సాక్షి, జైపూర్ : సోషల్ మీడియా.. ఆధునిక కాలంలో ఉపయోగించుకునేవారి రీతిని బట్టి.. వారికి ఆయావిధాలుగా సేవలు అందిస్తోంది. ముఖ్యంగా ఫేస్‌బుక్ మాత్రం ఎవరికి ఎలా కావాలంటే అలా ఉపయోగపడుతోంది. తమతమ అభిప్రాయాలను వెలువరించేందుకే కాకుండా.. సాక్ష్యాలుగా కూడా ఉపయోగించుకుంటున్నారు. తాజాగా రాజస్తాన్‌లో ఒక యువతి.. ఫేస్‌బుక్ కామెంట్లు, ఫొటోలును ఆధారంగా చూపి.. న్యాయం పొందింది. ఆశ్చర్యం కలిగించే ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రాజస్తాన్‌కు చెందిన సుశీల భిష్ణోయ్ (19) కు బాల్య వివాహం చేశారు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు విడాకులు ఇప్పించండి అంటూ కోర్టు మెట్లు ఎక్కింది. సుశీల వాదనను అమె భర్త పూర్తిగా వ్యతిరేకించాడు. అంతేకాక బాల్య వివాహం జరగలేదు అంటూ కోర్టుకు వివరించారు. ఈ కేసుపై వాదనలు విన్న కోర్టు.. బాల్య వివాహం జరిగిందనడానికి ఆధారాలుంటే సమర్పించాలని సుశీలను ఆదేశించింది.
కోర్టు ఆదేశాల మేరకు సుశీల, సామాజిక కార్యకర్త కృతి భారతితో కలిసి ఆధారాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. సరిగ్గా ఈ సమయంలో.. భర్త ఫేస్‌బుక్‌లో పెళ్లి సమయంలో పెట్టిన ఫొటో.. దానికి వచ్చిన కామెంట్లపై సామాజిక కార్యకర్త... సుశీలను అడిగారు. వెంటనే ఇద్దరూ కలిసి భర్త ఫేస్‌బుక్‌లో పెళ్లినాటి ఫొటో.. ఆ సమయంలో వచ్చిన కామెంట్లు.. తేదీ, నెల, సంవత్సరం.. వారీగా సేకరించారు. సుశీల భర్త ఫేస్‌బుక్‌లో పెళ్లి తేదీ నాడు.. గ్రీటింగ్స్ చెబుతూ వచ్చిన కామెంట్లను సాక్ష్యంగా సుశీల కోర్టులో ప్రవేశపెట్టారు. ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టేనాటికి తానింకా మైనర్‌ని అని.. తనను బెదిరించి, భయపెట్టిన పెళ్లి చేశారని సుశీల కోర్టుకు వివరించారు. ఫేస్‌బుక్ కామెంట్లను కోర్టు సాక్ష్యాలుగా అంగీకరించి.. ఆమెకు కోర్టు విడాకులు మంజూరు చేసింది.
ఈ పెళ్లి జరిగేనాటికి తనకు.. తన భర్తకు కేవలం 12 సంవత్సరాలు మాత్రమేనని సుశీల కోర్టుకు ఫేస్‌బుక్ కామెంట్లు, పోస్ట్‌లను సాక్ష్యంగా ప్రవేశపెట్టారు. కోర్టు తీర్పు తరువాత ఆమె మాట్లాడుతూ.. తనకు ఉన్నత చదువులు చదవాలన్న కోరిక ఉందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment