
చల్లపల్లి : విజయవాడ-అవనిగడ్డ మార్గంలోని కరకట్టపై ఘంటసాల మండలం పాపవిశానం వద్ద పంటకాలువలో కొట్టుకుపోయిన ఎస్‌ఐ మృతదేహం ఆదివారం ఉదయం బయటపడింది. చల్లపల్లి మండలం మంగళాపురం వద్ద మృతదేహం లభ్యమైంది. సుమారు 20 కిలో మీటర్ల దూరం ఎస్‌ఐ మృతదేహం కొట్టుకుపోయింది. కాలువలో నుంచి వెలికి తీసిన అనంతరం పోస్టుమార్టం చేయడానికి ఎస్‌ఐ వంశీధర్ మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వానికి తరలించారు. వంశీధర్ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎస్‌ఐగా పనిచేస్తున్న సంగతి తెల్సిందే.
శనివారం ఉదయం తల్లితో కలిసి స్వగ్రామం కోడూరు మండలం ఇస్మాయిల్‌బేగ్‌పేట్‌కు కారులో బయలుదేరిన సమయంలో పాపవినాశనం వద్ద కారు అదుపుతప్పి పక్కనున్న కాలువలోకి దూసుకెళ్లింది. అక్కడే ఉన్న స్థానిక గ్రామస్తులు ఎస్‌ఐ వంశీధర్ తల్లితో పాటు మరొకరిని కాపాడగలిగారు..కానీ కారు నీళ్లలోకి పూర్తిగా వెళ్లిపోవడంతో ఎస్‌ఐను కాపాడలేకపోయారు. వెంటనే సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందించడంతో వారు సంఘటనాస్థలానికి చేరుకుని నిన్నటి నుంచి గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment