిన సంగీతరావు నిన్న (నవంబరు 2, 2019) నూరవ పుట్టినరోజు పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా చెన్నైలో ఘంటసాల సతీమణి సావిత్రమ్మ, పిల్లలతో కలిసి, సంగీతరావు ఇంటికి వచ్చి, శుభాకాంక్షలు, అభినందనలు తెలిపి వెళ్లారు. ఘంటసాల గతించి, 45 సంవత్సరాలు గడిచిపోయినా, ఈ రెండు కుటుంబాల మధ్య అనుబంధం కొనసాగుతూనే ఉందనడానికి ఈ సంఘటన ప్రత్యక్ష నిదర్శనం. -
సినీ సంగీత ప్రపంచంలో.. మహానుభావులు ఎందరో
సంగీతానికి రాళ్లు కరుగుగతాయంటారు.. రాళ్లేమో కానీ మన మనసును మాత్రం ఇట్టే కరుగుతుంది. సంగీతానికి ఉండే శక్తి అటువంటింది. మనిషి మూడ్‌ను మార్చేసే శక్తి సంగీతానికి ఉందని ఎన్నో పరిశోధనల్లో తేలింది. మనసు బాగోలేకపోయినా.. మనకు ప్రశాంతత కరువైన నచ్చిన పాటలు వింటూ కొద్ది సేపు వింటే కిక్కే వేరప్ప. ఇక అందరికీ అన్ని పాటలు నచ్చకపోవచ్చు. కొందరికి మెలొడి సాంగ్స్, మరికొందరికి విప్లవ పాటలు, ఇంకొందరికి మాంచి ఫాస్ట్ బీట్ మాస్ సాంగ్‌లు అంటే ఇష్టం. అయితే.. కొన్ని పాటలు వింటూ ఉంటే లోకాన్ని మైమరిచిపోతూ ఉంటాం. మరికొన్నింటిని వింటే రక్తం ఉడికిపోయేలా ఉంటుంది. భారతీయ సంగీత శాస్త్రంలో ఉన్న గొప్పతనం మరెక్కడా లేదేమో అనిపిస్తుంది. అందులోనూ తెలుగు సాహిత్యంతో మెళవించిన సంగీతలోకం గురించి ఎంత అభివర్ణించినా తక్కువే అవుతుంది. అలనాటి ఆపాతమధురాలు వింటూ ఉంటే.. ఆకాశయానం చేస్తున్నట్లు ఉంటుంది. తెలుగు సినీ ప్రపంచంలో ఎంతో మంది సంగీత విద్వాంసులు ఈ సంగీతపూదోటలో ఎన్నో రకాల పుష్పాలను, ఇంకెన్నో కొత్త రకాల ప్రక్రియలను సృష్టించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి,థూ కొసరాజు, ఆత్రేయ, సాలూరి రాజేశ్వర్‌రావు, ఆరుద్ర, శ్రీశ్రీ, సినారె, వేటూరి, సిరివెన్నెల, చంద్రబోస్ వారి సాహిత్యంతో పదాలు కొత్త పుంతలు తొక్కుతుంటే.. కెవి మహదేవన్, ఘంటసాల, రమేష్‌నాయుడు, చక్రవర్తి, ఇళయరాజా, కీరవాణి ఇలా ఆనాటి నుంచి నేటి వరకు ఈ సంగీత ప్రపంచాన్ని తమ సృజనతో ఎప్పటికప్పుడు మలుపులు తిప్పుతూనే ఉన్నారు. నాటి పాటలు వింటూ ఉంటే.. అవి ఎప్పటికీ చెరిగిపోవు అనేట్టు ఉంటాయి. ఇప్పటికి ఆ పాటలు ఈతరం నోటివెంట వస్తుంటాయంటేనే వాటి గొప్పదనం ఏంటో తెలుస్తోంది. పగలే వెన్నెల జగమే ఊయలా అంటూ ఘంటసాల సృష్టించిన పాట వింటూ ఉంటే నిజంగానే ఆ అనుభూతి కలుగుతుంది. రావోయి చందమామ ఈ వింత గాథ వినుమా.. అంటూ సావిత్రి, ఎన్టీఆర్‌లు పాడుకుంటూ ఉంటే తెలుగు ప్రేక్షకులు వారికి నీరాజనం పట్టారు. అంతా బ్రాంతియేనా.. దేవదాస్ చిత్రంలో పారు ఏడుస్తుంటే.. అందరీ కళ్లు చెమ్మగిల్లాయి. నా పాట నీ నోట పలకలా చిలకా.. అని నాగేశ్వర్రావు మూగమనుసులు సినిమాలో సావిత్రికి నేర్పిస్తుంటే.. ప్రేక్షకలోకం కూడా వంతపాడింది. నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది అంటూ ఏఎన్నార్ పాడితే.. కుర్రలోకం మత్తులో మునిగిపోయింది. జానకీ కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు.. అంటూ జయసుధ, శోభన్ బాబు పాడుకున్న ఈ పాట తరాలు మారినా దానిలోని స్వచ్చత ఎప్పటికీ నిలిచే ఉంటుంది. సందర్భానుసారంగా వచ్చే కొన్ని పాటలు మనిషి జీవితంలో భాగమైపోయాయి. మనిషి జీవితంలో ముఖ్యమైన ఘట్టం పెళ్లి. ఈ పెళ్లి తంతులో కొన్ని పాటలను ప్లే చేయాల్సిందే అన్నట్లు అదొక రివాజుగా మారింది. పెళ్లిపుస్తకం చిత్రంలోని శ్రీరస్తు.. శుభమస్తు, మురారి సినిమాలోని అలనాటి రామచంద్రుడు అనే గీతాలు పెళ్లి మండపంలో మార్మోగాల్సిందే. ఇలా మనిషి పుట్టినప్పటి నుంచీ పోయేవరకు ఉండే ప్రతిఘట్టాన్ని పాటల రూపంలో మన చిత్రసీమ అందించింది. ఒక్కపాట ఓ జాతి మొత్తాన్ని కదిలించింది అంటే.. అది ఎంతటిప్రభంజాన్ని సృష్టించి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అల్లూరి సీతారామరాజు చిత్రంలో నిద్రాణమై ఉన్న జాతిని మేల్కొలిపేందుకు తెలుగు వీర లేవరా.. అంటూ గొంతెత్తితే వెండితెర దద్దరిల్లింది. మళ్లీ ప్రేక్షకుల నాడీ వేగాన్ని, రక్తపు ప్రవాహవేగాన్ని పెంచిన పాటలెన్నో చిత్రప్రపంచంలో వచ్చాయి. అందులో అందరికీ సుపరిచితమైనవి, ఇప్పటికీ అవి అక్షరసత్యంగా నిలిచినవి సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించినవవే. సిందూరంలో సినిమాలోని అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా.., గాయం చిత్రంలో నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని.. అనే రెండు పాటలు అప్పటి సమాజాన్నే కాదు ఇప్పటి సమాజాన్నీ ప్రశ్నిస్తూనే ఉన్నాయి. బందాలు, బంధుత్వాలు, ప్రేమజంట, విరాహవేదన, ఇలా ప్రతీఒక్క అంశంపై ఎన్నో పాటలు, మనసుపై చెరగని ముద్ర వేసిన పాటలు ఉన్నాయి. ముఖ్యంగా అమ్మపై వచ్చిన పాటలన్నీ ప్రేక్షకుల మనసులో నాటుకుపోయాయి. ఏఆర్ రెహమాన్, కీరవాణి, కోటి, మణిశర్మ, ఆర్పీ పట్నాయక్ లాంటి దిగ్గజాలు ఎన్నో మరుపురాని అద్భుతమైన పాటలు అందించగా.. యువ సంగీత దర్శకులు కూడా తమ సత్తా చాటుతూ సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్నారు. ఇక ఈ సంగీతం, పాటలు అనే కాన్సెప్ట్ మహాసముద్రం లాంటింది. ఇలా పాటలు, సంగీతం గురించి చెప్పుకుంటూ, రాసుకుంటూ పోతే ఎప్పటికీ ఆది అంతం ఉండదు. ఈ సంగీత ప్రపంచంలో ఎన్నో కొత్త స్వరాలను ప్రేక్షకులకు అందించిన, ప్రస్తుతం అందిస్తున్న ఎంతో మంది సంగీత దర్శకులకు, పాటల రచయితలకు ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు. -
తెలుగువారి తొలి కంఠం
గురువుకు కృతజ్ఞతగా ఉండలేని వాడి కంఠాన సరస్వతి ఉండదు. ఘంటసాలకు గురుభక్తి ఎక్కువ. తన గురువు పట్రాయని సీతారామశాస్త్రి అంటే చాలా గౌరవం. భక్తితో మసలేవారు. అంతేనా? వారి అబ్బాయి సంగీతరావును తనసహాయకులుగా నియమించుకున్నారు. ఇరవై ఏళ్ల పాటు ఘంటసాల దగ్గర సన్నిహితంగా మెలిగిన సంగీతరావు దగ్గర ఘంటసాల జ్ఞాపకాల రాశి ఉంది. ఘంటసాల జయంతి సందర్భంగా వాటిలో కొన్ని పల్లవులు పద్యాలు వరుస కట్టిన జ్ఞాపకాలు... ఘంటసాల కంఠం ఒక మంత్రదండం. అందులో మంద్ర, మధ్యమ, తారస్థాయులు అలవోకగా పలుకుతాయి. ఆయనతో పని చేసేవారే ఆయన ప్రతిభ చూసి అప్రతిభులు అయ్యేవారు. ఒకరోజు ఏదో పని ఉండి వాహిని స్టూడియోకి వెళ్లాను. ‘కృష్ణా ముకుందా మురారీ’ పాట రికార్డింగ్ జరుగుతోంది. అక్కడున్న వాద్యబృందం, టెక్నీషియన్లు ఘంటసాల పాడుతున్న విధానానికి మంత్రముగ్ధులవుతున్నారు. ఆ రోజు ఆర్కెస్ట్రాలో సన్నాయి సత్యం ఉన్నారు. ఘంటసాల పాడిన అనేక పాటలకు సత్యం పని చేశారు. అయినప్పటికీ పాటచివర ‘హే కృష్ణా! ముకుందా! మురారీ!’ అనే సాకీ తారస్థాయిని చే రే సందర్భంలో ఆ కంఠంలోని సామర్థ్యం, దైవత్వం చూసి సన్నాయి సత్యం ఉద్వేగంతో కన్నీళ్ల పర్యంతమవడం నాకు గుర్తుంది... లవకుశ సినిమాకు సంగీతం ఘంటసాల అందించారన్న సంగతి అందరికీ తెలుసు. అయితే ఆ సినిమా నిర్మాణంలో ఉండగా కొన్నాళ్లు షూటింగ్ వాయిదా పడింది. కాని అప్పటికే కొన్ని పాటలను ఘంటసాల రికార్డు చేశారు. ఆ పాటలు బాగా వచ్చాయి. అవి జనానికి చేరువ కావడంలో జాప్యం అవుతుండటంతో, కనీసం తన సంగీత దైవానికైనా వినిపిద్దామనుకుని, తిరువయ్యూరు వెళ్లి త్యాగయ్యగారి సమాధి దగ్గర ఆ పాటలను గానం చేసి వచ్చారు. ఎంత మంచి విషయం, విశేషం అది... ‘రహస్యం’ సినిమాలో మల్లాది రామకృష్ణశాస్త్రి రచించిన ఓ తత్త్వం ఉంది. ‘‘దీని భావము నీకే తెలియునురా ఆనందకృష్ణా. దీని మర్మము నీకే తెలియునురా’’ అని ప్రారంభం అవుతుంది ఈ తత్త్వం. ‘ఈ తత్త్వానికి పల్లవి ఎలా చేస్తారు’ అనుకున్నాను. మొదటి రెండు లైన్లూ చతురస్ర గతిలోను, తరవాత ఖండగతిలోను చాలా చిత్రంగా చేశారు. అది నిజమైన తత్త్వం వింటున్నంత తన్మయత్వం కలిగించింది నాకు. ఏ పాట చేసినా సంపూర్ణంగా దాని మూలాన్ననుసరించి చేయాలనే దృష్టి ఆయనది. స్త్రీల పాటలు – మంగళ హారతులు కూడా అలాగే చేసేవారు... శాస్త్రీయ సంగీత రచనలేవీ లేని స్కేల్స్‌లో కూడా ఆయన చాలా పాటలు చేశారు. బందిపోటు చిత్రంలోని ‘ఊహలు గుసగుసలాడే’ పాట ఇటువంటిదే. సగమపనిస – సనిపమగస... ఈ మూర్ఛన అమృతవర్షిణి, శుద్ధ ధన్యాసి, ఉదయ రవిచంద్రిక వంటి అనేక రాగాలకు సమానమే కాని సరిగ్గా ఏ రాగమో తెలియలేదు. పరిశీలిస్తే సౌదామిని రాగం అని తెలిసింది. అంతలోనే ‘సుమనేశ రంజని’ రాగ లక్షణాలు కూడా ఉన్నాయని తేలింది. ఇలా రాగాలను సంలీనం చేసి అపూర్వ ప్రయోగాలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అన్నమాచార్యులను గురించి ఎక్కువగా ప్రస్తావించని రోజుల్లోనే అన్నమయ్య కృతుల్ని రాగబద్ధం చేసి పాడారు ఘంటసాల. ‘కృష్ణకుచేల’ సినిమాలో రాజసూయ యాగ ఘట్టంలో పద్యాలన్నీ వేషధారులే పాడారు – అద్దంకి శ్రీరామ్మూర్తి, సియస్సార్ మొదలైనవాళ్లు. అద్దంకి శ్రీరామ్మూర్తి తన పద్యాన్ని పాడేశారుగాని ‘నిలుపంజాలను నెమ్మనంబు’ పద్యాన్ని వయసు కారణంగా సియస్సార్ సరిగా పాడలేకపోవడంతో ఘంటసాల పాడారు. అయితే ఆ తర్వాత సియస్సార్‌ని కలిసినప్పుడు ‘మాస్టారూ! మీరు పాడిన పద్యం నేను తిరిగి పాడవలసి వచ్చింది. కానీ మీరు పాడిందే ఎంతో భావయుక్తంగా ఉంది. నేను కేవలం పద్యం పాడానంతే’ అంటూ మనఃపూర్వకంగా చెప్పారు. ఆ నిజాయితీయే ఆయనను అపూర్వ వ్యక్తిని చేసింది. ‘‘ఘంటసాల గారికి సాహిత్యంలో వస్తున్న గీతాలు, ప్రజాజీవితంలో పాటలంటే చాలా ఇష్టం. ఆయన వాటిని వెతుక్కుంటూ శ్రీకాకుళం దాకా వెళ్లారు. ‘రావయాన రావయాన రాజా నామాలుకి (నా మహలుకి)’ అంటూ జముకు వాయిస్తూ జానపదులు పాడిన పాటను ఆయన ఇలాంటి అన్వేషణలో జానపదుల నుంచి విని సినిమాకు వాడారు. ఆయన వల్ల ‘అత్తలేని కోడలుత్తమురాలు ఓయమ్మా’ లాంటి పాటలు ప్రజలలో ప్రాచుర్యం పొందాయి. సినిమాలతో సంబంధం లేకుండా ప్రైవేట్ గ్రామఫోను రికార్డులు కూడా చేశారు. కరుణశ్రీ రచించిన ‘పుష్పవిలాపం’, ‘కుంతీకుమారి’ రసజ్ఞుల హృదయాలను దోచుకున్నాయి. శ్రీశ్రీ ‘పొలాలనన్నీ హలాల దున్నీ’, గురజాడ వారి ‘పుత్తడిబొమ్మ పూర్ణమ్మ’ పాటలు ప్రాచుర్యం పొందాయి. ఆరోజుల్లో రేడియోలో ఎన్నో లలిత గీతాలు పాడారు ఘంటసాల. ‘ఈ చల్లని రేయి తిరిగి రానేరాదు’, ‘తూరుపు దిక్కున అదిగో చూడు’, ‘బహుదూరపు బాటసారి’ వంటి పాటలెన్నో. ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా ఆంధ్రరాష్ట్ర గానం వంటి ఆంధ్రమాతను ప్రస్తుతించే పాటలు, ‘ఆంధ్రుల చరితం అతిరసభరితం’ వంటి పాటలు ఎంతో ఉత్తేజకరంగా గానం చేశారు. తిరుపతి శ్రీవేంకటేశ్వరుని మీద పాడిన భక్తిగీతాలు తెలుగునాట ఇంటింటా వినిపించాయి. తిరుమల గిరులు ఘంటసాల గారి భక్తిగీతాలతో ప్రతిధ్వనించాయి.ఘంటసాల తన జీవిత చరమాంకంలో గానం చేసినది భగవద్గీత. ఇది రాగబద్ధం చేస్తున్నప్పుడే చాలా ఆసక్తికరంగా ఉండేది. భగవద్గీత సంగీత ప్రధానమైన రచన కాదు. ప్రధానంగా తాత్త్విక చర్చ వంటిది. అటువంటి రచనను సంగీతానికి అనుకూలంగా చేయడంలో కృతకృత్యులయ్యారు ఘంటసాల. ఘంటసాల స్వర్గస్థులై, అమరగాయకుడై నాలుగు దశాబ్దాలు దాటుతున్నా ఆయన పాడిన పాటల్ని వర్ధమాన గాయకులు ఇంకా పాడుతూండడం తెలుగువారికి ఆయనపట్ల గల అపారప్రేమకు, అభిమానానికీ నిదర్శనం. నేటికీ అనేక తెలుగు కుటుంబాలలో ఘంటసాల ప్రాతఃస్మరణీయుడు. రహస్యం’ సినిమాలో మల్లాది రామకృష్ణశాస్త్రి రచించిన ఓ తత్త్వం ఉంది. ‘‘దీని భావము నీకే తెలియునురా ఆనందకృష్ణా. దీని మర్మము నీకే తెలియునురా’’ అని ప్రారంభం అవుతుంది ఈ తత్త్వం. ‘ఈ తత్త్వానికి పల్లవి ఎలా చేస్తారు’ అనుకున్నాను. మొదటి రెండు లైన్లూ చతురస్ర గతిలోను, తరవాత ఖండగతిలోను చాలా చిత్రంగా చేశారు. మల్లాది రామకృష్ణశాస్త్రిగారు కేళీ గోపాలంలో రాసిన నృత్యనాటకం తరవాతి రోజుల్లో ‘రహస్యం’ సినిమాలో ‘గిరిజాకల్యాణం’గా ఉపయోగించారు. అది ఎంత ప్రసిద్ధి చెందిందో తెలిసిందే. – పట్రాయని సంగీతరావు, చెన్నై (ఘంటసాల గురువులైన పట్రాయని సీతారామశాస్త్రి కుమారుడు) -
