ఘంటసాల, సుశీల పాటలో!
ఘంటసాల, సుశీల పాటలో!
Published Fri, Dec 6 2013 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM
ఘంటసాల పాటకు ఇప్పటివరకు మనం ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణలాంటి స్టార్స్ అభినయించడం చూశాం. త్వరలో శ్రీని కూడా చూడబోతున్నాం. ‘నువ్వు నా ముందుంటే.. నిన్నలా చూస్తుంటే..’ అంటూ ‘గూఢచారి 116’ సినిమా కోసం ఘంటసాల పాడిన పాట నాటి తరం ప్రేక్షకులకు బాగా తెలుసు. ఈ పాటను ఘంటసాలతో కలిసి సుశీల ఆలపించారు. కృష్ణ, జయలలిత అభినయించిన ఈ పాటకు ఇప్పుడు శ్రీ, హరిప్రియ అభినయించారు. ఈ ఇద్దరూ జంటగా కృష్ణ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్‌వర్మ నిర్మిస్తున్న చిత్రం ‘గలాటా’. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి.
నిర్మాత మాట్లాడుతూ -‘‘శ్రీ, హరిప్రియ పాల్గొనగా స్వర్ణ నృత్యదర్శకత్వంలో ‘నువ్వు నా ముందుంటే..’ పాటను చిత్రీకరించాం. సినిమాకి హైలైట్‌గా నిలిచే పాట ఇది. వచ్చేనెల పాటలు, ఫిబ్రవరిలో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే కొత్త కథాంశంతో ఈ సినిమా చేశామని, వినోద ప్రధానంగా సినిమా సాగుతుందని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సంగీ తం: సునిల్ కశ్యప్, కెమెరా: ఫిరోజ్‌ఖాన్, పాటలు: కృష్ణచైతన్య, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీతేజ నడింపల్లి.
Advertisement
Advertisement