sushila
-
‘అమ్మాయిల పిచ్చి రూమర్’పై స్పందించిన కాంతారావు కూతురు
టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రనటుడిగా ఓ వెలుగు వెలిగాడు కాంతారావు. హీరోగా, సహాయ నటుడిగా ఎన్నోరకాల పాత్రలు పోషించి విశేష పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆయన ఎంతగానో ఆస్తులు పోగేశాడు. కానీ తర్వాతి కాలంలో నిర్మాతగా మారి ఆస్తులు పోగొట్టుకున్నాడు. ఈ క్రమంలో 400 ఎకరాలను పోగొట్టుకున్నాడు. కాంతారావు కూతురు సుశీల రావు మాట్లాడుతూ.. 'నాన్నగారి చిన్నతనంలోనే తాతయ్య చనిపోయాడు. దీంతొ నానమ్మ నాన్నను గారాబంగా పెంచింది. ఎవ్వరు ఏం చెప్పినా తనకు నచ్చిందే చేసేవాడు. నిర్మాణ రంగం వైపు వెళ్లొద్దని ఎన్టీ రామారావు గారు చెప్పారు, కానీ ఆయన వినిపించుకోలేదు. సినిమాల కోసం 400 ఎకరాలు అమ్మేశారు. అలా సినిమాలు నిర్మించి చాలా నష్టపోయారు. నష్టపోయిన తర్వాత మాత్రమే ఎన్టీఆర్ మాట వినుంటే బాగుండేదని అనుకున్నారు. అప్పుడు కృష్ణ- విజయనిర్మలగారు మా ప్రతి సినిమాలో కాంతారావుకు ఓ వేషం ఇప్పిస్తామన్నారు. ఆ మాట నిలబెట్టుకున్నారు. నా పెళ్లి కోసం కృష్ణగారు రూ.10 వేల ఆర్థిక సాయం చేశారు. నాన్నకు సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదు. చచ్చేదాకా నటిస్తూ ఉండాలన్నదే ఆయన కోరిక. కాంతారావుకు ఆడవాళ్ల పిచ్చి ఉంది, దానివల్లే ఉన్నదంతా పోగొట్టుకున్నారని ఓ రూమర్ ఉంది. అది పూర్తిగా అవాస్తవం. ఆయనకు సినిమాలు, ఇల్లు ఈ రెండే తెలుసు. ఏ హీరోయిన్‌కూ డబ్బులివ్వలేదు' అని క్లారిటీ ఇచ్చింది సుశీల. -
నాబార్డు తెలంగాణ సీజీఎంగా సుశీల
సాక్షి, హైదరాబాద్: నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రి కల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డు) చీఫ్ జనరల్ మేనేజర్‌గా సుశీల చింతల నియమితులయ్యారు. గురు వారం తెలంగాణ ప్రాంతీయ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆమె కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ ప్రాంతీయ కార్యా లయాల్లో పని చేశారు. తమిళనాడులో పని చేసిన సమయంలో ఆ రాష్ట్ర ఉమెన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ బోర్డులోనూ సుశీల ఉన్నారు. నాబార్డ్ మద్దతు ఇచ్చే ఇంక్యుబేషన్ సెంటర్లతోపాటు అగ్రి స్టార్టప్‌లతో చురుకుగా పనిచేసిన ఆమెకు.. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టులు, క్రెడిట్ ప్లానింగ్, పర్యవేక్షణ, ఫైనాన్స్, మైక్రో క్రెడిట్, సహకార సంఘాలు, ఆర్ఆర్బీల పర్యవేక్షణలో మూడున్నర దశాబ్దాల అనుభవం ఉంది. -
Commonwealth Games 2022: న్యూస్ మేకర్.. జూడో ధీర
కామన్వెల్త్ క్రీడలలో సుశీలా దేవి లిక్మబమ్ రజత పతకం సాధించింది. 48 కేజీల జూడో ఫైనల్స్‌లో హోరాహోరీ పోరాడి రెండో స్థానంలో నిలిచింది. సుశీలా దేవి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఈ స్థాయికి చేరింది. డిప్రెషన్‌ను జయించి ప్రత్యర్థిని గెలిచింది. మణిపూర్ ఖ్యాతిని పెంచిన మరో వనిత సుశీలా దేవి పరిచయం... ప్రత్యర్థిని నాలుగు వైపుల నుంచి ముట్టడించాలని అంటారు. జూడోలో కూడా నాలుగు విధాలుగా ప్రత్యర్థిని ముట్టడించవచ్చు. త్రోయింగ్, చోకింగ్, లాకింగ్, హోల్డింగ్ అనే నాలుగు పద్ధతులతో ప్రత్యర్థిపై గెలుపు సాధించాల్సి ఉంటుంది. బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్– 2022లో మహిళా జూడో 48 కేజీల విభాగంలో సోమవారం జరిగిన ఫైనల్స్‌లో సుశీలా దేవి లిక్మబమ్ తన ప్రత్యర్థి దక్షిణాఫ్రికా జూడో క్రీడాకారిణి మిషిలా వైట్బూయీ మీద ఈ నాలుగు విధాలా దాడి చేసినా ప్రత్యేక పాయింట్ల విషయంలో వెనుకబడింది. ఫలితంగా రెండో స్థానంలో నిలబడింది. అయినప్పటికీ భారత దేశానికి మహిళా జూడోలో రజతం సాధించిన క్రీడాకారిణిగా ఆమె ప్రశంసలను పొందుతోంది. అయితే ఈ రజతంతో ఆమె సంతోషంగా లేదు. ‘నేను అన్ని విధాలా గోల్డ్ మెడల్‌కు అర్హురాలిని. మిస్ అయ్యింది’ అని కొంత నిరాశ పడుతోంది. కాని సుశీలా ఎదుర్కొన్న ఆటుపోట్లను చూస్తే దాదాపుగా జూడో నుంచి బయటికొచ్చేసి తిరిగి ఈ విజయం సాధించడం సామాన్యం కాదని అనిపిస్తుంది. మేరీకోమ్ నేల నుంచి మణిపూర్ అంటే మేరీకోమ్ గుర్తుకొస్తుంది. 27 ఏళ్ల సుశీలా దేవిది కూడా మణిపూరే. తండ్రి మనిహర్, తల్లి చవోబి. నలుగురు పిల్లల్లో రెండో సంతానం సుశీలాదేవి. చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉండే సుశీలాను చూసి ఆమె మేనమామ దినిక్ తనలాగే అంతర్జాతీయ స్థాయి జూడో క్రీడాకారిణి చేయాలనుకున్నాడు. అప్పటికే సుశీలాదేవి అన్న శైలాక్షి కూడా జూడో నేర్చుకుంటూ ఉండటంతో ఎనిమిదేళ్ల వయసు నుంచే సుశీలకు జూడో మీద ఆసక్తి పుట్టింది. ప్రాక్టీసు కోసం మేనమామ ఇంఫాల్ లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) కేంద్రానికి రోజూ రమ్మంటే సుశీల వాళ్ల ఇంటి నుంచి అది సుమారు 10 కిలోమీటర్లు అయినా రోజూ అన్నా చెల్లెళ్లు సైకిల్ తీసుకుని కొండలు, గుట్టలు దాటుతూ సాయ్ కేంద్రానికి చేరుకునేవారు. అలా ఆమె శిక్షణ మొదలయ్యింది. చెప్పాల్సిన విషయం ఏమంటే అన్న క్రమంగా జూడోలో వెనకబడితే చెల్లెలు పేరు తెచ్చుకోవడం మొదలెట్టింది. దానికి కారణం మహిళా జూడోలోకి ప్రవేశించే క్రీడాకారిణులు తక్కువగా ఉండటమే. పాటియాలా శిక్షణ సుశీల శిక్షణ ఇంఫాల్ నుంచి పాటియాలాలోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలె¯Œ ్సకు మారింది. అక్కడ అంతర్జాతీయ స్థాయిలో ఆడే మేరీకోమ్ వంటి ఆటగాళ్లను చూశాక ఆమెలో స్ఫూర్తి రగిలింది. తాను కూడా విశ్వవేదికపై మెరవాలని కలలు కని వాటిని సాకారం చేసుకునే దిశగా కృషి చేసింది. కోచ్ జీవన్ శర్మ ఆమెకు ద్రోణాచార్యుడి గా మారి శిక్షణ ఇచ్చాడు. 2008 జూనియర్ నేషనల్ చాంపియన్ షిప్లో పతకం సాధించడంతో ఆమె పేరు జూడోలో వినిపించడం మొదలెట్టింది. కొనసాగింపుగా ఆసియా యూత్ చాంపియన్ షిప్లో కూడా సుశీల పతకాలు సాధించింది. కారు అమ్ముకుంది క్రికెట్ తప్ప వేరే క్రీడలను పెద్దగా పట్టించుకోని స్పాన్సర్లు భారత్‌లో అంతగా తెలియని జూడోను అసలు పట్టించుకోనేలేదు. పైగా మహిళా జూడో అంటే వారికి లెక్కలేదు. ప్రభుత్వం కూడా ఒలింపిక్స్, ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్‌కు తప్ప వరల్డ్ ఛాంపియ¯Œ ్సకు పెద్దగా స్పాన్సర్షిప్ చేయదు. స్పాన్సర్లు లేకపోవడంతో తాను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న మొదటి కారును అమ్ముకుని ఆ పోటీలలో పాల్గొన్నది సుశీల. ‘నేను సంపాదించిందంతా జూడోలోనే ఖర్చు చేశాను. ఇంక నా దగ్గర అమ్ముకోవడానికి ఏమీ మిగలలేదు. కానీ ఈ ఆటను నేను వీడను..’ అంటుంది సుశీల. ఈ మెడల్‌తో ఆమె ఖ్యాతి మరింత పెరిగింది. ఇక ఆట కొనసాగింపు చూడాలి. సుశీల ప్రస్తుతం మణిపూర్ పోలీస్ శాఖలో ఇన్స్పెక్టర్గా పని చేస్తోంది. 2014 కామన్వెల్త్ విజయం 2014లో జరిగిన గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం సాధించడంతో సుశీల మీద అందరి అంచనాలు పెరిగాయి. ఆమె నుంచి ఒక ఒలింపిక్ పతకం ఖాయం అని భావించారు. అందుకు రిహార్సల్స్ వంటి 2018 ఆసియా క్రీడల్లో పాల్గొనాలని ఉత్సాహపడుతున్న సుశీలను గాయం బాధ పెట్టింది. ఆమె ఆ గేమ్స్‌లో పాల్గొనలేకపోవడంతో డిప్రెషన్ బారిన పడింది. ఆ తర్వాత వచ్చిన లాక్డౌన్, టోర్నీలు రద్దుకావడం ఇవన్నీ ఆమెను టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటానో లేదోననే స్థితికి తీసుకెళ్లాయి. టోక్యో ఒలింపిక్స్‌లో అదృష్టవశాత్తు కాంటినెంటల్ కోటాలో స్థానం దొరికితే దేశం తరపున ఏకైక జూడో క్రీడాకారిణిగా పాల్గొన్నా ఫస్ట్ రౌండ్లోనే వెనుదిరగాల్సి వచ్చింది. 2019 ఆసియన్ ఓపెన్ ఛాంపియన్ షిప్లో సిల్వర్ మెడల్, 2019 లో కామన్వెల్త్ జూడో ఛాంపియన్ షిప్లో స్వర్ణం నెగ్గింది. అయితే 2018 కు ముందు ఆమె చేతికి గాయమైంది. దీంతో ఆమె ఏడు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఒలింపిక్స్ లో పాల్గొనాలన్న ఆశలు ఆవిరవుతున్నట్టు అనిపించింది. కానీ ఆమె కుంగిపోలేదు. ఇంటికి వెళ్లి మూడు నెలలు విరామం తీసుకుంది. తిరిగి 2018లో ఆసియా గేమ్స్ లో పాల్గొనలేకపోయినా 2019 లో హాంకాంగ్ వేదికగా జరిగిన హాంకాంగ్ ఓపెన్ లో బరిలోకి దిగింది. -
జాతీయ జెండా రూపకర్తకు భారతరత్న ఇవ్వాలని కుటుంబసభ్యుల డిమాండ్
-
Commonwealth Games 2022: సుశీలకు చేజారిన స్వర్ణం
బర్మింగ్‌హామ్: ఎనిమిదేళ్ల క్రితం గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో సాధించిన రజతాన్ని ఈ సారి స్వర్ణంగా మార్చాలని బరిలోకి దిగిన భారత జూడో ప్లేయర్ సుశీలా దేవికి నిరాశే ఎదురైంది. గాయాలతో బాధపడుతూనే ఫైనల్ బరిలోకి దిగిన సుశీల చివరకు రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మహిళల 48 కేజీల విభాగం ఫైనల్లో సుశీలపై దక్షిణాఫ్రికాకు చెందిన మైకేలా వైట్‌బూ విజయం సాధించింది. గాయం కారణంగా కుడి కాలికి నాలుగు కుట్లతో బరిలోకి దిగిన సుశీల 4.25 నిమిషాల పాటు హోరాహోరీగా పోరాడి చివరకు తలవంచింది. పురుషుల 60 కేజీల విభాగంలో భారత్‌కు కాంస్యం లభించింది. వారణాసికి చెందిన విజయ్ కుమార్ యాదవ్ కాంస్య పతక పోరులో 58 సెకన్లలోనే పెట్రోస్ క్రిస్టోడూలిడ్స్ (సైప్రస్)ను ఓడించాడు. అయితే జూడోలోనే భారత్‌కు రెండు పతకాలు చేజారాయి. కాంస్యం కోసం జరిగిన మ్యాచ్‌లలో పురుషుల 66 కేజీల విభాగంలో నాథన్ కట్జ్ (ఆస్టేలియా) చేతిలో జస్లీన్ సింగ్ సైనీ... మహిళల 57 కేజీల విభాగంలో క్రిస్టీ లెజెంటిన్ (మారిషస్) చేతిలో సుచిక తరియాల్ ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ 3 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి ఎనిమిది పతకాలతో ఆరో స్థానంలో ఉంది. బ్యాడ్మింటన్ ఫైనల్లో భారత్ డిఫెండింగ్ చాంపియన్ భారత్ బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ విభాగంలో వరుసగా రెండోసారి ఫైనల్లోకి అడుగు పెట్టింది. సెమీఫైనల్లో భారత్ 3–0తో సింగపూర్‌ను ఓడించింది. నేడు జరిగే ఫైనల్లో మలేసియాతో భారత్ తలపడుతుంది. 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్లో మలేసియాపైనే నెగ్గి భారత్ స్వర్ణ పతకం సాధించడం విశేషం. సింగపూర్‌తో జరిగిన సెమీఫైనల్లో తొలి మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 21–11, 21–12తో యాంగ్ కాయ్–లియాంగ్ క్వెక్‌లపై గెలుపొందగా... రెండో మ్యాచ్‌లో పీవీ సింధు 21–11, 21–12తో జియా మిన్ యోను ఓడించి భారత్‌కు 2–0తో ఆధిక్యంలో నిలిపింది. మూడో మ్యాచ్‌లో లక్ష్య సేన్ 21–18, 21–15తో ప్రపంచ చాంపియన్ కీన్ యె లోపై నెగ్గి భారత్‌ను ఫైనల్‌కు చేర్చాడు. ఇంగ్లండ్‌తో భారత్ మ్యాచ్ ‘డ్రా’ పురుషుల హాకీలో ఇంగ్లండ్‌తో జరిగిన పూల్ ‘బి’ లీగ్ మ్యాచ్‌ను భారత్ 4–4తో ‘డ్రా’ చేసుకుంది. భారత్ తరఫున లలిత్ ఉపాధ్యాయ్ (3వ ని.లో), హర్మన్‌ప్రీత్ సింగ్(46వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... మన్దీప్ (13వ, 22వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. సెమీస్‌లో సౌరవ్ పురుషుల స్క్వాష్ సింగిల్స్‌లో భారత స్టార్ సౌరవ్ ఘోషాల్ సెమీఫైనల్ చేరాడు. క్వార్టర్ ఫైనల్లో సౌరవ్ 11–5, 8–11, 11–7, 11–3తో గ్రెగ్ లాబన్ (స్కాట్లాండ్)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో జోష్నా చినప్ప 9–11, 5–11, 13–15తో హోలీ నాటన్ (కెనడా) చేతిలో ఓడిపోయింది. మహిళల జిమ్నాస్టిక్స్ వాల్ట్ ఈవెంట్ ఫైనల్లో భారత ప్లేయర్ ప్రణతి నాయక్ ఐదో స్థానంలో నిలిచింది. -
టీచరమ్మ స్కూలు సేద్యం.. ‘థ్యాంక్స్ టు కోవిడ్’
పిల్లలకు పాఠాలు చెప్తే వాళ్లు భవిష్యత్ ఫలాలు ఇస్తారు. కాని ఖాళీగా ఉన్న స్థలంలో పంటలు వేస్తే ఇప్పుడే వారు ఆరోగ్యంగా తిని ఎదుగుతారు. బెంగళూరులోని ఆ స్కూల్ ప్రిన్సిపాల్‌కి ఆ ఆలోచనే వచ్చింది. వెంటనే ఆ బడి ఆవరణంతా సేంద్రియ సేద్యం మొదలెట్టింది. ఇంకేముంది... రోజుకు కిలోల కొద్ది పండ్లో, కాయలో, కూరలో దిగుబడికి వస్తున్నాయి. నేలకు పాఠం చెప్తే అది తెచ్చుకున్న ఆకుపచ్చటి మార్కులు ఇవి. స్కూల్లో తోట పెంచితే రెండు రకాల సీతాకోక చిలుకలు కనిపిస్తాయి. ఒక రకం యూనిఫామ్ వేసుకున్నవి. ఒక రకం రంగు రంగుల రెక్కలల్లారుస్తూ మొక్కలపై వాలేవి. పిల్లలకు ఏ మంచి చూపినా ఇష్టమే. వారు ఆడమంటే ఆడతారు. పాడమంటే పాడతారు. మొక్కలు పెంచమంటే పెంచుతారు. క్లాసుల్లో వేసి సిలబస్‌లు రుబ్బడమే చదువుగా మారాక పిల్లలకు బెండకాయ చెట్టు, వంకాయ మొలకా కూడా తెలియకుండా పోతున్నాయి. ‘థ్యాంక్స్ టు కోవిడ్’ అంటారు సుశీలా సంతోష్. ఆమె బెంగళూరులోని ఎలహంకలో ఉన్న విశ్వ విద్యాపీఠ్ స్కూల్‌కు డైరెక్టర్. ఆ స్కూల్‌కు మరో రెండు క్యాంపస్‌లు ఉన్నా ఎలహంక బాధ్యతలు చూస్తున్న సుశీలా సంతోష్ చేసిన పని ఇప్పుడు తీగలు, పాదులుగా మారి స్కూల్‌ను కళకళలాడిస్తూ ఉంది. ‘2021 మార్చి ఏప్రిల్ నుంచి లాక్డౌన్ మొదలయ్యింది. 1400 మంది పిల్లలు చదివే క్యాంపస్ మాది. మధ్యాహ్నం భోజనాలు మా స్కూల్లోనే చేస్తారు. కనుక స్టాఫ్ ఎక్కువ. కాని లాక్డౌన్ వల్ల బస్ డ్రైవర్లు, ఆయాలు, వంట మాస్టర్లు, అడెండర్లు అందరూ పనిలేని వారయ్యారు. వారంత చుట్టుపక్కల పల్లెల వారు. పని పోతుందేమోనని భయపడ్డారు. కాని వారిని మేము తీసేయ దలుచుకోలేదు. అలాగని ఖాళీగా పెడితే వారికి కూడా తోచదు. అలా వచ్చిన ఆలోచనే ఆర్గానిక్ ఫార్మింగ్. స్కూలు తోట. పదండి... ఏదైనా పండిద్దాం అన్నాను వారితో. అప్పుడు చూడాలి వారి ముఖం’ అంటుంది సుశీలా సంతోష్. స్కూలులో ప్రెయర్ గ్రౌండ్ తప్ప మిగిలిన ఏ ప్రదేశమైనా పంట యోగ్యం చేయాలని వారు నిశ్చయించుకున్నారు. ‘ఇంతకు ముందు వీరిలో కొందరికి సేద్యం తెలుసు కనుక మా పని సులువయ్యింది’ అంటారు సుశీల. ఆమె సారధ్యంలో స్కూల్ పెరడు, బిల్డింగుల మధ్య ఉన్న ఖాళీ స్థలం, కాంపౌండ్ వాల్స్‌కు ఆనుకుని ఉండే నేల... ఇంకా ఎక్కడెక్కడ ఏ స్థలం ఉన్నా అదంతా కాయగూరలు, పండ్ల మొక్కలు, ఇవి కాకుండా 40 రకాల హెర్బల్ ప్లాంట్లు వేసి వాటి బాగోగులు చూడటం మొదలెట్టారు. ‘మాకు చాలా పెద్ద కిచెన్ ఉంది. దాని టెర్రస్‌ను కూడా తోటగా మార్చాం’ అన్నారు సుశీల. స్కూలులోపల ఉన్న నీటి వ్యవస్థనే కాక వంట గదిలో వాడగా పారేసే నీటిని కూడా సద్వినియోగం చేసుకుంటూ (ఆ నీరు అరటికి చాలా ఉపయోగం) 200 అరటి చెట్లు పెంచడం మొదలెట్టారు. ఇవి కాకుండా ఆకు కూరలు, కాయగూరలు, క్యారెట్, క్యాబేజీ వంటివి కూడా పండించ సాగారు. ‘మూడు నెలల్లోనే ఏదో ఒక కాయగూర కనిపించడం మొదలెట్టింది. స్టాఫ్ మధ్యాహ్న భోజనానికి వాడగా మిగిలినవి చుట్టుపక్కల వారికి పంచడం మొదలెట్టాం. మరి కొన్నాళ్లకు మేమే వాటితో వండిన భోజనాన్ని కోవిడ్ పేషెంట్స్‌కు సాధారణ రేట్లకు అమ్మాం. ఆరోగ్యకరమైన భోజనం తక్కువ ధరకు కాబట్టి సంతోషంగా తీసుకున్నారు. మా స్టాఫ్‌కు ఇదంతా మంచి యాక్టివిటీని ఇచ్చింది’ అంటారు సుశీల. ఈ సంవత్సర కాలంలో స్కూలు ఆవరణలో సీజనల్ పండ్లు, కాయగూరలు స్కూల్ స్టాఫ్ తమ అనుభవం కొద్దీ పండిస్తూ స్కూలు ఆవరణను ఒక పంట పొలంలా మార్చారు. ‘ఇప్పుడు స్కూల్‌కు వచ్చిన పిల్లలు ఇదంతా చూసి సంబరపడుతున్నారు. వారిని మేము ఈ సేద్యంలో ఇన్వాల్వ్ చేయదలిచాం. స్కూల్ కొరికులం కూడా ఆ మేరకు మార్చాం. పిల్లలకు పంటల గురించి తెలియాలి. తమ తిండిని తాము పండించుకోవడమే కాదు నలుగురి కోసం పండించడం కూడా వారికి రావాలి. మార్కెట్లోని తట్టలో కాకుండా కళ్లెదురుగా ఉంటే మొక్కకి టొమాటోనో, తీగకి కాకరో వేళ్లాడుతూ కనిపిస్తే వాళ్లు పొందే ఆనందం వేరు’ అంటారు సుశీల. మన దగ్గర కూడా చాలా స్కూళ్లల్లో ఎంతో ఖాళీ స్థలం ఉంటుంది. ‘స్కూలు సేద్యం’ కొంత మంది టీచర్లు ప్రోత్సహిస్తుంటారు. కాని ప్రతి స్కూల్లో సుశీల లాంటి మోటివేటర్లు ఉంటే సిబ్బంది పూనుకుంటే ప్రతి స్కూలు ఒక సేంద్రియ పంటపొలం అవుతుంది. మధ్యాహ్న భోజనం మరింత రుచికరం అవుతుంది. ఇలాంటి స్కూళ్లను గ్రీన్ స్కూల్స్ అనొచ్చేమో. -
గానకోకిల పాటకు పట్టాభిషేకం
పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ పీ సుశీల జన్మదినోత్సవం సందర్భంగా 13 దేశాల నుంచి 50 మంది గాయనీమణులు 100 పాటలు గానం చేశారు. భారతదేశం, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఓమాన్, ఖతార్, బహరేయిన్, మలేషియా మరియు స్వీడన్ దేశాల నుంచి వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ సినీ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమాన్ని వంశీ ఇంటర్నేషనల్ ఇండియా, శుభోదయం గ్రూప్ ఇండియా, శ్రీ సాంస్కృతిక కళా సారథి, సింగపూర్, ది గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. డాక్టర్ వంశీ రామరాజు, డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ కలపటపు, రత్న కుమార్ కవుటూరు, రాధిక మంగిపూడి, అనిల్ కుమార్, డాక్టర్ తెన్నేటి సుధాదేవి, శైలజ సుంకరపల్లి, రాధిక నోరి, లక్ష్మీ శ్రీనివాస రామరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
సుశీల చానుకు మణిపూర్ ప్రభుత్వం బంపర్ ఆఫర్
టోక్యో: ఒలింపిక్స్ కాంస్య పోరులో భారత మహిళల హాకీ జట్టు బ్రిటన్ చేతిలో 4-3 తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. మ్యాచ్ ఆరంభం నుంచి బ్రిటన్‌కు గట్టిపోటీ ఇచ్చినప్పటికీ చివర్లో పెనాల్టి కార్నర్లు సమర్పించుకొని నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే మహిళల హాకీ జట్టు ప్రదర్శనకు దేశం మొత్తం అండగా నిలబడుతోంది. పతకం సాధించికపోయినా, అద్భుతంగా ఆడారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓటమి అనంతరం తీవ్ర భావోద్వేగానికి లోనైన రాణి రాంపాల్ సేనను బాధపడొద్దంటూ ఓదార్చి.. దీనిని స్పూర్తిగా తీసుకొని మున్ముందు మరిన్ని పథకాలు సాధించాలని ధైర్యం చెబుతున్నారు. అయితే భారత మహిళల హాకీ జట్టు బ్రిటన్‌తో ఓడిపోయినప్పటికీ జట్టులోని మణిపూర్‌కు చెందిన మిడ్‌ఫీల్డర్ సుశీల చానును ఆ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. చానుకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు భారీ నజరానా అందించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ‘ నేను ఇంఫాల్‌లో అడుగుపెట్టిన వెంటనే సుశీల చానుతో మాట్లాడాను. ఈరోజు తృటిలో కాంస్యం పథకం చేజారింది. కానీ ఒలింపిక్స్‌లో మహిళల జట్టులో సుశీల ప్రదర్శనను అభినందిచాల్సిన విషయం. ఆమెకు యువజన వ్యవహారాలు, స్పోర్ట్స్ విభాగంలో ఉద్యోగంతోపాటు 25 లక్షల నగదు పురస్కారం ఇవ్వనున్నట్లు' తెలిపారు. మణిపూర్‌లో హాకీని మరింతగా అభివృద్ధి చేయాలని భారత మహిళా హాకీ జట్టు మాజీ కెప్టెన్ సుశీల చేసిన సూచనపై సీఎం స్పందింస్తూ.. రాష్ట్రంలోని అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాల్లో హాకీ కోసం ఆస్ట్రోటార్ఫ్ పిచ్‌లనుకూడా ఏర్పాటు చేయబోతున్నామని తెలదిపారు. కాంస్య పతకం మ్యాచ్‌లో భారత పురుషుల హాకీ జట్టు విజయం, ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్లోకి ప్రవేశించిన మహిళల జట్టు ప్రదర్శన గర్వకారణమని అని పేర్కొన్నారు. కాగా 2016 రియో ఒలింపిక్స్‌లో మహిళ హాకీ జట్టుకు సుశీల చాను నాయకత్వం వహించారు. -
ఫేస్బుక్ సాక్ష్యంతో ఆమెకు విడాకులు
సాక్షి, జైపూర్ : సోషల్ మీడియా.. ఆధునిక కాలంలో ఉపయోగించుకునేవారి రీతిని బట్టి.. వారికి ఆయావిధాలుగా సేవలు అందిస్తోంది. ముఖ్యంగా ఫేస్బుక్ మాత్రం ఎవరికి ఎలా కావాలంటే అలా ఉపయోగపడుతోంది. తమతమ అభిప్రాయాలను వెలువరించేందుకే కాకుండా.. సాక్ష్యాలుగా కూడా ఉపయోగించుకుంటున్నారు. తాజాగా రాజస్తాన్‌లో ఒక యువతి.. ఫేస్బుక్ కామెంట్లు, ఫొటోలును ఆధారంగా చూపి.. న్యాయం పొందింది. ఆశ్చర్యం కలిగించే ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్తాన్‌కు చెందిన సుశీల భిష్ణోయ్ (19) కు బాల్య వివాహం చేశారు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు విడాకులు ఇప్పించండి అంటూ కోర్టు మెట్లు ఎక్కింది. సుశీల వాదనను అమె భర్త పూర్తిగా వ్యతిరేకించాడు. అంతేకాక బాల్య వివాహం జరగలేదు అంటూ కోర్టుకు వివరించారు. ఈ కేసుపై వాదనలు విన్న కోర్టు.. బాల్య వివాహం జరిగిందనడానికి ఆధారాలుంటే సమర్పించాలని సుశీలను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సుశీల, సామాజిక కార్యకర్త కృతి భారతితో కలిసి ఆధారాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. సరిగ్గా ఈ సమయంలో.. భర్త ఫేస్బుక్లో పెళ్లి సమయంలో పెట్టిన ఫొటో.. దానికి వచ్చిన కామెంట్లపై సామాజిక కార్యకర్త... సుశీలను అడిగారు. వెంటనే ఇద్దరూ కలిసి భర్త ఫేస్బుక్లో పెళ్లినాటి ఫొటో.. ఆ సమయంలో వచ్చిన కామెంట్లు.. తేదీ, నెల, సంవత్సరం.. వారీగా సేకరించారు. సుశీల భర్త ఫేస్బుక్లో పెళ్లి తేదీ నాడు.. గ్రీటింగ్స్ చెబుతూ వచ్చిన కామెంట్లను సాక్ష్యంగా సుశీల కోర్టులో ప్రవేశపెట్టారు. ఫేస్బుక్లో పోస్ట్ పెట్టేనాటికి తానింకా మైనర్ని అని.. తనను బెదిరించి, భయపెట్టిన పెళ్లి చేశారని సుశీల కోర్టుకు వివరించారు. ఫేస్బుక్ కామెంట్లను కోర్టు సాక్ష్యాలుగా అంగీకరించి.. ఆమెకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ పెళ్లి జరిగేనాటికి తనకు.. తన భర్తకు కేవలం 12 సంవత్సరాలు మాత్రమేనని సుశీల కోర్టుకు ఫేస్బుక్ కామెంట్లు, పోస్ట్‌లను సాక్ష్యంగా ప్రవేశపెట్టారు. కోర్టు తీర్పు తరువాత ఆమె మాట్లాడుతూ.. తనకు ఉన్నత చదువులు చదవాలన్న కోరిక ఉందని చెప్పారు. -
దాసరి కోడలు సంచలన వ్యాఖ్యలు
-
దాసరి కోడలు సంచలన వ్యాఖ్యలు
దర్శకరత్న దాసరి నారాయణరావు మృతిపై తనకు అనుమానాలున్నాయంటూ ఆయన పెద్ద కోడలు సుశీల సంచలన వ్యాఖ్యలు చేశారు. దాసరి కన్నుమూసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. గతంలో దాసరి ఆసుపత్రిలో ఉన్నప్పుడు తాను చూడటానికి వెళ్లానని, అప్పుడు తనను అనుమతించలేదని, తనను అనుమతించకపోవడంపైనా అనుమానాలున్నాయని ఆమె చెప్పారు. తన కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్నా తన భర్త నుంచి తాను ఇంకా విడాకులు తీసుకోలేదని తెలిపారు. తన మామగారు గతంలో ఆసుపత్రిలో ఉన్నప్పుడే చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారని అన్నారు. అంత ఆరోగ్యమైన మనిషి ఇంత హఠాత్తుగా ఎలా అనారోగ్యం పాలయ్యారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నెల 4న తాను మామగారి దగ్గరకు వెళ్లానని, ఆయన తనతో మంచిగా మాట్లాడారని చెప్పారు. తన కొడుకును సినీ రంగానికి పరిచయం చేస్తానని హామీ ఇచ్చినట్టు చెప్పారు. ‘ఇంకొక చిన్న ఆపరేషన్ ఉంది. రెండు వారాలు ఆగి రండి. కూర్చుని మాట్లాడుకుందాం’ అని దాసరి తనకు చెప్పారని అన్నారు. తమకు దాసరి ఆస్తిలో భాగం ఏమీ ఇవ్వలేదని, తమకు తప్పకుండా న్యాయం చేస్తానని ఆయన అన్నారని వివరించారు. తన మనవడిని దగ్గరకు తీసుకుంటానని దాసరి అన్నారని, ఇంతలోనే ఆయన మరణించడం పలు అనుమానాలకు తావిస్తున్నదని సుశీల చెప్పారు. ఆమె వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతోంది. -
అనురాగ్ శర్మకు మాతృవియోగం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మకు మాతృవియోగం కలిగింది. అనురాగ్ శర్మ తల్లి సుశీల (82) బుధవారం మృతి చెందారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఉదయం డీజీపీ నివాసానికి వెళ్లి అనురాగ్ శర్మను పరామర్శించారు. పోలీస్ ఉన్నతాధికారులు, పలువురు నేతలు డీజీపీని పరామర్శించినవారిలో ఉన్నారు. -
పరువు కోసం కూతుర్ని కడతేర్చారు
ప్రమాణం చేయించడానికని తీసుకెళ్లి హత్యచేసిన తల్లిదండ్రులు ఐదు రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసులు నిందితుల అరెస్ట్ దళితుడిని ప్రేమించిందని ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్థినిని తల్లిదండ్రులే హత్యచేశారు. ప్రమాణం చేయించడానికని చెప్పి ఆలయానికి తీసుకెళ్లి ప్రాణం తీశారు. ఆ తర్వాత వాళ్లే తమ కుమార్తె అదృశ్యమైందని ఫిర్యాదు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఐదు రోజుల్లోనే మిస్టరీని ఛేదించారు. పరువు కోసం కుమార్తెను తల్లిదండ్రులే హత్య చేశారని నిర్ధారించారు. ఈ మేరకు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు పలమనేరు డీఎస్పీ శంకర్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. గంగవరం: పుంగనూరు మండలం నల్లూరుపల్లెకు చెందిన ఎరుకుల శ్రీరాములు, పార్వతవ్ము దంపతుల మొదటి సంతానం సుశీల(17). పుంగనూరులో ఇంటర్మీడియొట్ మొదటి సంవత్సరం చదువుతోంది. రోజూ ఇంటి నుంచి కళాశాలకు వెళ్లి వచ్చేది. ఈ క్రవుంలో శ్రీరావుులు ఇంటికి సమీపంలో ఉన్న దళిత సామాజిక వర్గానికి చెందిన యువకునితో ప్రేమలో పడింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సుశీలను పలువూర్లు వుందలించారు. ఈనెల 16న సుశీల గ్రామ పొలిమేర్లలో ఆ యువకుడితో మాట్లాడుతుండగా గమనించిన ఆమె తండ్రి ఇంటికి తీసుకురావడానికి ప్రయుత్నించాడు. ఆ యువకుడు బాలిక తండ్రితో గొడవకు దిగి దాడికి ప్రయుత్నించాడు. ఇంటికి వచ్చిన శ్రీరాములు జరిగిన విషయూన్ని భార్య కు తెలిపాడు. ఇంత అవవూనం జరిగిన తర్వాత సుశీలను బతకనివ్వకూడదని నిర్ణరుుంచుకున్నారు. ప్రమాణం పేరుతో.. పెద్దపంజాణి వుండలం వీరప్పల్లె సమీపంలో ఉన్న గుర్రప్పన్నగుట్ట దగ్గర ఉన్న ఆలయుంలో ప్రవూణం చేరుుంచడానికి ఈనెల 17వ తేదీ ఉదయుం సుశీలను ఆమె తల్లిదండ్రులు తీసుకెళ్లారు. అలసట చెందిన వారిలాగా నటించి ఎవరూ లేనిచోట బైఠారుుంచారు. శ్రీరావుులు బ్యాగు లో తెచ్చుకున్న ప్లాస్టిక్ దారంతో ఒక్కసారిగా సుశీల గొంతుకు బిగించాడు. కదలకుండా తల్లి పార్వతవ్ము కాళ్లూ, చేతులు పట్టుకుంది. సుశీలను హత్య చేసిన అనంతరం ఇంకా బతికి ఉందనే అనువూనంతో బండరారుుతో తలపై బాదారు. వుృతదే హంపై మొహానికి ప్లాస్టిక్ సంచి కట్టి, బండ చాటున వదిలిపెట్టి వచ్చారు. ఏమీ తెలియనట్లు కువూర్తె కనిపించడం లేదని 22వ తేదీ తల్లిదండ్రులు పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పించుకుని తిరగడంతోనే... ఆ తరువాత ఎవరో గుర్తు తెలియుని యుువతి హత్య అనే విషయుం వెలుగులోకి వచ్చింది. వుృతదేహాన్ని పరిశీలించిన స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు వుువ్మురంచేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత శ్రీరావుులు, పార్వతవ్ము పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతుండగా, సందేహించిన పోలీసులు 29న సాయుంత్రం పంజాణిలో సీఐ రవికువూర్, పెద్దపంజాణి ఎస్ఐ లోకేష్ అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. పరువు పోతుందనే కువూర్తెను వీరప్పల్లె సమీపంలోకి తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసుల ఎదుట శ్రీరావుులు, పార్వతవ్ము అంగీకరించారని డీఎస్పీ వివరించారు. శుక్రవారం వారిని అరెస్ట్‌చేసి పలవునేరు కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. కేసును సవాల్‌గా తీసుకుని ఐదురోజుల్లోనే నిందితులను పట్టుకున్న సీఐ, ఎస్ఐ, స్పెషల్ టీమ్‌ను డీఎస్పీ అభినందించారు. -
విశాఖలో వివాహిత ఆత్మహత్య
గాజువాక, న్యూస్‌లైన్: విశాఖ గాజువాక పరిధిలోని ఇందిరా కాలనీలో ఓ గృహిణి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. నెల్లిమర్లకు చెందిన మాణిక్యం లక్ష్మణరావు కూర్మన్నపాలెం ప్రాంతంలోని ఓ పెట్రోల్ బంకులో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. విజయనగరంలోని బాబామెట్టకు చెందిన సుశీల(26)ను ఐదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి మూడేళ్ల పాప ఉంది. ఈ దంపతులు ఉపాధి వెతుక్కుంటూ విశాఖ వచ్చేశారు. లక్ష్మణరావు శుక్రవారం ఉదయం విధుల్లోకి వెళ్లాడు. ఆయన విధుల్లో ఉండగా తన ఆరోగ్యం బాగులేదని, ఆస్పత్రికి వెళ్లాల్సి ఉన్నందున రావాలని భార్య ఫోన్ చేసింది. తాను డ్యూటీలో ఉన్నందున వెంటనే రాలేనని, మధ్యాహ్న భోజన సమయంలో వస్తానని భర్త బదులిచ్చాడు. ఆ తర్వాత కూడా సుశీల రెండుమూడు సార్లు భర్తకు ఫోన్ చేసింది. అనంతరం కొద్దిసేపటికి వంటగదిలోని ఫ్యాన్‌హుక్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు లక్ష్మణరావుకు, గాజువాక పోలీసులకు సమాచారం అందజేశారు. ఎస్ఐ దాలిబాబు సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని లక్ష్మణరావును విచారణ చేశారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు స్వీకరించిన అనంతరం కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు. -
ఘంటసాల, సుశీల పాటలో!
ఘంటసాల పాటకు ఇప్పటివరకు మనం ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణలాంటి స్టార్స్ అభినయించడం చూశాం. త్వరలో శ్రీని కూడా చూడబోతున్నాం. ‘నువ్వు నా ముందుంటే.. నిన్నలా చూస్తుంటే..’ అంటూ ‘గూఢచారి 116’ సినిమా కోసం ఘంటసాల పాడిన పాట నాటి తరం ప్రేక్షకులకు బాగా తెలుసు. ఈ పాటను ఘంటసాలతో కలిసి సుశీల ఆలపించారు. కృష్ణ, జయలలిత అభినయించిన ఈ పాటకు ఇప్పుడు శ్రీ, హరిప్రియ అభినయించారు. ఈ ఇద్దరూ జంటగా కృష్ణ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్‌వర్మ నిర్మిస్తున్న చిత్రం ‘గలాటా’. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. నిర్మాత మాట్లాడుతూ -‘‘శ్రీ, హరిప్రియ పాల్గొనగా స్వర్ణ నృత్యదర్శకత్వంలో ‘నువ్వు నా ముందుంటే..’ పాటను చిత్రీకరించాం. సినిమాకి హైలైట్‌గా నిలిచే పాట ఇది. వచ్చేనెల పాటలు, ఫిబ్రవరిలో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే కొత్త కథాంశంతో ఈ సినిమా చేశామని, వినోద ప్రధానంగా సినిమా సాగుతుందని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సంగీ తం: సునిల్ కశ్యప్, కెమెరా: ఫిరోజ్‌ఖాన్, పాటలు: కృష్ణచైతన్య, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీతేజ నడింపల్లి.