కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఎస్‌ఐ గల్లంతు ? | Accident At Ghantasala Karakatta In Krishna District | Sakshi
Sakshi News home page

కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఎస్‌ఐ గల్లంతు ?

Published Sat, Aug 25 2018 3:36 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

Accident At Ghantasala Karakatta In Krishna District - Sakshi

సాక్షి, విజయవాడ : కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలో కరకట్టపై శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ సమీపంలోని రామచంద్రాపురం నుంచి అవనిగడ్డ వైపు వస్తున్న ఓ కారు పాపవినాశనం వద్ద అదుపుతప్పి కరకట్ట పై నుంచి పక్కనే ఉన్న బందరు కాలువలోకి దూసుకువెళ్లింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిని కాపాడగలిగారు. కాగా ఈ ఘటనలో డ్రైవింగ్‌ చేసిన వ్యక్తి మాత్రం గల్లంతయ్యారు. డ్రైవింగ్‌ చేసిన వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న కోట వంశీగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement