Centenary Award
-
కృష్ణవేణికి ఘంటసాల శతాబ్ది పురస్కారం
ప్రముఖ సీనియర్ నటి, నిర్మాత కృష్ణవేణి ‘ఆకృతి– ఘంటసాల శతాబ్ది పురస్కారం’ అందుకున్నారు. ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆకృతి–ఘంటసాల శతాబ్ది పురస్కారాన్ని కృష్ణవేణికి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ఎవరినైనా సక్సెస్ తర్వాతే గుర్తు పెట్టుకుంటారు. కానీ, ఎంతోమందికి సక్సెస్ ఇచ్చిన కృష్ణవేణిగారికి తగినంత గుర్తింపు రాకపోవడం బాధాకరం’’ అన్నారు. ‘‘నేటి తరం సినిమా వాళ్లకు కృష్ణవేణిగారి జీవితం పుస్తకంలా ఉపయోగపడుతుంది’’ అన్నారు తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కొల్లేటి దామోదర్. ‘‘కృష్ణవేణిగారు ఒక లెజెండ్’’ అన్నారు నటి రోజా రమణి. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవరాలు అజిత, ఫిక్కీ సీఎండీ అచ్యుత జగదీష్ చంద్ర, నటుడు మోహనకృష్ణ, ‘ఆకృతి’ సుధాకర్ పాల్గొన్నారు. -
ఎస్పీ బాలుకు సెంటినరీ అవార్డు
న్యూఢిల్లీ : ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరో పురస్కారం అందుకోనున్నారు. చలన చిత్ర రంగంలో విశేష కృషి చేసినందుకు జీవితకాల సాఫల్యత కొరకు సెంటినరీ అవార్డుతో ఆయనను కేంద్ర ప్రభుత్వం సత్కరించనుంది. గోవాలో జరుగనున్న 47వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్(ఐఎఫ్ఎఫ్ఐ-2016)లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు సెంటినరీ అవార్డు ప్రదానం చేయనున్నట్లు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మంగళవారమిక్కడ తెలిపారు. గత అయిదు దశాబ్దాలుగా తెలుగుతో పాటు తమిళం, కన్నడం, హిందీ, మలయాళం చలన చిత్ర పరిశ్రమలకు ఎస్పీ బాలు తన గాత్ర మాధుర్యంతో ఎనలేని సేవలు అందించారని ఆయన ప్రశంసించారు. ఎస్పీ బాలు వివిధ భాషల్లో సుమారు 40వేలకుపైగా పాటలు పడి సంగీతాభిమానులను అలరించారన్నారు. కాగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరుసార్లు జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఆయన సేవలకుగాను పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు వరించాయి. 47వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్..ఈ నెల 20 నుంచి 28 వరకూ గోవాలో జరుగనున్నాయి. -
సూపర్ స్టార్‌కు సెంటినరీ అవార్డు
స్టయిల్ కింగ్ రజనీకాంత్‌కు మరో అరుదైన అవార్డు వరించనుంది. భారత ప్రభుత్వం ఈ దక్షిణాది సూపర్‌స్టార్‌కు సెంటినరీ (ఈఏడాది ప్రముఖ సినీ కళాకారుడు) అవార్డును ప్రకటించింది. భారతీయ సినిమా శత వసంతాల వేడుక జరుపుకున్న సందర్భంగా రజనీకాంత్‌కు ప్రతిష్టాత్మక అవార్డు వరించడం విశేషం. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు ఈ నెల 20 నుంచి 30 వరకు గోవా లో జరగనున్నాయి. 75 దేశాలు పాల్గొనే ఈ చిత్రోత్సవాల్లో 68 దేశాలకు చెందిన చిత్రాలు ప్రదర్శించనున్నారు. వాటిలో ఏడు చిత్రాలు ఆసియాకు చెందినవి కావడం విశేషం. ప్రఖ్యా త బాలీవుడ్ నటుడు అమితాబ్ ముఖ్య అతిథిగా పాల్గొననున్న ఈ వేడుకలో ప్రత్యేక అతిథిగా సూపర్‌స్టార్ రజనీకాంత్ వేదికపై అలంకారం కానున్నారు. ఈ చిత్రోత్సవాల్లో తొలి రోజున రజనీకాంత్‌కు సెంటినరీ అవార్డుతో గౌరవించనున్నట్లు కేంద్ర సమాచార సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి రాజ్యవర్దన్‌సింగ్ రాథోడ్ మంగళవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రతిభకు మా త్రమే బీజేపీ ప్రభుత్వం పట్టం కడుతుందని ఈ సందర్భంగా ఆయన ఉద్ఘాటించారు. నివాళులు: కేంద్రమంత్రి మాట్లాడుతూ ఈ ఏడాది దివంగతులైన ప్రఖ్యాత కళాకారులు హాలీవుడ్ దర్శకుడు రిచర్డ్ అటన్ బరో, రాబి విలియమ్స్, భారతీయ ప్రముఖులు జోరో సేకల్, సుచిత్రా సేన్, అక్కినేని నాగేశ్వరరావు, సదాశివ్ అమ్రి పుర్కర్, ఫరూక్ షేక్ తదితరులకు నివాళులు అర్పించనున్నట్లు తెలిపారు. అభినందనల వెల్లువ రజనీకాంత్‌ను సెంటినరీ అవార్డు వరించడంతో చిత్ర పరిశ్రమ నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు భారతీయ జనతాపార్టీనేత తమిళిసై సౌందర్ రాజన్ ఆయనకు అభినందనలు తెలుపుతూ, ఒక ప్రకటన విడుదల చేశారు. రజనీకాంత్ మరిన్ని అవార్డులను అందుకోవాలని ఆకాంక్షిస్తూ అందులో పేర్కొన్నారు. - తమిళ సినిమా సూపర్‌స్టార్‌కు బర్త్‌డే గిఫ్ట్ దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు కేంద్ర ప్రభుత్వం అందించనున్న ఈ సెంటినరీ అవార్డు ఆయన పుట్టిన రోజు కానుకగా పేర్కొనవచ్చు. అయితే ఇలాంటి అవార్డులు రజనీకాంత్‌కు కొత్తే మీ కాదు. డిసెంబర్ 12న 64వ వసంతంలోకి అడిగిడుతున్న రజనీ నటుడిగా నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకుంటున్నారు. ఈ 40 ఏళ్లలో ఆయనకు ఎన్నో అవార్డులు, బిరుదులు అలంకారమయ్యూరుు. తమిళ ప్రభుత్వం అవార్డులతో పాటు ఫిలింఫేర్, కలైమామణి, ఇతర మీడియా అవార్డులెన్నో రజనీకాంత్‌కు వరించాయి. 2000 లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో గౌరవించింది. అదే ఏడాది మహారాష్ట్ర ప్రభుత్వం రాజ్‌కపూర్ అవార్డుతో సత్కరించింది. తన పుట్టిన రోజు సందర్భంగా రజనీకాంత్ అభిమానులకు లింగా చిత్రాన్ని కానుకగా అందించడానికి సిద్ధం అవుతుంటే ఆయనకు కేంద్ర ప్రభుత్వం ఈసెంటినరీ అవార్డును అందించనుండడం విశేషం. -
సూపర్‌స్టార్‌కు సెంటినరీ అవార్డు
స్టయిల్ కింగ్ రజనీకాంత్‌కు మరో అరుదైన అవార్డు వరించనుంది. భారత ప్రభుత్వం ఈ దక్షిణాది సూపర్‌స్టార్‌కు సెంటినరీ (ఈఏడాది ప్రముఖ సినీ కళాకారుడు) అవార్డును ప్రకటించింది. భారతీయ సినిమా శత వసంతాల వేడుక జరుపుకున్న సందర్భంగా రజనీకాంత్‌కు ప్రతిష్టాత్మక అవార్డు వరించడం విశేషం. రజనీకి బర్త్‌డే గిఫ్ట్ దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు కేంద్ర ప్రభుత్వం అందించనున్న ఈ సెంటినరీ అవార్డు ఆయన పుట్టిన రోజు కానుకగా పేర్కొనవచ్చు. అయితే ఇలాంటి అవార్డులు రజనీకాంత్‌కు కొత్తే మీ కాదు. డిసెంబర్ 12న 64వ వసంతంలోకి అడిగిడుతున్న రజనీ నటుడిగా నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకుంటున్నారు. ఈ 40 ఏళ్లలో ఆయనకు ఎన్నో అవార్డులు, బిరుదులు అలంకారమయ్యూయి. తమిళ ప్రభుత్వం అవార్డులతో పాటు ఫిలింఫేర్, కలైమామణి, ఇతర మీడియా అవార్డులెన్నో రజనీకాంత్‌కు వరించాయి. 2000 లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో గౌరవించింది. అదే ఏడాది మహారాష్ట్ర ప్రభుత్వం రాజ్‌కపూర్ అవార్డుతో సత్కరించింది. తన పుట్టిన రోజు సందర్భంగా రజనీకాంత్ అభిమానులకు లింగా చిత్రాన్ని కానుకగా అందించడానికి సిద్ధం అవుతుంటే ఆయనకు కేంద్ర ప్రభుత్వం ఈసెంటినరీ అవార్డును అందించనుండడం విశేషం. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు ఈ నెల 20 నుంచి 30 వరకు గోవా లో జరగనున్నాయి. 75 దేశాలు పాల్గొనే ఈ చిత్రోత్సవాల్లో 68 దేశాలకు చెందిన చిత్రాలు ప్రదర్శించనున్నారు. వాటిలో ఏడు చిత్రాలు ఆసియాకు చెందినవి కావడం విశేషం. ప్రఖ్యా త బాలీవుడ్ నటుడు అమితాబ్ ముఖ్య అతిథిగా పాల్గొననున్న ఈ వేడుకలో ప్రత్యేక అతిథిగా సూపర్‌స్టార్ రజనీకాంత్ వేదికపై అలంకారం కానున్నారు. ఈ చిత్రోత్సవాల్లో తొలి రోజున రజనీకాంత్‌కు సెంటినరీ అవార్డుతో గౌరవించనున్నట్లు కేంద్ర సమాచార సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ మంగళవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రతిభకు మా త్రమే బీజేపీ ప్రభుత్వం పట్టం కడుతుందని ఈ సందర్భంగా ఆయన ఉద్ఘాటించారు. నివాళులు: కేంద్రమంత్రి మాట్లాడుతూ, ఈ ఏడాది దివంగతులైన ప్రఖ్యాత కళాకారులు హాలీవుడ్ దర్శకుడు రిచర్డ్ అటన్ బరో, రాబి విలియమ్స్, భారతీయ ప్రముఖులు జోరో సేకల్, సుచిత్రా సేన్, అక్కినేని నాగేశ్వరరావు, సదాశివ్ అమ్రి పుర్కర్, ఫరూక్ షేక్ తదితరులకు నివాళులు అర్పించనున్నట్లు తెలిపారు. అభినందనల వెల్లువ రజనీకాంత్‌ను సెంటినరీ అవార్డు వరించడంతో చిత్ర పరిశ్రమ నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు భారతీయ జనతాపార్టీనేత తమిళిసై సౌందర్ రాజన్ ఆయనకు అభినందనలు తెలుపుతూ, ఒక ప్రకటన విడుదల చేశారు. రజనీకాంత్ మరిన్ని అవార్డులను అందుకోవాలని ఆకాంక్షిస్తూ అందులో పేర్కొన్నారు.