
గీత స్మరణం
పల్లవి :
అతడు: పదండి ముందుకు...
పదండి తోసుకు
కదం తొక్కుతూ కదలండి
స్వరాజ్యమే మన జన్మహక్కనీ
సమస్త జగతికి చాటండి ॥
భారతవీర ప్రజలారా
స్వరాజ్య వాదీ ధరించు ఖాదీ (2)
పరాయి సరుకులు మనకేలా
॥
ఆమె: రాటమున వడకే వారే
పోరాటములోన వడకరులే
॥॥
చరణం : 1
అ: అహింసయే మన ఆయుధమూ
సత్యాగ్రహమే సాధనమూ
॥
ఆ: త్రివర్ణ సుందర పతాకము
భారత దాస్య విమోచనము
॥
అ: ప్రేమా శాంతీ ధర్మం నిండిన (2)
రామ రాజ్యమే ఆశయమూ (2)
॥
చరణం : 2
ఆ: కల్లు మానండోయ్ బాబయ్యా
కళ్లు తెరచి సాగి రారయ్యా బాబయ్యా
॥మానండోయ్॥
కాపురాలను కూల్చురాకాసిరా
కన్నీళ్లు కష్టాలు కొనితెచ్చురా
॥
మంచితనమే చంపి...
మమతలే తెగతెంపి
మనల పశువుల చేయు మహామారిరా
॥మానండోయ్॥॥
చరణం : 3
అ: తరతరాల దురన్యాయాలకు
గురియై... బలియై...
దారి కనరాని వారీ దరిద్రనారాయణులూ
హరిజనులు
సాటి మనిషిని దూరం చేసే జనులు
మోక్షం కనలేరసలు (2)
సమాజమంతా సమానమైతే
నాడే జాతికి నవజీవనము (2)
॥
చరణం : 4
ఈ భూమి మా భూమిరా
ఇది బంగారు మాగాణిరా
పనులెన్నో వేసి పంట సిరులను దోచి
మాతల్లి నేలకే మమ్ము దూరమ్ము చేయు
దుష్టపరిపాలనకు స్వస్తియీనాడే
పన్నుల నిరాకరణ ప్రారంభమాయె...
॥
తెలుగు దేశ వీరులారా...
భరత దేశ పౌరులారా...
చిత్రం : పదండి ముందుకు (1962)
రచన : శ్రీశ్రీ
సంగీతం : ఎస్.పి.కోదండపాణి
గానం : ఘంటసాల, మాధవపెద్ది సత్యం, ఎ.పి.కోమల