భలే మంచి రోజు
చందమామ నవ్విన రోజు పల్లవి పులకించిన రోజు చరణం చకితమైన రోజు గానం పరవశించిన రోజు పాట గుండెకందిన రోజు అనుభూతి అనుభూతించిన రోజు మన కోసం అదృష్టం పుట్టిన రోజు జీవితానికి ఒక తోడు వచ్చిన రోజు ఘంటసాల పుట్టిన రోజు పాట చిరయశస్సు పొందిన రోజు నిట్టా జనార్దన్ సుప్రసిద్ధ సితార్ విద్వాంసులు. ఘంటసాలతో పని చేశారు. ఆయన పాటలకు సితార్ సహకారం అందించారు. ఘంటసాల జయంతి సందర్భంగా జనార్దన్ పంచుకున్న జ్ఞాపకాలు. 1958, జూన్ 6న ‘భాగ్యదేవత’ సినిమా కోసం మాస్టర్ వేణు సంగీత దర్శకత్వంలో ఘంటసాల, సుశీల పాడిన పాటకు మొట్టమొదట సితార్ అందించాను. నేను వాయించడం అంత దూరం నుంచి చూసిన ఘంటసాల ‘ఎంత హాయిగా ఉంది బాబూ నీ రాగం’ అని ఆలింగనం చేసుకున్నారు. అలా ఆయనతో నా సినిమా సంగీత ప్రయాణం ప్రారంభమైంది. ఒకప్పుడు గుడికి వెళ్లే సందర్భం, ఆనంద సంబరం, శోభన సన్నివేశాలలో మాత్రమే సితార్ ఉపయోగించేవారు. ఒకసారి ఒక సినిమా విషాద సన్నివేశంలో ‘సరోద్, సారంగి వాయించడానికి ఎవరూ లేరు. ఇప్పుడెలా?’ అన్నారు ఘంటసాల. అప్పుడు నేను సితార్ మీద వాయిస్తానని చెప్పి మంద్రస్థాయిలో ‘బిలాస్‌ఖాన్ తోడి రాగం’ లో వాయించేశాను. ఘంటసాల పరుగుపరుగున నా దగ్గరకు వచ్చి నన్ను ఆప్యాయంగా కౌగలించుకున్నారు. తాన్సేన్ కుమారుడు బిలాస్‌ఖాన్. తాన్సేన్ మరణించినప్పుడు బిలాస్‌ఖాన్ ఏడవకుండా ఒక రాగాన్ని పలికించాడు. అది బిలాన్‌ఖాన్ తోడి రాగంగా స్థిరపడిపోయింది. దానిని ఆ సందర్భానికి ఉపయోగించడం మంచి జ్ఞాపకం. డా.చక్రవర్తి సినిమాలో ‘మనసున మనసై... బతుకున బతుకై’ పాట ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. ఆ పాట కోసం జయజయంతి రాగం వాయించమన్నారు ఘంటసాల. ఆయన మేధావితనం వల్లే ఆ పాట నిలబడింది. ఆయన స్వరపరచిన ‘లవకుశ’ సినిమాలో అన్ని సీన్స్‌కి నేను సితార్ వాయించాను. పునర్జన్మ చిత్రంలో ‘ఎవరివో నీవెవరివో’ పాటలో ఘంటసాల గొంతు, నా సితార్ పోటాపోటీగా వినపడతాయి. ‘‘ఘంటసాల ‘పయనించే ఓ చిలుకా’ ‘బంగరు బొమ్మా సీతమ్మా’ పాడుతుంటే నాకు కళ్లలో నీళ్లు వచ్చేశాయి. ఆయన పాటలో ఉండే అనుభూతి, స్పష్టతల వల్ల ఆయన పాటలో నిమగ్నమైపోతాం. అలాగే ఘంటసాల ఆలపించిన ‘జయదేవుడి అష్టపదులకు’ సితారు అందించడం నేను నా జీవితంలో మరచిపోలేను. ఒకసారి ఘంటసాల భార్య సావిత్రమ్మ... ‘మీరు జనార్దన్ గారు ఎలా వాయించినా విని ఊరుకుంటారేంటి’ అన్నారు. అందుకు ఆయన ‘జనార్దన్ విద్వాంసుడు. మనం చెప్పక్కర్లేదు’ అని నా మీద ఉన్న నమ్మకాన్ని వివరించారు. ఘంటసాల తనకు మూడు కోరికలున్నాయని చెప్పేవారు. భగవద్గీత స్వరపరచుకుని గానం చేయడం, విదేశీ పర్యటన, తన పేరుతో ఒక సంగీత పాఠశాల ప్రారంభించడం. ఆయన బతికుండగా మొదటి రెండు జరిగాయి. గతించాక మూడోది కూడా జరిగింది. ఘంటసాలగారికి విదేశీ పర్యటన చేయాలనే కోరిక 1971లో నెరవేరింది. యునైటెడ్ నేషన్స్ ఆహ్వానం మేరకు అమెరికా వెళ్లి అక్కడ పాటలు పాడి అందరినీ అలరించారు. ఆయన వెంట నన్ను కూడా తీసుకువెళ్లారు. నేను ముందుగా ఒక పావుగంట సేపు శాస్త్రీయ సంగీతకచేరీ చేశాక, ఆర్కెస్ట్రాలో వాయిస్తానని చెప్పాను. ఆయన నిండు మనసుతో అంగీకరించారు. ఆఖరి రోజుల్లో స్వరపరచిన భగవద్గీతకు ‘జనార్దనే సితార్ వాయించాలి’ అని పట్టుబట్టారు ఘంటసాల. ఒక్కో శ్లోకం ఒక్కో రాగంలో రూపొందించారు. ముందరి రాగాల నుంచి తరవాత రాగానికి చేరుకోవాలి. అంటే అది ఇంటర్‌లింక్ చేయాలి, అలాగే చేశాను. ఘంటసాల తుదిశ్వాస వరకు ఆయన పాటలకు సితార్ వాయిస్తూనే ఉన్నాను. ‘ఘంటసాల గానగంధర్వుడు’. అలాంటివాళ్లు మళ్లీ పుట్టరు. – నిట్టా జనార్దన్, సితార్ విద్వాంసులు ఘంటసాల పాడిన ఈ పాటలకు సితార్ నేనే వాయించాను మనసున మనసై (డా. చక్రవర్తి), దివి నుంచి భువికి దిగి వచ్చే (తేనె మనసులు), చెలికాడు నిన్నే రమ్మని పిలువ (కులగోత్రాలు), విన్నవించుకోనా చిన్న కోరిక (బంగారు గాజులు), విన్నానులే ప్రియా (బందిపోటు దొంగలు), మల్లియలారా మాలికలారా (నిర్దోషి), (మౌనముగానే మనసు పాడిన వేణు గానములు వింటిలే (గుండమ్మ కథ), మురిపించే అందాలే అవి నన్నే చెందాలే (బొబ్బిలియుద్ధం), పూవై విరిసిన (తిరుపతమ్మ కథ), ఊహలు గుసగుసలాడే (బందిపోటు), నన్ను దోచుకుందువటే (గులేబకావళి కథ), ప్రియురాల సిగ్గేలనే (శ్రీకృష్ణార్జున యుద్ధం), హిమగిరి సొగసులు (పాండవ వనవాసం), తొలివలపే పదే పదే (దేవత), విన్నారా అలనాటి వేణుగానం (దేవుడు చేసిన మనుషులు), జగమే మారినది మధురముగా ఈ వేళ (దేశ ద్రోహులు), కిలకిల నవ్వులు చిలికిన (ఇద్దరు మిత్రులు). - నిట్టా జనార్దన్ సంభాషణ డా.వైజయంతి పురాణపండ