
సినిమాలలోని పాపులర్ సీన్‌లను రీక్రియేట్ చేసి ఆనందించడం మనకు కొత్త కాదు. సంజయ్‌లీలా బన్సాలీ ‘దేవదాస్’ సినిమాలో ‘పారు’ పాత్రలోని ఐశ్వర్యారాయ్‌ని అనుకరిస్తూ కైరా ఖన్నా అనే బాలిక చేసిన వీడియో తాజాగా వైరల్ అయింది.
ఐకానిక్ సినిమాలలోని పాపులర్ సీన్‌లను అనుకరిస్తూ కైరా చేసే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
‘జిస్ వక్త్ తుమ్హారే సాథ్ హోతి హమ్ ఉస్ వక్త్ బద్నామి కా బీ డర్ నహీ లగ్తా’ ‘దస్ సాల్ పహ్లే తుమ్హరే నామ్ కా దియా జలాయ థా మైనే. ఉసే ఆజ్ తక్ బుజ్నే నహీ దియా’... ఇలా ‘దేవదాస్’ సినిమాలోని ‘పారు’ పాపులర్ డైలాగ్‌లతో ‘వావ్’ అనిపించింది కైరా ఖన్నా.
‘డైలాగుల నుంచి ఎక్స్‌ప్రెషన్ వరకు అద్భుతం’ ‘అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్ ఉన్న కైరాకు బాలీవుడ్‌లో బ్రైట్ ఫ్యూచర్ ఉంది’... అంటూ నెటిజనులు కైరా ఖన్నాపై ప్రశంసల వర్షం కురిపించారు.
Comments
Please login to add a commentAdd a comment