
గీత స్మరణం
పల్లవి :
పల్లెకు పోదాం పారును చూద్దాం
చలో చలో (2)
అల్లరి చేద్దాం చలో చలో
॥పోదాం॥
ప్రొద్దువాలే ముందుగానే
ముంగిటవాలేమూ (2)
॥పోదాం॥
చరణం : 1
ఆటా పాటలందూ
కవ్వించు కొంటె కోణంగీ (2)
మనసేమో మక్కువేమో... (2)
నగవేమో వగేమో...
కనులార చూదమూ...
॥పోదాం॥
చరణం : 2
నన్నూ చూడగానే
చిననాటి చనువు చూపేనో
నా దరికీ దూకునో... (2)
తానలిగీపోవునో...ఏమౌనో చూదమూ
॥పోదాం॥
చిత్రం : దేవదాసు (1953)
రచన : సముద్రాల రాఘవాచార్య
సంగీతం : సి.ఆర్.సుబ్బరామన్
గానం : ఘంటసాల
నిర్వహణ: నాగేష్