నేడు ఎన్.టి.ఆర్. వర్ధంతి | today ntr vardhanthi | Sakshi
Sakshi News home page

నేడు ఎన్.టి.ఆర్. వర్ధంతి

Published Sat, Jan 18 2014 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 2:43 AM

నేడు ఎన్.టి.ఆర్. వర్ధంతి

నేడు ఎన్.టి.ఆర్. వర్ధంతి

పల్లవి : ఇది నా చెలి ఇది నా సఖి నా మనోహరీ (2)
 చరణం : 1
 మనసులోని మమతలన్నీ
 కనుల ముందు నిలచినటుల ॥

వన్నెలతో చిన్నెలతో మనసుగొనిన ఊహాసుందరి ॥నా చెలి॥
 చరణం : 2
 కలువ కనుల చల్లని సిరి ఉల్లములో ప్రేమలహరి

వినయసహన శోభలతో తనివినించు సుగుణసుందరి ॥నా చెలి॥
 
 పల్లవి :
 ఏమి శిక్ష కావాలో కోరుకొనవె ప్రేయసీ
 కోరుకొనవె ప్రేయసీ...॥ మురిపెముగా ముచ్చటగా ముద్దుముద్దుగా (2) ॥
 చరణం : 1
 ఆశలేవో తెలుసుకొని వేసమలా వేసుకొని (2)
 ముసిముసి నవ్వులతో  నా ముందు నిలచినందులకు   
 చరణం : 2
 ఆవరించు చీకటిలో... ఓ...
 ఆవరించు చీకటిలో దారిచూపు దీపికవై
 దారిచూపు దీపికవై...
 జీవితమును నవశోభల వెలయజేసినందులకు
 చిత్రం : చంద్రహారం (1954)
 రచన : పింగళి నాగేంద్రరావు
 సంగీతం, గానం : ఘంటసాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement