
ప్రముఖ సీనియర్ నటి, నిర్మాత కృష్ణవేణి ‘ఆకృతి– ఘంటసాల శతాబ్ది పురస్కారం’ అందుకున్నారు. ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆకృతి–ఘంటసాల శతాబ్ది పురస్కారాన్ని కృష్ణవేణికి తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ఎవరినైనా సక్సెస్ తర్వాతే గుర్తు పెట్టుకుంటారు. కానీ, ఎంతోమందికి సక్సెస్ ఇచ్చిన కృష్ణవేణిగారికి తగినంత గుర్తింపు రాకపోవడం బాధాకరం’’ అన్నారు.
‘‘నేటి తరం సినిమా వాళ్లకు కృష్ణవేణిగారి జీవితం పుస్తకంలా ఉపయోగపడుతుంది’’ అన్నారు తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కొల్లేటి దామోదర్. ‘‘కృష్ణవేణిగారు ఒక లెజెండ్’’ అన్నారు నటి రోజా రమణి. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవరాలు అజిత, ఫిక్కీ సీఎండీ అచ్యుత జగదీష్ చంద్ర, నటుడు మోహనకృష్ణ, ‘ఆకృతి’ సుధాకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment