సాక్షి, హైదరాబాద్: నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రి కల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డు) చీఫ్ జనరల్ మేనేజర్‌గా సుశీల చింతల నియమితులయ్యారు. గురు వారం తెలంగాణ ప్రాంతీయ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆమె కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ ప్రాంతీయ కార్యా లయాల్లో పని చేశారు.
తమిళనాడులో పని చేసిన సమయంలో ఆ రాష్ట్ర ఉమెన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ బోర్డులోనూ సుశీల ఉన్నారు. నాబార్డ్ మద్దతు ఇచ్చే ఇంక్యుబేషన్ సెంటర్లతోపాటు అగ్రి స్టార్టప్‌లతో చురుకుగా పనిచేసిన ఆమెకు.. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టులు, క్రెడిట్ ప్లానింగ్, పర్యవేక్షణ, ఫైనాన్స్, మైక్రో క్రెడిట్, సహకార సంఘాలు, ఆర్‌ఆర్‌బీల పర్యవేక్షణలో మూడున్నర దశాబ్దాల అనుభవం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment