ప్రమాణం చేయించడానికని తీసుకెళ్లి హత్యచేసిన తల్లిదండ్రులు
ఐదు రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసులు
నిందితుల అరెస్ట్
దళితుడిని ప్రేమించిందని ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్థినిని తల్లిదండ్రులే హత్యచేశారు. ప్రమాణం చేయించడానికని చెప్పి ఆలయానికి తీసుకెళ్లి ప్రాణం తీశారు. ఆ తర్వాత వాళ్లే తమ కుమార్తె అదృశ్యమైందని ఫిర్యాదు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఐదు రోజుల్లోనే మిస్టరీని ఛేదించారు. పరువు కోసం కుమార్తెను తల్లిదండ్రులే హత్య చేశారని నిర్ధారించారు. ఈ మేరకు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు పలమనేరు డీఎస్పీ శంకర్ శుక్రవారం విలేకరులకు తెలిపారు.
గంగవరం: పుంగనూరు మండలం నల్లూరుపల్లెకు చెందిన ఎరుకుల శ్రీరాములు, పార్వతవ్ము దంపతుల మొదటి సంతానం సుశీల(17). పుంగనూరులో ఇంటర్మీడియొట్ మొదటి సంవత్సరం చదువుతోంది. రోజూ ఇంటి నుంచి కళాశాలకు వెళ్లి వచ్చేది. ఈ క్రవుంలో శ్రీరావుులు ఇంటికి సమీపంలో ఉన్న దళిత సామాజిక వర్గానికి చెందిన యువకునితో ప్రేమలో పడింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సుశీలను పలువూర్లు వుందలించారు. ఈనెల 16న సుశీల గ్రామ పొలిమేర్లలో ఆ యువకుడితో మాట్లాడుతుండగా గమనించిన ఆమె తండ్రి ఇంటికి తీసుకురావడానికి ప్రయుత్నించాడు. ఆ యువకుడు బాలిక తండ్రితో గొడవకు దిగి దాడికి ప్రయుత్నించాడు. ఇంటికి వచ్చిన శ్రీరాములు జరిగిన విషయూన్ని భార్య కు తెలిపాడు. ఇంత అవవూనం జరిగిన తర్వాత సుశీలను బతకనివ్వకూడదని నిర్ణరుుంచుకున్నారు.
ప్రమాణం పేరుతో..
పెద్దపంజాణి వుండలం వీరప్పల్లె సమీపంలో ఉన్న గుర్రప్పన్నగుట్ట దగ్గర ఉన్న ఆలయుంలో ప్రవూణం చేరుుంచడానికి ఈనెల 17వ తేదీ ఉదయుం సుశీలను ఆమె తల్లిదండ్రులు తీసుకెళ్లారు. అలసట చెందిన వారిలాగా నటించి ఎవరూ లేనిచోట బైఠారుుంచారు. శ్రీరావుులు బ్యాగు లో తెచ్చుకున్న ప్లాస్టిక్ దారంతో ఒక్కసారిగా సుశీల గొంతుకు బిగించాడు. కదలకుండా తల్లి పార్వతవ్ము కాళ్లూ, చేతులు పట్టుకుంది. సుశీలను హత్య చేసిన అనంతరం ఇంకా బతికి ఉందనే అనువూనంతో బండరారుుతో తలపై బాదారు. వుృతదే హంపై మొహానికి ప్లాస్టిక్ సంచి కట్టి, బండ చాటున వదిలిపెట్టి వచ్చారు. ఏమీ తెలియనట్లు కువూర్తె కనిపించడం లేదని 22వ తేదీ తల్లిదండ్రులు పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తప్పించుకుని తిరగడంతోనే...
ఆ తరువాత ఎవరో గుర్తు తెలియుని యుువతి హత్య అనే విషయుం వెలుగులోకి వచ్చింది. వుృతదేహాన్ని పరిశీలించిన స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు వుువ్మురంచేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత శ్రీరావుులు, పార్వతవ్ము పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతుండగా, సందేహించిన పోలీసులు 29న సాయుంత్రం పంజాణిలో సీఐ రవికువూర్, పెద్దపంజాణి ఎస్‌ఐ లోకేష్ అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. పరువు పోతుందనే కువూర్తెను వీరప్పల్లె సమీపంలోకి తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసుల ఎదుట శ్రీరావుులు, పార్వతవ్ము అంగీకరించారని డీఎస్‌పీ వివరించారు. శుక్రవారం వారిని అరెస్ట్‌చేసి పలవునేరు కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. కేసును సవాల్‌గా తీసుకుని ఐదురోజుల్లోనే నిందితులను పట్టుకున్న సీఐ, ఎస్‌ఐ, స్పెషల్ టీమ్‌ను డీఎస్‌పీ అభినందించారు.
పరువు కోసం కూతుర్ని కడతేర్చారు
Published Sat, Jan 31 2015 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 8:32 PM
Advertisement
Advertisement